Thursday, 30 April 2015

18. విజయశైలి - మీ సామర్ధ్యాన్ని ఇలా పెంపొదించుకోండి...





నేనే చేయగలను అనే అతివిశ్వాసాన్ని, నేనేమి చేయలేను అనే అల్పవిశ్వాసాలకి దూరంగా వుండాలి, ఎందుకంటే అతివిశ్వాసం తరచుగా వివక్షన, విచక్షనలు లోపించి పెరుగుదలకి ప్రతిభందకాలు అయితే, అల్పవిశ్వాసం ఆ పనిలో అసలు ముందడుగుని వేయించాడానికే ప్రతిభంధకం అవుతుంది. అందుకని నేను చేయగలను అనే అనే సానుకూల భావోద్వేగ ధోరణిని అలవర్చుకొనే ధృక్ఫదాన్ని పెంపొందించుకోవాలి, అది ఆత్మవిశ్వాసానికి ఆలంబన అవుతుంది. సాదించబోయే విజయాలకి విజయపధం అవుతుంది.
 సానుకూల ధృక్పాధాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
o   అందానికి, ఆరోగ్యానికి నిద్రకి ప్రత్యక్ష సంబంధం వుంది. తగినంత నిద్రలేకపోతే దాని ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడంవల్ల మెమొరి పవర్ పెరుగుతుంది. సుఖనిద్రవల్ల మెదడు పునర్వ్యవస్తీకరణ జరిగి సృజనాత్మకత పెరుగుతుంది. నిద్రలో అనేక శరీర కణాలకు రెపేర్లు జరుగుతాయి. జీవవ్యవస్థ మెరుగౌతుంది. నాణ్యమైన కొత్తకణాలు తయారవుతాయి. ఈ కొత్తకణాలు కొత్త అందాన్నిస్తాయి. అందుకనే ఎదైనా ఒక మంచి పని చేయాలన్న, నేర్చుకోవాలన్న అదమరచి నిద్ర పోవాలి. నిద్రసమయంలో మెదడుసహ మనలోని ప్రధాన వ్యవస్థలు విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని రకాల హర్మొన్లు విడుదలవుతాయి. ఈ హర్మొన్లు మన శరీరానికి, మనస్సుకి, చర్మానికి ఎంతగానో ఉపయొగపడుతాయి. 
o   తగినంత నిద్ర లేకపోవడం నిద్రలేమికి కారణమవుతుంది. నిద్రలేమి మిమ్మలని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తుంది. అందుకని ప్రతిరోజు కనీసం ఎడుగంటలు నిద్ర తప్పనిసరి. కొందరు పగలు ఓ మూడు గంటలు, రాత్రిల్లు ఓ నాలుగు గంటలు నిద్రపోతూ తగినంతగా నిద్ర పోయినట్లుగా భావిస్తారు, కానీ నిద్ర అనేది కంటిన్యూగా వుండాలి అపుడే మెదడుకి తగిన విశ్రాంతి లభిస్తుంది. ఇది జీవనగడియారం సక్రమంగా నడవడానికి అత్యవసరం. పరీక్షల సమయంలో ఇది గతి తప్పుతుంది, అయితే పరీక్షల అనంతరంకూడా సరిఅయిన నిద్రపోవకపోతే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. వారంలో మూడు రోజులుమించి సరిఅయిన నిద్రలేకపోవడం, నిద్రనుంచి తరచుగా మధ్యలో లేవడం తరువాయి సరిగా నిద్రపోకపోవడం కూడా నిద్రలేమిగానే భావించాలి!! ప్రతిరోజు చక్కటి నిద్రకి, మానసికవిశ్రాంతికి యోగనిద్రని సాధన చేయాలి.
o    యోగనిద్ర మీలో సానుకూల బావోద్వేగాలకు ప్రేరణ అవుతుంది.  మానసిక ఉద్విగ్నత, ఓటమి, కల్లోలాల భావనలని అధిగమించే సమ్యక్ సిద్దిని సాధించే మార్గాన్ని అవగతం చేస్తుంది. డిన్నర్ ముగించిన రెండున్నర గంటల అనంతరమే యోగనిద్ర సాధన చేయాలి. ఆలస్యంగా డిన్నర్ చేసే అలవాటుకి స్వస్తి చెప్పి, రాత్రి భోజనం 7.30కి లోపుగా ముగించేట్లుగా అలవాటుచేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/blog-post_19.html
o   ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉండాలి. ప్రతి విఫలప్రయత్నం విజయఫధానికి దగ్గరికి చేరుస్తుంది అనే నమ్మకంతోనే పయనం సాగించాలి. ప్రయత్నలోపం లేనంతవరకి విజయావకాశాలకి ద్వారాలు తెరిచి ఉంటాయి. మొదలుపెట్టిన ప్రయత్నం మధ్యలో విరమిస్తే అపజయమే నీకు కానుక! అందుకని నమ్మకంతో ప్రారంభించే ఏ పని అయిన ప్రతికూల భావనలతో మొదలెట్టకండి. ఆ భావనల పరంపరలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడడం జరుగుతుంది. తడబాటు నిర్ణయాలు పోటిలో నిన్ను వెనుకవరుస లోనికి నెట్టివేస్తాయి. నీలో పిరికితనాన్ని పెంచుతుంది.
o   పనిలోని సాధారణ ఒత్తిడి మీలోని ప్రతిభకి మెరుగు పెడుతుంది, అదే అపరిమితమైతే మానశిక ఒత్తిడిగా మీలోని ధారుడ్యాన్ని బలహీన పరుస్తుంది, బ్లడ్ లో గ్లూకోజు లెవెల్సుని తగ్గిస్తుంది. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. శరీరంలో గ్లూకోజ్ త్వరగా ఖర్చు అవుతుంది. మానసిక ఒత్తిడి, టెన్షన్లను దూరంచేస్తూ మానసికానందం, శాంతి, ఆహ్లాదాల అనుభూతులకి తరగని నిధిగా మెడిటేషన్ని ప్రతిరోజు సాధన చేయండి. మెడిటేషన్ శరీరంలోని కొన్నిరకాల టాక్సిన్లని మెరుగైన శ్వాసక్రియ ప్రక్రియ ద్వార సమర్థవంతంగా తొలగిస్తుంది. మస్తిష్కంలో ఆలోచనాపరిధి విస్తృతమౌతుంది, నూతనభావాలతో ప్రేరణ పొందుతుంది, మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_18.html
o   నేనే తెలివైనవాడిని, యుక్తిపరున్ని అనే అహంభావం నుంచి దూరంగా ఉండాలి, లేకుంటే అదే ఓ పెద్ద బలహీనతగా మారే ప్రమాదం ఉంది! మేధోవంతులతో సాన్నిహితాన్ని పెంపొదించుకోవాలి. అది మీలోని ప్రతిభకి మెరుగులు దిద్దుతుంది. వ్యక్తిత్వవికాసానికి మిత్రుల నుంచి వచ్చే సలహలని, సూచనలని తప్పక స్వీకరించాలి, మీలోని బలహీనతలని సరిదిద్దుకోవడానికి ఇది ఒక వేదిక అవుతుంది.
o   నిన్ను నీవుగా నమ్మక, విశ్వసించక అపనమ్మకంతో ఆరంభించే ఏ కార్యానికి అయిన కార్యసిద్ది లభించదు, ఎందుకంటే మనస్థైర్యం నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉండకపోవడమే! స్వశక్తి పై నమ్మకం లేకుంటే సోమరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీలోని ప్రతిభ, సామర్థ్యాలను పెంపొందించుకోవాలి, వాటిపై నమ్మకాన్ని పెంచుకోవాలి!! నిరంతరసాధనే ఈ పోటి ప్రపంచంలో నీవు చేసే ప్రతిపని అంతర్గత శక్తుల ప్రేరణతో విజయపధం వైపుకి నడిపిస్తుంది.

o   అతిజాగరుత, సందిగ్థత, సంశయం, అనుమానం, అభద్రతలు మీ సామర్ధ్యానికి జారుడుమెట్లు! ఇవి నిన్ను అసమర్ధుడి జీవనపయనం దిశలో నడిపిస్తాయి! ఈ జారుడుమెట్లని సమర్థవంతంగా అధిగమించాలి, అపుడే విజయపథం వైపు దూసుకవెల్లడానికి మార్గం సుగమం అవుతుంది!! 

19. విజయశైలి - ఒత్తిడులను ఇలా వదిలించుకోండి..







నేటి పోటి వాతావరణంలో  ప్రతి రంగంలో తమకి నిర్ణయించిన లక్ష్యాలను సాధించే జీవన గమనంలో  నేడు మనం ఒత్తిడులతోనే సహజీవనం సాగించేస్తున్నాం. ఈ ఒత్తిడులను ఓస్థాయి వరకు ఛాలెంజీగా తీసుకోవడంద్వారా అది మీలోని మేధస్సు, ప్రతిభ, ప్రజ్ఙ్లలకి గీటురాయి  అవుతుంది.  అయితే  ఈ లక్ష్యాలు మీ సమర్థతకి మించిన స్థాయిలో వుంటే  అది తీవ్ర ఒత్తిడి, ఆంధోళణ ,అలజడులకు కారణం అవుతుంది.  ఈ స్ట్రెస్సుని తరచుగా  ఎక్కువకాలం కొనసాగితే అది  మెదడులోని రసాయనాల  సమ్మేళణాలలో అసమతుల్యతలకి కారణం అవుతుంది. అది భావోద్వేగాలలో తరచు మార్పులకి గురిచేస్తుంది. అది మిమ్మలని తీవ్రనిరాశ, నిసృహలకి గురి చేస్తుంది. మీ మానశిక స్థైర్యాన్ని అందోళణలకి గురిచేస్తుంది. ఇక మీలోని సామర్ధ్యాన్ని తిరోగమ దిశలో నడిపించేస్తుంది. అసహనం, విసుగు, కోపాలని తీసుక వస్తుంది. కొర్టిసోల్ లాంటి స్ట్రెస్ హర్మొనుల ప్రాభల్యాన్ని పెంచేస్తుంది.  ఈ దశ నుంచి వీలైనంత త్వరగా బయటకి రాగలగాలి. దానిని సమర్థవంతంగా మీ చేతల్లోకి తీసుకోవాలి.  మనలో వుండే ఒత్తిడులను, స్ట్రెస్ హర్మొనుల ప్రాబల్యాన్ని మీరు ఇలా ప్రయత్నిస్తే దూరంగా వుంచగలరు.


o   చేరలేని లక్ష్యాలకి  ఎటువంటి అపోహలు లేకుండా, ఆత్మవిశ్వాసంతో 'నో' చెప్పగలగాలి  వాటిని సహేతుకమైన కారణాలతో సున్నితంగా తిరస్కరించాలి.   అపుడు లక్ష్యాలని రివిజన్ చేయడానికి అవకాశాలు మెండుగా వుంటాయి.


o   సహోద్యోగులతో, మిత్రులతో సరదాగా వుండండి. చిరునవ్వులతో పలకరించండి. ఈ  చిరునవ్వులు  మీ మనస్సులో హ్యపి కెమికల్సుని ప్రేరేపిస్తాయి అవి స్ట్రెస్ హార్మొనులనులపై పట్టు సాధిచదానికి సహయపడుతాయి మిమ్మల్ని సంతోషానికి దగ్గరచేస్తూంది, సంతోషంగాను వుంచుతుంది. చిరునవ్వు ఓ అందమైన ఆభరణం. దానితోనే నేస్తం సాగించండి. కొర్టిసోల్ హర్మోనుని సహజరితిలొ అదుపులో ఉంచుకోవడానికి మనస్సుని సంతోషానుభూతులతో వుండనివ్వాలి.  ఈ సహజినవజీవనశైలి ని ఇలానే కొనసాగనివ్వాలి.

o   డైలీ మీ మదిలోని భావనలని ఓ జర్నలులో రికార్డు చేయండి. దీనిని తరచుగా తిరగేయండి. ఇది మీ భావాతరంగాల సరళికి నావిగేటర్  అవుతుంది.

o   చేసే పని మీలో ఒత్తిడిని పెంచుతుంటే ఆ పని నుంచి తాత్కాలికంగా  బ్రేక్ తీసుకోండి, మీ ఫ్యామిలితో కలిసి సరదాగా ఓ విహరయాత్రని ప్లాను చేసుకోండి. అది మీలో చక్కటి మార్పుని , జీవనమాధుర్యాన్ని తీసుక వస్తూంది.

o   సంసారిక జీవితాంలో శృంగారానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఏండార్ఫిన్ల  విడుదలని ప్రోత్సహిస్తూ అలసిన మనువు, తనువులను సేదదీరిస్తూ మీ జీవితాన్ని రసమయం చేస్తుంది. వారంలో కనీసం ఒకటి, రెండుమార్లు ఈ సంసారికమధురిమలని మీ లైఫ్ పార్ట్నరుతో అస్వాదించండి

o   మీ వర్కు స్టేషన్ని ఓ చిన్న మొక్కతో అలంకరించండి. తరచుగా వర్కు స్టేషన్ విండో నుంచి పకృతిని ఆస్వాదించండి. అది అలసటలని దూరం చేస్తుంది.

o   డల్ గా వున్నప్పుడు ఓ డార్కు చాక్లేట్ తీసుకోండి. అందులోని చక్కెరలు, ఫ్లేవరాయిడ్సు శరిరంలో ఏండార్ఫిను లెవల్సుని ప్రేరింపించి మీ మనస్సుని డల్నెస్ భావనలకి దూరం చేస్తాయి.

o   వారంలొ నాలుగు నుంచి ఐదు గంటల సమయాన్నిఆట పాటలకి ,శారీరక క్రీడలైన వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, జిం, ఎరోబిక్సు లకు కేటాయించాలి. అది బ్రెయిన్ లో ఏండార్ఫిన్ల విడుదలకు సహయకారి అవుతూ కొర్టిసోల్ హర్మోనుని సహజరీతిలో సమర్థవంతంగా నియంత్రించడానికి సహయకారి అవుతుంది.

o   విటమిన్ ‘డి’ లోపం మానశిక ఒత్తిడికి కారణం అవుతుంది అని పలు అధ్యాయనాలు తెలియజేస్తున్నాయి. ఇది సహజంగా సూర్యరశ్మి ద్వార మనకి లభిస్తుంది. అయితే ఎక్కువగా ఏ.సి గదులలో పనిచేసే ఐ.టి ఉద్యోగస్తులలో ఈ విటమిన్ లోపం తరచుగా గుర్తించడం జరుగుతోంది. ఈ లోప నివారణ చర్యగా రోజు ఓ గంట ఆరుబయట నీరెండలో గడపడంద్వారా శరీరానికి తగినంతా సూర్యరశ్మిని అందచేయాలి.


o   మీ చిన్నారులని మీతో దగ్గరగా వుండే అందమైన పార్కులకి రెగ్యులర్గా తీసుకవెళ్లండి. సూర్యోదయాన్ని/ సూర్యాస్తమయాన్ని అది తీసుకవచ్చే అరుణొదయ కాంతుల సొగసులను మనసారా అస్వాదించండి. పకృతిలో మమేకం అవండి.

o   రోజు ఓ అరగంట ముందుగా నిద్రలేవండి, దీర్ఘ శ్వాసక్రియని సాధన చేయండి. ఈ సాధన రోజులొ కనీసం 30 నిముషాలు అభ్యసించడంవల్ల మీ జీవక్రియ, జీవనక్రియలలో జరిగే మార్పులను ప్రస్పుటంగా కేవలం 6 నుంచి 8  వారాలలో గమనిస్తారు.  మానశిక ఆందోళణల క్రమబద్దీకరణ, మెరుగైణ రక్త ప్రసరణల ద్వారా బి.పి. సాధారణ స్థాయికి చేరడాన్నికూడా గుర్తించగలరు.   కొర్టిసోల్ హర్మోనుని సహజరితిలో అదుపులో ఉంచుతుంది. మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/07.html

o   తనువు, మనువుల పరిరక్షణలో మెడిటేషన్ సాధన నమ్మకమైన ఫలితాలను మీ సొంతం చేస్తుంది. ఇది మానశిక ప్రాశాంతతని సాధించడానికి మరియు మానశిక ఆందోళణలను నియంత్రించడానికి ఓ చక్కటి వేదిక అవుతుంది. రోజు 30 నిముసాల సాధన ద్వార కేవలం 8 వారాలలో మెదడులోని న్యూరాన్ వ్యవస్థ సంఘటితం అవుతుంది. స్ట్రెస్ హర్మోనులపై పట్టు సాధించగలరు.  మరిన్ని వివరాలకు ఈ లింకుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com /2014/11/blog-post_18.html

o   నారింజ, బత్తాయి, లెమన్ లాంటి సిట్రస్ జాతి ఫలాలు విటమిన్’ సి’ కి తరగని నిధులు. ఇది రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. వీటిని రోజువారి ఆరోగ్యకర ఆహరాలుగా మీ మెనులో చేర్చుకోవాలి. అందులోని యాంటి యాక్సిడెంట్లు , ఫ్లేవరాయిడ్సు మీలో అహ్లోదకర అనుభుతులకి దగ్గర చేస్తాయి,  మెటబాలిజాన్ని మెరుగుపరుస్తూ మిమ్మలని ఆరొగ్యవంతంగా ఉంచుతూ సత్వరశక్తిని యిస్తాయి.

o   పండ్లలో ఫైబర్, పొటాషీయం, విటమిన్లు, మైక్రో నూట్రీషీయంట్లు, ఎంజైంలు, యాంటియాంక్సిడెంట్సు పుష్కలంగా వుంటాయి. ఉపాహారంగా వారంలో మూడుమార్లు ఆయా సీజన్లలో దొరికే పండ్లని తీసుకోవాలి. ప్రతిరోజు విధిగా ఆయా సీజన్లలో దొరికే రెండు రకాల పండ్లు తినాలి అనే నియమాన్ని తప్పక పాటించండి.

o   ఫిష్, డ్రైనట్సు ఒమెగా 3 ప్యాటీ యాసిడ్సు, విటమిన్ E ల సంవృద్దితో మస్తిష్కంకి ఎంతో ప్రయోజనకారి. వీటిని రెగ్యులరుగా తీసుకోవడం ద్వారా డోపోమైన్ హార్మొనులస్థాయి నిలకడగా వుండడానికి తోడ్పాటు అవుతుంది. అది మీలో సంతోషకర భావనలకి ప్రేరణ అవుతుంది, మానిశిక ఆందోళనలని దూరంగా ఉంచుతుంది.

o   సెరోటొనిన్ హార్మొనులు మానశిక ఆందోళణలను, అతృతలని, స్ట్రెస్ భావనలని దూరంగా వుంచుతుంది.  ఇందుకు క్రమశిక్షణ కలిగిన సహజ జీవన శైలి, ఆహర అలవాట్లు, సంసారిక జీవనం , తగినంత శారిరక శ్రమ, విశ్రాంతి ప్రధాన భూమికలని పోషిస్తాయి.