Tuesday, 18 November 2014

03. యోగ జీవనశైలి - జీవధార...జీవనధార



మనల్ని ఆరోగ్యభరితంగా, ఆరోగ్యవంతులుగా ఉంచేది, మన జీవనగతికి జీవధారగా, జీవనధారగాఅయి నడిచేది, నడిపించేది అమృతధార అయిన జలధార... అదే మనం రోజు త్రాగే మంచినీళ్లే!
త్రాగేనీళ్లు అమృతధారగా ఫలితాలను సాధించాడానికి మీరు చేయవలసింది:
o   నిద్రలేవగానే పర గడుపున 1 నుంచి 1.5 లీటర్ల పరిశుభ్రమైన మంచినీళ్లు త్రాగాలి.ఐతే ఇందుకు ఫ్రిడ్జు వాటర్ ని ఉపయొగించరాదు.
o   పాకెజెడ్ వాటర్ త్రాగే అలవాటు ఉంటే దానినే కంటిన్యూ చేయండి.సాదరణంగా అందుబాటులో ఉంటే స్వచ్చమైన బావి నీరు తీసుకోండి లేదంటే ట్యాప్ వాటార్ కూడ పరవాలేదు.
o   నీళ్లు త్రాగే గ్లాసులు మరియు పాత్రలు పరిశుభ్రంగా వుండాలి.
o   మంచినీళ్లు త్రాగే అలవాటు అయ్యేంతవరకు మొదట్లో మూడుగ్లాసుల నుంచి ఆరంభించండి. కొద్దిటైం గ్యాప్ తరువాత ఇంకో మూడుగ్లాసుల నీళ్లుత్రాగండి. అవసరమైతే గోరువెచ్చనినీళ్లు కూడ తీసుకోవచ్చు.  ఆ తరువాత ఓ గంట వరకు ఏమి తీసుకోరాదు, అయితే కాలకృత్యాలను తీర్చుకోండి.
ఈ ప్రక్రియ మనలో సాధారణంగా వుండే మలబద్దకాన్ని రెండువారాలలొ పూర్తిగా నివారిస్తుంది. గ్యాస్ ప్రాబ్లంని కూడా అదుపులోనికి తెస్తుంది.  బిపీ వుంటే దాన్ని పదివారాలలొ నార్మల్ కి తీసుకువస్తుంది.
జీర్ణవ్యవస్థని అరోగ్యవంతంగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియ, జీవప్రక్రియలలొ శరీరం నుంచి తయారయ్యే వ్యర్థాలు, మలినాలు, జీర్ణంకాని ఆహర పదార్థాలని సమర్థవంతంగా విసర్జించడానికి తోడ్పడుతుంది. విసర్జనవ్యవస్థ విధులని మెరుగుపరుస్తుంది.
భొజనంతొ పాటు మంచి నీళ్లు త్రాగే అలవాటు ఉంటె దాన్నిఆపేయండి. భోజనంతొ పాటు నీళ్లు త్రాగ వలిసిన అవసరం జీర్ణక్రియకి ఎంతమాత్రం అవసరం లేదు. భోజనానికి అరగంట ముందుగా, భోజనం తరువాత ఓ గంట వరకి మంచినీళ్లు త్రాగకండి. ఇది మీరు తీసుకున్న ఆహరంని చక్కగా జీర్ణం కావడానికి దోహదం అవుతుంది. ఆ తర్వాత ఫ్రతిగంట, గంట విరామంతో ఓ గ్లాసు మంచినీళ్లు త్రాగండి. అదే విదంగా రోజుకు 3.5 నుంచి 4 లీటర్ల మంచి నీళ్లు త్ర్రాగాలి.  ఇది మన శరీరంలోని సహజ నిష్పత్తి అయిన ద్రవపదర్థాల సమతుల్యతలని సాధిస్తుంది.
o   కిడ్నీలని శక్తివంతంగా, సమర్థవంతంగా, విధులని నిర్వర్తించేలా దోహదకారి అవుతుంది, కిడ్నీలలొ స్టోన్ ఫార్మెషన్ లను రాకుండా నివారిస్తుంది, మరియు స్టోన్ లు ఫార్మేషన్ ప్రారంభంలొ వుంటే నివారణకారిగా పనిచేస్తుంది.
o   శరీరంలోని టాక్సిన్సుని సమర్థవంతంగా విసర్జించడం ద్వారా, చర్మం ఆరోగ్యవంతంగా తన విధులనుని నిర్వర్తిస్తుంది. ఏడు, ఎనిమిది వారాలలో చర్మం కాంతివంతంగా, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
o   కార్టిలేజు వ్యవస్థలో సుమారు 85 శాతం ద్రవసమ్మేళనం ఉంటుంది, ఇది ఆ సమతుల్యతని సాధించదంద్వార మెరుగైన కీళ్లవ్యవస్థతో ఆర్టరైటీస్ ని కంట్రొల్ చెయడానికి ఓ పరిష్కార మార్గం అవుతుంది.
o   శరీరంలో ద్రవసమతుల్యత కోలన్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, బ్రేస్టు క్యాన్సరులని నిరోధిస్తాయి అని శాస్త్రీయ అధ్యయానాలు  తెలియజేస్తున్నాయి.
o   ఊబకాయం నుంచి బరువుతగ్గించుకోవడానికి ఇది నమ్మకమైన సురక్షణ విధానం అని విశ్వవ్యాప్తంగా పలు అధ్యయానాలు తెలియచేస్తున్నాయి.
o   ఓ గ్లాసు మంచినీళ్లు నిమ్మరసంతో అలసిన మనస్సుకి, శరీరానికి తక్షణ శక్తిని ఉపశమనమనాన్ని ఇస్తుంది.
o   గోరువెచ్చని నీళ్లు, కొద్దిగా సాల్టుతో తరుచుగా పుక్కిలించదం ద్వారా రొంప, జలుబు, ఆస్థమా, బ్రాంకైటీస్ ల నుండి ఇమ్మ్యునిటిని 3 నుంచి 4నెలల్లొ తీసుక వస్తుంది.
o   ఏరొబిక్సు, స్విమ్మింగ్, జిం ఎక్సెర్సైజులలో మీ శరీరమునుంచి, కండారాలనుంచి స్వేదంగా నీరు అవిరీవుతుంది. తక్షణశక్తిగా ఒకటి లేక రెండు గ్లాసుల మంచినీళ్లు నిమ్మరసంతో కలిపి తీసుకోండి. మార్కెట్లలో దొరికే ఎనర్జి డ్రింక్సుకి బదులుగా ఇది తీసుకోవాలి.
o   జీర్ణప్రక్రియ, జీవప్రక్రియలని సజావుగా, సక్రమంగా, వేగవంతంగా నిర్వర్తించదానికి రెడి చేస్తుంది.
o   బయటకి వెళ్లేప్పుడు ఓ వాటర్ బాటిలు తిసుకవెళ్లే అలవాటు మీ బాడిని డిహైడ్రెష్నకి గురిగాకుండా రక్షిస్తుంది.
 మీ వర్కు స్టేషనులో వాటర్ బాటిలుని వుంచుకోండి, ఆసక్తి ఉంటే నిమ్మరసాన్ని ఇందులో కలపండి.
కూల్ డ్రింక్, ఎనర్జిడ్రింక్సు, కాఫీ, టీలు మంచినీళ్లకి ప్రత్యామ్నాయం కాదు, అయితే వీటికి ప్రత్యమ్నయంగా ప్రూట్ /లెమన్ జ్యూసులను తీసుకోండి, అయితే టేస్టు కోసం సుగర్, కూలింగ్ కోసం ఐస్ లని వాడకండి.
o   ఆరొగ్యవంతమైన శరీరంలో సుమారు 65 శాతం ద్రవసమ్మేలణమే, అది మీ బరువు ఆధారంగా 38 నుంచి 42 లీటర్ల ద్రవపదార్ధాల సమ్మేళణంలో వుంటుంది. సమతుల్యత సుక్ష్మపోషకాలను కణాలకి చేరవేస్తుంది. మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతలని క్రమబద్దీకరిస్తుంది. శరిరంలొ అంతరశుద్దిని మరియు జీర్ణకోశ వ్యవస్థని సక్రమంగా తన విధులని నిర్వర్తించడనికి సహయకారి ఔతుంది.
ద్రవపదార్ధాల సమ్మేళణంలో సమతుల్యతని సాధించడం సహజ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మొదటి అడుగు.
ఇక మానసిక ఆందోళలనలను అధిగమించడానికి, మానసిక ప్రశాంతతని సాధించడానికి మీకో ట్రెజర్ హౌస్ కావాలి!!
                                  ఇక మీ ట్రెజర్  హంట్ ని ఇలా మొదలెట్టండి!!!

No comments:

Post a Comment