Thursday, 30 April 2015

18. విజయశైలి - మీ సామర్ధ్యాన్ని ఇలా పెంపొదించుకోండి...





నేనే చేయగలను అనే అతివిశ్వాసాన్ని, నేనేమి చేయలేను అనే అల్పవిశ్వాసాలకి దూరంగా వుండాలి, ఎందుకంటే అతివిశ్వాసం తరచుగా వివక్షన, విచక్షనలు లోపించి పెరుగుదలకి ప్రతిభందకాలు అయితే, అల్పవిశ్వాసం ఆ పనిలో అసలు ముందడుగుని వేయించాడానికే ప్రతిభంధకం అవుతుంది. అందుకని నేను చేయగలను అనే అనే సానుకూల భావోద్వేగ ధోరణిని అలవర్చుకొనే ధృక్ఫదాన్ని పెంపొందించుకోవాలి, అది ఆత్మవిశ్వాసానికి ఆలంబన అవుతుంది. సాదించబోయే విజయాలకి విజయపధం అవుతుంది.
 సానుకూల ధృక్పాధాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
o   అందానికి, ఆరోగ్యానికి నిద్రకి ప్రత్యక్ష సంబంధం వుంది. తగినంత నిద్రలేకపోతే దాని ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడంవల్ల మెమొరి పవర్ పెరుగుతుంది. సుఖనిద్రవల్ల మెదడు పునర్వ్యవస్తీకరణ జరిగి సృజనాత్మకత పెరుగుతుంది. నిద్రలో అనేక శరీర కణాలకు రెపేర్లు జరుగుతాయి. జీవవ్యవస్థ మెరుగౌతుంది. నాణ్యమైన కొత్తకణాలు తయారవుతాయి. ఈ కొత్తకణాలు కొత్త అందాన్నిస్తాయి. అందుకనే ఎదైనా ఒక మంచి పని చేయాలన్న, నేర్చుకోవాలన్న అదమరచి నిద్ర పోవాలి. నిద్రసమయంలో మెదడుసహ మనలోని ప్రధాన వ్యవస్థలు విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని రకాల హర్మొన్లు విడుదలవుతాయి. ఈ హర్మొన్లు మన శరీరానికి, మనస్సుకి, చర్మానికి ఎంతగానో ఉపయొగపడుతాయి. 
o   తగినంత నిద్ర లేకపోవడం నిద్రలేమికి కారణమవుతుంది. నిద్రలేమి మిమ్మలని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తుంది. అందుకని ప్రతిరోజు కనీసం ఎడుగంటలు నిద్ర తప్పనిసరి. కొందరు పగలు ఓ మూడు గంటలు, రాత్రిల్లు ఓ నాలుగు గంటలు నిద్రపోతూ తగినంతగా నిద్ర పోయినట్లుగా భావిస్తారు, కానీ నిద్ర అనేది కంటిన్యూగా వుండాలి అపుడే మెదడుకి తగిన విశ్రాంతి లభిస్తుంది. ఇది జీవనగడియారం సక్రమంగా నడవడానికి అత్యవసరం. పరీక్షల సమయంలో ఇది గతి తప్పుతుంది, అయితే పరీక్షల అనంతరంకూడా సరిఅయిన నిద్రపోవకపోతే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. వారంలో మూడు రోజులుమించి సరిఅయిన నిద్రలేకపోవడం, నిద్రనుంచి తరచుగా మధ్యలో లేవడం తరువాయి సరిగా నిద్రపోకపోవడం కూడా నిద్రలేమిగానే భావించాలి!! ప్రతిరోజు చక్కటి నిద్రకి, మానసికవిశ్రాంతికి యోగనిద్రని సాధన చేయాలి.
o    యోగనిద్ర మీలో సానుకూల బావోద్వేగాలకు ప్రేరణ అవుతుంది.  మానసిక ఉద్విగ్నత, ఓటమి, కల్లోలాల భావనలని అధిగమించే సమ్యక్ సిద్దిని సాధించే మార్గాన్ని అవగతం చేస్తుంది. డిన్నర్ ముగించిన రెండున్నర గంటల అనంతరమే యోగనిద్ర సాధన చేయాలి. ఆలస్యంగా డిన్నర్ చేసే అలవాటుకి స్వస్తి చెప్పి, రాత్రి భోజనం 7.30కి లోపుగా ముగించేట్లుగా అలవాటుచేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/blog-post_19.html
o   ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉండాలి. ప్రతి విఫలప్రయత్నం విజయఫధానికి దగ్గరికి చేరుస్తుంది అనే నమ్మకంతోనే పయనం సాగించాలి. ప్రయత్నలోపం లేనంతవరకి విజయావకాశాలకి ద్వారాలు తెరిచి ఉంటాయి. మొదలుపెట్టిన ప్రయత్నం మధ్యలో విరమిస్తే అపజయమే నీకు కానుక! అందుకని నమ్మకంతో ప్రారంభించే ఏ పని అయిన ప్రతికూల భావనలతో మొదలెట్టకండి. ఆ భావనల పరంపరలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడడం జరుగుతుంది. తడబాటు నిర్ణయాలు పోటిలో నిన్ను వెనుకవరుస లోనికి నెట్టివేస్తాయి. నీలో పిరికితనాన్ని పెంచుతుంది.
o   పనిలోని సాధారణ ఒత్తిడి మీలోని ప్రతిభకి మెరుగు పెడుతుంది, అదే అపరిమితమైతే మానశిక ఒత్తిడిగా మీలోని ధారుడ్యాన్ని బలహీన పరుస్తుంది, బ్లడ్ లో గ్లూకోజు లెవెల్సుని తగ్గిస్తుంది. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. శరీరంలో గ్లూకోజ్ త్వరగా ఖర్చు అవుతుంది. మానసిక ఒత్తిడి, టెన్షన్లను దూరంచేస్తూ మానసికానందం, శాంతి, ఆహ్లాదాల అనుభూతులకి తరగని నిధిగా మెడిటేషన్ని ప్రతిరోజు సాధన చేయండి. మెడిటేషన్ శరీరంలోని కొన్నిరకాల టాక్సిన్లని మెరుగైన శ్వాసక్రియ ప్రక్రియ ద్వార సమర్థవంతంగా తొలగిస్తుంది. మస్తిష్కంలో ఆలోచనాపరిధి విస్తృతమౌతుంది, నూతనభావాలతో ప్రేరణ పొందుతుంది, మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_18.html
o   నేనే తెలివైనవాడిని, యుక్తిపరున్ని అనే అహంభావం నుంచి దూరంగా ఉండాలి, లేకుంటే అదే ఓ పెద్ద బలహీనతగా మారే ప్రమాదం ఉంది! మేధోవంతులతో సాన్నిహితాన్ని పెంపొదించుకోవాలి. అది మీలోని ప్రతిభకి మెరుగులు దిద్దుతుంది. వ్యక్తిత్వవికాసానికి మిత్రుల నుంచి వచ్చే సలహలని, సూచనలని తప్పక స్వీకరించాలి, మీలోని బలహీనతలని సరిదిద్దుకోవడానికి ఇది ఒక వేదిక అవుతుంది.
o   నిన్ను నీవుగా నమ్మక, విశ్వసించక అపనమ్మకంతో ఆరంభించే ఏ కార్యానికి అయిన కార్యసిద్ది లభించదు, ఎందుకంటే మనస్థైర్యం నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉండకపోవడమే! స్వశక్తి పై నమ్మకం లేకుంటే సోమరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీలోని ప్రతిభ, సామర్థ్యాలను పెంపొందించుకోవాలి, వాటిపై నమ్మకాన్ని పెంచుకోవాలి!! నిరంతరసాధనే ఈ పోటి ప్రపంచంలో నీవు చేసే ప్రతిపని అంతర్గత శక్తుల ప్రేరణతో విజయపధం వైపుకి నడిపిస్తుంది.

o   అతిజాగరుత, సందిగ్థత, సంశయం, అనుమానం, అభద్రతలు మీ సామర్ధ్యానికి జారుడుమెట్లు! ఇవి నిన్ను అసమర్ధుడి జీవనపయనం దిశలో నడిపిస్తాయి! ఈ జారుడుమెట్లని సమర్థవంతంగా అధిగమించాలి, అపుడే విజయపథం వైపు దూసుకవెల్లడానికి మార్గం సుగమం అవుతుంది!! 

19. విజయశైలి - ఒత్తిడులను ఇలా వదిలించుకోండి..







నేటి పోటి వాతావరణంలో  ప్రతి రంగంలో తమకి నిర్ణయించిన లక్ష్యాలను సాధించే జీవన గమనంలో  నేడు మనం ఒత్తిడులతోనే సహజీవనం సాగించేస్తున్నాం. ఈ ఒత్తిడులను ఓస్థాయి వరకు ఛాలెంజీగా తీసుకోవడంద్వారా అది మీలోని మేధస్సు, ప్రతిభ, ప్రజ్ఙ్లలకి గీటురాయి  అవుతుంది.  అయితే  ఈ లక్ష్యాలు మీ సమర్థతకి మించిన స్థాయిలో వుంటే  అది తీవ్ర ఒత్తిడి, ఆంధోళణ ,అలజడులకు కారణం అవుతుంది.  ఈ స్ట్రెస్సుని తరచుగా  ఎక్కువకాలం కొనసాగితే అది  మెదడులోని రసాయనాల  సమ్మేళణాలలో అసమతుల్యతలకి కారణం అవుతుంది. అది భావోద్వేగాలలో తరచు మార్పులకి గురిచేస్తుంది. అది మిమ్మలని తీవ్రనిరాశ, నిసృహలకి గురి చేస్తుంది. మీ మానశిక స్థైర్యాన్ని అందోళణలకి గురిచేస్తుంది. ఇక మీలోని సామర్ధ్యాన్ని తిరోగమ దిశలో నడిపించేస్తుంది. అసహనం, విసుగు, కోపాలని తీసుక వస్తుంది. కొర్టిసోల్ లాంటి స్ట్రెస్ హర్మొనుల ప్రాభల్యాన్ని పెంచేస్తుంది.  ఈ దశ నుంచి వీలైనంత త్వరగా బయటకి రాగలగాలి. దానిని సమర్థవంతంగా మీ చేతల్లోకి తీసుకోవాలి.  మనలో వుండే ఒత్తిడులను, స్ట్రెస్ హర్మొనుల ప్రాబల్యాన్ని మీరు ఇలా ప్రయత్నిస్తే దూరంగా వుంచగలరు.


o   చేరలేని లక్ష్యాలకి  ఎటువంటి అపోహలు లేకుండా, ఆత్మవిశ్వాసంతో 'నో' చెప్పగలగాలి  వాటిని సహేతుకమైన కారణాలతో సున్నితంగా తిరస్కరించాలి.   అపుడు లక్ష్యాలని రివిజన్ చేయడానికి అవకాశాలు మెండుగా వుంటాయి.


o   సహోద్యోగులతో, మిత్రులతో సరదాగా వుండండి. చిరునవ్వులతో పలకరించండి. ఈ  చిరునవ్వులు  మీ మనస్సులో హ్యపి కెమికల్సుని ప్రేరేపిస్తాయి అవి స్ట్రెస్ హార్మొనులనులపై పట్టు సాధిచదానికి సహయపడుతాయి మిమ్మల్ని సంతోషానికి దగ్గరచేస్తూంది, సంతోషంగాను వుంచుతుంది. చిరునవ్వు ఓ అందమైన ఆభరణం. దానితోనే నేస్తం సాగించండి. కొర్టిసోల్ హర్మోనుని సహజరితిలొ అదుపులో ఉంచుకోవడానికి మనస్సుని సంతోషానుభూతులతో వుండనివ్వాలి.  ఈ సహజినవజీవనశైలి ని ఇలానే కొనసాగనివ్వాలి.

o   డైలీ మీ మదిలోని భావనలని ఓ జర్నలులో రికార్డు చేయండి. దీనిని తరచుగా తిరగేయండి. ఇది మీ భావాతరంగాల సరళికి నావిగేటర్  అవుతుంది.

o   చేసే పని మీలో ఒత్తిడిని పెంచుతుంటే ఆ పని నుంచి తాత్కాలికంగా  బ్రేక్ తీసుకోండి, మీ ఫ్యామిలితో కలిసి సరదాగా ఓ విహరయాత్రని ప్లాను చేసుకోండి. అది మీలో చక్కటి మార్పుని , జీవనమాధుర్యాన్ని తీసుక వస్తూంది.

o   సంసారిక జీవితాంలో శృంగారానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఏండార్ఫిన్ల  విడుదలని ప్రోత్సహిస్తూ అలసిన మనువు, తనువులను సేదదీరిస్తూ మీ జీవితాన్ని రసమయం చేస్తుంది. వారంలో కనీసం ఒకటి, రెండుమార్లు ఈ సంసారికమధురిమలని మీ లైఫ్ పార్ట్నరుతో అస్వాదించండి

o   మీ వర్కు స్టేషన్ని ఓ చిన్న మొక్కతో అలంకరించండి. తరచుగా వర్కు స్టేషన్ విండో నుంచి పకృతిని ఆస్వాదించండి. అది అలసటలని దూరం చేస్తుంది.

o   డల్ గా వున్నప్పుడు ఓ డార్కు చాక్లేట్ తీసుకోండి. అందులోని చక్కెరలు, ఫ్లేవరాయిడ్సు శరిరంలో ఏండార్ఫిను లెవల్సుని ప్రేరింపించి మీ మనస్సుని డల్నెస్ భావనలకి దూరం చేస్తాయి.

o   వారంలొ నాలుగు నుంచి ఐదు గంటల సమయాన్నిఆట పాటలకి ,శారీరక క్రీడలైన వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, జిం, ఎరోబిక్సు లకు కేటాయించాలి. అది బ్రెయిన్ లో ఏండార్ఫిన్ల విడుదలకు సహయకారి అవుతూ కొర్టిసోల్ హర్మోనుని సహజరీతిలో సమర్థవంతంగా నియంత్రించడానికి సహయకారి అవుతుంది.

o   విటమిన్ ‘డి’ లోపం మానశిక ఒత్తిడికి కారణం అవుతుంది అని పలు అధ్యాయనాలు తెలియజేస్తున్నాయి. ఇది సహజంగా సూర్యరశ్మి ద్వార మనకి లభిస్తుంది. అయితే ఎక్కువగా ఏ.సి గదులలో పనిచేసే ఐ.టి ఉద్యోగస్తులలో ఈ విటమిన్ లోపం తరచుగా గుర్తించడం జరుగుతోంది. ఈ లోప నివారణ చర్యగా రోజు ఓ గంట ఆరుబయట నీరెండలో గడపడంద్వారా శరీరానికి తగినంతా సూర్యరశ్మిని అందచేయాలి.


o   మీ చిన్నారులని మీతో దగ్గరగా వుండే అందమైన పార్కులకి రెగ్యులర్గా తీసుకవెళ్లండి. సూర్యోదయాన్ని/ సూర్యాస్తమయాన్ని అది తీసుకవచ్చే అరుణొదయ కాంతుల సొగసులను మనసారా అస్వాదించండి. పకృతిలో మమేకం అవండి.

o   రోజు ఓ అరగంట ముందుగా నిద్రలేవండి, దీర్ఘ శ్వాసక్రియని సాధన చేయండి. ఈ సాధన రోజులొ కనీసం 30 నిముషాలు అభ్యసించడంవల్ల మీ జీవక్రియ, జీవనక్రియలలో జరిగే మార్పులను ప్రస్పుటంగా కేవలం 6 నుంచి 8  వారాలలో గమనిస్తారు.  మానశిక ఆందోళణల క్రమబద్దీకరణ, మెరుగైణ రక్త ప్రసరణల ద్వారా బి.పి. సాధారణ స్థాయికి చేరడాన్నికూడా గుర్తించగలరు.   కొర్టిసోల్ హర్మోనుని సహజరితిలో అదుపులో ఉంచుతుంది. మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/07.html

o   తనువు, మనువుల పరిరక్షణలో మెడిటేషన్ సాధన నమ్మకమైన ఫలితాలను మీ సొంతం చేస్తుంది. ఇది మానశిక ప్రాశాంతతని సాధించడానికి మరియు మానశిక ఆందోళణలను నియంత్రించడానికి ఓ చక్కటి వేదిక అవుతుంది. రోజు 30 నిముసాల సాధన ద్వార కేవలం 8 వారాలలో మెదడులోని న్యూరాన్ వ్యవస్థ సంఘటితం అవుతుంది. స్ట్రెస్ హర్మోనులపై పట్టు సాధించగలరు.  మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_18.html

o   నారింజ, బత్తాయి, లెమన్ లాంటి సిట్రస్ జాతి ఫలాలు విటమిన్’ సి’ కి తరగని నిధులు. ఇది రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. వీటిని రోజువారి ఆరోగ్యకర ఆహరాలుగా మీ మెనులో చేర్చుకోవాలి. అందులోని యాంటి యాక్సిడెంట్లు , ఫ్లేవరాయిడ్సు మీలో అహ్లోదకర అనుభుతులకి దగ్గర చేస్తాయి,  మెటబాలిజాన్ని మెరుగుపరుస్తూ మిమ్మలని ఆరొగ్యవంతంగా ఉంచుతూ సత్వరశక్తిని యిస్తాయి.

o   పండ్లలో ఫైబర్, పొటాషీయం, విటమిన్లు, మైక్రో నూట్రీషీయంట్లు, ఎంజైంలు, యాంటియాంక్సిడెంట్సు పుష్కలంగా వుంటాయి. ఉపాహారంగా వారంలో మూడుమార్లు ఆయా సీజన్లలో దొరికే పండ్లని తీసుకోవాలి. ప్రతిరోజు విధిగా ఆయా సీజన్లలో దొరికే రెండు రకాల పండ్లు తినాలి అనే నియమాన్ని తప్పక పాటించండి.

o   ఫిష్, డ్రైనట్సు ఒమెగా 3 ప్యాటీ యాసిడ్సు, విటమిన్ E ల సంవృద్దితో మస్తిష్కంకి ఎంతో ప్రయోజనకారి. వీటిని రెగ్యులరుగా తీసుకోవడం ద్వారా డోపోమైన్ హార్మొనులస్థాయి నిలకడగా వుండడానికి తోడ్పాటు అవుతుంది. అది మీలో సంతోషకర భావనలకి ప్రేరణ అవుతుంది, మానిశిక ఆందోళనలని దూరంగా ఉంచుతుంది.

o   సెరోటొనిన్ హార్మొనులు మానశిక ఆందోళణలను, అతృతలని, స్ట్రెస్ భావనలని దూరంగా వుంచుతుంది.  ఇందుకు క్రమశిక్షణ కలిగిన సహజ జీవన శైలి, ఆహర అలవాట్లు, సంసారిక జీవనం , తగినంత శారిరక శ్రమ, విశ్రాంతి ప్రధాన భూమికలని పోషిస్తాయి.

Thursday, 5 March 2015

17. ఆహారపధం VII వేడీ వేడీగా ఇడ్లీ సాంబార్!!


మనందరం బాగా ఇష్టపడే రెసిపి సాంబారు. దీనిని తయారుచేసుకోవడం తేలిక. ఓంటరిగా ఉంటే ఏ ఉడిపి హోటల్ నుంచి కూడా దీనిని కొనుక్కోవచ్చు. ఇందులో పప్పుగింజలని విరివిగా వాడుతారు కాబట్టి అవసరమైన ప్రోటీన్సు, ఫైబర్లు లభ్యమౌతాయి. అయితే పోషకసంవృద్దికోసం ఇందులో పచ్చి బఠాణిలు, అలసందలు, బీన్సు, పొటాటో, క్యారెట్, బ్రోకోలి, ఆనియన్, గార్లిక్ క్లోవ్సు, సీజన్లో దొరికే టమోట, గుమ్మడి, బెండ, వంకాయ, సొరకాయలను కూడా వాడుకోవచ్చు.  ఇవి రెసిపిలో 70 శాతంగా ఉండాలి. ఇవే గాకుండా మీకు ఇష్టమైన ఫ్రేష్ వెజిటబుల్సుని వేటినైన వాడండి. మునగకాడలు లభ్యమైతే విధిగా విరివిగా వాడుకోండి. ఇందులోని కాల్షియం బోన్ వ్యవష్థకి బలాన్ని తీసుకువస్తుంది. ఎండు కారాన్ని వాడరాదు అయితే పచ్చిమిర్చిని లేదా పెప్పర్ని వాడుకోండి.         ఈ రెసిపి జీర్ణవ్యవస్థని ఆరోగ్యవంతంగా, జీర్ణక్రియని సమర్థవంతంగా ఉంచుతుంది. ఆసక్తి ఉంటే బజారులో దొరికె మంచి దినుసులతో తయారైన సాంబారుపొడిని కూడా వాడుకోవచ్చు. రుచికోసం తీపిమీద ఆసక్తి ఉంటే కొద్దిగా బెల్లం వాడుకోండి. సాధారణంగా తీపిని వాడనవసరం లేదు. తాలింపుల్లో వెన్నని వాడుకోండి.  సర్వుచేసే ముందు కొత్తిమీరతో గార్నిషింగ్ చేయండి.
 
వేడీ, వేడీ ఇడ్లీలతో సాంబారు కాంబినేషన్ని ఇష్టపడని సౌత్ ఇండియన్ బహుశా ఉండకపోవచ్చు. మీ బామ్మ కొద్దిగా పొట్టుతీయని మినపప్పుతో ఇడ్లీని తయారుచేయడం మీకు గుర్తు ఉండేఉంటుంది, ఆ పరంపరలోనె వీటీని తయారుచేసుకోండి. ఇడ్లీలు ఆవిరిమీద తయారావుతాయి కాబట్టి ఎక్కువ పోషకాలు వంటలో నష్టపోవు. వీటీని నెయ్యి, కారపుపోడులతో తీసుకొనేఅలవాటుని ఆరోగ్యరీత్యా ఆపివేయాలి. ఆసక్తి ఉంటే పుదీన లేదా అల్లంచట్నీలని వాడుకోవచ్చు.


సాంబారురైసుకూడా ఇంకో మన ఫేవరేట్ డిష్ అయితే దినిని వేడివేడిగానే తీసుకోవాలి. పాలీషుచేయని ముడిబియ్యంతో దీనిని తీసుకోవడం ఆరోగ్యరీత్యా మంచిది. షుగర్ వ్యాదిగ్రస్తులు దీనిని తప్పకపాటించాలి. వీరి రెసిపిలో గుమ్మడి, స్వీట్ పొటాటోలని తక్కువుగా వాడాలి.

 సాంబారు రెసిపిలో వాడే చింతపండుపులుసు మంచి ఔషధకారిణి, మరియు విరోచనకారి. ప్రేవువ్యవస్థని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, థయామిన్, మాగ్నిషీయం, పోటాషీయంలు సంవృద్దిగా లభ్యం, అది మిమ్మలని ఆరోగ్యభరితంగా ఉంచుతుంది. కాని ఈ రెసిపిని రోజుతీసుకొనే అలవాటు కొన్ని ఇండ్లలో ఉంది, అలా చేయడం జీర్ణవ్యవస్థ అందులోని ఔషదగుణాల నుండి రెసిస్టెన్సిని పొందుతుంది, అది వాంచణీయం కాదు.  అందుకని రోజులో ఒకసారి వారంలో రెండు నుంచి మూడు సార్లు మించి  తీసుకోకండి. మజ్జిగపులుసుని కూడా ప్రత్యమ్నయంగా ట్రై చేయండి. దానిరుచి మిమ్మలని మళ్లీ మళ్లీ తీసుకొనే కోరికని కలుగచేస్తుంది.

Sunday, 22 February 2015

16. ఆహారపథం VI ఆరోగ్యాన్ని పెంపొందించే డ్రైనట్సు…


 



డ్రైనట్సు కాజు, పిస్త, బాదం, వాలునట్సు, పల్లీలు ఆరోగ్యకరమైన ఆహరాలు అయితే అందులోవుండే అధికకెలోరీలు, కొవ్వు బరువునిపెంచే అనారోగ్యకర ఆహరాలుగా  చాలమందిలో  అపోహ వుంది.  వాస్తవానికి డ్రైనట్సు అపార పోషకనిధుల సంతులితఆహరాలు. వీటిని పరిమితమొతాదులో వాడకంద్వార హానికరంకాని మంచికొవ్వు, ప్రొటిన్లు, ఫైబర్లు, మినరల్సు, విటమిన్లు, యాంటియాక్సిడెంట్లు, సహజసిద్దమైన స్టిరాయిడ్సు లభిస్తాయి అవి ఆరోగ్యపరిరక్షణకి చాలాఅవసరం. వీటిని వుడకించకుండా తీసుకోవడం శ్రేయస్కరం అయితే నానబెట్టిన నట్సులో ఫొషకవిలువలు రెట్టింపు అవుతాయి అందుకని అలా తీసుకోవడం మరింత శ్రేయస్కరం. టేస్టుకోసం ఉప్పు, కారంలని కలపకండి లేక ఆయిల్సులో ప్రై చేయకండి, అసక్తి ఉంటే పెప్పెరుపౌడరుని వాడుకోండి. వీటిని సహజరీతీలో తీసుకోండి. ఇవి చాలారకాల కాన్సర్లను, హృదయసంభందిత వ్యాధులను, గాల్ స్టోన్సు, ఉదరకోశ వ్యాధులను, నిరోధించడానికి, గ్లూకోజు లెవల్సుని, మెరుగైన మేటబాలిజాలకి చేయూత అవుతుంది.
డ్రైనట్సు తీసుకోవడం ద్వార మనకు లభించే ఆరోగ్యప్రయోజనాలు:

o   డ్రైనట్సు తీసుకోవడంద్వారా సమతుల్యమైన బరువుని సాధించుకోవచ్చు. అందుకే డైటులో ఓ భాగంగా రోజు ఐదు నుంచి ఆరు నట్సుని మించకుండా తీసుకోవచ్చు.

o   డ్రైనట్సులోని యాంటియాక్సిడెంట్లు కణనిర్మాణంలో కీలకపాత్రని పోషిస్తూ, కణహీనతలనుంచి రక్షణని తెస్తాయి, అది కాన్సర్ల నుంచి దూరంగా ఉంచడానికి సహయపడుతాయి.

o   వీటిలోని E విటమిన్ కంటిచూపుని పరిరక్షిస్తాయి. మరియు ధమనులు గట్టిపడనీయకుండ మృదువుగా ఉండడానికి తోడ్పడుతాయి.

o   వీటిద్వార లభించే కొవ్వు కొలొస్ట్రాలు లెవెల్సుని పెరగనీయవు, అందులోని ఫైబర్లు ఆకలి భావనలను దూరం చేస్తాయి.

o   ఇవి సూక్ష్మధాతువులు అయిన మాంగనీసు, పోటాషీయం, మాగ్నీషియం, కాల్షియంలకు అపారనిధులు. అవి ఆరోగ్యపరిరక్షణలో కీలకపాత్రని పోషిస్తాయి.

o   ఇందులోని యాంటియాక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర సూక్ష్మధాతువులు చర్మాన్ని అరోగ్యవంతంగా ఉంచుతూ మృదుత్వాన్ని, లావణ్యాన్ని తీసుకవస్తాయి.

o   ఇందులోని B7 విటమిన్లు ఆరోగ్యవంతమైన శిరోజాలపెరుగుదలకి మరియు సంరక్షణకి ఉపయొగపదుతూ జుట్టురాలడాన్ని తగ్గిస్తాయి.

o   ఇవి ప్రొస్టేటు క్యాన్సరువ్యాప్తిని 30% నుంచి 40% వరకు నియంత్రించడానికి సహయకారి అవుతుంది. 

o   ఇవి స్తనసంపదని ఆకర్షణియంగా ఉంచడానికి, బ్రెస్టు క్యాన్సరువ్యాప్తిని నియంత్రించడానికి సహయపడుతుంది

o   ఇవి మెటబాలిజక్రియని మెరుగుపరుస్తాయి, అందుకే డయాబిటిసుభాదితులు వారానికి ఓ పావుకప్పు వాలునట్సుని తీసుకోవడం వాంచనీయం. 

o   వాలునట్సు ఒమెగా3ఫ్యాట్సు, విటమిన్ E ల సంవృద్దితో మస్తిష్కంకి ఎంతో ప్రయోజనకారి. మానిశిక ఆందోళనలని దూరంగా ఉంచుతుంది.

o   వాలునట్సు రెగ్యులరుగా తీసుకోవడం ద్వార ఆరోగ్యవంతులైన యువకుల్లో వీర్యవృద్దికి దోహదపడుతుంది

o   బాదం, వాలునట్సు వాడకం రక్తపోటుని సాధరణస్తాయిలో ఉంచడానికి సహయ పడుతాయి.

o   పల్లీలు, కాజులలోని కాల్షియం నిధులు బోనువ్యవస్థకి, మరియు గుండెకి ఎంతో మేలుని తీసుక వస్తాయి

o   గర్భిణిగా ఉన్నపుడు బాదం పప్పులు రెగ్యులరుగా తీసుకోవడంద్వారా తల్లికి, శిశువుకి సమీకృత పోషకవిలువలను అందచేస్తాయి. వీటిద్వార లబబించే ప్రోటీన్లు శిశువులో చక్కటి కండర నిర్మాణానికి ఉపయోగపడుతాయి. ఇందులోని ఫైబర్లు తల్లిని మలబద్దకము నుంచి పరిరక్షిస్తాయి. ఇందులోని విటమిన్ A శిశువు జుట్టుపెరుగుదలకి, మృదువైన చర్మనిర్మాణానికి తోడ్పడుతుంది. వీటీలోని కాల్షియం నిధులు తల్లిలో బిపి   స్తాయిలని క్రమబద్దీకరిస్తాయి.ఇందులోని మాంగనీసు సమతుల్య బరవులని సాధించడానికి అవసరం. వీటిలోని మాగ్నీషియం నాడీమండల వ్యవస్థని బలోపేతం చేస్తుంది. ఇందులో విటమిన్లు A, B1, B2, B5, B6, B9, E, మరియుK ఆరోగ్యపరిరక్షణకి ఆలంబన అవుతాయి. ఇవి శిశువుకి ఎటువంటి ఫుడ్ అలర్జీలు దరిదాపుకి చేరనీయవు. తల్లికి నట్సు అలర్జి ఉంటే ముందుగా దాక్టరు సలహాని తీసుకోని వీటి వాడకాన్ని ప్రారంబించాల్సివుంటుంది.

o   పిల్లలో వ్యాధినిరోధకవ్యవస్థని మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లలలో నాడీవ్యవస్థ, బోనువ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థలు బలోపేతం అవుతాయి. వీరికి కాజు, బాదం, వాలునట్సులని, పల్లీలని సమపాళ్లలో తీసుకొని ఓ రాత్రి నీళ్లలో నానబెట్టండి. మరునాడు నీడలో వీటిని ఆరనీయండి, ఆరిన ఈ నట్సుని పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. మీ చిన్నారులకి ఇచ్చే ఆహరంలో ఈ పొడులమిశ్రమాన్ని, ఓట్సులని కలగలిపి 40:60 గా మిక్సుచేసి రోజుఇవ్వాలి. ఇది బలవర్ధకమైన సమతుల్య పొషకాహారం అవుతుంది.
 
o   డ్రైఫ్రూట్సుతో చేసిన లడ్డులను పిల్లలు బాగా ఇష్టపడుతారు. వీటి తయారిలో నూగులు, ఫాక్సుసీడ్సుని కూడా జత చేసుకోండి. వీటిని వారంలో రెండు నుంచి మూడమార్లు ఇవ్వండి. ఈ లడ్డులలో చక్కెరకి ప్రత్యామ్నాయంగా కొద్దిగా బెల్లం, తేనె, ఎండుద్రాక్ష, కర్ర్జురాలని వాడాలి.

o   కర్జురాలు సూక్ష్మపోషకాలు, విటమిన్సు, మినరల్సుకు నిధులు. రోజు మూడూ, నాలుగు కర్జురాలను తీసుకోండి. మీ చిన్నారులకి స్నాక్ ఐటంగా ఇవ్వండి. రాత్రి ఐదారు ఎండు కర్జురాల ముక్కలని మంచినీళ్లలో నానబెట్టండి. ఆ నీటిని చిన్నపిల్లలతొ ఉదయం తాగించండి. వీటి రుచిని ఇష్టపడుతారు.ఇందులోని ఫ్లోరిన్ దంతసంరక్షణకి, ఐరన్ రక్తహీనరహితానికి   తోడ్పాటు అవుతుంది.

o   కర్జురాలలోని పొటాషియం నరాలవ్యవస్థని, ఫైబరు జీర్ణవ్యవస్థని, ప్రొటీన్లు శారీరకవ్యవస్థని ఆరోగ్యంగా వుంచుతాయి. ఇందులో B1, B2, B3, B5, C మరియు A1 విటమిన్లు ఉన్నాయి ఇవి కంటి చూపుని మెరుగుపరుస్తాయి. ఉదరకోశ క్యాన్సరు నుంచి రక్షణ ఇస్తుంది. చెడు కొలొస్ట్రాలుని తగ్గిస్తుంది.  ఇందులోని ‘లో’ కెలోరీలు ఆరోగ్య పరిరక్షణకి మేలు చేస్తాయి.

o   వారంలో మూడుసార్లు డ్రైఫ్రూట్సుని రెగులర్గా తీసుకోవడం ఓ అలవాటుగా చేసుకోండి. ఈ అలవాటు ఆరోగ్యకర జీవితానికి, ధీర్గాయుస్సుకి కారణం అవుతుంది.

o   ప్రతిసారి పది నుంచి పదిహేను గ్రాములు మించకుండా వారానికి రెండుమార్లు రెగ్యులర్ వీటిని తీసుకోవడం ఓ అలవాటుగా చేసుకోవడం ద్వారా పాంక్రియాసుక్యాన్సరు భారి నుంచి రక్షణ పొందవచ్చు.
డ్రైనట్సు, డ్రై ఫ్రూట్సులపై అపోహలు వదలి మీ డైటులో వీటిని ఓ భాగంగా చేర్చుకొనండి, వాటి అపార ఫలితాలను, రుచులను మనసరా అస్వాదించండి.