ఆలోచించండి…!!!
మనందరం ఆలోచనలు చేస్తూనే ఉంటాము మరి ఈ ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అన్న విషయం ఎపుడైనా ఆలోచించారా? ఆ ఆలోచనలు నిజానికి మీ మదిలో జనించినవేనా?
ప్రతిరోజూ ఈ ఆలోచనలు సుమారు అరవైవేలదాక మస్తిష్కంలో ఓ స్రవంతిలా నిరంతరం జనిస్తాయి అని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆలోచనల కేంద్రం నిజంగా మనలోనే వుందా!?
ఈ ఆలోచనలు అన్ని మన ప్రమేయంతోనే జరుగుతున్నాయా లేక నిమిత్తమాత్రులుగా మన ప్రమేయం లేకుండానే ఆలోచన స్రవంతి మనలో కొనసాగుతూ ఉంటుందా !?
ఆలోచనలు కేవలం మన ప్రమేయంతోనే జరుగుతాయి అని భావిస్తే వాటిని ఏలా నిర్ధారించగలవు, ఎందుకంటే స్వప్నావస్థలో మన ప్రమేయం లేకుండానే ఆలోచనాతరంగాలు మదిని చుట్టివేస్తువుంటాయి కదా!!
ఈ ఆలోచనలకు మూలాలు ఎక్కడ వున్నాయి?
మనలోని ఆలోచనలు,భావాలు కేవలం మన మనసుకే పరిమితం కాకుండా సార్వత్రిక చైతన్య శక్తితో అనుసంధానం కలిగి ఉంటాయి అనేది తత్వవేత్తల అభిప్రాయం. అందుకే వసుదైకకుటుంభభావనతో మనమంతా మానసికంగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కలిగి వుంటాము. ఈ సార్వత్రిక చైతన్యశక్తి ఇంద్రియాతీతం, గుణాతీతం, రూపరహితం, అవ్యయం,అచింత్యం, అప్రమేయంగా విశ్వంలో అణువణువునా వ్యాపించిన దివ్యపదార్థం అది మహిమాన్వితం, శక్తివంతం!! అందుకే మతరహిత ప్రాతిపాదికంగా దేవాలయావ్యవస్థ అనాదిగా సార్వత్రిక చైతన్యశక్తి కేంద్రాలుగా మన సంస్కృతిలో అవిభాజ్యకేంద్రాలుగా వికసించి విరాజిల్లుతున్నాయి!!!
మన మస్తిష్కం ఓ రిసీవర్ గా ఆ సార్వత్రిక చైతన్య శక్తి ⚡️ తో ఏలా అనుసంధానం అవుతుందో అనే ప్రశ్న మేధావులకు నేటికి జవాబు తెలియని సవాలుగా నిలిచివుంది!!! శాస్త్రజ్ఞుల మదిని తొలచివేస్తూనేవుంది. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే పలు సందర్భాలలో పరిశోధనలకు మూలమైన ఒకే తరహా ఆలోచనలు, ఒకరి కంటే ఎక్కువ మందికి సుదూర దేశాలలోని శాస్త్రవేత్తలలో కలిగాయి. అవీ ఏలా జనించాయి!!? అలాంటి పరిశోధనలలో టెలిఫోన్ ☎️ విమానం 🛫 వంటి నూతన ఆవిష్కరణాభావనలు వివిధ మేధావుల్లో సమాంతర సమయాల్లో ఏలా కలిగాయి!!
నేడు అధికుల్లో ప్రజ్ఞ, మేధస్సు, తెలివితేటలు అన్నీ నావే!
ఈ సిరి సంపదలు అన్ని నా స్వయంకృషినే!
భోగాలలో సుఖించడమే ఈ జీవిత పరమార్థం!
ఈ జీవితం ఐహిక సుఖాలను పొందడానికే, అనుభవించడానికే… !
అలాగే ఈ ఆలోచనలు, తెలివితేటలు అన్ని నాకే సొంతం.. !
వీటన్నింటికి కర్త , కర్మ, క్రియలకు బాధ్యుడను నేనే అనే భ్రమలో అహంభావం తమ పేటెంట్ హక్కు గా జీవించేస్తువుంటారు..
ఆలోచలు అన్ని నీవే అయితే పలుమార్లు సమస్యలలో సతమవుతూ, పరిష్కారదిశలో ఆలోచనలు రాని సందర్భాలను ఎన్నెన్నో గుర్తుకుతెచ్చుకోండి, ఎన్నిసార్లు ఆ విధాతను పరిష్కారాలకోసం వేడుకున్నావో గుర్తుకుతెచ్చుకో…తత్వం నీ కే బోధపడుతుంది.
- కోపం వద్దు అనే ఆలోచన నీదే ఐతే, మరి కోపం అనేది నీకు ఎందుకు వస్తుంది? ఎక్కడ నుంచి వస్తుంది?
- మోసం, స్వార్ధం అనేవి మనల్ని అధోగతిపాలు చేస్తాయి అనే ఆలోచన నీదే ఐతే, మరి మనల్ని ఎవరో ప్రీరేపిస్తున్నట్లుగా, ముందుకు నడిపిస్తున్నట్లుగా ఎందుకు స్వార్థంతో, మోసంతో కూడిన పాపకర్మలను మూటలు కట్టినట్లుగా అదేపనిగా చేస్తున్నాం?
- దీనులకు, ఆర్తులకు సహాయం చేయడం పుణ్యము అనే ఆలోచన నీదే ఐతే మరి అవసర సమయాల్లో ఆ భావన మదిలో మెలిసిన ఎందుకు ఉపేక్షిస్తున్నాం?
- చదువుల్లో మంచి ర్యాంక్ సాధించాలి అనే ఆలోచన నీదే ఐతే, మరి చదవకుండానే కాఫీయింగ్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నావు?
- ప్రజాసేవనే పరమావధిగా భావించిన రాజకీయ నాయకులు కేవలం స్వసేవ, స్వజనసేవలకే ఎందుకు పరిమితం అవుతున్నారు?
- ఆరోగ్యపరిరక్షణే తన వృత్తి పరమధర్మంగా భావించే వైద్యుడు కేవలం సంపాదనే తన పరమ లక్ష్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?
- లాయరుగా న్యాయవృత్తిని స్వీకరించి కేవలం అన్యాయానికి కొమ్ముఎందుకు కాస్తున్నాడు ?
- చదువులు నేర్పించే అధ్యాపక వృత్తి స్వీకరించి విద్యార్థిలో అనైతికమైన కాఫీయింగ్ ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు ?
తెలివి తేటలు, అందం, అభినయం,టాలెంట్ లాంటివి మనందరికి భగవత్ ప్రసాదితాలు అందుకు ఆ భగవంతునికి వినయ విధేయతలతో కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూ,వాటిని నీ స్వయంకృషితో మెరుగు పరచుకోవాలి. ఐతే అహంకారం, అహంభావనలతో ఇదంతా నాదే అనే మూర్తీభవించిన గర్వం, స్వార్థం, పొగరును ప్రదర్శిస్తుంటాం!!!
ఆలోచనలే మన ప్రవర్తనలను ప్రభావితం చేస్తాయి…ఆ ఆలోచనలే నమ్మకాలకు, మూఢ నమ్మకాలకు నాంది అవుతాయి…అవి మన వ్యక్తిగత ప్రవర్తనలకు దశ దిశలను కూడా నిర్ణయిస్తాయి. భవిష్యత్తును నిర్ణయిస్తూ ముందుకు నడిపిస్తాయి..
కొన్ని నమ్మకాలు మనలో భయం, పిరికితనం,అత్యాశ, కోపం, బాధ, అసూయ, ఉద్వేగాలకు కారణమవుతున్నాయి.
ఇంకొన్ని నమ్మకాలు మనలో స్వార్థం,కుటిలత్వం, కుతంత్రం,రాగ ద్వేషాలకు, అహంభావం, అహంకారలకు ఆధారమవుతాయి.
అయితే అవే నమ్మకాలు ప్రజ్ఞ,మేధస్సు, విజ్ఞత, వివేకత,విచక్షణలకు కూడా వేదికలవుతాయి.
ఆ నమ్మకాలే ధీరత్వం, ధైర్యం,ఉత్సాహం, సంతోషం, ఆనందాలకు మూలం అయిన మనోధైర్యంలను సొంతం చేస్తుంది.
ఆ నమ్మకాలే మనలో దయ, కరుణ, జాలి, ప్రేమ, భక్తి, వినయము, విధేయతలతో మనసును వికసింపచేస్తాయి. మనస్సును శాంతిభరితం చేస్తాయి.
నేటి యువత ఆలోచనలలో కాలుష్యం పెరిగిపోతువుంది. ప్రతిది తమకనుకూలంగా ఉండాలి అనే ఆలోచన ధోరణి పెరిగిపోతుండడం, తమకు ప్రతికూలంగా జరిగితే విపరీత అసహనంకి లోనవుతూ వివేకవిచక్షణా రహితంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం.
ఐతే ప్రతికూలతలను సవాళ్లుగా స్వీకరించగలిగితే అవి మీలో నూతన ఒరవడికి శ్రీకారం అవుతాయి. వజ్రాన్ని సానపడితే అది ప్రకాశిస్తుంది, అదేవిధంగా కష్టాలు కూడా మంచివే అవి మీలోని ప్రతిభను వెలికి తీస్తాయి, వాటిని సానపడుతాయి…అవే విజయ కేతనాలుగా ఉజ్వల భవిష్యత్తుకు గీటురాళ్లు అవుతాయి!!
ఆలోచనకాలుష్యము ప్రవర్తనకాలుష్యానికి దారితీస్తుంది. సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా యువత ఆలోచనలను, ప్రవర్తనలను తీవ్రస్థాయిలో ప్రలోభపరుస్తు లోతుతెలియిని ఈ కాలుష్య ఊబిలోనికి నెట్టివేస్తున్నాయి!!!
అంతా నా ఇష్టం… అనే ధోరణితో నేడు యువత మాదకద్రవ్యాలకు, మత్తుపదార్థాలకు బానిసలవుతూ తమ ఉజ్వలభవిష్యత్తుకు తామే సంకెళ్లు వేసుకుంటున్నారు.
మానవత, మానవీయతలకు తిలోదకాలు సమర్పిస్తున్నారు. ఈ ఆలోచన, ప్రవర్తన,నడవడికల కాలుష్యాలను యువత తప్పక అధిగమించి తీరాల్సిందే… ఆలోచనానియంత్రణలే ఇందుకు స్ఫూర్తివంతం, స్ఫూర్తిదాయకం అవుతాయి అందుకే అవి యువతకు మార్గదర్శకం కావాలి!మెడిటేషన్ 🧘♂️ ప్రతిభావంతంగా ఆలోచన, ప్రవర్తనల నియంత్రణతో మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, పెంపొందించేందుకు చక్కటి వేదిక అవుతుంది!!!
సర్వేజనా సుఖినోభవంతు
మీ
ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
నారాయణ శెట్టి రాచపూడి
వ్యవస్థాపకులు
రానా యోగ ఆలయ
9900022729
🧘♀️ 🧘♀️ 🧘♀️ 🧘♀️ 🧘♀️ 🧘♀️ 🧘♀️
No comments:
Post a Comment