Thursday, 11 June 2015

21. విజయశైలి - మీ వయస్సుని మించి అగుపిస్తున్నారా?







యంగ్’గా కనిపించాలి అన్నది మనందరికి ఇష్టమే! ఆ భావనే మిమ్మల్ని ఏనర్జటిక్’గా, గ్రేట్’గా, ఫవర్ ఫుల్’గా, డైనమిక్’గా వుండేలా చేస్తుంది, అయితే యవ్వనంగా వుండవలిసిన వయస్సులో వయస్సునిమించి ఆగుపిస్తున్నారా?   
ఇందుకు ప్రదానంగా పౌష్టికాహరలోపం, హర్మోన్లలొ అసమానతలు, చేసేపనులు గ్రేట్ గా లేవని క్రమేణ వాటిపై పెంచుకున్న అనాసక్తతలు, ఎదుగు బొదుగులేని సంపాధనలు, ఆలోచనాధోరణిలో పరివర్తనలు ఈ పరిస్తితులకి దారి తీస్తాయి. మీ సంబందభాందవ్యాలని డోలాయమానం చేస్తాయి.  రూపురేఖలను, హవభావాలను ప్రభావితం చేస్తాయి. నెమ్మదిగా జుట్టుపై ప్రబావాన్ని తీసుకువస్తుంది. జుట్టు గ్రేకలర్’ సంతరించుకోవడం లేదా పలుచబడడాన్ని గమనిస్తారు. కొందరిలో కనులచుట్టూ డార్కుగా వలయాలు రావడం, ముఖంలో గీతలు ప్రస్పుటం కావడం కూదా గమనించవచ్చు. ఫలితంగా థర్టీస్’లోనే వయస్సునిమించిన పెద్దవారిగా కనపడడం మొదలవుతుంది. ఆరోగ్యంగా కనిపించడం కోసం ఇక మిమ్మల్ని ట్రీట్’మెంటుకోసం డాక్టర్ల చుట్టు తిరిగేలా చేస్తూంది.


ఈ భావనలను అధిగమించడానికి, ఆలోచనలలో నవ్యత్వం, ఆచరణలో భిన్నత్వం, స్వీయగౌరవాన్ని పెంపొందించుకొనే దిశలో ఆత్మవిశ్వాసంతో, మానసికదృడత్వాన్ని పెంపొందించే విదంగా ముందడుగు వేయాలి. ఇక మీ నవీనజీవనశైలిలో తీసుకవచ్చే మార్పులను స్వాగతించాలి.  ఆ మార్పులు, కూర్పులు, చేర్పులను జీవితశైలిలో ఓ నూతన వరవడిగా గుర్తించాలి.


మొదటిగా మీలోని సంశయాత్మక ధోరణిని వదులుకోవడానికి, సానుకూలధోరణితో సంసిద్దులు కావాలి.  చాలాసందర్భాలలో అవలి వ్యక్తి భాదపడుతాడు అనే సంశయంతో వాళ్లు మీపై వేసే అభాండాలు/అనుచితమైన కామెంట్సుకి రిప్లై ఇవ్వక మౌనంగా తప్పులేక పోయిన గిల్టీగా ఫీల్ అవుతూ, మానసివేదనని భరిస్తూ వుంటారు. ఇది మీలో ఆత్మన్యూనతని పెంచేస్తుంది, జీవనాన్ని దుర్భరం చేస్తుంది.ఇక మీదట అటువంటి సందర్భాలలో వారు సహోద్యోగినిఅయినా, మిత్రుడుఅయినా, బాస్’అయినా, జీవనభాగస్వామిఅయినా మరేవరైనాసరే మీ తిరస్కారాన్ని  
‘మీరు అలా మాట్లాడడం నాకు నచ్చడంలేదు’, అని సూటిగా వారి మొహంకేసిచూస్తూ, తడబాటు లేకుండా, మృదువుగా చెప్పాలి.
  • సంశయాత్మక ధోరణిని తిరస్కరించడంతో అది మానసిక శృంఖలాలను తెంచుకోవాడానికి మొదటి స్టెప్ అవబోతుంది. క్రమేణా ఎందుకు నచ్చడం లేదో తెలియజేయడం మీరు అలవాటు చేసుకోవాలి. ఇక మీదట ధూషణ / తిరస్కారాలు మీ దరికి చేరడానికి సంకోచిస్తాయి.
  • నేను ఏమీ చెయ్యలేక పోయాను అని చింతించడం వలన ప్రయోజనం లేదు, ఇప్పుడు ఏమి చెయ్యగలను, నేను రేపు ఏమి చెయ్యాలి అని నిర్ణయాత్మకధోరణిలోఆలోచించడం, ఆచరణలో పెట్టడం మనలని అభివృద్దివైపు నడిపిస్తాయి.
  • ఈ సానుకూలధోరణి మీలోని అత్మన్యూనతని దూరంచేయడమే గాకుండ మీ ఆత్మవిశ్వా సానికి మెరుగు పెడుతూ మిమ్మలని డైనమిక్’గా, యంగ్’గా వుంచడానికి తొడ్పడుతుంది. 
వీరు విధేయత అనే ముసుగులో కాలం గడిపేస్తూ వుంటారు. నిజాయితిగా తమ పని చేసుకపోతారు. అందులో ప్రావీణ్యతనికూడా సంపాదిస్తారు.
  • వీరు తమ ప్రావీణ్యతలకి తగిన గుర్తింపు సకాలంలో అందడంలేదు అని సహోద్యోగులతో వాపోతుంటారు. అయితే ఎంప్లాయర్ ని అడగడానికి సంశయిస్తూవుంటారు. తమముందే చేరిన జూనీయర్సు తమ ప్రఙ్న,పాఠావాలతో అవకాశాలను అంది పుచ్చుకుంటూ ఉద్యోగ పరమపదసోపానపఠంలో నిచ్చేనని వడివడిగా ఏక్కెయడం వీరిని ప్రేక్షకులుగా, తదుపరి నిరాశావాదులుగా మార్చివేస్తుంది. ఇక ఫ్యూచర్ మీద విశ్వాసాన్ని సడలించేస్తారు.
  • నిజాయితిగా తమ భావనలను అవసరమైన సమయాలలోకూడా వ్యక్తీకరించలేక పోవడం, ప్రశ్నించే నైపుణ్యం కొరవడడమే తమ ప్రావీణ్యతకి గుర్తింపు కలగకపోవడం, అసంతృప్తికి కారణం అని చాలా లేట్’గా గుర్తిస్తారు.
  • ఆలోచనలను, ఆభిప్రాయాలను అవసరమైన సమయాలలో వ్యక్తీకరించకపోవడం ద్వారా అవకాశాలను అంది పుచ్చుకోలేరు.ఈ బలహీనతను సమర్థవంతంగా అధిగమించవలసిందే!
అయితే కొన్ని సందర్భాలలో వీరి సిన్సియారిటిని, సీనియారిటీని లేటుగా గుర్తింపబడవచ్చు, ప్రమోషన్లు కూడా పొందవచ్చు. నిజాయితిపరుడుగా కూడా మెప్పుపొందవచ్చు.  
మాట్లాడడం ఓ కళ. మృధుభాషణ మీ వ్యక్తిత్వానికి మరింత సొగసుని తెస్తుంది.
  • నలుగురిని అందులో కొందరు అపరిచితులు అయినా సరే చిరునవ్వుతోనే పలకరించండి!  
  • మీ సంభాషణలలో సందర్భానుసారంగా చతురోక్తులని మేళవించండి! అది వ్యక్తులమద్య వుండే దూరాన్ని తగ్గిస్తుంది. సాన్నిహిత్యాన్ని పెంచుతుంది, సంభందాలను బలోపేతం చేస్తుంది.
  • ఇక మిమ్మల్ని ఏనర్జటిక్ గా వుంచుతుంది. మీ చతురతను అభిలషిస్తారు. 
ఆఫీస్ వర్కుల్లో బెరుకుతనానికి స్వస్తి చెప్పేయాలి.మీ ఆలోచనలని/అభిప్రాయాలను సూటిగా, తడబాటులేకుండా కమ్యునికేట్ చేయాలి.
  • ఎఫెక్టివ్’కమ్యునికెషన్ అలవాటు చేసుకోవాలి. అది అలావాటు అయ్యేంతవరకు మనస్సులో ప్రాక్టీస్’చేయాలి. మీలోని స్పీకింగ్’ ఫోభియాని వదలివేయడం వ్యక్తిత్వనిర్మాణప్రక్రియలో ముందడుగు అవుతుంది.
  • మీపార్టిసిపెషన్లో సానుకూలధృక్పధం మాత్రమే ప్రతిబించాలి. ఇతరుల అభిప్రాయాలను శ్రద్దగా ఆలకించాలి, అవి మీఆలోచనల కంటే మెరుగైనవి అయితే వాటిని గౌరవించాలి.
  • మీ ఆలోచనాసరళి నాణ్యమైనది అయితే సహేతుకంగా మీ అభిప్రాయాలకి వివరణ ఇవ్వగలగాలి. అపుడే సాధారణంగా వాటికి విలువ పెరుగుతుంది, ఆమోదం పొందడానికి ఆస్కారం ఎర్పదుతుంది.
  • ఇతరుల అభిప్రాయాలతో   ఏకాభిప్రాయం కుదరకపొతే ఆర్గ్యుమెంట్ చేయకండి, అయితే డిష్కసన్ మాత్రమే చేయాలి. డిష్కసన్ మాత్రమే స్నెహపూర్వక వాతవరణాంలో అవలివారిని ఇంప్రెస్ చేయడానికి అవకాశాన్ని  కలుగచేస్తుంది.
  • మీకు నచ్చని ఇతరుల అభిప్రాయలను సున్నితంగా తిరస్కరించాలి అది అవలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఏ మాత్రం కించపరిచేవిదంగా ఉండరాదు.
  • మీ అభిప్రాయాలు ఆమోదం పొందినా/పొందకపోయినా ఈ సానుకూల ధృక్పదం స్వీయగౌరవానికి వన్నె తెస్తుంది. 'విన్ విన్ ' వాతవరణాం ఇద్దరిలోని అహన్ని తృప్తి పరుస్తుంది అటువంటి వాతావరణం మీలోని అంతర్లీన శక్తుల ఉద్దీపణకి ప్రేరణ అవుతుంది.
జీవనయానం క్రియాశీల ధోరణిలో కొనసాగించాలి. వృత్తిరీత్యా, వ్యాపారపరంగా నీకు కావలసింది నీవే సంపాదిం చుకోవాలి!
  • స్వశక్తితో సంపాదించే ప్రతిభ, సంపాధనలకే ఈ సొసైటీలో గుర్తింపు! వారసత్వంగా వచ్చే ఆస్తిపాస్తులు నీ విలువను పెంచవు!!
  • అవకాశాలను వెతుక్కూంటూ నీవు వెళ్లాల్సిందే, అవి మీముంగిటకి రావు, వచ్చిన అవకాశాలను సడలని విశ్వాసంతో, స్వయంకృషి, మేధస్సులని మేళవించి సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అవసరమైతే ఇతరుల సహయం తప్పకతీసుకోవాల్సిందే! రండి కలిసి సాగుదాం, సాధిస్తాం అన్న ధోరణిలో నడుద్దాం!!
  • లక్ష్యం అనేది క్లియర్’గా వుండితీరాలి. ఆ లక్ష్యం మీశక్తిని, వయస్సుని, ప్రతిభని ధృష్టిలో వుంచుకొని మీపరిమితులను గుర్తేరిగి నిర్దేశించుకోవాలి! ఆలక్ష్యసాధనని  నిర్ణయాత్మక ధోరణిలొ కొనసాగించాలి.
  • చేజారిన అవకాశం, చేజార్చుకున్న కాలం తిరిగిరావు! అందుకనే కావలసిన నైపుణ్యం, మేధస్సులని పెంపొందించుకుంటూ అవకాశాలను అందుకోవాలి. ఇందుకు దృడచిత్తం, ఆత్మవిశ్వాసంలనే పెట్టుబడులుగా ముందదుగు వేయాలి. అవి వ్యక్తిత్వనిర్మాణంలో కీలకపాత్రని పోషిస్తూ కలలసాఫల్యానికి అంతర్గత ప్రేరేపణగా నడిపిస్తాయి, ఇక నీ లక్ష్యాన్ని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది.
  • మీరు ఏ రంగంలోవున్నా, వృత్తిలోవున్నా రాణించాలి అంటే మీ ప్రతిభ, నైపుణ్యాలని నిరంతరం మెరుగుపరుచుకుంటూ వుండవలసిందే!! అలసత్వం దరిచేయకుండా చూసుకోవల్సిందే!!  లేదంటే ఈ పోటీ వాతవరణంలో ఇక ఏక్కడవేసిన గొంగలి చందంలా వెనుకబడిపోయే ప్రమాదం పొంచివుంటుంది!!
  •  భవిష్యత్తుని గురించి కలలు గనవలసిందే...వాటిని సార్థకత చేసుకోవాడానికి అవసరమైన నైపుణ్యం, తెగువ, ధైర్యం, సాహసాలని ప్రదర్సించి తీరవలసిందే!!
ఈ భవిష్య ప్రణాళికలు మిమ్మల్ని సదా ప్రేరేపిస్తూ ఉండేట్లు దశ, దిశ లని మలచుకోవాలి. అలాగే నీ ప్రతిభ, వ్యుత్పత్తుల సామర్ధ్యాన్ని అతిగా భావించరాదు. అది ప్రత్యర్దుల సామర్ధ్యాన్ని అంచనావేయడంలో తక్కువ చేసి చూపిస్తుంది. నీ ఎదుగుదలకి బారికేడర్ అవుతుంది.
మనం తీసుకునే ఆహరం పోషకవిలువలు కలిగిన పౌష్టికాహరం అయితీరాలి, అది శరీరాఅవసరాల మేరకు తగినంత పరిమాణాలలో మాత్రమే తీసుకోవాలి, అవి మేలైన నాణ్యతని కలిగిన సాత్విక ఆహరాలుగా వుండి తీరాలి.
  • సాత్వికాహరారం ఔషధంలా వ్యాధినిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది, మనల్ని సదా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది.·        
  • మీరు రోజు ‘జీరో’ కెలోరీలు, ‘లో’ కెలోరీల ఆహారాన్ని ఆసక్తి మేరకు తీసుకోవచ్చు!!
  • ఇవి మిమ్మల్ని ఒబెసిటిబారిన పడకుండా, స్లింగా, ఆరోగ్యభరితంగా వుంచుతాయి.
  • హర్మోన్ల అసమతుల్యతల ద్వారా వచ్చే మూడ్’స్వింగ్సు నుంచి పరిరక్షీంచేదిశలో కీలకపాత్ర పోషిస్తాయి.
  • ఇవి మనువు, తనువులను కల్మషాలభారి నుంచి రీచార్జి చేస్తాయి.
  • ఎంప్టీ కెలొరీల ద్వార ఆరోగ్య ప్రధానమైన సూక్ష్మపోషకాలు శూన్యం అటువంటి ఫుడ్స్’ని అవాయిడ్ చేయడం శ్రేయస్కరం.
ఫుడ్ సెలెక్షన్’లో మీ విఙ్నత చూపించాలి. సమగ్ర వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_11.html


Saturday, 23 May 2015

20 విజయశైలి - లక్ష్యసాధనలో అవరోధాలను ఇలా అధిగమించండి....



బిజినెస్’లో లాసెస్, ఆరోగ్య సమస్యలు, ఆఫీసులో వర్కుఫ్రెషర్,  వృత్తిలో ఎదుగుదల లేకపోవడం, ఎక్జాంస్ కాంపిటీషన్, లవ్ ఫెయిల్, వైవాహికజీవితంలో అపశృతులు ,వివాహేతర సంభందాలు, కుటుంభ కలహాలు,  భార్యాభర్తల్లో కొరవడిన అన్యోనతలు , తరచు కీచులాటలు, ఆర్ధిక సమస్యలు,  ఇలా ఎన్నెన్నో కారణాలు మన ఆలోచనల సరళిని దీర్ఘకాలంలో ప్రభావితం చేస్తాయి!! అది మీలోని సృజనాత్మకత, భావుకతలపై నెమ్మది నెమ్మదిగా తమ ప్రతికూల ప్రభావాలని చూపెడతాయి . అది మీప్రవృత్తిపై తీరని ప్రభావాన్ని తీసుకువస్తూంది.. తరచుగా అసహనం, విసుగు, కోపం, ఆవేశాలకి లోనవుతుంటారు   పర్యవసనంగా ఆలోచనలలో, తీసుకొనే నిర్ణయాలలో తరచుగా వివక్షణ, విచక్షణ, విజ్ఞతలు లోపిస్తాయి..

  • మితిమీరిన కోపావేశాలు, అలజడుల ప్రకంపణలు మానశిక వ్యధలకి ,ఒక్కోసారి తీవ్రమైన తలనొప్పులకి, ప్రతిసారి బ్లడ్ ప్రెషర్ లెవెల్సు పెరగడానికి కారణం అవుతాయి.
  • అది వ్యాధినిరొధక వ్యవస్థని, బలహీనం చేస్తుంది.తరచుగా జలుబు, రొంప, మలబద్దకంలకి గురిచేస్తుంది.
  • ఇది 90% వ్యాధులకు మూలం అవుతుంది, మొండి వ్యాదులకి చేయూత అవుతుంది.
  • అలాగని ఈ కోపావేశాలను, మదిలోని అలజడులను నీలో నీవే అదుపు చేసుకుంటే అది మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని తీసుకువస్తుంది.
  • ఇది జీర్ణవ్యవస్థని, అంతర్గత వ్యవస్థలని బలహీన పరుస్తుంది. అల్సర్, కండరాల వాపులకి గురిచేస్తుంది.
  • ప్రతి ఇద్దరిలో ఒకరు జీవన పయనంలో  సగభాగం నిద్రకి, మిగిలిన సగభాగంలో అర్ధ భాగం కోపంతోనే నేస్తం సాగిస్తున్నారు అని గణాంకాలు చెబుతున్నాయి.
  • పంచుకుంటే తగ్గేది భాధ!  అందుకని కోపావేశాల మూలాలను గుర్తించాలి. మదిలోని ఆలోచనలను, అలజడులను కలిగించే అంశాలను కేవలం మనస్సుకి దగ్గరైన సన్నిహితులతోనే పంచుకోవాలిషేర్ అండ్ కేర్’  మీకు తక్షణ  ఉపశమనాన్ని కలిగిస్తూ, మనస్సుని తేలిక చేస్తుంది.
  • ఈ కోపావేశాల సమయ ప్రదర్శనలో వివక్షణ,విజ్ఞతని పెంపొదించుకోవాలి
కోపాన్ని, ఆవేశాలనుపాజిటివ్ ఎనెర్జీస్’ గా మలచుకోగలిగే సామర్ధ్యాన్ని మీరు పెంపొదించుకుంటే ఇక సాధించబోయే ఫలితాలు మిమ్మలని పోటి ప్రపంచంలో ప్రత్యేకంగా నిలపెడ్తాయి.
  • మీ ఆక్షేపణలు, అభిప్రాయాలను అవసరమైన సందర్బాలలో మృదుభాషణలోతప్పక తెలియజేయాలి, అప్పుడే అనుకున్నది సాధించడానికి వీలు అవుతుంది, అలా చేయకపొతే ముభావిగా మిగిలి పోయె ప్రమాదం ఉంది.
  • ఒకేసారి మల్టీ టాస్కులు తీసుకోవడం స్ట్రేస్సుని పెంచడానికి కారణం అవ్యుతుంది. అందుకే టాస్కులని ప్రయారిటీ పరంగా విభజించుకోవాలి. ఇక ఒక్కోకటిగా టాస్కులని హ్యండిల్ చేయాలి.
  • ఈ సామర్ధ్యాన్ని సొంతం చేసుకోవడానికి మీ లోని అంతర్గత శక్తులని ప్రేరేపించాలి, వాటిని లక్ష్యదిశగా  కేంద్రీకరంచి ముండడుగు వేయాలి. ఆండుకోసం సానుకూల భావనలతో చూడడం మొదలెట్టాలి. సానుకుల ధోరణి మీ ఇంటి నుంచే ఆరంభించాలి.
  • పంచుకుంటే పెరిగేది ప్రేమ! అందుకనే జీవిత భాగస్వామి మీ పై చూపించే ఆధరణ, ఆప్యాయాత, అనురాగం, ఇష్టాలని  గుర్తించండి , ప్రశంసించండి, మోటివేట్ చేయండి, ఆమెకి సదా స్నెహ హస్తం ఇవ్వండి, అయితే అదే పనిగా పొగడకండి. ఫ్రశంశ మనస్సులోంచి వస్తే, పొగడ్త పెదాలనుంచి మాత్రమే వస్తుంది. మీరు మీ పిల్లలని రోజు హగ్ చేసుకొండి, నవ్వుతూ పలకరించండి. సరదాగా వారితో గడపండి. చిరునవ్వులతో ఆఫీస్ నుంచి వచ్చిన మీవారిని మదిలోనికి, ఇంటిలోనికి ఆహ్వానించాలి, మృదువుగా  ప్రేమతో   పలకరించాలి.  కాఫీ/ టీ సర్వు  చేయండి, సేద తీరనీయండి. పై మీకిష్టమైన టాపిక్ షేర్ చేసుకోండి. వారాంతాలలో ఫ్యామిలితో మూవీ/పార్కు/షాపింగ్/డిన్నర్’లకి వెళ్లండి. ఈ సానుకూల మార్పులు భార్యభర్తల మధ్య వుండే అపోహలని దూరంచేస్తూ, కీచులాటలకి పుల్ స్టాప్ అవుతుంది. ఇక మీ దాంపత్యజీవితం నందనవనంగా మారడాన్ని గమనిస్తారు!!
  • మీరూ బాగ ఇష్టపడె బుక్ అది నవల కాని, సుడోకొ పజిల్సు కాని, సైంటిఫిక్ ఫిక్సన్  కాని, అడ్వెంచర్ థ్రిల్లర్ కాని మీ బ్యాగ్ లో వుంచుకోవాలి, తీరిక సమయాలలో, జర్నీలలో  అది కాలక్షేపంగా మిమ్మల్ని రొటిన్ నుంచి బిజీ చేస్తుంది. మష్తిష్కంకి పదును పెడుతుంది.
  • మనం తరచుగా టైం దొరకడం లేదు అనే మాట వింటుంటాము , అయితే మీరు మీకు తెలీకుండానే గంటలతరబడి టివీచూడడం లేదా ఇంటెర్ నెట్ బ్రౌజ్ చేయడం అలవాటు చేసుకొని ఉంటే వ్యసనాన్ని తగ్గించుకొని అందులో కొద్దిపాటి టైం డైలీ ఫ్యామిలి మెంబర్సుతో సరదాగా గడపండి. చిన్నారుల ప్రోగ్రస్ చదువుల్లో, ఆటపాటల్లో గమనించండి, వారికి ప్రేమ, ఆప్యాయతలని పంచండి. వారి చిరునవ్వులు మీ చికాకులను తొలిగిస్తాయి.
  • పంచుకుంటే పెరిగేది, తరగనిది జ్ఞాపకాలా తీపి గుర్తులు!  అందుకని చాలాకాలం నుంచి టచ్’లో లేని మీ చిరకాల బాల్యమిత్రులకి  సర్ప్రైజ్  చేస్తూ వారితో ఫోన్ లో మీ చిన్ననాటి మధూరానుభూతులను షేరు చేసుకోండి.  వారికి స్నేహ మాధుర్యాన్ని పంచండి. అది మీకు మంచి రిలీఫ్’ని ఇస్తూ ప్రొయాక్టివ్’గా వుంచుతుంది.
  •  నిద్రకి ముందు టీవి ప్రోగ్రాంలు చూడకపోవడం మీ సుఖనిద్రని సుగమం చేస్తుంది! సాదారణంగాఈ టైంలో ప్రసారితమయ్యే క్రైం స్టోరీస్ ,   హారర్ ఎపిసోడ్సు, ఈవిల్ స్టోరీస్, టెర్రర్ స్టోరీస్, సస్పెన్సు థ్రిల్లర్సు,  మిడ్ నైట్ మసాలాల వంటి ప్రోగ్రాంలు అవి మదిలో కలిగించే ఆలోచనా ప్రకంపణలను దూరం చేసేస్తుంది. కొన్ని రోజుల్లోనే చక్కటి నిద్రానుభూతులను మీ సొంతం చేసుకుంటారు.
మనస్సు, తనువు, మష్తిష్కంలను  సంధానిస్తూ పాజిటివ్ ఎనెర్జిస్ లకి ఆలంబన అవుతూ మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తూ ,  ఆత్మ న్యూనతలను దూరంచేసే హైందవ సంప్రదాయక ప్రదాయణి  యోగ’ని ఆభ్యాసం చేయండి. ఇందుకు మీరు రాత్రి పది గంటలకి ముందుగానేయోగనిద్ర’ ద్వార సుఖ నిద్రని ఆహ్వానించాలి  మరియు ఉదయం ఓ అరగంట ముందుగా నిద్రనుంచి లేవాలి. ఇక సమయాన్ని యొగ సాధన  ప్రత్యేకించి ‘మెడిటేషన్’ కి కేటాయించాలి. అందుకే యొగ క్లాసులకి తప్పక సైన్ చేయండి. మరిన్ని వివరాలకు ఈ లింకులని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_18.html & http://rvnsetty.blogspot.com/2014/11/blog-post_19.html

Thursday, 30 April 2015

18. విజయశైలి - మీ సామర్ధ్యాన్ని ఇలా పెంపొదించుకోండి...





నేనే చేయగలను అనే అతివిశ్వాసాన్ని, నేనేమి చేయలేను అనే అల్పవిశ్వాసాలకి దూరంగా వుండాలి, ఎందుకంటే అతివిశ్వాసం తరచుగా వివక్షన, విచక్షనలు లోపించి పెరుగుదలకి ప్రతిభందకాలు అయితే, అల్పవిశ్వాసం ఆ పనిలో అసలు ముందడుగుని వేయించాడానికే ప్రతిభంధకం అవుతుంది. అందుకని నేను చేయగలను అనే అనే సానుకూల భావోద్వేగ ధోరణిని అలవర్చుకొనే ధృక్ఫదాన్ని పెంపొందించుకోవాలి, అది ఆత్మవిశ్వాసానికి ఆలంబన అవుతుంది. సాదించబోయే విజయాలకి విజయపధం అవుతుంది.
 సానుకూల ధృక్పాధాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
o   అందానికి, ఆరోగ్యానికి నిద్రకి ప్రత్యక్ష సంబంధం వుంది. తగినంత నిద్రలేకపోతే దాని ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడంవల్ల మెమొరి పవర్ పెరుగుతుంది. సుఖనిద్రవల్ల మెదడు పునర్వ్యవస్తీకరణ జరిగి సృజనాత్మకత పెరుగుతుంది. నిద్రలో అనేక శరీర కణాలకు రెపేర్లు జరుగుతాయి. జీవవ్యవస్థ మెరుగౌతుంది. నాణ్యమైన కొత్తకణాలు తయారవుతాయి. ఈ కొత్తకణాలు కొత్త అందాన్నిస్తాయి. అందుకనే ఎదైనా ఒక మంచి పని చేయాలన్న, నేర్చుకోవాలన్న అదమరచి నిద్ర పోవాలి. నిద్రసమయంలో మెదడుసహ మనలోని ప్రధాన వ్యవస్థలు విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని రకాల హర్మొన్లు విడుదలవుతాయి. ఈ హర్మొన్లు మన శరీరానికి, మనస్సుకి, చర్మానికి ఎంతగానో ఉపయొగపడుతాయి. 
o   తగినంత నిద్ర లేకపోవడం నిద్రలేమికి కారణమవుతుంది. నిద్రలేమి మిమ్మలని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తుంది. అందుకని ప్రతిరోజు కనీసం ఎడుగంటలు నిద్ర తప్పనిసరి. కొందరు పగలు ఓ మూడు గంటలు, రాత్రిల్లు ఓ నాలుగు గంటలు నిద్రపోతూ తగినంతగా నిద్ర పోయినట్లుగా భావిస్తారు, కానీ నిద్ర అనేది కంటిన్యూగా వుండాలి అపుడే మెదడుకి తగిన విశ్రాంతి లభిస్తుంది. ఇది జీవనగడియారం సక్రమంగా నడవడానికి అత్యవసరం. పరీక్షల సమయంలో ఇది గతి తప్పుతుంది, అయితే పరీక్షల అనంతరంకూడా సరిఅయిన నిద్రపోవకపోతే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. వారంలో మూడు రోజులుమించి సరిఅయిన నిద్రలేకపోవడం, నిద్రనుంచి తరచుగా మధ్యలో లేవడం తరువాయి సరిగా నిద్రపోకపోవడం కూడా నిద్రలేమిగానే భావించాలి!! ప్రతిరోజు చక్కటి నిద్రకి, మానసికవిశ్రాంతికి యోగనిద్రని సాధన చేయాలి.
o    యోగనిద్ర మీలో సానుకూల బావోద్వేగాలకు ప్రేరణ అవుతుంది.  మానసిక ఉద్విగ్నత, ఓటమి, కల్లోలాల భావనలని అధిగమించే సమ్యక్ సిద్దిని సాధించే మార్గాన్ని అవగతం చేస్తుంది. డిన్నర్ ముగించిన రెండున్నర గంటల అనంతరమే యోగనిద్ర సాధన చేయాలి. ఆలస్యంగా డిన్నర్ చేసే అలవాటుకి స్వస్తి చెప్పి, రాత్రి భోజనం 7.30కి లోపుగా ముగించేట్లుగా అలవాటుచేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/blog-post_19.html
o   ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉండాలి. ప్రతి విఫలప్రయత్నం విజయఫధానికి దగ్గరికి చేరుస్తుంది అనే నమ్మకంతోనే పయనం సాగించాలి. ప్రయత్నలోపం లేనంతవరకి విజయావకాశాలకి ద్వారాలు తెరిచి ఉంటాయి. మొదలుపెట్టిన ప్రయత్నం మధ్యలో విరమిస్తే అపజయమే నీకు కానుక! అందుకని నమ్మకంతో ప్రారంభించే ఏ పని అయిన ప్రతికూల భావనలతో మొదలెట్టకండి. ఆ భావనల పరంపరలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడడం జరుగుతుంది. తడబాటు నిర్ణయాలు పోటిలో నిన్ను వెనుకవరుస లోనికి నెట్టివేస్తాయి. నీలో పిరికితనాన్ని పెంచుతుంది.
o   పనిలోని సాధారణ ఒత్తిడి మీలోని ప్రతిభకి మెరుగు పెడుతుంది, అదే అపరిమితమైతే మానశిక ఒత్తిడిగా మీలోని ధారుడ్యాన్ని బలహీన పరుస్తుంది, బ్లడ్ లో గ్లూకోజు లెవెల్సుని తగ్గిస్తుంది. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. శరీరంలో గ్లూకోజ్ త్వరగా ఖర్చు అవుతుంది. మానసిక ఒత్తిడి, టెన్షన్లను దూరంచేస్తూ మానసికానందం, శాంతి, ఆహ్లాదాల అనుభూతులకి తరగని నిధిగా మెడిటేషన్ని ప్రతిరోజు సాధన చేయండి. మెడిటేషన్ శరీరంలోని కొన్నిరకాల టాక్సిన్లని మెరుగైన శ్వాసక్రియ ప్రక్రియ ద్వార సమర్థవంతంగా తొలగిస్తుంది. మస్తిష్కంలో ఆలోచనాపరిధి విస్తృతమౌతుంది, నూతనభావాలతో ప్రేరణ పొందుతుంది, మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_18.html
o   నేనే తెలివైనవాడిని, యుక్తిపరున్ని అనే అహంభావం నుంచి దూరంగా ఉండాలి, లేకుంటే అదే ఓ పెద్ద బలహీనతగా మారే ప్రమాదం ఉంది! మేధోవంతులతో సాన్నిహితాన్ని పెంపొదించుకోవాలి. అది మీలోని ప్రతిభకి మెరుగులు దిద్దుతుంది. వ్యక్తిత్వవికాసానికి మిత్రుల నుంచి వచ్చే సలహలని, సూచనలని తప్పక స్వీకరించాలి, మీలోని బలహీనతలని సరిదిద్దుకోవడానికి ఇది ఒక వేదిక అవుతుంది.
o   నిన్ను నీవుగా నమ్మక, విశ్వసించక అపనమ్మకంతో ఆరంభించే ఏ కార్యానికి అయిన కార్యసిద్ది లభించదు, ఎందుకంటే మనస్థైర్యం నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉండకపోవడమే! స్వశక్తి పై నమ్మకం లేకుంటే సోమరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీలోని ప్రతిభ, సామర్థ్యాలను పెంపొందించుకోవాలి, వాటిపై నమ్మకాన్ని పెంచుకోవాలి!! నిరంతరసాధనే ఈ పోటి ప్రపంచంలో నీవు చేసే ప్రతిపని అంతర్గత శక్తుల ప్రేరణతో విజయపధం వైపుకి నడిపిస్తుంది.

o   అతిజాగరుత, సందిగ్థత, సంశయం, అనుమానం, అభద్రతలు మీ సామర్ధ్యానికి జారుడుమెట్లు! ఇవి నిన్ను అసమర్ధుడి జీవనపయనం దిశలో నడిపిస్తాయి! ఈ జారుడుమెట్లని సమర్థవంతంగా అధిగమించాలి, అపుడే విజయపథం వైపు దూసుకవెల్లడానికి మార్గం సుగమం అవుతుంది!!