Thursday, 12 February 2026

జాగృతి మాలిక 09 ఆత్మ సంయమనం అంటే…?!


ఇంద్రియనిగ్రహమే మనోనిగ్రహమా?

సర్వేంద్రియాం నయనం ప్రధానం.  పంచేంద్రియాలలో నయనం జ్ఞానకాంతికి ద్వారం!

మనం కన్నులతో ఈ ప్రపంచాన్ని చూస్తూ అవగతం చేసుకుంటాం.

అయితే చూడగూడని వాటినే అదేపనిగా చూస్తూ యువత పెడదారిన పడుతూవుంటే తల్లిదండ్రులగా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే అది మీలో అశాంతికి, వారి వ్యక్తిత్వం అస్తవ్యస్త మవడానికి కారణం కూడా అవుతుంది.


రెండవ పంచేద్రియం చెవులు, అవి  శ్రవణద్వారాలు! వీనులకు విందైన సంగీతం, సత్ సాంగత్యం, వినదగిన మాటలు మనస్సును ఆనందభరితం చేస్తుంది!

అయితే  వినదగని వాటినే పదే పదే వింటూ, వినదగిన వాటిని వినక పోవడం ద్వారా మన ప్రయారిటీలు తారుమారు అవుతూ మన ఆలోచనలలో క్లారిటీ లోపిస్తూ మనస్సుని, ఆలోచనలను కలుషితం చేసేస్తాయి.


ఈ ప్రాణాలయానికి నాసిక ప్రధానద్వారం. పకృతి ప్రసాదిత స్వచ్ఛమైన, పరిశుద్ధమైన గాలి  ఉచ్వాసక్రియలో మీ శ్వాసకోశాలను సృశిస్తూ హృదయకోశంని తేజోమయం చేస్తూ నాణ్యమైన జీవితాన్ని మీ సొంతం చేస్తుంది! ప్రాణాయామం ఈ శ్వాసక్రియని మెరుగుపరుస్తుంది! ప్రాణాయామం అంటేనే శ్వాస మీద ధ్యాస!


ప్రతిరోజూ ఉషోదయకాంతులలో, అహ్లదకరమైన ప్రశాంత వాతావరణ అనుభూతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేయడం మనస్సుని మధురానుభూతికి చేరువచేస్తుంది!


నోరు మంచిదైతే ఊరు మంచిదే అనేది లోకోక్తి!

అందుకే మన మాటలు హితబాషణం,  నిర్భాషణం,మధురభాషణాం, మితభాషణం, సత్యభాషణంగా వుంటూ మాటల్లో సాంత్వన, ఆత్మీయతలని ప్రతిఫలిస్తూ ఉంటే అవి ప్రపంచానికే నిన్ను దగ్గర చేస్తుంది!!


అసూయ, ద్వేషం, దురుద్దేశపూర్వకంగా, అహంకారపూరితంగా, అవమానించేవిగా మీ మాటలువుంటే అది నిప్పుని చేతితో విసరడం లాంటిదే అవుతుంది,అది ఎదుటి వాడిని బాధించిన, బాధించకపోయినా నిన్ను మాత్రం తప్పక  దహించి వేస్తుంది!!


జిహ్వ  రుచులను ఆస్వాదిస్తూ ఆరోగ్యవంతమైన సంపూర్ణజీవితాన్ని ఆస్వాదించడానికే!  

తీసుకునే ఆహారాలు మితాహారం, హితాహారం, మధురాహారం, సాత్వికాహారాలుగా మీ దేహాపుష్టికి ప్రియంగా ఉండాలి!


ఈదేహానికి  అప్రియమైన తినదగని  నిషిద్ధ ఆహారాలనే, పదే పదే తింటూ, ఎటువంటి ఉపయోగం లేని పానీయాలని అదేపనిగా తాగుతూ బాల్యంలోనే ఒబేసిటీ, యవ్వనంలోనే బీపీ,కొలస్ట్రాల్, షుగర్లు లాంటి అనారోగ్యలతో నేటియువత నిర్వీర్యం అవుతూ వుంటే సంపూర్ణ ఆరోగ్యం ఇక అందని ద్రాక్షపండ్లే!!


మనం చూసే దృష్టి, వినే మాటలు, మాట్లాడే మాటలు, తీసుకొనే ఆహారం,శ్వాస క్రియలు ఇవే మనస్సుకి మనం ఇచ్చే ఆహారాలు!!!


మనం చూసే దృశ్యాలపై నియంత్రణ, 

అలోచించి, మృదువుగా మాట్లాడే వాక్ నియంత్రణ,

విన్న, వింటున్న మాటలలోనీ విషయాలను బేరీజు వేసుకుని స్పందించే తీరు,

మన నడక, ప్రవర్తన, తీరుతెన్నుల పై దృష్టి,

ప్రాణాయామ ద్వారామెరుగైన శ్వాస క్రియ,

జిహ్వ పై చూపించే శ్రద్ధలే  ఇంద్రియనిగ్రహం అవుతాయి!


ఇంద్రియనిగ్రహం ద్వారా అంతర్శుద్ధి , తద్వారా మానసిక ప్రశాంత చేకూరుతుంది!

మనోనిగ్రహం ప్రశాంతపూరిత మనస్సుకే సొంతం!


సర్వే జన సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక సేవలో 

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 

జాగృతి మాలిక 8 కాలమే మహా కాలుడు!!!



కాలం 🕧మారడం అనేది నిజమేనా?

కాలం అనేది వ్యవహారికభాషలో ⏳టైమ్, ఆది సమయాన్ని సూచిస్తుంది. అయితే టైమ్ జోన్లలో ఆ సమయాన్ని చూపించే టైమ్ ని తరుచుగా సవరిస్తూ ఉంటారు. సవరణలకు, మార్పులకు లోనయ్యేది కాలం కాదు!

నిజానికి కాలం మారదు, కాలంలో మనం మారుతూవుంటాం!! ఇది ప్రకృతిధర్మం!!


కాలం అంటే సమయం.

కాలం అంటే వ్యవధి.  

కాలావ్యవధిని ఓ ప్రాథమిక  ప్రామాణికంతో కొలుస్తారు. అవి: 

తృటి,  క్షణం, సెకను, నిముషం,ఘడియ, ఝాము, రోజు, వారం, నెల, సంవత్సరం, దశాబ్దం, రజితవవర్షం, స్వర్ణవర్షం, వజ్రవర్షం, అమృతవర్షం,శతమానం లేక శతాబ్ది,సహస్రాబ్ది.

కాలచక్రం ఈ కాలగతిని తనలో కలుపుకుంటూ  నిరంతరం సాగిపోతూ వుంటుంది.


భూమి ఆత్మ ప్రదక్షిణ  కాలవ్యవధిని ఓ రోజుగా,  రోజును ఒక రాత్రి,పగలుగా,సూర్యుని చుట్టూ తన కక్ష్యలో చేసే పరిభ్రమణ కాలవ్యవధిని ఓ సంవత్సరంగా, దానిని మూడు కాలాలుగా, ఆరు ఋతువులుగా పరిగణిస్తున్నాం.


సౌరకుటుంబం లోనీ ఇతరగ్రహలుకూడా తమ కక్ష్యల్లో సూర్యుని చుట్టూ చేసే నిరంతర ప్రదక్షిణలు, చంద్రుడు భూప్రదక్షిణలో తన కక్ష్యలో అనేక నక్షత్రాలకు చేరువయ్యే సమయాల ఆధారంగా  ఏర్పడే వివిధ రాశులు, తిథి, నక్షత్రం, యోగం, కరణం, వారం వాటి ఖగోళ ఫలితాలను కాలచక్ర ఆధారంగా గణిస్తారు.

 

కల్పారంభంలో పరమాత్మ 🔱 నుంచి ఈ సృష్టి పరిపూర్ణంగా ఆవిర్భవించింది! దానితోపాటు కాలచక్రం ☸️కూడా! అది నిరంతరం ఓ 🏞️జీవనదిలా తన పయనం కొనసాగిస్తూనే వుంది. నదిలో నీరులా కాలంకూడా ఆగదు, సాగిపోతూనే వుంటుంది. 


సాగిపోయేకాలంలో  పుడుతున్నాం , ఆ కాలంతోనే సాగిపోతువున్నాం, ఆ కాలంలోనే కలిసిపోతూ తిరిగి మరోజన్మకి సిద్ధం అవుతాం. ఈ జనన మరణచక్రం, కాలచక్రంలో ఓ అంతర్వాహినిగా సదా కొనసాగుతూనే వుంటుంది.


కాలానికి అతీతంగా ఈ ప్రపంచంలో 🌍ఏదైనా వుందా?

వర్తమానంలో జీవించివున్న మనలో ఎవరు ఓ శతాబ్దం తర్వాత  వుండరు కాలగర్భంలో  కలిసి వుంటారు. అదే విధంగా ఓ నూరు సంవత్సరాల క్రితం వున్న ఎవరు ఈ రోజులేరు, కాలంలో కలిసిపోయారు. కాని కాలగమనం  నిర్వికారంగా ముందుకి సాగిపోతూనే వుంటుంది. కాలనికి ఆతీతంగా ఈ విశ్వంలో ఎది వుండదు.


నిజానికి కాలం అనేది సంఘటనలు, జ్ఞాపకాల దొంతరలు మాత్రమే!! 

కాలం భూత,వర్తమాన, భవిష్యత్తు కాలలకు అతీతం.

ఎపుడో చిన్నప్పుడు జరిగిన సంఘటనలు స్వప్నంలో తారసపడుతాయి.  స్వప్నం  కాలాతీతఘటన.

గతం అనేది లేదు ఎందుకంటే దానీ లోనికి వెళ్ల లేవు దానీ తాలూకు స్మృతులు మాత్రమే నీతో వుంటాయి, అలాగే భవిష్యత్తు కూడా లేదు, ఎందుకంటే దానిని నీవు సృశించలేవు. భవిష్యత్తు సదా వర్తమానంలో కలిసిపోతూ  గతంతో లయమవుతూ వుంటుంది. ఇది సృష్టి ధర్మం.


కాలుడు ఎవరు?

కాలం మారేది కాదు! కాలమే నేను! కాలుడను నేనే! మహంకాళిని నేనే! సృష్టికర్తను అయిన నాలోనే ఈ చరాచర జగత్తు కల్పాంతంలో లయమవుతుంది! నేనే లయకారకుడను!


సర్వే జన సుఖినోభవంతు 

మీ ఆధ్యాత్మిక సేవలో 

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 

జాగృతి మాలిక 07 శూన్యం అంటే నిజంగా శూన్యమేనా


శూన్యం అంటే అనంతం!!!

శూన్యం అంటే ఏమీలేదు అనికాదు, అది అవ్యక్త రూపంలో,ఇంద్రియములకు గోచరంకానీ అనంత ద్రవ్యరాశి!

శూన్యం అంటే చూడలేనిది అనికాదు, నీ దృష్టికోణానికి అందని ఏకాంబరస్వరూపం!

శూన్యం అంటే సున్నా కాదు, ఆది అనంతమైనది!

శూన్యం అంటే విలువ లేనిది కాదు, విలువ కట్ట లేనిది.

శూన్యం అంటే నిశ్శబ్దం కాదు 

శబ్దం లేని స్థితి! ధ్యానంద్వారా ఆ అనుభూతికి

చేరుకోవడం.

ధ్యానం అంటే ప్రాణాయామం !

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస !

ధ్యానం అంటే నామస్మరణం !

ధ్యానం అంటే అంతరంగవీక్షణ !

ధ్యానం అంటే మనోనిగ్రహం !

ధ్యానం అంటే మానశిక పరిపూర్ణత!

ధ్యానం అంటే పరమాత్మతో అనుబంధం!

ధ్యానం అంటే ఆత్మానుభూతి!

ధ్యానం అంటే మనలోని శబ్దాలు నిశ్శబ్దంలో లయమవుతూ మనస్సు ప్రశాంతతని చేరుకునే దివ్యానుభూతి.


ప్రశాంత పూరితమైన మనస్సుల్లోని హృదయంతరాలలో ఏకాంబరరూపంలో స్థితుడైన  జీవాత్మ, పరమాత్మతో స్థితమయ్యే అనుసంధానప్రక్రియనే ధ్యానం.


పంచతత్వాల సమ్మేళనమే ఈ ప్రకృతి.

పంచతత్వ మయమయిన ఈ దేహం ఆకాశ తత్వంతో వికసిస్తూవుంటుంది. ఆకాశం అంటే శూన్యం అనికాదు ఆది ప్రణవనాదం, అదే నీ నాదం,గళం కూడా..!


శూన్యం అంటే ఖాళీ అనికాదు,అది సర్వత్రా విస్తరించియున్న అనంత ద్రవ్యరాశి!

పరమాత్మ, సర్వాంతర్యామి, పరిపూర్ణంతో మూర్తిభవించిన సర్వసంపూర్ణుడు అయిన సృష్టికర్త నుంచి ఆవిర్భవించిన ఈ విశాల విశ్వం శూన్యం నుంచే పరిపూర్ణంగా ఆవిర్భవించి సకల జీవకోటికి ఆవాసంగా వర్ధిల్లుతూవుంది.

ఈ సత్యాన్ని శాంతి మంత్రం,ఓం పూర్ణ మధః పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే, ద్వారా నిరూపితమైన ఈ సృష్టి అనేక పాలపుంతలతో,  గెలాక్సీలగా విస్తరించి మన మేధస్సుకు, ఊహలకు అంతుచిక్కని మహోన్నతసృస్టి!


శాస్త్రీయఅధ్యాయనాలు ఇదే విషయాన్ని బిగ్ బ్యాంగ్ థియరీగా ధృవీకరిస్తున్నాయి.ఈ విశ్వం ఎప్పుడో 1300 కోట్ల సంవత్సరాల క్రితం ఓ కృష్ణబిలంలో జరిగిన ఓ మహావిచ్చిన్నంతో కూడిన పేలుడులో ఆవిర్భవించి మూడు లక్షల కాంతి సంవత్సరాల మేరకు విస్తరించిన ద్రవ్యరాశిగా భావిస్తూన్నాయి. వాస్తవానికి ఈ కృష్ణ బిలాలు కంటికి కనిపించవు కాని వాటి చుట్టూ ఉండే కాంతి ప్రవాహంతో శాస్త్రజ్ఞులు అక్కడ ఓ  కృష్ణ బిలం వుంది అనే అంచనాకు వచ్చారు.


కాంతి తరంగాలు , ధ్వని తరంగాలు, దృశ్య తరంగాలు, విలోమ, రేఖాంశ తరంగాల ప్రసరణకు మాధ్యమం  ఏకాంబరతత్వమే!!


సర్వేజన సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక సేవలో 

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration 


ధ్యాన మాలిక మాస పత్రిక అక్టోబర్ 25 లో వ్యాసమాలికలో  ప్రచురితమయినది.





జాగృతి మాలిక 06 అంతరంగదర్శనం సాధ్యమేనా…!

అంతరంగదర్శనం 

పంచతత్వాల సమ్మేళనమే ప్రకృతి. పంచతత్వమయమైన ఈ దేహం అగ్నితత్వంతో  విలక్షణంగా ప్రకాశిస్తూ వుంటుంది.

ఆవాసక్షేత్రంమయిన ఈ దేహం దృష్టికి గోచరించని  పంచాగ్నులతో, అగ్నితత్వ మయంగా, శక్తికేంద్రంగా, దేవాలయంగా విరాజిల్లుతోంది!

మనం ఆహారం పరమాత్మకు సమర్పిస్తున్న నైవేద్యంగా భావిస్తూ, ఆ మధురానుభూతితో  తీసుకోవాలి. ఆది సాత్వికాహారంగా, మధురాహారంగా, హితాహారంగా, మితాహారంగా కూడా వుండాలి. 

భగవత్ప్రసాదితంగా స్వీకరించిన ఆ ఆహారం నోటిలో లాలాజలంతో కలిసి జిహ్వగ్ని అనే యజ్ఞంలో చిన్న చిన్న కణాలుగా విచ్చిన్నం అవుతూ నెమ్మది నెమ్మదిగా జీర్ణాశయంలోకి జారి జఠరాగ్ని అనే రసాయన ప్రక్రియలతో పచనం అవుతూ  జీవశక్తిగా కణకణానికి చేరుతూ శరీర ఉష్ణోగ్రతల సమతుల్యతను పరిరక్షిస్తూ వుంటుంది.

అహం వైశ్వనరో భూత్వ ప్రాణి నాం దేహమాశ్రీతః అనే గీతోక్తిని ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోండి. 

శ్వాసక్రియ ద్వారా ప్రకృతి వరప్రసాదిత ప్రాణవాయువుని  వాతావరణం నుంచి గ్రహిస్తూ శ్వాసకోశవ్యవస్థలో ప్రాణాగ్నిలో దహింపబడి, ప్రాణకక్తిగా జీవితక్రియలను సదా నిర్వహించేది హృదయ క్షేత్రంలో వుండే  శీతాగ్ని.

ఈ శీతాగ్నియే ఆత్మ. ఆ ఆత్మనే జీవుడు.

జీవుడే దేహదారిగా ఈ స్థూలదేహంతో ఇంద్రియములసముదాయంతో తన కోరికలను, ఇష్టాలను తీర్చుకోవడానికి కర్తవ్యకర్మలను సదా ఆచరిస్తూవుంటాడు.

'ఈ స్థూలదేహం కంటే ఇంద్రియమలు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు. ఇంద్రియముల కంటే మనస్సు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనవి. దాని కంటే అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ ' అని గీతాచార్యులు ప్రబోధ గీతగా బోధించారు.

జ్ఞానాగ్నితో తేజోవంతంగా పరమాత్మ సస్వరూపమైన ఆత్మ అంతరంగంలో ప్రకాశిస్తూ వుంటుంది.

అంతరంగ దర్శనం జ్ఞానసాధన ద్వారానే వీలవుతుంది.

దృడసంకల్పం, శ్రద్ధ, ధీరత్వం, అచంచల విశ్వాసంలతో ఆ జ్ఞాన సాధన ఉండాలి.


సర్వే జన సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక సేవలో 

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra

జాగృతి మాలిక 5 మేలి ముసుగులు 🎭 తీసేయండి


మేలి ముసుగులు 🎭 తీసేయండి 



ఈ మొద్దునిద్ర నుంచి బయటకు రండి!కని పించనిమేలి ముసుగులని తొలగించండి !

విషం మనలని ఒక్క సారిగా చంపేస్తుంది. అయితే  సహనం , సెక్యులరిజం, మత సహనం,  సౌభ్రాతృత్వం అనే కనిపించని 🧣మేలి ముసుగులతో మన మనస్సులని  కప్పివేసి తమ పబ్బాలు గడుపుకున్న, గడుపుకుంటున్న, గడుపుకోవాలనుకుంటున్న,  కుహనా రాజకీయ శక్తులు  మన మనస్సులని  నిర్జీవంతంగా,  నిర్వీర్యం చేయడంలో  విజయవంతం అయ్యాయి !!!


గాలిపటంలో 🪁గాలి, గల్లా పెట్టేలో 🗃️గల్ల, ఫైర్ ఇంజన్ 🚒లో ఫైర్, నిప్పుకోడిలో నిప్పు, నేతిబీర లో నెయ్యి ఎలా ఉంటాయో ఈ కుహనా రాజకీయ శక్తుల బుజ్జగింపు చర్యలుకూడ అంతే!!


మనం వేసుకున్న సహనం అనే ముసుగులో , లవ్ జిహాదీ పేరుతో మన ఆడబిడ్డల మీద జరిగే నిరంతర దోపిడికి, బలవంతపు మతమార్పిడిలకి కళ్లున్నకబోధిలా నిర్లిప్తంగా వుండడం, అది  మరింత బరితెగింపుకు లైసెన్స్ ఇచ్చినట్లే! 


మత విద్వేషాలతో రగిలిపోతు  హైందవసంప్రదాయలపై, కట్టుబాట్లుపై,  విశ్వాసాలపై జరుగుతున్న అమానుష దోపిడీలకి పరమతసహనమనే  మేలి ముసుగులో మూగ సాక్షులుగా ప్రశ్నించక పోవడం ముష్కర మూక  లలో మరింత విచ్చలవిడితనానికి ప్రేరణ ఇచ్చినట్లే !!


 దేవాలయ 🛕వ్యవస్థలని,  దేవాలయ భూములను, దేవాలయ మాన్యాలని, చెరువులను అప్పనంగా దోచుకునే ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని, భూ జిహాదీలని , భూభకాసురాలను, సెక్యులరిజం అనే రంగుల  ముసుగులో ఉపేక్షించడం వారికి  యదేక్షగా దోపిడికి లైసెన్స్ గా మారింది.

హైడ్రా,  వక్ఫ్, బుల్డోజర్ల ద్వారా వారికి తగిన గుణపాఠం నేర్పించాల్సిందే!! వారి గుండెల్లో రైళ్ళను పరుగులెట్టించాల్సిందే


మత మూఢస చాందసభావజాలంతో  దేవాలయాలపై, దేవతా విగ్రహాలపై, మన మతవిశ్వాసాలపై విచక్షణా రహితంగా దాడులుచేస్తూ,  తీరని నష్టం కలుగచేసే మతోన్మాదులపై వారికి పరోక్షంగా తమ మద్దతును అందచేసే రాజకీయ నాయకులపై శీతకన్ను వేయడం మన లోని పిరికితనానికి పరాకాష్ట!!


క్షుద్రం హృదయ దౌర్బల్యం  త్యక్త్వోతిష్ఠ పరంతప అనే గీతాచార్య ప్రబోధగీతం  🌅ఉషాకిరణం లా 

హృదయ దౌర్బల్యం అనే ఈ కనిపించని ముసుగుతెరలని  ధైర్యం అనే 🤺ఖడ్గంతో   చేధించేయించాల్సిందే...


పహల్గావ్ లాంటి అమానుష, వికృత చర్యలు పునరావృతం గాకుండా వుండడానికి కళ్లు మూసుకుని నటిస్తున్న మొద్దు నిద్రమత్తు నుంచి బయటికి రావాల్సిందే !!


జవాబుదారి తనంతో, ప్రశ్నించే గొంతుకలతో, బ్రహ్మోస్ , సుదర్శన్ లాంటి క్షిపణులతో ఈ ముష్కర మూకలనీ దేశ సరిహద్దుల నుంచి తరిమి, తరిమి కొట్టాల్సిందే!


జాతి మనుగడకి, గౌరవానికి, చేతిలో చెయ్యి 🤝వేసి ధృఢంగా ముందుకు అడుగు వేయాల్సిందే!

దేశరక్షణకోసం అలుపెరుగక, నిరంతరం పరిశ్రమించే అగ్నివీరులకు, వీరజవాన్లకు, వాయుసేనలకు, నావిక దళాలకు  చేతులెత్తి మొక్కాల్సిందే!


వర్తమానంలో జీవిస్తూ. మన ఉనికిని సజీవంగా. సర్వమానవాళికి తెలియచేయాల్సిందే!

జై భారత్! 🇮🇳 

జై హింద్!!🇮🇳 


సర్వే జన సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక సేవలో 

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra



జాగృతి మాలిక 4 మనకి జీవధార , జీవనధార, ప్రాణధార నీరే!!

 జీవధార , జీవనధార, ప్రాణధార నీరే!!

జీవభరితం, వైవిధ్యభరితం అయిన ఈ భగవంతుని సృష్టి బహు విలక్షణభరితంగా, మన  ఆలోచనలకి, అంచనాలకు అందని విశిష్ట  స్థాయిలో ఉంటూ మానవాళి మేధస్సుకి, విజ్ఞతకి, ప్రతిభకి , ప్రజ్ఞలకి పదును పెడుతూ ఎన్నో నూతనావిష్కరాలకి కేంధ్ర బిందువుగా మార్గదర్శకంగా పయనింపచేస్తునే వుంది.

మన దేహానిర్మాణం కూడా అంతే విలక్షణభరితం!

మనం నివసించే ఈ భూమండలం 🌍70 శాతం నీటీతో 30 శాతం భూమితో విస్తరించిన ప్రకృతి స్వరూపం. సరిగ్గా అదే విధంగా మన దేహాల్లో కూడా 🌊70 శాతం  విస్తరించిన కణజాలం నీరే !!

నీరే 🌊మనకి జీవధార, జీవనధార, ప్రాణధార కూడా! 

సమాజ  ప్రగతి, పురోగతి, ఆర్ధికస్వవాలంబనకి , ప్రభుత్వ వ్యవస్థలను ప్రభావితం చేసేది, చేస్తున్నది , చేయబోయేది కూడా పకృతి ప్రసాదిత 🌊జలాలే!

ప్రపంచంలో అతి పురాతన,విశిష్ట మానవ నాగరిక సమాజాలు హరప్ప, సింధు నాగరికతలు గంగ, సింధు నదుల పరివాహక ప్రాంతాల్లోనే వికసించి నలుదిశల శోభిల్లింది!!

నాడు నేడు కూడ వివిధ దేశాల మధ్య ఈ జలయుద్దాలు అనేకమార్లు జరిగాయి, జరుగుతున్నాయి !నేడు ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాక్ పై మనం అప్రకటిత జలయుద్ధానికి  శంఖారావం పూరించాం !

ఇక వ్యక్తిగత పరంగా 

మనం ప్రతి రోజూ తాగే నీళ్లు శరీరంలో 

ఆహారం సమర్థవంతంగా జీర్ణం అవడానికి,    జీవరసాయనకచర్యలతో మేళవించిన  రసరూప ఆహారం జీవశక్తిగా శరీర అంగంగాలకి రక్తకణాల ద్వారా చేరవేయడానికి, 

వ్యర్థపదార్థాలను మలరూపంలో సుఖ విరోచనం  అవడానికి, 

స్వేదక్రియద్వారా శరీర ఉష్ణోగ్రతల సమతుల్యత ను సదా పరీరక్షించడానికి , 

కిడ్నీవ్యవస్థలో వడపోత ద్వారా రక్తశుద్ధికి, తద్వారా మలినాలను సాఫీగా మూత్రంద్వారా విసర్జనకి కారణం అవుతుంది.

ఆరోగ్యవంతమైన ఈ దేహం సమర్థవంతంగా  తన ఈ విధులను నిర్వహించడానికి ప్రతిరోజు మూడు లీటర్ల నీరు తప్పక అందించి తీరాల్సిందే.

కొబ్బరినీళ్లు, చల్లట్టిమజ్జిగ, తాజా పండ్లరసాలు, చెరకురసాలు, వెజిటేబుల్  జ్యూస్, ఫ్రూట్ జ్యూస్  లు గా  కూడా అందించవచ్చు.

భగవత్ప్రసాదితమైన ఈ విలక్షణ దేహం శత వసంతాలు సమర్థవంతంగా ప్రతిఫలాపేక్ష లేకుండా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మీరు చేయవలసినది అశ్రద్దలేకుండా జాగరూకతతో ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల  నీళ్లు తాగడమే! 

ద్రవ సమతుల్యతలను కాపాడడం మీ కనీస బాధ్యత!!

వృద్ధులలో దప్పిక తక్కువగా ఉంటుంది. అందువల్ల కేవలం ఒకటీ రెండు గ్లాసుల నీరు పరిమితంగా తీసుకుంటుంటారు. అది  డిహైడ్రేషన్ కి కారణం అవుతుంది. మీరు జాగరూకతతో గమనిస్తూ తగినంత నీరు తప్పక తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి.

శరీర ధర్మాన్ని గౌరవిద్దాం!!

ఈ దేహాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమిద్దాం!!!

సర్వే జన సుఖినోభవంతు 

మీ ఆధ్యాత్మిక సేవలో 

RaNa 

9900022729
🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️


జాగృతి మాలిక 03 పరమాత్మ 🔱 సృష్టి యాదృచ్ఛికమా???


సృష్టి యాదృక్షికంగా జరిగిందా?


ఈ సృష్టి 🪐సనాతనం,చైతన్యవంతం, జీవభరితం,వైవిధ్యభరితం,తేజోవంతం, స్పూర్తిభరితం నిర్దిష్టక్రమంలో సర్వసంపూర్ణుడు, సమగ్రుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మ 🔱 నుండి కల్పారంభంలో ఆవిర్భవించిన ఈ సకల సృష్టి పరిపూర్ణంగా విరాజిల్లుతోంది.


అనేక మహాయుగాలు గడిచినా సృస్టి నిర్మాణక్రమంలో, రూపకల్పనలో అణుమాత్రం కూడా మార్పులు లేని అత్యంత అద్భుతమైన సంక్లిష్ట సృష్టి ప్రక్రియ, యుగయుగాలుగా నిరంతరం కొనసాగుతూ వుంది.


భౌతికవాదుల మేధస్సుకు ఈ జీవపదార్థం, జీవకణనిర్మాణం, జీవశరీర నిర్మాణం సమాధానం దొరకని ఓ సవాలుగా నిలిచింది!

ఏ శాస్త్రవేత్తకాని,వారి పరిజ్ఞానం జీవపదార్థం పుట్టుకని, దాని ఉనికిని కనిపెట్టలేక పోయింది! వారి పరిశోధనలు ఓ జీవకణాన్ని తమ పరిశోధనాలయంలో తమ మేధస్సుతో సృష్టించలేక పోయింది.

🪐ఈ సృష్టి పృథ్వి, వాయు,నీరు,🌊 అగ్ని, 🔥ఆకాశంలతో విశ్వమంతా విస్తరించిన పంచభూతమయమే!

నశ్వర మయిన ఈ దేహాలన్నీ పంచభూతాల రూపకల్పనతో నిర్మితమైన సామూహిక జీవకణాల నిర్దిష్ట రూపాలే!

ఈ స్థూలదేహమే క్షేత్రం.ఈ ఉపాధి క్షేత్రంలో సనాతనం,అనశ్వరం, చైతన్యభరితమయిన ఓ జీవశక్తి వుంది.

అది మీ జీవక్రియ, జీవనక్రియ, జీవితక్రియలను నిర్దేశిస్తుంది.

ఆ జీవశక్తిస్వరూపమే 🪔 జీవుడు!

ఆ జీవుడు పరమాత్మ సస్వరూపమే!!

మనలోని జీవుడే శివుడు!!

శ్వాస మీది ద్యాసనే ధ్యానం 🧘 అదే శివతత్వం..


సర్వ భూతస్థ ఆత్మానం, సర్వ భూతాని ఆత్మానీ అనేది గీతోక్తి.

సృష్టిలోని సకలజీవరాశిలో పరమాత్మ చైతన్యవంతంగా,ఆత్మరూపంలో ప్రకాశిస్తుంటాడు. ఈ సద్భావనతో ఈ జీవనయాత్రని కొనసాగిస్తూ ఉండాలి.

ఆత్మ భావనతో ప్రతి ఒక్కరియందు దయ, కరుణ, జాలి, ప్రేమ, కారుణ్యం కలిగి ఉండాలి.

మనం సదా జాగరూకతతో, ఎరుకతో ఏ ప్రాణికి అపకారం చేయాలనే తలంపును మనస్సు నుంచి సంపూర్ణంగా త్యజించి వేయాలి. అది భగవతత్వానికి మనలని మరింత చేరువ చేస్తుంది.


సర్వే జన సుఖినోభవంతు.

మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra