Thursday, 12 February 2026

జాగృతి మాలిక 03 పరమాత్మ 🔱 సృష్టి యాదృచ్ఛికమా???


సృష్టి యాదృక్షికంగా జరిగిందా?


ఈ సృష్టి 🪐సనాతనం,చైతన్యవంతం, జీవభరితం,వైవిధ్యభరితం,తేజోవంతం, స్పూర్తిభరితం నిర్దిష్టక్రమంలో సర్వసంపూర్ణుడు, సమగ్రుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మ 🔱 నుండి కల్పారంభంలో ఆవిర్భవించిన ఈ సకల సృష్టి పరిపూర్ణంగా విరాజిల్లుతోంది.


అనేక మహాయుగాలు గడిచినా సృస్టి నిర్మాణక్రమంలో, రూపకల్పనలో అణుమాత్రం కూడా మార్పులు లేని అత్యంత అద్భుతమైన సంక్లిష్ట సృష్టి ప్రక్రియ, యుగయుగాలుగా నిరంతరం కొనసాగుతూ వుంది.


భౌతికవాదుల మేధస్సుకు ఈ జీవపదార్థం, జీవకణనిర్మాణం, జీవశరీర నిర్మాణం సమాధానం దొరకని ఓ సవాలుగా నిలిచింది!

ఏ శాస్త్రవేత్తకాని,వారి పరిజ్ఞానం జీవపదార్థం పుట్టుకని, దాని ఉనికిని కనిపెట్టలేక పోయింది! వారి పరిశోధనలు ఓ జీవకణాన్ని తమ పరిశోధనాలయంలో తమ మేధస్సుతో సృష్టించలేక పోయింది.

🪐ఈ సృష్టి పృథ్వి, వాయు,నీరు,🌊 అగ్ని, 🔥ఆకాశంలతో విశ్వమంతా విస్తరించిన పంచభూతమయమే!

నశ్వర మయిన ఈ దేహాలన్నీ పంచభూతాల రూపకల్పనతో నిర్మితమైన సామూహిక జీవకణాల నిర్దిష్ట రూపాలే!

ఈ స్థూలదేహమే క్షేత్రం.ఈ ఉపాధి క్షేత్రంలో సనాతనం,అనశ్వరం, చైతన్యభరితమయిన ఓ జీవశక్తి వుంది.

అది మీ జీవక్రియ, జీవనక్రియ, జీవితక్రియలను నిర్దేశిస్తుంది.

ఆ జీవశక్తిస్వరూపమే 🪔 జీవుడు!

ఆ జీవుడు పరమాత్మ సస్వరూపమే!!

మనలోని జీవుడే శివుడు!!

శ్వాస మీది ద్యాసనే ధ్యానం 🧘 అదే శివతత్వం..


సర్వ భూతస్థ ఆత్మానం, సర్వ భూతాని ఆత్మానీ అనేది గీతోక్తి.

సృష్టిలోని సకలజీవరాశిలో పరమాత్మ చైతన్యవంతంగా,ఆత్మరూపంలో ప్రకాశిస్తుంటాడు. ఈ సద్భావనతో ఈ జీవనయాత్రని కొనసాగిస్తూ ఉండాలి.

ఆత్మ భావనతో ప్రతి ఒక్కరియందు దయ, కరుణ, జాలి, ప్రేమ, కారుణ్యం కలిగి ఉండాలి.

మనం సదా జాగరూకతతో, ఎరుకతో ఏ ప్రాణికి అపకారం చేయాలనే తలంపును మనస్సు నుంచి సంపూర్ణంగా త్యజించి వేయాలి. అది భగవతత్వానికి మనలని మరింత చేరువ చేస్తుంది.


సర్వే జన సుఖినోభవంతు.

మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra


జాగృతి మాలిక 02 అప్రమేయుడిని ఎలా దర్శించాలి


పరమాత్మ 🔱 స్వరూపం


ఈ సృష్టి అనంతమైన, అభేద్యమైన మహాజీవరాశి. సకల జీవరాశులను నడిపించే శుద్ధచైతన్య స్వరూపం. అది తేజోవంతం, ✨చైతన్యవంతం,జీవభరితం, స్పూర్తిభరితం, వైవిధ్యభరితం, అజరామరం.


ఈ శుద్ధచైతన్యమే మనస్సులో జ్ఞానశక్తిగా 🕯️ప్రజ్వలం అవుతూ వుంటుంది.

అదే జీవశక్తిగా జఠరాగ్నినీ కలిగించి 🥗 ఆహారాన్ని తీసుకోవాడనికి ప్రేరణ అవుతుంది.

అదే దృష్టిగా 👁️కంటితో విశ్వాన్ని చూపిస్తుంది.

అదే శ్రవణశక్తిగా 🦻చెవితో శ్రవానందం కలిగిస్తుంది.

అదే గాత్రంగా మధుర స్వరంతో నిన్ను పరవశున్ని చేస్తుంది.

అదే ఆగ్హణశక్తిగా 👃నాసికతో పరిమళాలను ఆస్వాదిస్తుంది.

అదే మలయమారుతాలు, చిరుజల్లుల 🌧️స్పరానుభూతితో మనస్సును పులకరింపచేస్తుంది.

అదే ప్రేమ, ఆప్యాయతలతో తన కుటుంబాన్ని లాలిస్తుంది, పోషిస్తుంది.

ఆ అనుభూతులను జ్ఞాపకాల దొంతర్లుగా🧠 మనస్సు పుటల్లో భద్రపరచుకుంటుంది.


అది మన ఆలోచనల తీరుని, ప్రవర్తనని, నడవడికని, ప్రజ్ఞ, మేధస్సులని, హావభావాలని, మాటతీరుని ప్రభావితం చేస్తూ నీ వ్యక్తిత్వానికి  ఓ దిశ, దిశలని అవగతం చేస్తుంది.


నిన్ను మహోత్తర శిఖరాలకు చేరుస్తుంది, జాగరూకతతో లేకుంటే అదే పాతాళానికి కూడా తోసేస్తోంది. అది సంకల్ప, వికల్పాల క్షేత్రం.


మనందరిలో ఓ'ఐశ్వర్య నిధి ' 🗃️వుంది. అందులో ఓ అపురూప దివ్య ఆభరణం భగవంతుడు భద్రపరిచాడు! దాని ' కీ ' నీ చేతుల్లో, చేతల్లోనే వుంచాడు!


మన అంతరంగమే ఆ ‘అష్టైశ్వర్యాల నిధి ’ దాని ’ కీ' మనస్సే! అంతరాత్మనే ఆ దివ్యఆభరణం!అది చైతన్యవంతం, స్వయం ప్రకాశం ✨ తో హృదయంతరాలలో వికసించి దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది !!


అంతరాత్మని ఎరుకతో, సంయమనంతో, జాగరూకతతో గమనిస్తే అది పరమాత్మ సస్వరూపమే. మరి దానిని ఎలా దర్శించాలి...


భక్తి, శ్రద్ధ,నిష్ట,అనన్యచింతనలతో అష్టైశ్వర్యాల నిధి, ఆత్మ వైభవానుభూతినీ పొందగలము!


సర్వే జన సుఖినోభవంతు.

మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra



జాగృతి మాలిక 01 🔱 దేవుడు ఎందుకు కనిపించడు???


దేవుడు 🔱 వున్నాడా…?


దైవానికి ఎలాదగ్గరకావాలి?

దేవుడువున్నాడు అనే నమ్మకంతో కొందరు,

దేవుడువున్నాడా అనే అపనమ్మకంతో ఇంకొందరు,

దేవుడు ఎక్కడ వుంటాడు అనే సందిగ్ధంలో మరికొందరు.

దేవుడువుంటే ఎందుకు కన్పించడు?

కనిపించని దేవుడిని ఏమని పిలవాలి?

ఏమని ప్రార్థించాలి?

ఆయన మనప్రార్థనలను ఆలకిస్తాడా?

ఆయన మనకోరికలను నెరవేరుస్తాడా?

అసలు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు?

ఇంతకీ ఎవరైనా దేవుడీని చూసారా?


ఇలా ఎన్నెన్నో సందేహాలు???


దేవుడు వున్నాడు అని వాదించేవాడు, దేవుడులేడు అని వాదించే ఇద్దరి వాదనలు కూడా సరియైనవికానే కాదు!!


దేవుడువున్నాడు అనే వాడు ఆ అనుభూతిని మనసారా ఆస్వాదించకనే,ఆ ప్రయత్నంకూడా చేయకనే పూజలు, 🪔 హోమాలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తూ ఆ భ్రమతోనే వుంటూవుంటాడు. పరమాత్మ అనుభూతిని పొందనివాడు ఆ అంకిత భావాన్ని ఎలా కలిగివుంటాడు!!

దేవుడిని చూడలేదు,కాబట్టి దేవుడు లేడు అనే అజ్ఞాని చీకటిలో వుండి చైతన్యవంతం,స్వయం ప్రకాశిత అంతర్యామి అనుభూతిని ఎలా పొందగలడు?


సుగంధపరిమళాలు👃 నాసికతోనే అస్వాదిస్తాం అని అనుకుంటాం, కానీ నిజానికి అది ఓ మానశిక అనుభూతి!

సంగీతం  🦻చెవితో వింటున్నా ఆ శ్రవణానందకరం ఆత్మానుభూతితోనే సాధ్యం!

👁️కంటితో చూసే సుందరదృశ్యం, మనస్సుతో వీక్షిస్తే సుందర మనోహరదృశ్యంగా మనస్సుపొరల్లో నిక్షిప్తం అవుతుంది కదా!

అదేవిధంగా ఆత్మానుభూతితోనే దైవానుభూతిని మనసారా ఆస్వాదించగలం. అందుకు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే సాధన తప్పక వుండితీరాలి.


మనసే ఓ కోవెల 🛕గా అంకితభావం, సమర్పణభావం, దృఢచిత్తం, భక్తి, శ్రద్ధ, నిష్ఠ, అనన్యచింతనలతో మేళవించిన ధ్యానం 🧘‍♀️ ద్వారా  అప్రమేయుడు, విశ్వంభరుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మత తత్వానికి చేరువకాగలం. ధ్యానం ఆ పరమాత్మ అనుభూతిని ఆస్వాదించడానికి ఓ యానకం అవుతుంది.


ఈ రోజునుంచే ధ్యానం ద్వారా ఆ పరమాత్మ తత్వానికి దగ్గర అయ్యే ప్రయత్నం ఆరంభించాలి.


సర్వేజన సుఖీనో భవంతు


మీ ఆధ్యాత్మిక సేవలో


RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra


Wednesday, 11 February 2026

రానా కవితలు 4 పరంబ్రహ్మ

 

రానా కవితలు 4 పరంబ్రహ్మ 


విశ్వం లేని శివం లేదు 

శివం లేని జీవం లేదు 

జీవం లేని ప్రాణి లేదు 

జీవం కానీ ప్రాణం లేదు

ప్రాణం లేని మనుగడ లేదు

మనుగడ లేని విశ్వం లేదు 

విశ్వం లేక బ్రహ్మసృష్టియే లేదు 

సర్వం అవ్యయం

సర్వం అనంతం 

సర్వం శివమయం !!!


వాయువు నీలో చలనశక్తి, ప్రాణశక్తులుగా 

పృద్వి నీలో  శరీరక్షేత్రంగా 

అగ్ని 🔥 నీలో తేజస్సు, ఓజస్సులుగా 

జలం 🚰నీలో స్వచ్ఛభరిత జీవధారగా 

ఆకాశతత్వమే నీలో శ్రవణ👂, గాత్రలుగా 

పంచభూతాత్మ స్వరూపంగా 

సర్వం జీవమయం

సర్వం శక్తిమయం 

సర్వం చైతన్య మయం 

సర్వం శివమయం!!!


నీలో,నాలో,మనందరిలో 

సృష్టిలో సకల జీవరాశిలో

🪐అఖండమండలాకారం లో 

విశ్వంలో శుద్ధ చైతన్యశక్తి ⚡️ గా 

విద్వత్ శక్తిగా 

సకల చరాచరజగత్తులో 

సర్వత్రావిస్తరించిన 

అప్రమేయుడుగా 

అవ్యయుడుగా 

ఆ విశ్వంభరుడుని 

జీవశక్తిగా, 

సకలసృష్టిలో 

పరంబ్రహ్మ బింబరూపంలో సమదర్శనమే 

పరమేశ్వరుడికి 

సమర్పించే  అనన్య భక్తి పూర్వక 

కుసుమాంజలి 

🙏🙏🙏🙏

ధ్యాన మాలిక జూలై 26 సంచికలో ప్రచురితమైనది 



రానా కవితలు 3 వదిలేయండి

 


రానా కవితలు 3 వదిలేయండి!!!


వదిలేయండి!!!



కడిగేయాలి 

మీ కాలికి అంటిన మురికిని 

లేదా అది మీ ఇంటిని మురికి మయం చేస్తుంది

అలాగే 

వదిలివేయాలి

మీ 

కోపాలు,తాపాలు

పగలు,ప్రతీకారాలు

కుట్రలు,కుతంత్రాలు

వెతలు, వేదనలు

కలహాలు,కలతలు

వాంఛలు,వంచనలు

పంతాలు,పట్టింపులు

ఉద్వేగాలు,ఉద్విగ్నాలు 

అసూయ,ద్వేషాలు

మోహాలు,విరహాలు

కోరికలు,భేషజాలు

ఇష్టాలు,అయిష్టాలు

బంధాలు,అనుభందాలు

ఎందుకు అంటే 

చివరికి ఇవి ఏవి మిగలవు!

మన ఈ ప్రయాణం చిన్నది!

ప్రతి వెలుగు చీకటిలోనే ముగుస్తుంది!


ఈ చిరు ప్రయాణమే

చింతలు లేని ప్రయాణంగా

ఆనందహేళగా కొనసాగాలి

అందుకే 

వదలివేయకండి 

ధర్మరక్షణే మొక్కవోనిదీక్షగా 

కష్టసుఖాలలో మనోస్థైర్యం

గెలుపు 🥇 ఓటమి 😡 లలో చెదరని విశ్వాసం 

ప్రలోభాలకు లొంగని దృఢత్వం

లాభనష్టాలలో సడలని అపరిగ్రహం

జయాపజయాలలో నిర్వికారభావన 


పరమాత్మ యందు అంకితభావం

ప్రత్యగాత్మ యందు సడలనిదీక్ష 

అప్రమేయుడి యందు సమర్పణభావం

సర్వేశ్వరుని యందు అనన్యభక్తి 

విశ్వంభరుడి యందు అనన్యచింతన

సకలసృష్టిలో విధాత అక్షయస్వరూపం


ఇవే మీ తోడునీడ అయితే 

జీవితం శాంతిభరితం 

మనస్సు ఆనందభరితం 

హృదయం వికసిత ప్రేమమయ కరుణారసభరితం 

అవుతుంది, వెరసి 

ప్రశాంతభరిత జీవనపయనం




రానా కవితలు 2 ప్రత్యగాత్మ


రానా కవితలు 2 ప్రత్యగాత్మ


వినువీధిలో

స్వేచ్చగా విహరించే విహంగ పరిజ్ఞానం 

🐦‍⬛విహంగాలకు ఎవరు నేర్పించారు ? 

చెట్లమీద  🕊️గూడు ఓ అద్భుత ఆవిష్కరణగా 

నిర్మించే ఇంజనీరింగ్ జ్ఞానం దానికి ఎవరిద్వారా వచ్చింది? 

ఎంత సుదూరప్రయాణం చేసినా 

తిరిగి తనగూటికే చేరే జీపీఎస్ జ్ఞానం 

ఈ విహంగాలకు ఎక్కడినుంచి, ఎలా వచ్చింది?


మట్టిలో విత్తిన విత్తనం 🌱మొలకగా 

అంకురించే పరిజ్ఞానం దానికి ఎక్కడినుంచి వచ్చింది? 

వెలుతురునే తినేటువంటి 

జ్ఞానం వాటి 🌿ఆకులకు ఏలా వచ్చింది? 

జాబిల్లి వెలుగులలో మొగ్గ 

పూవులా 🌺పరిమళించే వికసితజ్ఞానం వాటికి ఏలా వచ్చింది? 

మోడువారిన చెట్టుకు 🪾తిరిగి చిగురించే  జీవజ్ఞానం,

నీటి అలభ్యతను ఎదిరించి కొనసాగించే జీవనగమనజ్ఞానం 

ఎడారి🌵 మొక్కలకు ఎవరు, ఎప్పడు నేర్పించారు? 


సాలీడు 🕷️తనకు మాత్రమే పేటెంట్ హక్కు కలిగిన

సాలెగూడు 🕸️నిర్మాణాత్మకప్రజ్ఞ దానికి ఏలా వచ్చింది? 

🐝 తేటికి మకరందసేకరణ సామర్ధ్యం 

తేనపట్టు నిర్మాణప్రజ్ఞ ఎక్కడినుంచి వచ్చింది? 

🐜చీమకి వాల్మీకం నిర్మాణ ప్రతిభ,

ఆహారజాడలను గుర్తించి స్నేహితచీమలకు కమ్యూనికేట్ చేసే శక్తి ఎవరిచ్చారు?


భూకంపాలను, ప్రకృతి విపత్తులను 

వాతావరణమార్పులను ముందుగానే పసిగట్టే విశేషజ్ఞానం 

జంతువులకు, పక్షులకు ఎక్కడినుంచి, ఎలా వచ్చింది?


లైఫ్ జాకెట్ లేకుండానే నీటిలో సదా విహరించే 

జీవశాస్త్ర కళ 🦈మీనంకి  ఎక్కడినుంచి వచ్చింది? 

కళ్లుమూయకనే నిద్రించే కళ 🐟మత్స్యానికి ఏలా వచ్చింది?

నీటిని ప్రాణశక్తిగా మార్చుకొనే జీవకళ🐠 ఝషముకే సొంతం ఏలా అయ్యింది?


కొంకర్లుపోయే విపరీతచలిలో 

ఆచ్ఛాదనరహిత జీవనపయనం,

మంచుగడ్డ కట్టే చలిలో ఆహారలేమిని,

శిశిరనిద్రని కొనసాగించే 

అతీంద్రియశక్తి నాగసాధువులకి  ఏలా వచ్చింది? ఎక్కడినుంచి వచ్చింది?


సకల జీవరాశులలో 

ఈ  విశేషపరిజ్ఞానం,

చైతన్యరూపంగా,

ప్రాణధారణగా,

ప్రాణశక్తిగా,

ప్రత్యగాత్మ

ప్రాణులలో పురుడుపోసుకుంది!!








 

రానా కవితలు 1 విశ్వంభర

 రానా కవితలు 1 విశ్వంభర

అరుణ కాంతుల సొగసులను 

స్వాగతిస్తూ 

ఉషోదయ వేళల్లో 

వికసించే 🪻పూబాలలనడుగు 

పూదోట వెదజల్లే పరిమళాలనడుగు

మలయమారుతాలతో పరవశించే కొండగాలినడుగు

పూతోటలోని🐝 తేటి నడుగు 

ఈ తుషారబిందువుల🫧 సొగసులు నీకెక్కడివి అని 

అంకురించిన 🌱 మొలకనడుగు

కుహు కుహూ రాగాల కోకిలనడుగు

పక్షుల కిలకిల రావాలనడుగు

🦋సీతాకోకచిలుకగా మారిన 🐛 గొంగళిపురుగునడుగు

పురివిప్పిన🦚 నాట్యమయూరిని నడుగు

చెంగు చెంగున ఎగిరే జింక పిల్లలనడుగు

గల గల పారే సెలయేళ్లలో

తమ సొగసులతో ఆకట్టుకునే 🦢రాజహంసలనడుగు

పుడమి తల్లిని దైవంగా భావించే కృషీవలుడిని నడుగు

తన స్వేదాన్ని తర్పణంగా సమర్పించే అన్నదాత నడుగు

సుప్రభాతసేవలో తరిస్తున్న 🧘‍♂️యోగులనడుగు

ఏ కుంచెతో ఈ నింగికి సప్తవర్ణాలు అద్దినది ఎవరు?

ఇంకెవరు 

ప్రకృతి లోని అందాలలో, ఆనందాలలో 

నీ లోన, బయట

అటు,ఇటు, ఎటు చూసినా 

సర్వత్రా, సర్వంగా విస్తరించివున్న 

ఆ అప్రమేయుడే 

విశ్వంభరుడు 



మీ 

RaNa 

9900022729

ధ్యాన మాలిక మార్చ్ 26 సంచికలో ప్రచురితం