Thursday, 12 February 2026

జాగృతి మాలిక 5 మేలి ముసుగులు 🎭 తీసేయండి


మేలి ముసుగులు 🎭 తీసేయండి 



ఈ మొద్దునిద్ర నుంచి బయటకు రండి!కని పించనిమేలి ముసుగులని తొలగించండి !

విషం మనలని ఒక్క సారిగా చంపేస్తుంది. అయితే  సహనం , సెక్యులరిజం, మత సహనం,  సౌభ్రాతృత్వం అనే కనిపించని 🧣మేలి ముసుగులతో మన మనస్సులని  కప్పివేసి తమ పబ్బాలు గడుపుకున్న, గడుపుకుంటున్న, గడుపుకోవాలనుకుంటున్న,  కుహనా రాజకీయ శక్తులు  మన మనస్సులని  నిర్జీవంతంగా,  నిర్వీర్యం చేయడంలో  విజయవంతం అయ్యాయి !!!


గాలిపటంలో 🪁గాలి, గల్లా పెట్టేలో 🗃️గల్ల, ఫైర్ ఇంజన్ 🚒లో ఫైర్, నిప్పుకోడిలో నిప్పు, నేతిబీర లో నెయ్యి ఎలా ఉంటాయో ఈ కుహనా రాజకీయ శక్తుల బుజ్జగింపు చర్యలుకూడ అంతే!!


మనం వేసుకున్న సహనం అనే ముసుగులో , లవ్ జిహాదీ పేరుతో మన ఆడబిడ్డల మీద జరిగే నిరంతర దోపిడికి, బలవంతపు మతమార్పిడిలకి కళ్లున్నకబోధిలా నిర్లిప్తంగా వుండడం, అది  మరింత బరితెగింపుకు లైసెన్స్ ఇచ్చినట్లే! 


మత విద్వేషాలతో రగిలిపోతు  హైందవసంప్రదాయలపై, కట్టుబాట్లుపై,  విశ్వాసాలపై జరుగుతున్న అమానుష దోపిడీలకి పరమతసహనమనే  మేలి ముసుగులో మూగ సాక్షులుగా ప్రశ్నించక పోవడం ముష్కర మూక  లలో మరింత విచ్చలవిడితనానికి ప్రేరణ ఇచ్చినట్లే !!


 దేవాలయ 🛕వ్యవస్థలని,  దేవాలయ భూములను, దేవాలయ మాన్యాలని, చెరువులను అప్పనంగా దోచుకునే ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని, భూ జిహాదీలని , భూభకాసురాలను, సెక్యులరిజం అనే రంగుల  ముసుగులో ఉపేక్షించడం వారికి  యదేక్షగా దోపిడికి లైసెన్స్ గా మారింది.

హైడ్రా,  వక్ఫ్, బుల్డోజర్ల ద్వారా వారికి తగిన గుణపాఠం నేర్పించాల్సిందే!! వారి గుండెల్లో రైళ్ళను పరుగులెట్టించాల్సిందే


మత మూఢస చాందసభావజాలంతో  దేవాలయాలపై, దేవతా విగ్రహాలపై, మన మతవిశ్వాసాలపై విచక్షణా రహితంగా దాడులుచేస్తూ,  తీరని నష్టం కలుగచేసే మతోన్మాదులపై వారికి పరోక్షంగా తమ మద్దతును అందచేసే రాజకీయ నాయకులపై శీతకన్ను వేయడం మన లోని పిరికితనానికి పరాకాష్ట!!


క్షుద్రం హృదయ దౌర్బల్యం  త్యక్త్వోతిష్ఠ పరంతప అనే గీతాచార్య ప్రబోధగీతం  🌅ఉషాకిరణం లా 

హృదయ దౌర్బల్యం అనే ఈ కనిపించని ముసుగుతెరలని  ధైర్యం అనే 🤺ఖడ్గంతో   చేధించేయించాల్సిందే...


పహల్గావ్ లాంటి అమానుష, వికృత చర్యలు పునరావృతం గాకుండా వుండడానికి కళ్లు మూసుకుని నటిస్తున్న మొద్దు నిద్రమత్తు నుంచి బయటికి రావాల్సిందే !!


జవాబుదారి తనంతో, ప్రశ్నించే గొంతుకలతో, బ్రహ్మోస్ , సుదర్శన్ లాంటి క్షిపణులతో ఈ ముష్కర మూకలనీ దేశ సరిహద్దుల నుంచి తరిమి, తరిమి కొట్టాల్సిందే!


జాతి మనుగడకి, గౌరవానికి, చేతిలో చెయ్యి 🤝వేసి ధృఢంగా ముందుకు అడుగు వేయాల్సిందే!

దేశరక్షణకోసం అలుపెరుగక, నిరంతరం పరిశ్రమించే అగ్నివీరులకు, వీరజవాన్లకు, వాయుసేనలకు, నావిక దళాలకు  చేతులెత్తి మొక్కాల్సిందే!


వర్తమానంలో జీవిస్తూ. మన ఉనికిని సజీవంగా. సర్వమానవాళికి తెలియచేయాల్సిందే!

జై భారత్! 🇮🇳 

జై హింద్!!🇮🇳 


సర్వే జన సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక సేవలో 

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra



జాగృతి మాలిక 4 మనకి జీవధార , జీవనధార, ప్రాణధార నీరే!!

 జీవధార , జీవనధార, ప్రాణధార నీరే!!

జీవభరితం, వైవిధ్యభరితం అయిన ఈ భగవంతుని సృష్టి బహు విలక్షణభరితంగా, మన  ఆలోచనలకి, అంచనాలకు అందని విశిష్ట  స్థాయిలో ఉంటూ మానవాళి మేధస్సుకి, విజ్ఞతకి, ప్రతిభకి , ప్రజ్ఞలకి పదును పెడుతూ ఎన్నో నూతనావిష్కరాలకి కేంధ్ర బిందువుగా మార్గదర్శకంగా పయనింపచేస్తునే వుంది.

మన దేహానిర్మాణం కూడా అంతే విలక్షణభరితం!

మనం నివసించే ఈ భూమండలం 🌍70 శాతం నీటీతో 30 శాతం భూమితో విస్తరించిన ప్రకృతి స్వరూపం. సరిగ్గా అదే విధంగా మన దేహాల్లో కూడా 🌊70 శాతం  విస్తరించిన కణజాలం నీరే !!

నీరే 🌊మనకి జీవధార, జీవనధార, ప్రాణధార కూడా! 

సమాజ  ప్రగతి, పురోగతి, ఆర్ధికస్వవాలంబనకి , ప్రభుత్వ వ్యవస్థలను ప్రభావితం చేసేది, చేస్తున్నది , చేయబోయేది కూడా పకృతి ప్రసాదిత 🌊జలాలే!

ప్రపంచంలో అతి పురాతన,విశిష్ట మానవ నాగరిక సమాజాలు హరప్ప, సింధు నాగరికతలు గంగ, సింధు నదుల పరివాహక ప్రాంతాల్లోనే వికసించి నలుదిశల శోభిల్లింది!!

నాడు నేడు కూడ వివిధ దేశాల మధ్య ఈ జలయుద్దాలు అనేకమార్లు జరిగాయి, జరుగుతున్నాయి !నేడు ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాక్ పై మనం అప్రకటిత జలయుద్ధానికి  శంఖారావం పూరించాం !

ఇక వ్యక్తిగత పరంగా 

మనం ప్రతి రోజూ తాగే నీళ్లు శరీరంలో 

ఆహారం సమర్థవంతంగా జీర్ణం అవడానికి,    జీవరసాయనకచర్యలతో మేళవించిన  రసరూప ఆహారం జీవశక్తిగా శరీర అంగంగాలకి రక్తకణాల ద్వారా చేరవేయడానికి, 

వ్యర్థపదార్థాలను మలరూపంలో సుఖ విరోచనం  అవడానికి, 

స్వేదక్రియద్వారా శరీర ఉష్ణోగ్రతల సమతుల్యత ను సదా పరీరక్షించడానికి , 

కిడ్నీవ్యవస్థలో వడపోత ద్వారా రక్తశుద్ధికి, తద్వారా మలినాలను సాఫీగా మూత్రంద్వారా విసర్జనకి కారణం అవుతుంది.

ఆరోగ్యవంతమైన ఈ దేహం సమర్థవంతంగా  తన ఈ విధులను నిర్వహించడానికి ప్రతిరోజు మూడు లీటర్ల నీరు తప్పక అందించి తీరాల్సిందే.

కొబ్బరినీళ్లు, చల్లట్టిమజ్జిగ, తాజా పండ్లరసాలు, చెరకురసాలు, వెజిటేబుల్  జ్యూస్, ఫ్రూట్ జ్యూస్  లు గా  కూడా అందించవచ్చు.

భగవత్ప్రసాదితమైన ఈ విలక్షణ దేహం శత వసంతాలు సమర్థవంతంగా ప్రతిఫలాపేక్ష లేకుండా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మీరు చేయవలసినది అశ్రద్దలేకుండా జాగరూకతతో ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల  నీళ్లు తాగడమే! 

ద్రవ సమతుల్యతలను కాపాడడం మీ కనీస బాధ్యత!!

వృద్ధులలో దప్పిక తక్కువగా ఉంటుంది. అందువల్ల కేవలం ఒకటీ రెండు గ్లాసుల నీరు పరిమితంగా తీసుకుంటుంటారు. అది  డిహైడ్రేషన్ కి కారణం అవుతుంది. మీరు జాగరూకతతో గమనిస్తూ తగినంత నీరు తప్పక తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి.

శరీర ధర్మాన్ని గౌరవిద్దాం!!

ఈ దేహాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమిద్దాం!!!

సర్వే జన సుఖినోభవంతు 

మీ ఆధ్యాత్మిక సేవలో 

RaNa 

9900022729
🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️


జాగృతి మాలిక 03 పరమాత్మ 🔱 సృష్టి యాదృచ్ఛికమా???


సృష్టి యాదృక్షికంగా జరిగిందా?


ఈ సృష్టి 🪐సనాతనం,చైతన్యవంతం, జీవభరితం,వైవిధ్యభరితం,తేజోవంతం, స్పూర్తిభరితం నిర్దిష్టక్రమంలో సర్వసంపూర్ణుడు, సమగ్రుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మ 🔱 నుండి కల్పారంభంలో ఆవిర్భవించిన ఈ సకల సృష్టి పరిపూర్ణంగా విరాజిల్లుతోంది.


అనేక మహాయుగాలు గడిచినా సృస్టి నిర్మాణక్రమంలో, రూపకల్పనలో అణుమాత్రం కూడా మార్పులు లేని అత్యంత అద్భుతమైన సంక్లిష్ట సృష్టి ప్రక్రియ, యుగయుగాలుగా నిరంతరం కొనసాగుతూ వుంది.


భౌతికవాదుల మేధస్సుకు ఈ జీవపదార్థం, జీవకణనిర్మాణం, జీవశరీర నిర్మాణం సమాధానం దొరకని ఓ సవాలుగా నిలిచింది!

ఏ శాస్త్రవేత్తకాని,వారి పరిజ్ఞానం జీవపదార్థం పుట్టుకని, దాని ఉనికిని కనిపెట్టలేక పోయింది! వారి పరిశోధనలు ఓ జీవకణాన్ని తమ పరిశోధనాలయంలో తమ మేధస్సుతో సృష్టించలేక పోయింది.

🪐ఈ సృష్టి పృథ్వి, వాయు,నీరు,🌊 అగ్ని, 🔥ఆకాశంలతో విశ్వమంతా విస్తరించిన పంచభూతమయమే!

నశ్వర మయిన ఈ దేహాలన్నీ పంచభూతాల రూపకల్పనతో నిర్మితమైన సామూహిక జీవకణాల నిర్దిష్ట రూపాలే!

ఈ స్థూలదేహమే క్షేత్రం.ఈ ఉపాధి క్షేత్రంలో సనాతనం,అనశ్వరం, చైతన్యభరితమయిన ఓ జీవశక్తి వుంది.

అది మీ జీవక్రియ, జీవనక్రియ, జీవితక్రియలను నిర్దేశిస్తుంది.

ఆ జీవశక్తిస్వరూపమే 🪔 జీవుడు!

ఆ జీవుడు పరమాత్మ సస్వరూపమే!!

మనలోని జీవుడే శివుడు!!

శ్వాస మీది ద్యాసనే ధ్యానం 🧘 అదే శివతత్వం..


సర్వ భూతస్థ ఆత్మానం, సర్వ భూతాని ఆత్మానీ అనేది గీతోక్తి.

సృష్టిలోని సకలజీవరాశిలో పరమాత్మ చైతన్యవంతంగా,ఆత్మరూపంలో ప్రకాశిస్తుంటాడు. ఈ సద్భావనతో ఈ జీవనయాత్రని కొనసాగిస్తూ ఉండాలి.

ఆత్మ భావనతో ప్రతి ఒక్కరియందు దయ, కరుణ, జాలి, ప్రేమ, కారుణ్యం కలిగి ఉండాలి.

మనం సదా జాగరూకతతో, ఎరుకతో ఏ ప్రాణికి అపకారం చేయాలనే తలంపును మనస్సు నుంచి సంపూర్ణంగా త్యజించి వేయాలి. అది భగవతత్వానికి మనలని మరింత చేరువ చేస్తుంది.


సర్వే జన సుఖినోభవంతు.

మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra


జాగృతి మాలిక 02 అప్రమేయుడిని ఎలా దర్శించాలి


పరమాత్మ 🔱 స్వరూపం


ఈ సృష్టి అనంతమైన, అభేద్యమైన మహాజీవరాశి. సకల జీవరాశులను నడిపించే శుద్ధచైతన్య స్వరూపం. అది తేజోవంతం, ✨చైతన్యవంతం,జీవభరితం, స్పూర్తిభరితం, వైవిధ్యభరితం, అజరామరం.


ఈ శుద్ధచైతన్యమే మనస్సులో జ్ఞానశక్తిగా 🕯️ప్రజ్వలం అవుతూ వుంటుంది.

అదే జీవశక్తిగా జఠరాగ్నినీ కలిగించి 🥗 ఆహారాన్ని తీసుకోవాడనికి ప్రేరణ అవుతుంది.

అదే దృష్టిగా 👁️కంటితో విశ్వాన్ని చూపిస్తుంది.

అదే శ్రవణశక్తిగా 🦻చెవితో శ్రవానందం కలిగిస్తుంది.

అదే గాత్రంగా మధుర స్వరంతో నిన్ను పరవశున్ని చేస్తుంది.

అదే ఆగ్హణశక్తిగా 👃నాసికతో పరిమళాలను ఆస్వాదిస్తుంది.

అదే మలయమారుతాలు, చిరుజల్లుల 🌧️స్పరానుభూతితో మనస్సును పులకరింపచేస్తుంది.

అదే ప్రేమ, ఆప్యాయతలతో తన కుటుంబాన్ని లాలిస్తుంది, పోషిస్తుంది.

ఆ అనుభూతులను జ్ఞాపకాల దొంతర్లుగా🧠 మనస్సు పుటల్లో భద్రపరచుకుంటుంది.


అది మన ఆలోచనల తీరుని, ప్రవర్తనని, నడవడికని, ప్రజ్ఞ, మేధస్సులని, హావభావాలని, మాటతీరుని ప్రభావితం చేస్తూ నీ వ్యక్తిత్వానికి  ఓ దిశ, దిశలని అవగతం చేస్తుంది.


నిన్ను మహోత్తర శిఖరాలకు చేరుస్తుంది, జాగరూకతతో లేకుంటే అదే పాతాళానికి కూడా తోసేస్తోంది. అది సంకల్ప, వికల్పాల క్షేత్రం.


మనందరిలో ఓ'ఐశ్వర్య నిధి ' 🗃️వుంది. అందులో ఓ అపురూప దివ్య ఆభరణం భగవంతుడు భద్రపరిచాడు! దాని ' కీ ' నీ చేతుల్లో, చేతల్లోనే వుంచాడు!


మన అంతరంగమే ఆ ‘అష్టైశ్వర్యాల నిధి ’ దాని ’ కీ' మనస్సే! అంతరాత్మనే ఆ దివ్యఆభరణం!అది చైతన్యవంతం, స్వయం ప్రకాశం ✨ తో హృదయంతరాలలో వికసించి దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది !!


అంతరాత్మని ఎరుకతో, సంయమనంతో, జాగరూకతతో గమనిస్తే అది పరమాత్మ సస్వరూపమే. మరి దానిని ఎలా దర్శించాలి...


భక్తి, శ్రద్ధ,నిష్ట,అనన్యచింతనలతో అష్టైశ్వర్యాల నిధి, ఆత్మ వైభవానుభూతినీ పొందగలము!


సర్వే జన సుఖినోభవంతు.

మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra



జాగృతి మాలిక 01 🔱 దేవుడు ఎందుకు కనిపించడు???


దేవుడు 🔱 వున్నాడా…?


దైవానికి ఎలాదగ్గరకావాలి?

దేవుడువున్నాడు అనే నమ్మకంతో కొందరు,

దేవుడువున్నాడా అనే అపనమ్మకంతో ఇంకొందరు,

దేవుడు ఎక్కడ వుంటాడు అనే సందిగ్ధంలో మరికొందరు.

దేవుడువుంటే ఎందుకు కన్పించడు?

కనిపించని దేవుడిని ఏమని పిలవాలి?

ఏమని ప్రార్థించాలి?

ఆయన మనప్రార్థనలను ఆలకిస్తాడా?

ఆయన మనకోరికలను నెరవేరుస్తాడా?

అసలు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు?

ఇంతకీ ఎవరైనా దేవుడీని చూసారా?


ఇలా ఎన్నెన్నో సందేహాలు???


దేవుడు వున్నాడు అని వాదించేవాడు, దేవుడులేడు అని వాదించే ఇద్దరి వాదనలు కూడా సరియైనవికానే కాదు!!


దేవుడువున్నాడు అనే వాడు ఆ అనుభూతిని మనసారా ఆస్వాదించకనే,ఆ ప్రయత్నంకూడా చేయకనే పూజలు, 🪔 హోమాలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తూ ఆ భ్రమతోనే వుంటూవుంటాడు. పరమాత్మ అనుభూతిని పొందనివాడు ఆ అంకిత భావాన్ని ఎలా కలిగివుంటాడు!!

దేవుడిని చూడలేదు,కాబట్టి దేవుడు లేడు అనే అజ్ఞాని చీకటిలో వుండి చైతన్యవంతం,స్వయం ప్రకాశిత అంతర్యామి అనుభూతిని ఎలా పొందగలడు?


సుగంధపరిమళాలు👃 నాసికతోనే అస్వాదిస్తాం అని అనుకుంటాం, కానీ నిజానికి అది ఓ మానశిక అనుభూతి!

సంగీతం  🦻చెవితో వింటున్నా ఆ శ్రవణానందకరం ఆత్మానుభూతితోనే సాధ్యం!

👁️కంటితో చూసే సుందరదృశ్యం, మనస్సుతో వీక్షిస్తే సుందర మనోహరదృశ్యంగా మనస్సుపొరల్లో నిక్షిప్తం అవుతుంది కదా!

అదేవిధంగా ఆత్మానుభూతితోనే దైవానుభూతిని మనసారా ఆస్వాదించగలం. అందుకు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే సాధన తప్పక వుండితీరాలి.


మనసే ఓ కోవెల 🛕గా అంకితభావం, సమర్పణభావం, దృఢచిత్తం, భక్తి, శ్రద్ధ, నిష్ఠ, అనన్యచింతనలతో మేళవించిన ధ్యానం 🧘‍♀️ ద్వారా  అప్రమేయుడు, విశ్వంభరుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మత తత్వానికి చేరువకాగలం. ధ్యానం ఆ పరమాత్మ అనుభూతిని ఆస్వాదించడానికి ఓ యానకం అవుతుంది.


ఈ రోజునుంచే ధ్యానం ద్వారా ఆ పరమాత్మ తత్వానికి దగ్గర అయ్యే ప్రయత్నం ఆరంభించాలి.


సర్వేజన సుఖీనో భవంతు


మీ ఆధ్యాత్మిక సేవలో


RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra


Wednesday, 11 February 2026

రానా కవితలు 4 పరంబ్రహ్మ

 

రానా కవితలు 4 పరంబ్రహ్మ 


విశ్వం లేని శివం లేదు 

శివం లేని జీవం లేదు 

జీవం లేని ప్రాణి లేదు 

జీవం కానీ ప్రాణం లేదు

ప్రాణం లేని మనుగడ లేదు

మనుగడ లేని విశ్వం లేదు 

విశ్వం లేక బ్రహ్మసృష్టియే లేదు 

సర్వం అవ్యయం

సర్వం అనంతం 

సర్వం శివమయం !!!


వాయువు నీలో చలనశక్తి, ప్రాణశక్తులుగా 

పృద్వి నీలో  శరీరక్షేత్రంగా 

అగ్ని 🔥 నీలో తేజస్సు, ఓజస్సులుగా 

జలం 🚰నీలో స్వచ్ఛభరిత జీవధారగా 

ఆకాశతత్వమే నీలో శ్రవణ👂, గాత్రలుగా 

పంచభూతాత్మ స్వరూపంగా 

సర్వం జీవమయం

సర్వం శక్తిమయం 

సర్వం చైతన్య మయం 

సర్వం శివమయం!!!


నీలో,నాలో,మనందరిలో 

సృష్టిలో సకల జీవరాశిలో

🪐అఖండమండలాకారం లో 

విశ్వంలో శుద్ధ చైతన్యశక్తి ⚡️ గా 

విద్వత్ శక్తిగా 

సకల చరాచరజగత్తులో 

సర్వత్రావిస్తరించిన 

అప్రమేయుడుగా 

అవ్యయుడుగా 

ఆ విశ్వంభరుడుని 

జీవశక్తిగా, 

సకలసృష్టిలో 

పరంబ్రహ్మ బింబరూపంలో సమదర్శనమే 

పరమేశ్వరుడికి 

సమర్పించే  అనన్య భక్తి పూర్వక 

కుసుమాంజలి 

🙏🙏🙏🙏

ధ్యాన మాలిక జూలై 26 సంచికలో ప్రచురితమైనది 



రానా కవితలు 3 వదిలేయండి

 


రానా కవితలు 3 వదిలేయండి!!!


వదిలేయండి!!!



కడిగేయాలి 

మీ కాలికి అంటిన మురికిని 

లేదా అది మీ ఇంటిని మురికి మయం చేస్తుంది

అలాగే 

వదిలివేయాలి

మీ 

కోపాలు,తాపాలు

పగలు,ప్రతీకారాలు

కుట్రలు,కుతంత్రాలు

వెతలు, వేదనలు

కలహాలు,కలతలు

వాంఛలు,వంచనలు

పంతాలు,పట్టింపులు

ఉద్వేగాలు,ఉద్విగ్నాలు 

అసూయ,ద్వేషాలు

మోహాలు,విరహాలు

కోరికలు,భేషజాలు

ఇష్టాలు,అయిష్టాలు

బంధాలు,అనుభందాలు

ఎందుకు అంటే 

చివరికి ఇవి ఏవి మిగలవు!

మన ఈ ప్రయాణం చిన్నది!

ప్రతి వెలుగు చీకటిలోనే ముగుస్తుంది!


ఈ చిరు ప్రయాణమే

చింతలు లేని ప్రయాణంగా

ఆనందహేళగా కొనసాగాలి

అందుకే 

వదలివేయకండి 

ధర్మరక్షణే మొక్కవోనిదీక్షగా 

కష్టసుఖాలలో మనోస్థైర్యం

గెలుపు 🥇 ఓటమి 😡 లలో చెదరని విశ్వాసం 

ప్రలోభాలకు లొంగని దృఢత్వం

లాభనష్టాలలో సడలని అపరిగ్రహం

జయాపజయాలలో నిర్వికారభావన 


పరమాత్మ యందు అంకితభావం

ప్రత్యగాత్మ యందు సడలనిదీక్ష 

అప్రమేయుడి యందు సమర్పణభావం

సర్వేశ్వరుని యందు అనన్యభక్తి 

విశ్వంభరుడి యందు అనన్యచింతన

సకలసృష్టిలో విధాత అక్షయస్వరూపం


ఇవే మీ తోడునీడ అయితే 

జీవితం శాంతిభరితం 

మనస్సు ఆనందభరితం 

హృదయం వికసిత ప్రేమమయ కరుణారసభరితం 

అవుతుంది, వెరసి 

ప్రశాంతభరిత జీవనపయనం