Thursday, 12 February 2026

జాగృతి మాలిక 02 అప్రమేయుడిని ఎలా దర్శించాలి


పరమాత్మ 🔱 స్వరూపం


ఈ సృష్టి అనంతమైన, అభేద్యమైన మహాజీవరాశి. సకల జీవరాశులను నడిపించే శుద్ధచైతన్య స్వరూపం. అది తేజోవంతం, ✨చైతన్యవంతం,జీవభరితం, స్పూర్తిభరితం, వైవిధ్యభరితం, అజరామరం.


ఈ శుద్ధచైతన్యమే మనస్సులో జ్ఞానశక్తిగా 🕯️ప్రజ్వలం అవుతూ వుంటుంది.

అదే జీవశక్తిగా జఠరాగ్నినీ కలిగించి 🥗 ఆహారాన్ని తీసుకోవాడనికి ప్రేరణ అవుతుంది.

అదే దృష్టిగా 👁️కంటితో విశ్వాన్ని చూపిస్తుంది.

అదే శ్రవణశక్తిగా 🦻చెవితో శ్రవానందం కలిగిస్తుంది.

అదే గాత్రంగా మధుర స్వరంతో నిన్ను పరవశున్ని చేస్తుంది.

అదే ఆగ్హణశక్తిగా 👃నాసికతో పరిమళాలను ఆస్వాదిస్తుంది.

అదే మలయమారుతాలు, చిరుజల్లుల 🌧️స్పరానుభూతితో మనస్సును పులకరింపచేస్తుంది.

అదే ప్రేమ, ఆప్యాయతలతో తన కుటుంబాన్ని లాలిస్తుంది, పోషిస్తుంది.

ఆ అనుభూతులను జ్ఞాపకాల దొంతర్లుగా🧠 మనస్సు పుటల్లో భద్రపరచుకుంటుంది.


అది మన ఆలోచనల తీరుని, ప్రవర్తనని, నడవడికని, ప్రజ్ఞ, మేధస్సులని, హావభావాలని, మాటతీరుని ప్రభావితం చేస్తూ నీ వ్యక్తిత్వానికి  ఓ దిశ, దిశలని అవగతం చేస్తుంది.


నిన్ను మహోత్తర శిఖరాలకు చేరుస్తుంది, జాగరూకతతో లేకుంటే అదే పాతాళానికి కూడా తోసేస్తోంది. అది సంకల్ప, వికల్పాల క్షేత్రం.


మనందరిలో ఓ'ఐశ్వర్య నిధి ' 🗃️వుంది. అందులో ఓ అపురూప దివ్య ఆభరణం భగవంతుడు భద్రపరిచాడు! దాని ' కీ ' నీ చేతుల్లో, చేతల్లోనే వుంచాడు!


మన అంతరంగమే ఆ ‘అష్టైశ్వర్యాల నిధి ’ దాని ’ కీ' మనస్సే! అంతరాత్మనే ఆ దివ్యఆభరణం!అది చైతన్యవంతం, స్వయం ప్రకాశం ✨ తో హృదయంతరాలలో వికసించి దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది !!


అంతరాత్మని ఎరుకతో, సంయమనంతో, జాగరూకతతో గమనిస్తే అది పరమాత్మ సస్వరూపమే. మరి దానిని ఎలా దర్శించాలి...


భక్తి, శ్రద్ధ,నిష్ట,అనన్యచింతనలతో అష్టైశ్వర్యాల నిధి, ఆత్మ వైభవానుభూతినీ పొందగలము!


సర్వే జన సుఖినోభవంతు.

మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra



జాగృతి మాలిక 01 🔱 దేవుడు ఎందుకు కనిపించడు???


దేవుడు 🔱 వున్నాడా…?


దైవానికి ఎలాదగ్గరకావాలి?

దేవుడువున్నాడు అనే నమ్మకంతో కొందరు,

దేవుడువున్నాడా అనే అపనమ్మకంతో ఇంకొందరు,

దేవుడు ఎక్కడ వుంటాడు అనే సందిగ్ధంలో మరికొందరు.

దేవుడువుంటే ఎందుకు కన్పించడు?

కనిపించని దేవుడిని ఏమని పిలవాలి?

ఏమని ప్రార్థించాలి?

ఆయన మనప్రార్థనలను ఆలకిస్తాడా?

ఆయన మనకోరికలను నెరవేరుస్తాడా?

అసలు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు?

ఇంతకీ ఎవరైనా దేవుడీని చూసారా?


ఇలా ఎన్నెన్నో సందేహాలు???


దేవుడు వున్నాడు అని వాదించేవాడు, దేవుడులేడు అని వాదించే ఇద్దరి వాదనలు కూడా సరియైనవికానే కాదు!!


దేవుడువున్నాడు అనే వాడు ఆ అనుభూతిని మనసారా ఆస్వాదించకనే,ఆ ప్రయత్నంకూడా చేయకనే పూజలు, 🪔 హోమాలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తూ ఆ భ్రమతోనే వుంటూవుంటాడు. పరమాత్మ అనుభూతిని పొందనివాడు ఆ అంకిత భావాన్ని ఎలా కలిగివుంటాడు!!

దేవుడిని చూడలేదు,కాబట్టి దేవుడు లేడు అనే అజ్ఞాని చీకటిలో వుండి చైతన్యవంతం,స్వయం ప్రకాశిత అంతర్యామి అనుభూతిని ఎలా పొందగలడు?


సుగంధపరిమళాలు👃 నాసికతోనే అస్వాదిస్తాం అని అనుకుంటాం, కానీ నిజానికి అది ఓ మానశిక అనుభూతి!

సంగీతం  🦻చెవితో వింటున్నా ఆ శ్రవణానందకరం ఆత్మానుభూతితోనే సాధ్యం!

👁️కంటితో చూసే సుందరదృశ్యం, మనస్సుతో వీక్షిస్తే సుందర మనోహరదృశ్యంగా మనస్సుపొరల్లో నిక్షిప్తం అవుతుంది కదా!

అదేవిధంగా ఆత్మానుభూతితోనే దైవానుభూతిని మనసారా ఆస్వాదించగలం. అందుకు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే సాధన తప్పక వుండితీరాలి.


మనసే ఓ కోవెల 🛕గా అంకితభావం, సమర్పణభావం, దృఢచిత్తం, భక్తి, శ్రద్ధ, నిష్ఠ, అనన్యచింతనలతో మేళవించిన ధ్యానం 🧘‍♀️ ద్వారా  అప్రమేయుడు, విశ్వంభరుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మత తత్వానికి చేరువకాగలం. ధ్యానం ఆ పరమాత్మ అనుభూతిని ఆస్వాదించడానికి ఓ యానకం అవుతుంది.


ఈ రోజునుంచే ధ్యానం ద్వారా ఆ పరమాత్మ తత్వానికి దగ్గర అయ్యే ప్రయత్నం ఆరంభించాలి.


సర్వేజన సుఖీనో భవంతు


మీ ఆధ్యాత్మిక సేవలో


RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra


Wednesday, 11 February 2026

రానా కవితలు 4 పరంబ్రహ్మ

 

రానా కవితలు 4 పరంబ్రహ్మ 


విశ్వం లేని శివం లేదు 

శివం లేని జీవం లేదు 

జీవం లేని ప్రాణి లేదు 

జీవం కానీ ప్రాణం లేదు

ప్రాణం లేని మనుగడ లేదు

మనుగడ లేని విశ్వం లేదు 

విశ్వం లేక బ్రహ్మసృష్టియే లేదు 

సర్వం అవ్యయం

సర్వం అనంతం 

సర్వం శివమయం !!!


వాయువు నీలో చలనశక్తి, ప్రాణశక్తులుగా 

పృద్వి నీలో  శరీరక్షేత్రంగా 

అగ్ని 🔥 నీలో తేజస్సు, ఓజస్సులుగా 

జలం 🚰నీలో స్వచ్ఛభరిత జీవధారగా 

ఆకాశతత్వమే నీలో శ్రవణ👂, గాత్రలుగా 

పంచభూతాత్మ స్వరూపంగా 

సర్వం జీవమయం

సర్వం శక్తిమయం 

సర్వం చైతన్య మయం 

సర్వం శివమయం!!!


నీలో,నాలో,మనందరిలో 

సృష్టిలో సకల జీవరాశిలో

🪐అఖండమండలాకారం లో 

విశ్వంలో శుద్ధ చైతన్యశక్తి ⚡️ గా 

విద్వత్ శక్తిగా 

సకల చరాచరజగత్తులో 

సర్వత్రావిస్తరించిన 

అప్రమేయుడుగా 

అవ్యయుడుగా 

ఆ విశ్వంభరుడుని 

జీవశక్తిగా, 

సకలసృష్టిలో 

పరంబ్రహ్మ బింబరూపంలో సమదర్శనమే 

పరమేశ్వరుడికి 

సమర్పించే  అనన్య భక్తి పూర్వక 

కుసుమాంజలి 

🙏🙏🙏🙏

ధ్యాన మాలిక జూలై 26 సంచికలో ప్రచురితమైనది 



రానా కవితలు 3 వదిలేయండి

 


రానా కవితలు 3 వదిలేయండి!!!


వదిలేయండి!!!



కడిగేయాలి 

మీ కాలికి అంటిన మురికిని 

లేదా అది మీ ఇంటిని మురికి మయం చేస్తుంది

అలాగే 

వదిలివేయాలి

మీ 

కోపాలు,తాపాలు

పగలు,ప్రతీకారాలు

కుట్రలు,కుతంత్రాలు

వెతలు, వేదనలు

కలహాలు,కలతలు

వాంఛలు,వంచనలు

పంతాలు,పట్టింపులు

ఉద్వేగాలు,ఉద్విగ్నాలు 

అసూయ,ద్వేషాలు

మోహాలు,విరహాలు

కోరికలు,భేషజాలు

ఇష్టాలు,అయిష్టాలు

బంధాలు,అనుభందాలు

ఎందుకు అంటే 

చివరికి ఇవి ఏవి మిగలవు!

మన ఈ ప్రయాణం చిన్నది!

ప్రతి వెలుగు చీకటిలోనే ముగుస్తుంది!


ఈ చిరు ప్రయాణమే

చింతలు లేని ప్రయాణంగా

ఆనందహేళగా కొనసాగాలి

అందుకే 

వదలివేయకండి 

ధర్మరక్షణే మొక్కవోనిదీక్షగా 

కష్టసుఖాలలో మనోస్థైర్యం

గెలుపు 🥇 ఓటమి 😡 లలో చెదరని విశ్వాసం 

ప్రలోభాలకు లొంగని దృఢత్వం

లాభనష్టాలలో సడలని అపరిగ్రహం

జయాపజయాలలో నిర్వికారభావన 


పరమాత్మ యందు అంకితభావం

ప్రత్యగాత్మ యందు సడలనిదీక్ష 

అప్రమేయుడి యందు సమర్పణభావం

సర్వేశ్వరుని యందు అనన్యభక్తి 

విశ్వంభరుడి యందు అనన్యచింతన

సకలసృష్టిలో విధాత అక్షయస్వరూపం


ఇవే మీ తోడునీడ అయితే 

జీవితం శాంతిభరితం 

మనస్సు ఆనందభరితం 

హృదయం వికసిత ప్రేమమయ కరుణారసభరితం 

అవుతుంది, వెరసి 

ప్రశాంతభరిత జీవనపయనం




రానా కవితలు 2 ప్రత్యగాత్మ


రానా కవితలు 2 ప్రత్యగాత్మ


వినువీధిలో

స్వేచ్చగా విహరించే విహంగ పరిజ్ఞానం 

🐦‍⬛విహంగాలకు ఎవరు నేర్పించారు ? 

చెట్లమీద  🕊️గూడు ఓ అద్భుత ఆవిష్కరణగా 

నిర్మించే ఇంజనీరింగ్ జ్ఞానం దానికి ఎవరిద్వారా వచ్చింది? 

ఎంత సుదూరప్రయాణం చేసినా 

తిరిగి తనగూటికే చేరే జీపీఎస్ జ్ఞానం 

ఈ విహంగాలకు ఎక్కడినుంచి, ఎలా వచ్చింది?


మట్టిలో విత్తిన విత్తనం 🌱మొలకగా 

అంకురించే పరిజ్ఞానం దానికి ఎక్కడినుంచి వచ్చింది? 

వెలుతురునే తినేటువంటి 

జ్ఞానం వాటి 🌿ఆకులకు ఏలా వచ్చింది? 

జాబిల్లి వెలుగులలో మొగ్గ 

పూవులా 🌺పరిమళించే వికసితజ్ఞానం వాటికి ఏలా వచ్చింది? 

మోడువారిన చెట్టుకు 🪾తిరిగి చిగురించే  జీవజ్ఞానం,

నీటి అలభ్యతను ఎదిరించి కొనసాగించే జీవనగమనజ్ఞానం 

ఎడారి🌵 మొక్కలకు ఎవరు, ఎప్పడు నేర్పించారు? 


సాలీడు 🕷️తనకు మాత్రమే పేటెంట్ హక్కు కలిగిన

సాలెగూడు 🕸️నిర్మాణాత్మకప్రజ్ఞ దానికి ఏలా వచ్చింది? 

🐝 తేటికి మకరందసేకరణ సామర్ధ్యం 

తేనపట్టు నిర్మాణప్రజ్ఞ ఎక్కడినుంచి వచ్చింది? 

🐜చీమకి వాల్మీకం నిర్మాణ ప్రతిభ,

ఆహారజాడలను గుర్తించి స్నేహితచీమలకు కమ్యూనికేట్ చేసే శక్తి ఎవరిచ్చారు?


భూకంపాలను, ప్రకృతి విపత్తులను 

వాతావరణమార్పులను ముందుగానే పసిగట్టే విశేషజ్ఞానం 

జంతువులకు, పక్షులకు ఎక్కడినుంచి, ఎలా వచ్చింది?


లైఫ్ జాకెట్ లేకుండానే నీటిలో సదా విహరించే 

జీవశాస్త్ర కళ 🦈మీనంకి  ఎక్కడినుంచి వచ్చింది? 

కళ్లుమూయకనే నిద్రించే కళ 🐟మత్స్యానికి ఏలా వచ్చింది?

నీటిని ప్రాణశక్తిగా మార్చుకొనే జీవకళ🐠 ఝషముకే సొంతం ఏలా అయ్యింది?


కొంకర్లుపోయే విపరీతచలిలో 

ఆచ్ఛాదనరహిత జీవనపయనం,

మంచుగడ్డ కట్టే చలిలో ఆహారలేమిని,

శిశిరనిద్రని కొనసాగించే 

అతీంద్రియశక్తి నాగసాధువులకి  ఏలా వచ్చింది? ఎక్కడినుంచి వచ్చింది?


సకల జీవరాశులలో 

ఈ  విశేషపరిజ్ఞానం,

చైతన్యరూపంగా,

ప్రాణధారణగా,

ప్రాణశక్తిగా,

ప్రత్యగాత్మ

ప్రాణులలో పురుడుపోసుకుంది!!








 

రానా కవితలు 1 విశ్వంభర

 రానా కవితలు 1 విశ్వంభర

అరుణ కాంతుల సొగసులను 

స్వాగతిస్తూ 

ఉషోదయ వేళల్లో 

వికసించే 🪻పూబాలలనడుగు 

పూదోట వెదజల్లే పరిమళాలనడుగు

మలయమారుతాలతో పరవశించే కొండగాలినడుగు

పూతోటలోని🐝 తేటి నడుగు 

ఈ తుషారబిందువుల🫧 సొగసులు నీకెక్కడివి అని 

అంకురించిన 🌱 మొలకనడుగు

కుహు కుహూ రాగాల కోకిలనడుగు

పక్షుల కిలకిల రావాలనడుగు

🦋సీతాకోకచిలుకగా మారిన 🐛 గొంగళిపురుగునడుగు

పురివిప్పిన🦚 నాట్యమయూరిని నడుగు

చెంగు చెంగున ఎగిరే జింక పిల్లలనడుగు

గల గల పారే సెలయేళ్లలో

తమ సొగసులతో ఆకట్టుకునే 🦢రాజహంసలనడుగు

పుడమి తల్లిని దైవంగా భావించే కృషీవలుడిని నడుగు

తన స్వేదాన్ని తర్పణంగా సమర్పించే అన్నదాత నడుగు

సుప్రభాతసేవలో తరిస్తున్న 🧘‍♂️యోగులనడుగు

ఏ కుంచెతో ఈ నింగికి సప్తవర్ణాలు అద్దినది ఎవరు?

ఇంకెవరు 

ప్రకృతి లోని అందాలలో, ఆనందాలలో 

నీ లోన, బయట

అటు,ఇటు, ఎటు చూసినా 

సర్వత్రా, సర్వంగా విస్తరించివున్న 

ఆ అప్రమేయుడే 

విశ్వంభరుడు 



మీ 

RaNa 

9900022729

ధ్యాన మాలిక మార్చ్ 26 సంచికలో ప్రచురితం 


Thursday, 10 November 2016

పిల్లలలో మానశిక ఒత్తిడి


పిల్లలలో మానశిక ఒత్తిడి









మనలో చాలమంది చిన్నపిల్లకి మానశిక ఒత్తిడులా, అవి ఎందుకు వుంటాయి...! వాళ్లకి ఏమి ప్రాబ్లంలు/ సమస్యలు వుంటాయి.. అనే భావనలో వుంటాం…!! నిజానికి ఇవి మనందరిలో వయస్సుతో సంభందం లేకుండా వుండనే వుంటాయి.. తల్లి గర్భంలోవుండే శిశువుకి కూడా ఇవి వుంటాయి అన్నది మన వుహలకి అందని యదార్ధం... లౌడ్ మ్యూజిక్, వింతశబ్ధాలకి , పిడుగుపాటి శబ్ధాలకి గర్భస్థ శిశువు వులికిపడడం  చాలామంది తల్లులకు అనుభవమే..! అందుకే వినసొంపైన, లయబద్దమైన, శ్రావ్యమైన , ఆహ్లదభరితమైన వీనులవిందైన సంగీతాన్నే తల్లిగా మీరు ఆస్వాదించాలి


మీచిన్నారి ప్రవర్తనలో వచ్చే మార్పులు, చేర్పులని సునిశతంగాగమనిస్తూ వుండడం తల్లితండ్రులుగా మీ కనీసభాద్యత , ఇది ప్రధానం అన్నది తప్పక గుర్తించాలి.. అప్పుడుమాత్రమే అది వాళ్ల ఆలన,పాలనలకి చక్కటి ఆలంబన అవుతుంది.

మీ చిన్నారి గత కొంతకాలం నుంచి తరచుగా మూడీగా , ఒంటరిగా, పరధ్యానం, ఇరిటేషన్ లతో వుంటే వాడు మానశికఒత్తిడిలో వున్నట్లే. వారి ప్రవర్తనలలోని  మార్పులని ఇలా గమనించవచ్చు..
  • స్కూల్ కి వెళ్లడానికి అయిష్టంగా వుండడం
  • ఫ్రెండ్స్ తో కలసి ఆటపాటలకి కలసి ఆడుకోవడానికి ఇష్టపడక పోవడం
  • అడిగినవాటికి  సమధానం ఇవ్వకపోవడం
  • తరచుగా గట్టిగా, అరచినట్లుగా మాట్లడడం
  • కోపంగా సమాధానం ఇవ్వడం
  • ఒంటరిగా వుండడానికి ఇష్టపడడం
  • అందరితో కలసి మెలసి వుండకపోవడం

ఇలా బిహెవ్ చెయడానికి ప్రధానకారణాలుగా వీటిని చెప్పుకోవచ్చు 

  • పిల్లల ముందే తరచుగా మీరు గట్టిగా అరచుకోవడం, కీచులాడుకోవడం, వాదులాడుకోవడం  వారిలో ఇన్సెక్యురిటీగా ఫీల్ కావడానికి కారణం అవుతారు. విషయాన్ని వాళ్లు వ్యక్తీకరించలేక పొవచ్చు, కాని ఆభద్రతా భావానలకి గురవుతారు... అందుకే పిల్లల ముందు అలా ఎప్పటికి ప్రవర్తించకపోవడం  అభిలషణీయం అని గుర్తెరిగి హుందాగా, సరదాగా నడచుకోవడంద్వార వారిలోని ఆభద్రతా భావనలని దూరంచేస్తాయి
మీలోని కోపావేశాలని పిల్లల ముందు ఎప్పుడు ప్రదర్శించకపోవడం అనేవివేకవంతమైన మార్పుని మీ జీవనవిధానంలోనికి మనస్పూర్తీగా స్వాగతించాలి.  
  • సాంఘిక పరమైన సమస్యలు, ఆర్ధిక పరమైన సమస్యలని వారి ముందు చర్చించకండి. అది వారిని ఆందోళనలకి గురిచేస్తాయి.

  • కారణాలు ఏవైన పిల్లలు తల్లితండ్రులలో  ఒక్కరి దగ్గరమాత్రమే వుండడం సహజంగా వారిని తీవ్ర అసంతృప్తికి  గురిచేస్తాయి. ఆవి సహేతుకమైన కారణాలు మీకు కావచ్చు కాని అవి చిన్నారి మనస్సుకి సాంత్వనని ఏమాత్రం తీసుకరాలేవు..

  • క్లాస్ లో చెప్పే పాఠాలు సరిగా అర్ధం చేసుకోకపోవడం, ఇది ప్రధానంగా క్లాస్ రూం లో మాట్లాడే భాష డిఫరెంట్ గా  వుండి ఫాలోకాలేకపోవడం. అది వారి మానశిక స్థైర్యాన్ని దెబ్బతీసి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ నిరాశని తీసుకవస్తుంది.

  • స్కూల్లో ఎవరైన వారితో మిస్ బిహేవ్ చేయడం లేక ఆటలలో దూరంగా వుంచడం వారిని  ఆత్మన్యూనత పరిస్తితులలోనికి తీసుక వెళ్తాయి. ఒంటరి తనానికి దగ్గర చేస్తుంది.


ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక వారితో ప్రేమగా ఆ రోజు క్లాస్ విషయాలని, చెప్పిన పాఠాలని గురించి స్వేచ్చగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి. వాటిని శ్రద్దగా వినండి. వారికి వుండే  చిన్నపాటి ఇబ్బందులని ఫ్రీ గా చెప్పనీయండి.  ఆ ఇబ్బందులని అధిగమించడానికి మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వండి.

వారి హోంవర్క్ లో మీ చేయూత తప్పనిసరి. చేసేసిన హోంవర్క్ కి అభినందించండి. మీ పనులని పక్కనవుంచి డైలీప్రోగ్రస్ ని సునిశితంగా గమనిస్తువుండాలి. వారిలోని బెరుకుతనాన్ని దూరంచేయడానికి మీ వంతు సహకారం తప్పనిసరి.

తోటి మిత్రులతో  ఆడుకోవడానికి వారిని ఎంకరెజ్ చేయండి. ప్రతి రోజు వాళ్లతో కలసి ఆడుకొనేట్లుగా చూడండి.

తరుచుగా వారి క్లాస్ టీచర్ తో మాట్లాడండి.  మీ వాడి చదవులో  ప్రోగ్రస్ ని గురించి వారితో చర్చించాలి క్లాస్ లో వాడి ప్రవర్తనని గురించి ఆరా తీయండి. అవసరమైతే వారి అబిప్రాయాలని, సలహాలని సూచనలని తీసుకోవాలి. గురువుగా మీవాడిని గురించి వారి ఒపినియన్ చాల ముఖ్యమైనది అని గుర్తించి ప్రవర్తించండి.

ఎవరైన మిస్ బిహేవ్ చేసినట్లుగా లేక ఆటలలో దూరంగా వుంచడం మీదృష్టికి వస్తే తప్పకుండా క్లాస్ టీచర్ దృష్టికి తీసుకవెళ్లాలి. దిద్దుబాటు చర్యలని తీసుకోవాలి.

స్కూల్ ఎక్టివిటీస్ లో మీ వాడు తప్పక పాల్గొనేవిధంగా ప్రొత్సహించాలి.

స్కూల్ వాతవరణం వారికి సన్నిహితంగా వుండేట్లు చూసే భాద్యత మీది మరియు స్ఖుల్ యజమాన్యానిది. అందుకనే తరుచు వారితో మాట్లాడడం ఎన్ని పనులున్న వాటిని పక్కనవుంచి , పేరేంట్స్ డే కి విధిగా అటెండ్ కావాలి.

పిల్లల్ని కోపం చేయడం మీ ప్రేమలో ఓ భాగంగా మీ అలవాటు అయితే  మీరు ముందుగా మారాలి. ఆ ఆలోచన సరి అయినది కాదు. వారికి మీ ఆంతర్యం తెలుసుకొనే శక్తి వుండకపోవచ్చు, మానశికంగా ఒత్తిడికి గురి అవుతారు.  వారు తమ మనస్సుల్లో తమని చిన్నబుచ్చుకుంటారు. అది వారి మానశికవికాసాన్ని ప్రభావితంచేస్తుంది. అందుకనే పిల్లలతో ఎప్పుడూ ప్రేమగా వుండాలి.

రోజు నిర్ణిత సమయానికి వారిని నిద్రకి ఉపక్రమించేలా చేయాలి. వారికి మీ అనురాగాన్ని పంచుతూ దగ్గరిగా తీసుకోవడం, హత్తుకోవడం ద్వార  రక్షణ భావాన్ని కలుగచేస్తూ ప్రతిరోజు స్పూర్తీధాయకమైన ఓ మంచి నీతి కధని వారి మనస్సుకు హత్తుకునేట్లుగా  చెప్తు    వారిని నిద్రపుచ్చాలి. అది చక్కటి నిద్రకి ప్రేరణ అవుతుంది, మానశిక ఒత్తిడులని దూరం చేస్తుంది.

పాశ్చాత్య పోకడలకు దూరంగా వారిని మీదగ్గరిగా మీతో పాటు పడుకోనియ్యాలి. నిద్రకి ఉపక్రమించినాక వారిని వారికి కేటాయించిన బెడ్ కి మార్చుకొండి. విడిగా వుంచడంతో కొన్నిమార్లు వారు ఒత్తిడికి దగ్గరయ్యే అవకాశం వుండి. అందుకని మీ విగ్నతని ప్రదర్సించాలి.

ఆహార సంభందిత విషయాలలో కొన్ని మెళుకవలని ఇలా పాటించండి.
  • ఆహారాలు తత్వగుణాన్ని పెంపొందించేవిగా వుండాలి. తేలికగా జీర్ణమయ్యే పండ్లు, కూరగాయలని విరివిగా తీసుకొనేట్లుగా చుడాలి
  • పాలు,  డ్రైనట్సు తేనెలని విరివిగా/రెగ్యులర్గా ఇవ్వాలి. అవి మనస్సుని రిలాక్స్ గా వుంచే సమికృత ఆహరాలు  అవుతాయి .
  • చిప్స్, కూల్ డ్రింక్స్, బర్గర్లు, పిజ్జ, కేక్సు, ఫాస్ట్రీస్, సమోస, బజ్జి, బేకరి ప్రాడక్ట్స్ తమోగుణాన్ని పెంచుతాయి, అదనపు కేలరిలని వృద్ది చేస్తాయి, ఒబెసిటికి కారకాలు అవుతాయి. అందుకని వాటిని ఇవ్వడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • తమో గుణాన్ని కలిగిన ఆహారాలు మనస్సుకి ఇరిటేషన్ కలిగిస్తాయి అందుకని వాటిని వాడకపోవడం మీ చిన్నారి భవిష్యత్తు దృష్ట్యా శ్రేయస్కరం.