Wednesday, 11 February 2026

రానా కవితలు 2 ప్రత్యగాత్మ


రానా కవితలు 2 ప్రత్యగాత్మ


వినువీధిలో

స్వేచ్చగా విహరించే విహంగ పరిజ్ఞానం 

🐦‍⬛విహంగాలకు ఎవరు నేర్పించారు ? 

చెట్లమీద  🕊️గూడు ఓ అద్భుత ఆవిష్కరణగా 

నిర్మించే ఇంజనీరింగ్ జ్ఞానం దానికి ఎవరిద్వారా వచ్చింది? 

ఎంత సుదూరప్రయాణం చేసినా 

తిరిగి తనగూటికే చేరే జీపీఎస్ జ్ఞానం 

ఈ విహంగాలకు ఎక్కడినుంచి, ఎలా వచ్చింది?


మట్టిలో విత్తిన విత్తనం 🌱మొలకగా 

అంకురించే పరిజ్ఞానం దానికి ఎక్కడినుంచి వచ్చింది? 

వెలుతురునే తినేటువంటి 

జ్ఞానం వాటి 🌿ఆకులకు ఏలా వచ్చింది? 

జాబిల్లి వెలుగులలో మొగ్గ 

పూవులా 🌺పరిమళించే వికసితజ్ఞానం వాటికి ఏలా వచ్చింది? 

మోడువారిన చెట్టుకు 🪾తిరిగి చిగురించే  జీవజ్ఞానం,

నీటి అలభ్యతను ఎదిరించి కొనసాగించే జీవనగమనజ్ఞానం 

ఎడారి🌵 మొక్కలకు ఎవరు, ఎప్పడు నేర్పించారు? 


సాలీడు 🕷️తనకు మాత్రమే పేటెంట్ హక్కు కలిగిన

సాలెగూడు 🕸️నిర్మాణాత్మకప్రజ్ఞ దానికి ఏలా వచ్చింది? 

🐝 తేటికి మకరందసేకరణ సామర్ధ్యం 

తేనపట్టు నిర్మాణప్రజ్ఞ ఎక్కడినుంచి వచ్చింది? 

🐜చీమకి వాల్మీకం నిర్మాణ ప్రతిభ,

ఆహారజాడలను గుర్తించి స్నేహితచీమలకు కమ్యూనికేట్ చేసే శక్తి ఎవరిచ్చారు?


భూకంపాలను, ప్రకృతి విపత్తులను 

వాతావరణమార్పులను ముందుగానే పసిగట్టే విశేషజ్ఞానం 

జంతువులకు, పక్షులకు ఎక్కడినుంచి, ఎలా వచ్చింది?


లైఫ్ జాకెట్ లేకుండానే నీటిలో సదా విహరించే 

జీవశాస్త్ర కళ 🦈మీనంకి  ఎక్కడినుంచి వచ్చింది? 

కళ్లుమూయకనే నిద్రించే కళ 🐟మత్స్యానికి ఏలా వచ్చింది?

నీటిని ప్రాణశక్తిగా మార్చుకొనే జీవకళ🐠 ఝషముకే సొంతం ఏలా అయ్యింది?


కొంకర్లుపోయే విపరీతచలిలో 

ఆచ్ఛాదనరహిత జీవనపయనం,

మంచుగడ్డ కట్టే చలిలో ఆహారలేమిని,

శిశిరనిద్రని కొనసాగించే 

అతీంద్రియశక్తి నాగసాధువులకి  ఏలా వచ్చింది? ఎక్కడినుంచి వచ్చింది?


సకల జీవరాశులలో 

ఈ  విశేషపరిజ్ఞానం,

చైతన్యరూపంగా,

ప్రాణధారణగా,

ప్రాణశక్తిగా,

ప్రత్యగాత్మ

ప్రాణులలో పురుడుపోసుకుంది!!








 

రానా కవితలు 1 విశ్వంభర

 రానా కవితలు 1 విశ్వంభర

అరుణ కాంతుల సొగసులను 

స్వాగతిస్తూ 

ఉషోదయ వేళల్లో 

వికసించే 🪻పూబాలలనడుగు 

పూదోట వెదజల్లే పరిమళాలనడుగు

మలయమారుతాలతో పరవశించే కొండగాలినడుగు

పూతోటలోని🐝 తేటి నడుగు 

ఈ తుషారబిందువుల🫧 సొగసులు నీకెక్కడివి అని 

అంకురించిన 🌱 మొలకనడుగు

కుహు కుహూ రాగాల కోకిలనడుగు

పక్షుల కిలకిల రావాలనడుగు

🦋సీతాకోకచిలుకగా మారిన 🐛 గొంగళిపురుగునడుగు

పురివిప్పిన🦚 నాట్యమయూరిని నడుగు

చెంగు చెంగున ఎగిరే జింక పిల్లలనడుగు

గల గల పారే సెలయేళ్లలో

తమ సొగసులతో ఆకట్టుకునే 🦢రాజహంసలనడుగు

పుడమి తల్లిని దైవంగా భావించే కృషీవలుడిని నడుగు

తన స్వేదాన్ని తర్పణంగా సమర్పించే అన్నదాత నడుగు

సుప్రభాతసేవలో తరిస్తున్న 🧘‍♂️యోగులనడుగు

ఏ కుంచెతో ఈ నింగికి సప్తవర్ణాలు అద్దినది ఎవరు?

ఇంకెవరు 

ప్రకృతి లోని అందాలలో, ఆనందాలలో 

నీ లోన, బయట

అటు,ఇటు, ఎటు చూసినా 

సర్వత్రా, సర్వంగా విస్తరించివున్న 

ఆ అప్రమేయుడే 

విశ్వంభరుడు 



మీ 

RaNa 

9900022729

ధ్యాన మాలిక మార్చ్ 26 సంచికలో ప్రచురితం 


Thursday, 10 November 2016

పిల్లలలో మానశిక ఒత్తిడి


పిల్లలలో మానశిక ఒత్తిడి









మనలో చాలమంది చిన్నపిల్లకి మానశిక ఒత్తిడులా, అవి ఎందుకు వుంటాయి...! వాళ్లకి ఏమి ప్రాబ్లంలు/ సమస్యలు వుంటాయి.. అనే భావనలో వుంటాం…!! నిజానికి ఇవి మనందరిలో వయస్సుతో సంభందం లేకుండా వుండనే వుంటాయి.. తల్లి గర్భంలోవుండే శిశువుకి కూడా ఇవి వుంటాయి అన్నది మన వుహలకి అందని యదార్ధం... లౌడ్ మ్యూజిక్, వింతశబ్ధాలకి , పిడుగుపాటి శబ్ధాలకి గర్భస్థ శిశువు వులికిపడడం  చాలామంది తల్లులకు అనుభవమే..! అందుకే వినసొంపైన, లయబద్దమైన, శ్రావ్యమైన , ఆహ్లదభరితమైన వీనులవిందైన సంగీతాన్నే తల్లిగా మీరు ఆస్వాదించాలి


మీచిన్నారి ప్రవర్తనలో వచ్చే మార్పులు, చేర్పులని సునిశతంగాగమనిస్తూ వుండడం తల్లితండ్రులుగా మీ కనీసభాద్యత , ఇది ప్రధానం అన్నది తప్పక గుర్తించాలి.. అప్పుడుమాత్రమే అది వాళ్ల ఆలన,పాలనలకి చక్కటి ఆలంబన అవుతుంది.

మీ చిన్నారి గత కొంతకాలం నుంచి తరచుగా మూడీగా , ఒంటరిగా, పరధ్యానం, ఇరిటేషన్ లతో వుంటే వాడు మానశికఒత్తిడిలో వున్నట్లే. వారి ప్రవర్తనలలోని  మార్పులని ఇలా గమనించవచ్చు..
  • స్కూల్ కి వెళ్లడానికి అయిష్టంగా వుండడం
  • ఫ్రెండ్స్ తో కలసి ఆటపాటలకి కలసి ఆడుకోవడానికి ఇష్టపడక పోవడం
  • అడిగినవాటికి  సమధానం ఇవ్వకపోవడం
  • తరచుగా గట్టిగా, అరచినట్లుగా మాట్లడడం
  • కోపంగా సమాధానం ఇవ్వడం
  • ఒంటరిగా వుండడానికి ఇష్టపడడం
  • అందరితో కలసి మెలసి వుండకపోవడం

ఇలా బిహెవ్ చెయడానికి ప్రధానకారణాలుగా వీటిని చెప్పుకోవచ్చు 

  • పిల్లల ముందే తరచుగా మీరు గట్టిగా అరచుకోవడం, కీచులాడుకోవడం, వాదులాడుకోవడం  వారిలో ఇన్సెక్యురిటీగా ఫీల్ కావడానికి కారణం అవుతారు. విషయాన్ని వాళ్లు వ్యక్తీకరించలేక పొవచ్చు, కాని ఆభద్రతా భావానలకి గురవుతారు... అందుకే పిల్లల ముందు అలా ఎప్పటికి ప్రవర్తించకపోవడం  అభిలషణీయం అని గుర్తెరిగి హుందాగా, సరదాగా నడచుకోవడంద్వార వారిలోని ఆభద్రతా భావనలని దూరంచేస్తాయి
మీలోని కోపావేశాలని పిల్లల ముందు ఎప్పుడు ప్రదర్శించకపోవడం అనేవివేకవంతమైన మార్పుని మీ జీవనవిధానంలోనికి మనస్పూర్తీగా స్వాగతించాలి.  
  • సాంఘిక పరమైన సమస్యలు, ఆర్ధిక పరమైన సమస్యలని వారి ముందు చర్చించకండి. అది వారిని ఆందోళనలకి గురిచేస్తాయి.

  • కారణాలు ఏవైన పిల్లలు తల్లితండ్రులలో  ఒక్కరి దగ్గరమాత్రమే వుండడం సహజంగా వారిని తీవ్ర అసంతృప్తికి  గురిచేస్తాయి. ఆవి సహేతుకమైన కారణాలు మీకు కావచ్చు కాని అవి చిన్నారి మనస్సుకి సాంత్వనని ఏమాత్రం తీసుకరాలేవు..

  • క్లాస్ లో చెప్పే పాఠాలు సరిగా అర్ధం చేసుకోకపోవడం, ఇది ప్రధానంగా క్లాస్ రూం లో మాట్లాడే భాష డిఫరెంట్ గా  వుండి ఫాలోకాలేకపోవడం. అది వారి మానశిక స్థైర్యాన్ని దెబ్బతీసి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ నిరాశని తీసుకవస్తుంది.

  • స్కూల్లో ఎవరైన వారితో మిస్ బిహేవ్ చేయడం లేక ఆటలలో దూరంగా వుంచడం వారిని  ఆత్మన్యూనత పరిస్తితులలోనికి తీసుక వెళ్తాయి. ఒంటరి తనానికి దగ్గర చేస్తుంది.


ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక వారితో ప్రేమగా ఆ రోజు క్లాస్ విషయాలని, చెప్పిన పాఠాలని గురించి స్వేచ్చగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి. వాటిని శ్రద్దగా వినండి. వారికి వుండే  చిన్నపాటి ఇబ్బందులని ఫ్రీ గా చెప్పనీయండి.  ఆ ఇబ్బందులని అధిగమించడానికి మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వండి.

వారి హోంవర్క్ లో మీ చేయూత తప్పనిసరి. చేసేసిన హోంవర్క్ కి అభినందించండి. మీ పనులని పక్కనవుంచి డైలీప్రోగ్రస్ ని సునిశితంగా గమనిస్తువుండాలి. వారిలోని బెరుకుతనాన్ని దూరంచేయడానికి మీ వంతు సహకారం తప్పనిసరి.

తోటి మిత్రులతో  ఆడుకోవడానికి వారిని ఎంకరెజ్ చేయండి. ప్రతి రోజు వాళ్లతో కలసి ఆడుకొనేట్లుగా చూడండి.

తరుచుగా వారి క్లాస్ టీచర్ తో మాట్లాడండి.  మీ వాడి చదవులో  ప్రోగ్రస్ ని గురించి వారితో చర్చించాలి క్లాస్ లో వాడి ప్రవర్తనని గురించి ఆరా తీయండి. అవసరమైతే వారి అబిప్రాయాలని, సలహాలని సూచనలని తీసుకోవాలి. గురువుగా మీవాడిని గురించి వారి ఒపినియన్ చాల ముఖ్యమైనది అని గుర్తించి ప్రవర్తించండి.

ఎవరైన మిస్ బిహేవ్ చేసినట్లుగా లేక ఆటలలో దూరంగా వుంచడం మీదృష్టికి వస్తే తప్పకుండా క్లాస్ టీచర్ దృష్టికి తీసుకవెళ్లాలి. దిద్దుబాటు చర్యలని తీసుకోవాలి.

స్కూల్ ఎక్టివిటీస్ లో మీ వాడు తప్పక పాల్గొనేవిధంగా ప్రొత్సహించాలి.

స్కూల్ వాతవరణం వారికి సన్నిహితంగా వుండేట్లు చూసే భాద్యత మీది మరియు స్ఖుల్ యజమాన్యానిది. అందుకనే తరుచు వారితో మాట్లాడడం ఎన్ని పనులున్న వాటిని పక్కనవుంచి , పేరేంట్స్ డే కి విధిగా అటెండ్ కావాలి.

పిల్లల్ని కోపం చేయడం మీ ప్రేమలో ఓ భాగంగా మీ అలవాటు అయితే  మీరు ముందుగా మారాలి. ఆ ఆలోచన సరి అయినది కాదు. వారికి మీ ఆంతర్యం తెలుసుకొనే శక్తి వుండకపోవచ్చు, మానశికంగా ఒత్తిడికి గురి అవుతారు.  వారు తమ మనస్సుల్లో తమని చిన్నబుచ్చుకుంటారు. అది వారి మానశికవికాసాన్ని ప్రభావితంచేస్తుంది. అందుకనే పిల్లలతో ఎప్పుడూ ప్రేమగా వుండాలి.

రోజు నిర్ణిత సమయానికి వారిని నిద్రకి ఉపక్రమించేలా చేయాలి. వారికి మీ అనురాగాన్ని పంచుతూ దగ్గరిగా తీసుకోవడం, హత్తుకోవడం ద్వార  రక్షణ భావాన్ని కలుగచేస్తూ ప్రతిరోజు స్పూర్తీధాయకమైన ఓ మంచి నీతి కధని వారి మనస్సుకు హత్తుకునేట్లుగా  చెప్తు    వారిని నిద్రపుచ్చాలి. అది చక్కటి నిద్రకి ప్రేరణ అవుతుంది, మానశిక ఒత్తిడులని దూరం చేస్తుంది.

పాశ్చాత్య పోకడలకు దూరంగా వారిని మీదగ్గరిగా మీతో పాటు పడుకోనియ్యాలి. నిద్రకి ఉపక్రమించినాక వారిని వారికి కేటాయించిన బెడ్ కి మార్చుకొండి. విడిగా వుంచడంతో కొన్నిమార్లు వారు ఒత్తిడికి దగ్గరయ్యే అవకాశం వుండి. అందుకని మీ విగ్నతని ప్రదర్సించాలి.

ఆహార సంభందిత విషయాలలో కొన్ని మెళుకవలని ఇలా పాటించండి.
  • ఆహారాలు తత్వగుణాన్ని పెంపొందించేవిగా వుండాలి. తేలికగా జీర్ణమయ్యే పండ్లు, కూరగాయలని విరివిగా తీసుకొనేట్లుగా చుడాలి
  • పాలు,  డ్రైనట్సు తేనెలని విరివిగా/రెగ్యులర్గా ఇవ్వాలి. అవి మనస్సుని రిలాక్స్ గా వుంచే సమికృత ఆహరాలు  అవుతాయి .
  • చిప్స్, కూల్ డ్రింక్స్, బర్గర్లు, పిజ్జ, కేక్సు, ఫాస్ట్రీస్, సమోస, బజ్జి, బేకరి ప్రాడక్ట్స్ తమోగుణాన్ని పెంచుతాయి, అదనపు కేలరిలని వృద్ది చేస్తాయి, ఒబెసిటికి కారకాలు అవుతాయి. అందుకని వాటిని ఇవ్వడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • తమో గుణాన్ని కలిగిన ఆహారాలు మనస్సుకి ఇరిటేషన్ కలిగిస్తాయి అందుకని వాటిని వాడకపోవడం మీ చిన్నారి భవిష్యత్తు దృష్ట్యా శ్రేయస్కరం.   




 














Wednesday, 30 December 2015

జాతి రత్నాలు




  
మంచి తండ్రి దగ్గర పెరిగిన ఓ ఆడపిల్లకి మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది
మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి ఓ మహిళను ఏలా గౌరవించాలో , ప్రేమించాలో బాగా తెలుస్తుంది
ఏదైన అది మన పెంపకంలోనే ఉంటుంది
అదే ఆదర్శసమాజ నిర్మణానికి మొదటి అడుగు అవుతుంది.
 పొత్తిళ్లలోని పాపాయికి మాతృస్తన్యం దేవుడు ప్రసాదించిన ఆమూల్య కానుక. ఆ దైవప్రసాదాన్ని తనివిదీర రోజూ త్రాగనీయండి.  అది తల్లి శిశు అనుభందాలని మమేకంచేస్తూ అనిర్వచనీయ అనుభూతులకి దగ్గరచేస్తూంది. పెరిగేపాపాయికి ఈ స్తన్యం అమృతధార అవుతుంది. తల్లిపాలు పాపాయికి ఎదుగుదలకి కావలసిన పోషకాలను అందజేస్తూ ఆరోగ్యవంతమైన జీవనానికి నాంది అవుతుంది. ఇతర సమీకృత ఆహరాలను బేబికి స్తన్యం అందించినంతవరకి అందచేయవలిసిన అవసరం ఏమాత్రం లేదు. 
బేబికి ఆరుమాసాలు నిండినతరువాత నెమ్మదిగా ఘనఆహరాలను పరిచయం చేయాలి.
  • మార్కెట్లలో దొరికే బేబిఫుడ్’ని వాడనవసరంలేదు. మీ ఇంట్లోనే బేబికి కావలసిన ఆహరాన్నిసంప్రదాయక పద్దతిలో తయారుచేసి  మీ ప్రేమతో రంగరించి అందించండి. భెబిఫుడ్’లో రుచికోసం ఉప్పు,కారాలు,మసాలాలని కలపకండి. అలాగే చక్కరకి ప్రత్యామ్నంగా తేనేని కలిపి ఇవ్వాలి.
  • పెరిగే పాపాయి అన్ని రుచులని ఆస్వాదిస్తుంది అయితే ఐస్ క్రీం, కేక్ , పిజ్జా , బర్గర్లు ,కూల్ డ్రింకులకి  వీలైనంత దూరంగా వుంచడం వారి ఆరోగ్య పరిరక్షణలో కీలకం అని గుర్తించండి. అందులోని ఎంఫ్టి కెలరీలు ఒబెసిటిని పెంచడానికి మాత్రమే ఉపయొగపడుతాయి!!
  • ఫుడ్ ఫీడింగ్ విషయంలో వారి ఆభిరుచులకి ప్రాధాన్యత ఇవ్వాలి.
  • చిన్నారికి ఎంత ఇష్టపడుతుందో అంతే ఫీడ్ చేయండి. అంతేగాని క్లీన్ ప్లేట్  కావాలి అని ఒత్తిడి ఎంతమాత్రం చేయకండి. మరింతగా ఫీడ్ తీసుకోవాలని  వారికి టివి, స్మార్ట్’ఫోన్  ప్రోగ్రాం’లని ఆశ పెట్టకండి. ఒబెసిటికి అది మరో అడుగు అవుతుంది !!!
  • రోజూ నిర్దేశిత సమయాల్లోనే నాలుగు లేక ఐదు దఫాలుగా వారి అభిమతం మేరకు ఆహరం ఇవ్వాలి. ప్రతి ఫీడింగ్ కి కనీసం మూడు గంటలు గాప్ ఇవ్వాలి. అది మెటబాలిజ క్రియని తేజోవంతం చేస్తుంది. వారి టమ్మీ సున్నితమైనది అందుకే తేలికగా జీర్ణమయ్యే సాత్వికాహారాలనే ఇవ్వాలి.
ఆహరం తీసుకునే విషయంలో మీ మితిమీరినప్రేమతో వారిని బలవంతం చేయకండి. ఓవర్ ఫీడింగ్ వారి పెరుగుదలపై ప్రతికూల ప్ర భావాన్ని చూపుతుంది.

  • పిల్లలకి కావలసింది మీ ముద్దుమురిపాలు, ప్రేమ ఆప్యాయతలే...వాటినే పంచండి!  
  • వారిని టివి, స్మార్ట్’ఫోన్  ప్రోగ్రాం’లతో గిఫ్ట్ లతో, బొమ్మలతో మచ్చిక చేసుకోవచ్చు అని భావించకండి!!  
  • తల్లివడిని మించిన సౌఖ్యం గిఫ్ట్ కూడ వారికి ఇవ్వదు!  
  • పిల్లలతో సరదగా గడపడానికి ప్రతిరోజు సమయం కేటాయించాలి. వారితో సన్నిహితంగా గడపండి. సరదాగా నవ్వుతు, హగ్ చేసుకుంటూ పలకరించాలి.
  • విధిగా రోజూ వారిని తోటివారితో నిర్ణిత సమయాలలో కలసి మెలసి వుండేట్లుగా ఆటలు ఆడుకోనివ్వాలి. వారితో ఎలా ఆడుతున్నారో గమనించండి. ఆటలలో ఎలా ప్రవర్తించకూడదో నేర్పించండి. ఋజుప్రవర్తనకి, సఖ్యతకి  మొదటి ఆడుగులు సక్రమగావుండెట్లు జాగ్రత్థ తీసుకోవలసిన అవసరాన్ని ఆర్ధం అయ్యేలా నేర్పించండి. ఇతరులతో ఆటపాటలలో పోల్చి చిన్నబుచ్చకండి.
  • వారి  భాల్యాన్ని  మధురానుభూతులతో ఆస్వాదింపచేయనియండి. అవే ప్రేమాంకురాలుగా వారి మదిలో వెళ్లివిరవాడానికి దోహదం అవుతాయి.
పిల్లల ముందు తరచుగా కీచులాడుకోవడం వారిలో ఆభద్రతాభావాన్ని తీసుకువస్తుంది. వారి ముందు హుందాగా ప్రవర్తించాలి మీ కోపావేశాలు, పరస్పర నిందారోపణలు చేసుకోవద్దు. అవి వారి సున్నిత మనస్తత్వాన్ని ప్రభావితం చెస్తాయి. మీ మధ్య వుండే పరస్పర గౌరవమే చిన్నారికి మీరు అందజేసే అపురూప వారసత్వం.
నాన్నగా వాళ్ల అమ్మకి అనురాగాన్ని, ఆప్యాయతలని మాత్రమే పంచాలి. మీ పిల్లలు మిమ్మలనే అనుకరిస్తారు అన్నది గుర్తుంచుకొని ప్రవర్తనని సరిదిద్దుకోవలసిన భాధ్యత తల్లిదండ్రులదే.. పిల్లలు మీరు ఎలా వుంటారో వారు అలాగే  పెరుగుతారు  అందుకని వారి ప్రవర్తన  ఎలావుండాలని మీరు అభిలషిస్తారో  ఆవిధంగా మీరు మారాలి.

  • మీ ఆలోచనలని, అబిప్రాయాలని బలవంతంగా వారిపై రుద్దకండి!  
  • వారి ఆలోచనలని, భావనలని, అభిప్రాయాలని, స్వేచ్చగావ్యక్తికరించనియ్యాలి..
  • వారి  వ్యక్తిత్వాన్ని గమనించి దశలో ప్రోత్సహించాలి.
  • వారిలోని సృజనాత్మకతని నిశితంగా గమనించాలి
  • మీ చిన్నారిలోని అంతర్గత ప్రతిభని గుర్తించండి.. ప్రతిభకి మెరుగులు దిద్దే ప్రయత్నం చేయండి. దిశలో శిక్షణ ఇప్పించాలి
  • లలతకళలలని ఆభ్యసించడానికి ప్రోత్సహించండి. నాట్యం, చిత్రలేఖనం, యోగ, చెస్, సంగితకళలలో ఆసక్తిని పెంపొదించే దిశలో ప్రోత్సహించండి. స్విమ్మింగ్ క్లాసుల్లో  చేర్పించండి. మన ఆచార వ్యవహరాలశైలికి ప్రాధాన్యత ఇవ్వండి. దిశలో మొదటి అడుగులు పడనీయండి.
వారి ప్రవర్తన ఎలా వుండాలో అన్న విషయంలో మీకు పూర్తిగా క్లారిటి వుండాలి. వారి ప్రవర్తనలో మీకు నచ్చని విషయాలని వారికి సున్నితంగా తెలియజేయడమే గాకుండ అది ఎలా వుండాలో వారి మనస్సుకి హత్తుకునేలా తెలియజేయవలసిన భాద్యత మీదే!! వారి ప్రవర్తనలో  తప్పొపులను సునిశితంగా గమనించాలి. వారి తప్పులని సున్నితంగా చూపించండి. అలా ఎందుకు చేయరాదో, ఎలా చేయాలో వారికి తిరిగి అర్ధం అయ్యేలా తెలియచేయాలి. అదే పొరపాట్లు  తిరిగిచేయనివ్వకండి. అవే తప్పులని పదేపదే చేస్తుంటే చూసిచుడనట్లుగా వదలివేయకుండా చక్కటి క్రమశిక్షణని అమలుచేస్తూ సహనంతో సరిదిద్దాలి. క్రమశిక్షణని అమలు చేసే విషయంలో పిల్లలముండు మీరు ఎప్పుడు ఆర్గ్యుమెంట్లు చేసుకోకండి.  ప్రవర్తనని సరిదిద్దడంలో మీలో ఏకాభిప్రాయం తప్పనిసరి. మీరు అమలు చేయలేని ఆర్డర్లు, క్రమశిక్షణని పిల్లలకి ఇవ్వకండి. క్రమశ్క్షణ పేరుతో కఠినంగా శిక్షించకండి. ఒక తప్పుకి ఒక పనిష్మెంట్ ఒక మంచి పనికి ఒక రివార్డ్’ నే ఇవ్వాలి. ఇవ్వబడే పనిష్మెంట్ మీ చిన్నారిని భయభ్రాంతులకి గురిచేసెట్లుగా అసలు వుండరాదు. ఇచ్చే రివార్డ్ స్పుర్తిదాయకంగా వుండాలి.
భవిష్యత్తులో జాతిరత్నంగా తీర్చిదిద్దడానికి  ఇపుడే శ్రీకారం చుట్టాలి.
పెంచడం అమ్మే అయినా బాధ్యతాయుతంగా పెంచడం నాన్న బాధ్యతే!!
సేవచేయడం అమ్మవంతు మరి సరిచేయటం నాన్నవంతు !!
కనిపించే ఆరాటం అమ్మది, కనిపించని పోరటమే నాన్నది !!!
అమ్మ మీ రక్తం అయితే నాన్న మీ హృదయం !!!

Tuesday, 24 November 2015

23 నవసమాజ నిర్మణానికి పదండి ముందుకు....



నవతరం


నేటిచిన్నారులే రేపటి భవిష్యత్తు, నవోదయ కరదీపికలు!  నవశకానికి చిరుదివ్వెలు ! మీ ఆశాదీపాలు, మీకలల సాకారాలు!! ఆడుతూ, పాడుతూ కేరింతలతోసాగాలి బాల్యం. గలగల సాగే మధురస్రవంతిలా  తోటివారితో అరమరికలులేకుండా కలసిమెలిసే జీవనస్రవంతిలా  కొనసాగుతూ ఉండేలా చూడడం మన బాద్యత. రేపటి పౌరులుగా ఆహ్లదకరమైన వాతవరణంలో ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యభరితంగా చిరునవ్వులతో కొనసాగాలి  కౌమారదశ.
మనజాతి సంపదని మహోన్నతంగా, ఉజ్వలంగా, ఆదర్సవంతంగా తీర్చడంలో తల్లిదండ్రులుగా మన భాద్యత అసమానమైనది, నిరుపమానమైనది.
నేటి సమాజికవ్యవస్థలో ఈ భాద్యతానిర్వహణ బహుసున్నితం, క్లిష్టతరం అయింది.
ఆదర్శవంతమైన పెంపకానికి కావలసిన పేరెంటింగ్ స్కిల్స్ నేటిసమాజంలో కొరవడడం కలచివేస్తున్న భాధకరవాస్తవం. నిజానికి ఈ భాద్యతలను సక్రమంగానిర్వర్తించడానికి తల్లిదండ్రులకు నిర్దేశిత కోర్సులుగాని, కోచింగ్ సెంటర్లూగాని లేవు. ఈ దిశలొ అనుభవరాహిత్యం , అవగాహనరాహిత్యం తల్లిదండ్రులకు/సమజానికి పెనుసవాలుగా మారుతున్నాది.
కాబోయే తల్లిదండ్రులు ఈఅవగాహనరాహిత్యాని, అనుభవలేమిలని గుర్తించడంలో వాటిని అధిగమించడంలో  విఙ్నతని పెంపొందించుకోవాలి. ఈ దశలో మొదటి అడుగుగా…
  • సంతానం ఎప్పుడు కావాలి అన్న విషయంలో సంధిగ్ధతలు వుండరాదు. ఇరువురి ఏకాభిప్రాయంతోనే గర్భధారణకి అంకురార్పణ జరగాలి. అంతవరకి సంతాననిరోధక పద్దతులని తప్పక  పాటించాలి, అది అవాంచనీయ గర్భధారణలకి చెక్ అవుతుంది. ఆరోగ్యవంతమైన సంసారిక జీవనానికి నాంది అవుతుంది.
  • గర్భధారణకి సహధర్మచారిణి వయస్సు కనీసం ఇరవైకి పైగా వుండడం అభిలషణీయం. ఆమె ఆరోగ్యాన్ని, మానసికవికాసాన్నికూడ పరిగణనలోనికి తీసుకోవాలి.
  • దంపతుల్లో ఎవరైన సుగర్ భాధితులైతే ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలని తెలుకోవాలి వాటిని అమలుపరచి తీరాలి.
  • గర్భధారణ గురించిన అపోహలు, ఆందోళనలు , భయాలు ఉండడం సహజం అవి మీ మదిని కలవరపరుస్తూ వుండవచ్చు. ఇందుకుగాను మీ ఫ్యామిలిడాక్టరుతో నిస్సంకోచంగా మీ ఆరోగ్య సమస్యలని, మదిలోని ఆలోచనల ప్రకంపనలని, అలవాట్లని వివరంగా మనస్సువిప్పి చర్చిం చాలి. వారి సలహాలు సూచనలను పాటించాలి.
  • ఈ క్రమంలో ఆరోగ్యకర అలవాట్లని స్వాగతించాలి. సమతుల్యమైన బలవర్ధకమైన పోషక ఆహరాలని తీసుకోవడం మీ జీవనశైలి కావాలి. ద్రవపదర్థాలని ఎక్కువుగా తీసుకుంటు, ఎంప్టికెలరీ ఆహరాలని దూరంగా వుంచండి. రోజుకి రెండు నుంచి మూడులీటర్ల నీరు  త్రాగాలి. అవి శారీరక సమతుల్యతలని కాపాడుతూ మిమ్మలని ఆరోగ్యవంతులుగా వుంచుతుంది.
  • ఆల్కహాల్ డ్రింకింగ్, సిగరేట్ స్మోకింగ్, జర్డాపాన్, పొగాకు ఉత్పత్తులను వాడే అలవాట్లువుంటే వాటిని దూరంగా వుంచండి, అవి గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
  • నిర్ధేశిత సమయాల్లో భోజనం, నిర్ణిత సమయాల్లొ నిద్రకి ఉపక్రమించాలి. ఆలస్యంగా నిద్రపోయె అలవాటుకి స్వస్తి చెప్పి 9:30కి నిద్రకి ఉపక్రమించాలి. బెడ్’రూంలోనికి ధారాళంగా గాలి వెలుతురు వచ్చేట్లుగా వుండాలి. నైట్ నీలిరంగు బెడ్ ల్యాంప్ వాడండి. సరితగినంత నిద్ర మిమ్మలని  ఆహ్లదకరంగా వుంచుతుంది. స్మార్ట్’పోన్’ని చీకట్లో బెడ్’రూంలోవాడడం మానివేయండి అవి కంటిచూపుకి హానికరం.
  • బెడ్ రూంలో టివి ప్రోగ్రాములు చూడడం అలవాటు ఉంటే టివిని హాలులోనికి మార్చండి, లేకుంటే మీకు తెలియకుండానే ఎక్కువసమయం టివి వాచింగ్ లో గడిపేస్తారు.
  • మానశికపుష్టి, శారీరకపుష్టి, ఆర్ధికపుష్టి, ఆరోగ్యపుష్టిలసమ్మేళనంతో మీ కుటుంభంలోనికి నూతనశిశువుకోసం శ్రీకారం చుట్టాలి.
  • కాబోయే తండ్రిగా సహధర్మచారిణితో మరింత సన్నిహితంగా వుండాలి. ఆమె భావోద్వేగాలను, ఆలోచనాప్రకంపనలను నిశితంగా గమనిస్తూ మానశికంగా దగ్గరిగావుంటు, అక్కున చేర్చుకొని నేనున్నాను అనే భరోసాన్ని ఇవ్వాలి.
  • ఆమెలో శారీరకంగా, మానసికంగా కలిగే మార్పులను ప్రేమానురాగాలతో గమనిస్తూ ఆమెకు  చేదోడువాదోడుగా, ఆప్యాయంగా వుంటూ సంతోషంగా వుంచడం మీభాద్యత. ఇంటి పనులని షేర్ చేసుకోండి.
  • ఆమె మనస్సుని ఆహ్లదకరంగా వుంచడానికి రోజు ఆరుబయట వాకింగ్ తప్పనిసరి. వీలు అయితే వారంలో ఓ గంట  స్విమ్మింగ్’కి కేటాయించండి.
  • శృంగారంలో సున్నితత్వం, లాలిత్యం కలగలపుగా వుండాలి. అందులో ఆమెకి అభిరుచి, ఆసక్తి వుండితీరాలి. ఆమెకి శృంగారంపై అనాసక్తి ఉంటే దానికి దూరంగా వుండడమే బెటర్.
  • మనస్సు ప్రశాంతత పొందడానికి యోగసాధన ఓ చక్కటి పరిష్కార వేదిక. అందుకని మీరు సరయిన యోగశిక్షణ తీసుకొని యోగాభ్యాసం చేయండి.  
  • సృష్టిలో ప్రతిశిశువు ఆణిముత్యమే ఇందులో లింగవివక్షణకి ఆస్కారమే ఇవ్వకండి. లింగ నిర్ధారణ పరిక్షలు చేయించకండి అది నేరం కూడ.
  • శిశువు పెరుగదలను, తల్లి ఆరోగ్యపరిస్తితులను రెగ్యులర్ గా డాక్టర్’తో చెకప్’లు చేయించాలి.
అల్ట్రాసౌండ్ స్కాన్నింగ్’లని అందులో మీ చిన్నారి స్పందనలను ఆస్వాదించండి. మీశ్రీమతితో ప్రతిసారి డాక్టరుని కలవండి.శిశువు పెరుగదలలో జన్యుపరమైన లోపాలను గుర్తిస్తే అవసరమైతే డాక్టరు సలహమేరకు గర్భవిచ్చిత్తికి సంసిద్దం కావలసిందే.

ఆరోగ్యవంతమైన దంపతులు మాత్రమే ఆరోగ్యకరమైన శిశువుని అపురూప కానుకగా భవిష్యత్ తరానికి అందచేయగలరు. చిన్నారులని మీ వారసులుగానే గాకుండా దేశసంపదగా గుర్తించాలి. అది మన జాతీయసంపదని ఆదర్శవంతంగా పురొగమనదిశకి నడిపించే మొదటి అడుగు కావాలి.