హలాసనం:
మిమ్మలని
యవ్వనవంతులుగా వుంచే ఆసనం. వెల్లకిలా
శవాసనంలో పడుకోవాలి. దీర్ఘశ్వాసని తీసుకుంటూ పాదములు పైకి తీసుకొనివెళ్లి నిటారుగా
ఉంచాలి, పిరుదుల వరకు పైకి తీసుకువెళ్ళాలి. మోకాళ్లని వంచకుండా నెమ్మదిగా కాలిబొటనవేళ్లు
నేలని తగిలెట్లుగా కటిభాగాన్ని వెనుకకి తీసుకోవాలి.
ఈ
ఆసనసాధనద్వార వెన్నుపూస, భుజాలకు బలం చేకురుతుంది. జీర్ణక్రియ ఉత్తేజితం అవుతుంది.
కాళ్లు, తొడలు, పిక్కలు, కటి వ్యవస్థలు బలోపేతం అవుతాయి. థైరాయిడ్, పైరాథైరాయిడ్ గ్రందులు,
మెడకండరాలు, సమర్థవంతంగా క్రియాభరితం అవుతాయి.
కండరవ్యవస్థ సహజత్వాన్ని పొందుతూ సమర్థవంతం అవుతుంది. మానసికప్రశాంతతని పొందడానికి చక్కటివేదిక అవుతుంది..
సర్వాంగాసనం:
ముందుగా
శవాసనం వేసి దీర్ఘశ్వాసతీసుకుంటూ మెల్లగా
ఒక్కసారిగా కాళ్ళను పైకి తీసుకెళ్ళాలి. చేతులు నడుము భాగమున సహాయంగా ఉంచాలి. ఉండగలిగినంత సేపు ఉండి పూర్వపుస్థితికి
రావలయును.
ఈ
ఆసనసాధన ద్వార థైరాయిద్ గ్రంధి ఉత్తేజితం అవుతుంది. మానసి కస్వస్థకి ఆలంబన అవుతుంది.
నాడీమందల వ్యవస్థ జాగృతం అవుతుంది. మానసికఆందోళనలు, నైరాశ్యాలను, టెన్సన్’లను, భావోద్వేగాలను
దూరంగావుంచడానికి నమ్మకమైన ప్రక్రియ. నిద్రలేమిని నివారించడానికి ఆచరించదగ్గ ఆసనసాధన.
అంతర్గత శక్తులను ప్రభావితం చేస్తుంది. మానసిక వికాసాన్ని పెంపొందిస్తుంది. మెటభాలిజాన్ని
మెరుగుపరుస్తూ జఠరాగ్నిని ప్రేరేపిస్తూ శరీరంలోని అదనపు కొవ్వుని కరగించడానికి సహయకారి
అవుతుంది.

శలభాసనం:
ముందుగా
మకరాసనకి రావాలి. శ్వాసని తీసుకొని చేతులను సాఫీగా నేలను తాకేట్లుగా నడుముపక్కకి తీసుకవస్తూ
కుడి పాదాన్ని పైకి లేపి శ్వాసనిబందించి ఓ ఐదు సెకండ్లు వుంచాలి. నిశ్వాసతో కుడిపాదాన్ని
నేలకి తీసుకరావాలి. ఈ మారు ఎడమకాలుతో సాధన చేయండి. ఓ నిముషం ఈ సాధనకొనసాగించిన తరువాయి
ధీర్గశ్వాసనితీసుకుంటూ రెండుకాళ్లని ఒకేమారుగా పైకిలేపి 3 నుంచి 5 సెకండ్లు వుంచుతూ
ఈ రెండు నిముషాలు సాధనకొనసాగించండి.
ఈ
ఆసనసాధనద్వార వెన్నుపూస దిగువభాగం, మణికట్లు, తుంటి, పిరుదుల కండర వ్యవస్థలకి బలం చేకురుతుంది.
సయాటిక నొప్పులనుంచి ఊరట వస్తుంది. కండరల వాపులని తగ్గిస్తుంది. కొవ్వు నడుము, తొడలు, పొత్తికడుపు భాగాలనుంచి కరిగి
మృదుత్వాన్ని సంతరించుకోవడానికి సహయకారి అవుతుంది.
ధనురాసనం:
ముందుగా నుదురు నేలకి అభిముఖంగా
వుండేలా బొర్లపడుకోవాలి. కుడి పాదాన్ని కుడిచేతివేళ్లతో, అదేవిదంగా ఎడమ పాదాన్ని ఎడమచేతివేళ్లతో
పట్టుకోని మీ బాడిని పైకితీసుకోవాలి. అప్పుడు శరీరభంగిమ నాభి ఆధారంగా ధనుస్సువలే వుంటుంది. ఈ ఆసనస్థితిని ఒకటి నుంచి రెండు నిముషాలు కొనసాగించాలి.
ఇలా కనీసం 2 నుంచి
3 సార్లు చేయాలి.
ఈ ఆసనసాధనద్వార వీపు, పొట్టకండరాలు
ఆరోగ్యవంతం అవుతాయి. పునరుత్పత్తివ్యవస్తని హెల్తీగా వుంచడానికి తోడ్పడుతుంది. చాతీ,
మెడ, భుజాల కండరాలు అరోగ్యవంతంగా పనిచేస్తాయి. కండర వ్యవస్థ మృదుత్వాన్ని పొందుతూ అలసటలనుండి
రక్షణగా నిలుస్తుంది. మానసిక అశాంతులను దూరం చేస్తుంది.
చక్రాసనం:
ముందుగా శవాసనం వేయాలి. నెమ్మదిగా
శ్వాసని తీసుకుంటూ పాదములు పిరుదుల వద్దకు తీసుకువచ్చి నేలకు త్ర్రాకించాలి. చేతులను
పైనుండి తీసుకువెళ్ళి తలకు ఇరువైపులా నేలకు త్రాకించాలి. సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ
చేతుల సాయంతో శరీరాన్ని పైకి తీసుకురావలి. వుండగలిగినంతసేపు వుండి పూర్వపు
స్థితికి రావాలి. ఇలా కనీసం 2 సార్లు చేయాలి.
ఈ ఆసనసాధనద్వార జీర్ణకోశం,
ఉదరకోశం, శ్వాసకోశం, హృదయకోశాలు ఉత్తేజితం అవుతాయి. వీపు, వెన్నుపూస కండరాలు బలోపేతం
అవుతాయి. తొడకండరాలు, కటి వ్యవస్థ బలపడుతాయి. భుజాలు, కీళ్ల వ్యవస్థలు మృదుత్వాన్ని
సంతరించుకుంటాయి. మెరుగైన మెటబాలిజానికి తోడ్పడుతుంది. అడ్రినాల్, థైరాయిడ్ గ్రంధి వ్యవస్థలని మెరుగుపరుస్తుంది. అఫీసుల్లో
పనిచేసే ఉద్యోగస్తులు జీవనశైలిలో ఆరోగ్యకరమార్పుగా మార్పుగా దీనీని అభ్యసించాలి. ఈ ఆసన నిరంతర సాధనద్వార టెన్సన్, స్ట్రెస్ లని సమర్థవంతంగా
నియంత్రించుకోవచ్చు.
పూర్వోత్తాసనం:
ముందుగా ధండాసన స్థితికి రావాలి.
రెండు చేతులను వెనక్కి తీసుకొని వాటి ఆధారంగా మొత్తం శరీరాన్ని అరిపాదాల ఆధారంతో పైకి
లేపి వుండగలిగినంతసేపు వుండాలి, తిరిగి ధండాసన స్థితికి రావాలి. శ్వాసని లోనికి తీసుకొని
ఆసనస్థితిలో కొనసాగాలి. ఇలా కనీసం 2 నుంచి 3 సార్లు చేయాలి.
ఈ ఆసనసాధనద్వార కాలిపిక్కలు,
భుజాలు, మోచేయి, ముంజేయి, మణికట్లు, గుండె, వెన్నుపూస, వీపు కండరాలు బలోపేతం అవుతాయి.
మనస్సుకి ఆహ్లదాన్ని చేకూరుస్తుంది. స్త్రీలలో ఋతుసమస్యలకి ఉపకరిస్తుంది.

పశ్చిమొత్తాసనం;
ముందుగా ధండాసన స్థితికి రావాలి.
అరచేతులను నేలకు
ఆనిస్తూ వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస
తీసుకుంటూ రెండు చేతులను 90 డిగ్రీల కోణంలో నిట్టనిలువుగా లేపి, దీర్ఘ శ్వాస తీసుకోవాలి.
ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను వదులుతూ వెన్ను, మెడ వంచకుండా ముందుకు వంగి నుదిటిని మోకాళ్ళకు
తాకిస్తూ చేతులతో కాలిబొటన వేళ్లను పట్టుకోవాలి. ఈ స్థితిలో మోకాళ్లు పైకి లేపకూడదు.
ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదులుతూ ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ
యథాస్థితికి రావాలి. ఇలా కనీసం 4 నుంచి 5 సార్లు చేయాలి. తొలిసారి ఈ ఆసనం సాధన చేసేవారికి,
పెద్ద పొట్ట ఉన్నవారికి తల మోకాళ్ల మీదికి రాకపోవటం, ఆసనం మధ్యలో మోకాళ్ళు పైకిలేపటం
వంటి ఇబ్బందులు ఎదురుకావడం సహజమే. అయితే సాధన చేసేకొద్దీ ఈ లోపాలను సవరించుకోవచ్చు.
ఈ ఆసనసాధనద్వార కిడ్నీలు,
లివరు, పాంక్రియాస్, ప్రేవువ్యవష, పునరుత్పత్తి వ్యవస్థలకి సానుకులత వస్తుంది. స్త్రీలలో
ఋతుసమస్యలకి ఉపకరిస్తుంది. మానశికఆందోళనలకి, మైగ్రైన్లకి చెక్ పెడుతుంది. జీర్ణక్రియ
మెరుగౌతుంది. ఒబెసిటి నియంత్రణకారి. వెన్నుపూసని తెజోవంతపరుస్తుంది.

నటరాజాసనం:
ఈ ఆసనం ఓ నాట్యభంగిమని పోలి వుంటుంది. నిటారుగా
నిలబడి కుడికాలు వెనుకకు తీసుకుని చేతితో పాదం
పట్టుకుని లాగాలి. సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ ఎడమచేయి ముందుకు చాపాలి. తరువాత కాళ్ళను మార్చి చేయాలి. ఇలా కనీసం 5 నుంచి 6 సార్లు చేయాలి.
ఈ ఆసనసాధనద్వార పాదాలు, గిరికల
సానుకూలతలకి. తొడలు, పొత్తికడుపు కండరాలు తెజోవంతం కావడానికి సాధన చేయండి. లోబిపి
ఉన్నవారు ఈ సాధన చేయకండి. ఆరంభంలో తొడలు క్రాంప్సుకి లోనుకావచ్చు. సరీయిన
ఆసనస్థితిద్వార దీనిని అధిగమించవచ్చు. పూరక స్థితిలో ఆసనసాధన కొనసాగించాలి.

ఊత్కతాసనం:
ముందుగా కాళ్ళను
విస్తృత పరచి నిటారుగా నిలుచోవాలి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులను భూమికి సమంతరంఘ
ముందుకు సాచి వుంచాలి. నెమ్మదిగా శ్వాసక్రియని కొనసాగిస్తూ మోకాళ్లను వెనుకకి వంచుతూ
తొడలని భూమికి సమంతరంగా వుండేట్లుగా కటిభాగాన్ని కిందికి తీసుకోవాలి. ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదులుతూ ఉండగలిగినంత
సేపు ఉండి తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇలా కనీసం 5 నుంచి
10 సార్లు చేయాలి. ఆహరం తీసుకొనివుంటే ఈ ఆసనసాధనకి కనీసం మూడు నుంచి నాలుగు గంటల వ్యవదిని
తప్పక పాటించాలి.
ఈ ఆసనసాధనద్వార బలమైన కాళ్లు,
చేతుల వ్యవస్థ మీ సొంతం. గుండె మరియు డయాప్రంల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. యవ్వనవంతులుగా
తీర్చుతుంది. ఉదరకోశ వ్యవస్థ తెజోవంతంకావడానికి సహయకారి అవుతుంది. ఆరంభంలో ఓ ఆరనిముషం
సాధన చేయండి నెమ్మదిగా మీ ఆసక్తి మేరకు వ్యవధిని పెంచుకోండి.
ప్రతి యోగాఆసనం సరిఅయిన శారీరకభంగిమలలో
పదిమార్లు దీర్ఘశ్వాసలని కేవలం ముక్కుద్వారానే కొనసాగించాలి, ఇది సుమారు 40 సెకండ్ల
ఆసనస్థితి. ప్రతి ఆసనాన్ని కనీసం మూడునిమిషాలు కొనసాగించాలి.
- మీకు బిపి, సుగర్,
నిద్రలేమి, బ్రాకైంటీస్, సైనస్, ఒబెసిటి లాంటివి ఇప్పటికే ఉంటే వాటిని సరియైన యోగాసన
సాధనతో నివారించుకోవచ్చు.
- సరైన యోగశిక్షణలో
మనలోని అధిక కేలరీలు ఖర్చు అవుతాయి. బరవు తగ్గాలనుకొనేవారికి యోగసాధన చాల ఉపకరిస్తుంది.
- యోగాభ్యాసంతో
రోజులోవచ్చే ఒత్తిడి, మానసికవేదనల వంటివి తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడితో మీకు
తరచుగా కోపం వస్తూవుంటే అటువంటప్పుడు ఇది బాగాపని చేస్తుంది
ఆరంభంలో కొందరికి కొన్నిఆసనాలు
వేయదం కష్టం అనిపిస్తుంది. యోగసాధనతో శారీరక సానుకులత మెరుగౌతుంది. ఆరంభంలో కాలివేళ్లని చేతివేళ్లతో నడుముని, మోకాళ్లని వంచకుండా అందుకోవడానికి ఇబ్బందిపడుతారు, కాని కొన్నిరోజుల్లొ తక్కువ ప్రయాసతో చేయగలుగుతారు. అదేవిదంగా ఆరంభంలో మీ భుజాలు, కటి, తొడలు, కాలిపిక్కల కండరాలనొప్పులు మిమ్మ్మల్ని ఆందోళనకి గురిచేయవచ్చు కాని కొన్నిరోజుల్లొ ఈ కండరాలు తమ సహజ మృదుత్వాన్ని సంతరించుకుంటాయి, నొప్పులు మాయం అవుతాయి.
గర్భిణిస్త్రీలుకూడా నిరభ్యంతరంగా యోగాసన సాధనని కొనసాగించవచ్చు. ఆసన స్థితులను వారి శారీరక అనుకూలరీతీలో మాత్రమే కొనసాగించాలి. యోగ సాధన తల్లికి, బిడ్డకి మరింత సన్నిహితాన్ని పెంచుతుంది. కుండలిని**యోగసాధన ఆచార్యుల సమక్షంలో మెళుకువలను గ్రహించి మాత్రమే సాధన చేయాలి. ఇది ఒత్తిడి, నైరాశ్యాం, అలజడులని నియంత్రించి ప్రశాంతతని, అనురాగా భావాలని పెంపొదిస్తుంది. శారీరక సమతుల్యతల సాధనద్వార నాడీమండలం, కండరాలు సమతుల్యతలని పొందుతాయి. కండరాల వాపులు, నొప్పులని, నడుము నొప్పులను నివారిస్తుంది. సుఖప్రసవానికి సహయాకారి అవుతుంది. ఇంట్లో యోగసాధన మీ జీవిత భాగస్వామితో కలసి/సమక్షంలో కొనసాగించండి
కేవలంశ్వాసపై ద్యాసతో ప్రాణయామని లయబద్దంగా రోజుకి మూడుమార్లుగా ఏడు నుంచి ఎనిమిది వారాలు కొనసాగించడం ద్వార థైరాయిడు సమస్యలని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.
ఆరంభంలో మీరు నేర్చుకున్న అన్ని ఆసనాలను ప్రాక్టీస్ చేయండి. బరువు
తగ్గడం, బ్లడ్ గ్లూకోజు లెవల్సుతగ్గడం లాంటి అవసరాలను ధృష్టిలో ఉంచుకొని ప్రత్యేకించి కొన్ని యోగాసనాలను సాధనచేయాలి.
*National Center for Biotechnology Information
మీకు జీవితకాలం గ్యారంటీ తో ఎటువంటి షరతులు లేకుండా ఓ అముల్య అభరణం!
యోగ - బాక్ పెయిన్
సాధరణంగా చాలమందిని వేదించే
అనారోగ్య సమస్యలలో వెన్నునొప్పి అనబడే బాక్ పెయిన్, నడుమునొప్పి, మెడనొప్పి అనేది ఒకటి.
కారణం ఎదైన అది రాకుండ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుత జీవ నవిధానంలో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ.
నడుమునొప్పి ఎందుకు
వస్తుంది?
·
సాధారణంగా వచ్చే నడుమునొప్పి ముఖ్యంగా ఇటివల జీవనవిధానంలో వచ్చిన మార్పులే ప్రధానకారణం.
నేటిఉద్యోగాలు గంటల తరబడి నిశ్చలస్థితిలో పనిచేసే కోవకి చెందినవే. ఆ నిశ్చలస్థితిలో వెన్నముకని
వంచి కూర్చొనేవిధానమే నడుంనొప్పికి, అదేవిధంగా ఆ సమయంలో మెడవంచి చదివేతీరు,
మెడఎత్తి చూసేవిధానం మెడనొప్పికి కారణం అవుతున్నాయి.
·
కొందరిలో పడక వెన్నుకి సపోర్టుగా
లేక వెన్నునొప్పికి కారణమవుతుంది. అవసరమైన
మార్పులతో పడుకొనే విధానాన్ని వారు మార్చుకోవాలి.
·
కొందరిలో పని టెన్సన్ వల్ల నడుం కండరాలు
సంకోచిస్తాయి, రక్త సరఫరా కటిభాగానికి తగ్గవచ్చు. దీనివల్ల నడుం నొప్పి వస్తుంది.
·
ఫ్యాషన్ పేరిట వాడే ఎగుడు
దిగుడు చెప్పులు, ఎత్తుమడమల చెప్పులు రక్తప్రసరణకి అడ్డంకిగామారవచ్చు, కండరాలు బలహీనపడవచ్చు,
నడుమునొప్పికి కారాణం కావచ్చు.
సరిలేని శరీరభంగిమలు వెన్నుపూసలని
అధిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీనికి సరి అయిన జాగ్రత్తలు
సకాలంలో తీసుకోకపొతే ముందు ముందు అనేక సమస్యలకి ఇవి కేరాఫ్అడ్రస్ గా మారే ప్రమాదం వుంది.
కూర్చునే విషయాల్లో, చూసే పద్దతుల్లో, పడుకొనే పద్దతుల్లో, నడిచే విధానాల్లో కొద్దిపాటి
మార్పులని పాటించడంద్వారా ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
ఇందుకుగాను రోజు
ఓ ఇరవైనిముషాలు వజ్రాసనం ప్రాక్టీసు చేయడంవల్ల మెరుగైన శరీరభంగిమలని సాధించడంద్వార
వెన్నుపూస సాధరణస్థితికి చేరడానికి దోహదం అవుతుంది, ఆవిధంగా ఈ సమస్యని దూరంచేసుకోవచ్చు.
ఆహరశైలిలోని మార్పులు ముఖ్యంగా
అధిక కెలరీలువున్నా ఆహరాలని డైలీ అదేపనిగా తీసుకోవడం మనలని ఒబెసిటికి దగ్గరచేస్తున్నాయి.
ఒబెసిటి వెన్నుపాముని అధిక ఒత్తిడికి, భారానికి గురిచేస్తుంది.
బరువు నడుము నొప్పికి కారణం అయితే 5 నుంచి 6 కిలోల బరువు తగ్గడంద్వారా నడుమునొప్పిని
అదుపులోనికి తెచ్చుకోవచ్చు. ఇందుకుగాను లో కేలరిలు కలిగివున్న పోషకాహరాలని ప్రత్యామ్నాయంగా
తీసుకోవాలి.
వెన్నుపాము ఏ
పనులని చేస్తుంది?
శరీరంలోని నాడీమండల వ్యవస్థకి
వెన్నెముక ఓ రక్షణకవచంలా వుంటూ అన్ని ప్రధాన అవయాలను అనుసంధానిస్తూ శరీరాకృతిని పరిరక్షించడంలో
కీలకపాత్రని పోషిస్తూవుంటుంది. వెన్నెముకకు తోడుగా కండరాలు, లిగ్మెంట్లు, డిస్కులుంటాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్కులు , లిగ్మెంట్లు
తోడుగావుంటాయి. వెన్నుపూసల అమరికనే వెన్నుపాము అనివ్యవహరించే వెన్నెముక. ఈ వెన్నుపూసల
మధ్య రబ్బరు కుదురులాంటి మృదు పదార్ధం సాగే
గుణాన్ని కలిగివుంటుంది. దీనిని డిస్కు అంటారు. డిస్కులు వెన్నముక కదలికలకి షాక్ అబ్జార్బర్సు
లా పనిచేస్తాయి
వెన్నుపాము పొడవున ఎన్నో నరాలు
వెలుతుంటాయి. మెడభాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోకి, నడుమునుంచి వెళ్లేనరాలు కాళ్లలోకి
వెళ్తూ వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జన భాగంతోపాటు లైంగిక బాగాల్లోకి
వెళతాయి. డిస్కుసమస్యలు కలిగివున్న కొందరిలో అంగస్తంభన, శ్రీఘ్రస్కలనం వంటి లైంగిక
సమస్యలు కూడా అగుపిస్తాయి.
డిస్కు సమస్యలు ఎందుకు వస్తాయి?
ఆధికబరువులను ఎత్తడం, ఎక్కువదూరం
అదే పనిగా రన్నింగ్ చేయడం, రోజంతా వంగి పని
పనిచేయడం, వెన్నేముకకి ప్రమదవశాత్తు దెబ్బలుతగలడం, గతుకులరోడ్లలో వాహనప్రయాణాలు, వయసుపెరిగేకొద్ది
వచ్చేమార్పులు ,సరైయిన శారిరక భంగిమలని పాటించకపోవడం డిస్కులపై ఒత్తిడి పెరగడానికి
డిస్కులలో అరుగుదల, తరుగదలలికి కారణమవుతున్నాయి. సంవృద్దిగా నీళ్లుతాగడం డిస్కుల అరుగుదలలకి,
తరుగుదలలకి చెక్ పెట్టడానికి ఓ మంచి టెక్నిక్ అవుతుంది.
బలమైన వెన్నువ్యవస్థకి అభ్యసించదగిన
యోగాసనాలు.
కటిచలనాసన; మార్జాలసన; శలభాసన;
పశ్చిమోత్తాసన; భుజంగాసన; మత్స్యేంద్రాసన; ధనురాసన; సేతుభందాసన; త్రికోణాసన; ధండాసన;
ఉష్ట్రాసన; శశాంకాసన
No comments:
Post a Comment