Wednesday, 22 July 2015

22 యవ్వనం చిగురిస్తుంది..

..

ఆరోగ్యవంతమైన, ఆకర్షణీయమైన శరీరసౌష్ఠవం, ఒత్తైన శిరోజాలు, మృదువైన, కాంతివంతమైన చర్మం, యవ్వనకాంతులని  వెదజల్లే నగుమోములని తమ సొంతం చేసుకోవడం ఇష్టం కానిది ఏవరికి చెప్పండి.

ఇందుకుకావలసింది కొద్దిగా పట్టుదలతో కూడిన మీసంకల్పం జీవనశైలీలో కొన్నిమార్పులు…. కేవలం కొద్దివారాలలో వాటి ఫలితాలు మిమ్మలని ముగ్దులను చేస్తాయి. మిమ్మల్ని లోపటినుంచి బయటికి యవ్వనవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఇందులో ప్రదాన భూమికలు వేళకి నిద్ర, తగినంత మానసిక విశ్రాంతి, డైలీ ఓగంట యొగసాధనలతో పాటు,మీరు తీసుకొనే ఆహరాలు. తీసుకొనే ఆహరం వైవిద్యభరితంగా, పోషకభరింతంగా సమతుల్యభరితంగా వుండే సాత్వికాహరం గా వుండి తీరాలి. తీసుకొనె ఆహరాలలో వివక్షణని ఇలా చూపించండి.
 
  • టమొటాలు యాంటియాక్సిడెంట్సులకి తరగని నిధులు. ఇందులోని లైకోపోస్ పొట్టని సంరక్షించడంలో కీలక పాత్రని పోషిస్తాయి. వాటిని అవకాశం ఉన్నంతవరకి రెగ్యులర్గా మీ భొజనంలో తప్పకతీసుకోండి. వీటిని సలాడ్సుగా లెక జ్యూస్’గా కూడ వాడండి

  • తాజా కారెట్సులోని  విలువైన ‘ఏ’ విటమిన్ కంటిచూపుకి రక్షణవలయంగా వుంటుంది, ఇందులోని యాంటికాన్సర్ కారకాలు ఆరోగ్యపరిరక్షణలో కీలకమైనవి. వీటిని వారంలో 2 లేక 3 సార్లు తీసుకోండి.

  • కివి ఫ్రూట్ లో బోన్ వ్యవస్తని సంరక్షించే ధాతువులు అపారం. ఇది విటమిన్ ‘సి’కి నిధి. హార్టుని ఆరోగ్యవంతంగా వుంచడంలో సహయకారి. 1 లేక  2 కివిలని వారంలో తీసుకోండి. బ్లడ్ సుగర్ నియంత్రించడంలో కూడ సహయకారి. దీనిని డయాబిటిస్ ఉన్నవారుకూడ నిరంభ్యంతరంగా తీసుకోవచ్చు.
  • తాజా ఫ్రూట్’జ్యూస్, వెజిటబుల్’జ్యూస్’లని వారానికి 2 లేక 3 గ్లాసులు తీసుకోండి. టేస్టు కోసం సుగర్, ఐస్’లని మిక్సు చేయకండి. అవి మిమ్మలని అల్జీమర్ వ్యాధి నుంచి రక్షిస్తూ బ్రేయిన్’కి ఉపయోగకారిగా వుంటుంది. 
  • జింజర్’లోని యాంటి ఆక్సిడెంట్సు, యాంటి బాక్టిరియా గుణాలు ఔషధకారిగా పనిచేస్తాయి. ఇది కోలన్’కి కాన్సర్ నుంచి రక్షణ తెస్తుంది. అందుకని జింజర్ టీ డైలీ ఓ కప్ తీసుకోండి.

  • తాజా బ్రొకోలి సూక్ష్మ ధాతువులనిధి. ఇందులోని కాల్షియం, మాంగనీసు, పోటాషీయం, ఐరను, సంవృద్దిగా లభ్యమయ్యె విటమిన్లు  మీలో ఇమ్యూనిటిని పెంపొదించడంలో యాంటి కాన్సరు కారకాలుగా కీలక పాత్రని పొషీస్తాయి. ఇందులోని సూక్ష్మ పోషకాలు ఫ్యాటుని కరిగించే ఎంజైంలకి ప్రేరణ అవుతాయి. దీనిని సలాడుగా విరివిగా వాడుకోండి.

  • తాజ పాలకూర బలమైన కండర వ్యవస్థని తీసుక వస్తుంది. ఇందులోని  మాంగనీసు, పోటాషీయం,  మీలో ఇమ్యూనిటిని పెంపొదించడంలో సహయకారి అవుతుంది. ఆవిరిలో వుడికించిడంద్వార పోషకాలను సంరక్షించుకోవచ్చు. వారంలో 1 లేక  2 మార్లు తీసుకోండి.
  • పెరుగుని రెగ్యులర్గా వాడండి. ఇందులోని మంచి బాక్టిరియ జీర్ణవ్యవస్థని తేజోవంతంగా వుంచుతుంది. వెన్నతీసిన పాలని పెరుగుతయారికి వాడుకోవడం అభిలషణీయం. రోజుకి 1 లేక 2 కప్పుల వరకి వాడుకోవచ్చు.

  • అవకొడని సలాడుగా, జ్యూస్’గా తీసుకోవడంద్వార ఫ్యాట్ని కరగించే హర్మొనులకి ఉద్దీపన కారిగా, మెటబాలిజం’ని తెజోవంతం చేస్తుంది , అది శరిరంలో చెడుకొలోస్ట్రాల్ ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
  • సుగంధద్రవ్యమైన దాల్చినచెక్కలో యాంటి యాక్సిడెంట్సు పుష్కలం. అవి బ్లడ్’సుగర్సుని నియంత్రించడంలో మరియు బ్లడ్’క్లాటింగ్’ని నియంత్రించడంలో కీలక పాత్రని పోషిస్తాయి. అందువల్ల పొడిరూపంలో ఓ స్పూను వేడి పాలు/నీరు తో వారంలో 1 లేక 2 మార్లు రాత్రినిద్రకి ఉపక్రమించే ముందు తీసుకోండి.
  • తాజ ఫైన్’ఆఫిల్’లోని  యాంటి ఆక్సిడెంట్సు, ఎంజైంలు , యాంటి ఇంఫ్లమేటరి కారకాలు, విటమిన్లు మిమ్మలని హెల్తీగా యంగ్’గా  ఉండడానికి తోడ్పడుతాయి. వారానికి 2 లెక 3  కప్పులు తీసుకోండి.

  • పండు మిరపకాయలు మెరుగైన మెటబాలిజానికి సహయకారి. బ్లడ్’ని పలుచగా ఉంచడానికి తోడ్పడుతుంది.అంటువ్యాధులను సమర్థవంతంగా ఏదుర్కోవడానికి ఉపకరిస్తుంది, అయితే ఎండు కారాన్ని ప్రత్యమ్నాయంగా వాడకండి.

  • తాజా చెర్రీస్ మొండి వ్యాధులనుంచి రక్షణ ఇస్తుంది.కీళ్ల వ్యవస్థని బలోపేతం చేస్తుంది. అవకాశం , అందుబాటులో వుంటే వీటిని హాయిగా తీసుకోండి.

  • మేడిపండ్లలో పోటాషీయం, మాంగనీసు, ఫైబర్, యాంటి యాక్సిడెంట్సు పుష్కలం. బ్లడ్ సుగర్సుని నియంత్రించడంలో కీలక పాత్రని పోషిస్తాయి. వీటిని రోజు 2 లేక 3 తీసుకోండి.
  • గుడ్లు ఆరోగ్యకరమైన సమీకృత ఆహరం. వారంలో 2 లేక 3 తీసుకొండి.

  • పసుపులో యాంటిబయాటిక్, యాంటి ఇంప్లమేటరి గుణాలు పుష్కలం. ఓ చిటికెడు పసుపుని వంటకాలలో వాడుకోవచ్చు, పసుపులోని ఔషద గుణాలు చర్మసంరక్షణకి, సౌందర్యపోషణకి ఆలంబన అవుతుంది. అది కాళ్లపగుల్లుని అరికడ్తుంది. పాలు, పసుపుల మిశ్రమాన్ని మీమోముకి తరచుగా మసాజు చేయండి. అది మొహంలోని మచ్ఛలని కాంతిరహితంగా, మొహాన్ని మృదువుగా చేస్తుంది. స్కిన్’ని టైట్’గా ఉంచడానికి తోడ్పడుతుంది.

  • పుట్టగొడుగులు ఆరోగ్యకరమైన ఆహరమే! ఇందులోని యాంటి యాక్సిడెంట్సు కాన్సర్లభారి నుంచి రక్షిస్తాయి.బ్రౌన్’రైస్’తో వీటి రుచులని అనుభవించండి.

  • ఆలీవ్’లోని  ఒమెగా 3 ఫ్యాటి యాసిడ్సు గుండెకి రక్షణ తెస్తుంది. ఆలీవ్ఆయిల్  లోని యాంటి ఇంఫ్లమేటరి గుణాలు కీళ్ల వాపులనుంచి ఆరోగ్యవంతంగా వుంచడానికి సహయకారి. వీటిని 3 లేక 4 ఒకసారిగా తీసుకోవచ్చు.


  • దానిమ్మ గింజలని తరచుగా తీసుకోండి. దానిమ్మలో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి, అవి ప్రీరాడికల్సుని నియంత్రిస్తాయి. ఇవి రోగనిరొధకవ్యవస్థని బలోపేతం చెస్తుంది. దానిమ్మజ్యూసుని వారంలో 1 లేక 2 మార్లు ఓ గ్లాసు తీసుకోండి. హార్మొన్ల సమతుల్యతలని సాదిస్తుంది. నరాలలో రక్తాన్ని గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది. గుండెని ఆరొగ్యవంతంగా తన విధులని నిర్వర్తించడానికి తొడ్పడుతుంది. ఇందులో ఇనుము ధాతువు సంవృద్దిగా లభిస్తుంది, అది రక్తహీనతని తగ్గిస్తుంది. ఇందులోని మూలధాతువులు కాన్సర్లనుంచి మీకు రక్షణని తీసుకవస్తాయి.
  • వాల్’నట్సు సూక్ష్మపోషకాల నిధి. ఈ నట్సులోని పుష్కలమైన విటమిన్ సి ,యాంటి ఆక్సిడెంట్సు, ఫైబర్, మినరల్సు   బాడిలోని టాక్సిన్లని సమర్థవంతంగా తొలగిస్తూ జీవక్రియ, జీవనక్రియ లని తేజోవంతంగా వుంచడానికి సహకరిస్తూ మిమ్మలని లోపటినుంచి బయటికి యవ్వనవంతంగా వుంచుతుంది. ఇండులోని ధాతువులు చెడు కొలోస్ట్రాల్ ని నియంత్రించి  హార్టుని ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్రని పోషిస్తాయి.  వీటిని వారంలో 1 లేక 2 సార్లు  10 నుంచి 15 గ్రాంలు  తీసుకోండి.

  • ఫ్లాక్’సీడ్సు (అవిసె గింజల): వీటీలో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటి యాసిడ్సు  పుష్కలం. ఆరోగ్య పరిరక్షణగా రోజూ ఓ స్పూన్ మీరు తీసుకొనే పుల్కాలలో మిక్సు చేసుకోండి.

  • స్వీట్ పొటాటొ: ఇందులో యాంటిఆక్సిడెంట్సు పుష్కలం. మెరుగైన మెటబాలిజానికి వీటిని వారంలో 1 లేక 2 మార్లు వాడుకోండి. దీని సహజరుచిని మీరు ఇష్ట పడుతారు. అయితే వీటిని  ఫ్రై చేయకండి. ఆవిరిలో వుడికించండి. డయాబిటిస్ భాదితులు కొద్ది మోతాదుల్లో తీసుకోవచ్చు. 
  • ఆఫిల్’లో యాంటి ఆక్సిడెంట్సు, మినరల్సు, ఫైబర్లు పుష్కలం. ఇందులోని యాంటి ఇంఫ్లమెటరి గుణాలు శరీరంలోని అంతర్గత వాపులనుంచి రక్షణ ఇస్టుంది. వీటిని చెక్కు తీయకుండా,  ట్యాప్’వాటర్’లో  పరిశుభ్రపరచి  తీసుకొవాలి.
  • రెడ్ వైన్: ఇది చెడుకొలోస్ట్రాల్’ని, బ్లడ్’కాన్సర్లని  నియంత్రించే లైఫ్’సెవర్. పరిమిత మొతాదు ల్లో వారంలో 2 లేక 3 మార్లు దీని రుచులను ఆస్వాదించండి.
  • ఫాలీస్’లేని బ్రౌన్’రైస్’లో ఫైబర్ పుష్కలం. ఇది జీర్ణక్రియని తేజొవంతం చేస్తూ  కోలన్’వ్యవస్థని హెల్తీగా వుంచడానికి సహయకారి అవుతుంది. కండర వ్యవస్థని, మష్తిష్కం ని ఉత్తేజభరితంగా వుంచడంలో ఆలంబన అవుతుంది.
  • అలసందలు, మినుములు, పెసలు , శనగలు, రజ్మ, కిడ్ని బీన్సు, అవిసె గింజల వాడకం గుండెని హెల్తీగా వుంచడంలో ప్రాధాన భూమికని కలిగి వున్నాయి. మస్టిష్కంకి పదును పెడ్తాయి.బ్రెయిన్ పవర్ ఉత్తేజితం కావడానికి సహయకారి.
  • తేన: ఇందులో అపారంగా లభ్యమయ్యే యాంటి ఆక్సిడెంట్సు, బయొ  ఫ్లెవరాయిడ్సు, మినరల్సు, ఎంజైంలు , ప్రొటిన్లు రోగనిరోధక వ్యవస్థని ఉత్తేజపరుస్తుంది, ఇమ్యునిటిని తీసుకవస్తుంది. వీర్యవృద్దిని పెంపొందిస్తుంది. లోపటినుంచి యవ్వనంగా వుంచుతుంది. కాన్సర్ల నుంచి రక్షణగా నిలుస్తుంది. ఇంతటి సుగుణాల నిధి హనిని డైలీ  ఓ స్పూను సుగర్ కి బదులుగా వాడుకోండి. సుగర్ భాధితులు పరిమిత మోతాదులో దీనిని స్వీకరించవచ్చు.
  • డార్కు చాక్లేట్లు : వీటి రుచులని ఇష్ట పడని వారు ఎవరైన ఉన్నారా చెప్పండి.ఇందులోని కోకొ ద్వారా లభ్యమయ్యే ఫ్లెవరాయిడ్లు ధమనుల వ్యవస్థని ప్రేరేపిస్తూ హెల్తీగా వుంచడంలో ఉపయోగకారి. వారంలో 1 లేక 2 చాక్లేట్లు తీసుకోవచ్చు. డాయబిటీసు భాధితులుకూడా పరిమితంగా తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకోకండి లేకుంటే అవి తీసుకవచ్చే అధిక కెలోరీలని బర్నింగ్ చేయడానికి ఎక్కువుగా శ్రమించాల్సి వస్తూంది.
  • గ్రీన్ టీ: రోజు 1 లేక 2 కప్పులు తీసుకోండి. ఇందులోని యాంటి ఆక్సిడెంట్సు యాంటి ఇంప్లమేటరీగా , యాంటి కాన్సర్ కారకాలుగా ఆరోగ్య పరక్షణలో ప్రధాన పాత్రని పోషిస్తాయి. మార్పుకోసం తులసి, పుదినాలతో గ్రీన్  టీ తయారు చేసుకోండి. వీటీ సహజ రుచులు మిమ్మలని ఉత్తేజభరితులని చేస్తాయి.