Sunday, 22 February 2015

16. ఆహారపథం VI ఆరోగ్యాన్ని పెంపొందించే డ్రైనట్సు…


 



డ్రైనట్సు కాజు, పిస్త, బాదం, వాలునట్సు, పల్లీలు ఆరోగ్యకరమైన ఆహరాలు అయితే అందులోవుండే అధికకెలోరీలు, కొవ్వు బరువునిపెంచే అనారోగ్యకర ఆహరాలుగా  చాలమందిలో  అపోహ వుంది.  వాస్తవానికి డ్రైనట్సు అపార పోషకనిధుల సంతులితఆహరాలు. వీటిని పరిమితమొతాదులో వాడకంద్వార హానికరంకాని మంచికొవ్వు, ప్రొటిన్లు, ఫైబర్లు, మినరల్సు, విటమిన్లు, యాంటియాక్సిడెంట్లు, సహజసిద్దమైన స్టిరాయిడ్సు లభిస్తాయి అవి ఆరోగ్యపరిరక్షణకి చాలాఅవసరం. వీటిని వుడకించకుండా తీసుకోవడం శ్రేయస్కరం అయితే నానబెట్టిన నట్సులో ఫొషకవిలువలు రెట్టింపు అవుతాయి అందుకని అలా తీసుకోవడం మరింత శ్రేయస్కరం. టేస్టుకోసం ఉప్పు, కారంలని కలపకండి లేక ఆయిల్సులో ప్రై చేయకండి, అసక్తి ఉంటే పెప్పెరుపౌడరుని వాడుకోండి. వీటిని సహజరీతీలో తీసుకోండి. ఇవి చాలారకాల కాన్సర్లను, హృదయసంభందిత వ్యాధులను, గాల్ స్టోన్సు, ఉదరకోశ వ్యాధులను, నిరోధించడానికి, గ్లూకోజు లెవల్సుని, మెరుగైన మేటబాలిజాలకి చేయూత అవుతుంది.
డ్రైనట్సు తీసుకోవడం ద్వార మనకు లభించే ఆరోగ్యప్రయోజనాలు:

o   డ్రైనట్సు తీసుకోవడంద్వారా సమతుల్యమైన బరువుని సాధించుకోవచ్చు. అందుకే డైటులో ఓ భాగంగా రోజు ఐదు నుంచి ఆరు నట్సుని మించకుండా తీసుకోవచ్చు.

o   డ్రైనట్సులోని యాంటియాక్సిడెంట్లు కణనిర్మాణంలో కీలకపాత్రని పోషిస్తూ, కణహీనతలనుంచి రక్షణని తెస్తాయి, అది కాన్సర్ల నుంచి దూరంగా ఉంచడానికి సహయపడుతాయి.

o   వీటిలోని E విటమిన్ కంటిచూపుని పరిరక్షిస్తాయి. మరియు ధమనులు గట్టిపడనీయకుండ మృదువుగా ఉండడానికి తోడ్పడుతాయి.

o   వీటిద్వార లభించే కొవ్వు కొలొస్ట్రాలు లెవెల్సుని పెరగనీయవు, అందులోని ఫైబర్లు ఆకలి భావనలను దూరం చేస్తాయి.

o   ఇవి సూక్ష్మధాతువులు అయిన మాంగనీసు, పోటాషీయం, మాగ్నీషియం, కాల్షియంలకు అపారనిధులు. అవి ఆరోగ్యపరిరక్షణలో కీలకపాత్రని పోషిస్తాయి.

o   ఇందులోని యాంటియాక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర సూక్ష్మధాతువులు చర్మాన్ని అరోగ్యవంతంగా ఉంచుతూ మృదుత్వాన్ని, లావణ్యాన్ని తీసుకవస్తాయి.

o   ఇందులోని B7 విటమిన్లు ఆరోగ్యవంతమైన శిరోజాలపెరుగుదలకి మరియు సంరక్షణకి ఉపయొగపదుతూ జుట్టురాలడాన్ని తగ్గిస్తాయి.

o   ఇవి ప్రొస్టేటు క్యాన్సరువ్యాప్తిని 30% నుంచి 40% వరకు నియంత్రించడానికి సహయకారి అవుతుంది. 

o   ఇవి స్తనసంపదని ఆకర్షణియంగా ఉంచడానికి, బ్రెస్టు క్యాన్సరువ్యాప్తిని నియంత్రించడానికి సహయపడుతుంది

o   ఇవి మెటబాలిజక్రియని మెరుగుపరుస్తాయి, అందుకే డయాబిటిసుభాదితులు వారానికి ఓ పావుకప్పు వాలునట్సుని తీసుకోవడం వాంచనీయం. 

o   వాలునట్సు ఒమెగా3ఫ్యాట్సు, విటమిన్ E ల సంవృద్దితో మస్తిష్కంకి ఎంతో ప్రయోజనకారి. మానిశిక ఆందోళనలని దూరంగా ఉంచుతుంది.

o   వాలునట్సు రెగ్యులరుగా తీసుకోవడం ద్వార ఆరోగ్యవంతులైన యువకుల్లో వీర్యవృద్దికి దోహదపడుతుంది

o   బాదం, వాలునట్సు వాడకం రక్తపోటుని సాధరణస్తాయిలో ఉంచడానికి సహయ పడుతాయి.

o   పల్లీలు, కాజులలోని కాల్షియం నిధులు బోనువ్యవస్థకి, మరియు గుండెకి ఎంతో మేలుని తీసుక వస్తాయి

o   గర్భిణిగా ఉన్నపుడు బాదం పప్పులు రెగ్యులరుగా తీసుకోవడంద్వారా తల్లికి, శిశువుకి సమీకృత పోషకవిలువలను అందచేస్తాయి. వీటిద్వార లబబించే ప్రోటీన్లు శిశువులో చక్కటి కండర నిర్మాణానికి ఉపయోగపడుతాయి. ఇందులోని ఫైబర్లు తల్లిని మలబద్దకము నుంచి పరిరక్షిస్తాయి. ఇందులోని విటమిన్ A శిశువు జుట్టుపెరుగుదలకి, మృదువైన చర్మనిర్మాణానికి తోడ్పడుతుంది. వీటీలోని కాల్షియం నిధులు తల్లిలో బిపి   స్తాయిలని క్రమబద్దీకరిస్తాయి.ఇందులోని మాంగనీసు సమతుల్య బరవులని సాధించడానికి అవసరం. వీటిలోని మాగ్నీషియం నాడీమండల వ్యవస్థని బలోపేతం చేస్తుంది. ఇందులో విటమిన్లు A, B1, B2, B5, B6, B9, E, మరియుK ఆరోగ్యపరిరక్షణకి ఆలంబన అవుతాయి. ఇవి శిశువుకి ఎటువంటి ఫుడ్ అలర్జీలు దరిదాపుకి చేరనీయవు. తల్లికి నట్సు అలర్జి ఉంటే ముందుగా దాక్టరు సలహాని తీసుకోని వీటి వాడకాన్ని ప్రారంబించాల్సివుంటుంది.

o   పిల్లలో వ్యాధినిరోధకవ్యవస్థని మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లలలో నాడీవ్యవస్థ, బోనువ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థలు బలోపేతం అవుతాయి. వీరికి కాజు, బాదం, వాలునట్సులని, పల్లీలని సమపాళ్లలో తీసుకొని ఓ రాత్రి నీళ్లలో నానబెట్టండి. మరునాడు నీడలో వీటిని ఆరనీయండి, ఆరిన ఈ నట్సుని పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. మీ చిన్నారులకి ఇచ్చే ఆహరంలో ఈ పొడులమిశ్రమాన్ని, ఓట్సులని కలగలిపి 40:60 గా మిక్సుచేసి రోజుఇవ్వాలి. ఇది బలవర్ధకమైన సమతుల్య పొషకాహారం అవుతుంది.
 
o   డ్రైఫ్రూట్సుతో చేసిన లడ్డులను పిల్లలు బాగా ఇష్టపడుతారు. వీటి తయారిలో నూగులు, ఫాక్సుసీడ్సుని కూడా జత చేసుకోండి. వీటిని వారంలో రెండు నుంచి మూడమార్లు ఇవ్వండి. ఈ లడ్డులలో చక్కెరకి ప్రత్యామ్నాయంగా కొద్దిగా బెల్లం, తేనె, ఎండుద్రాక్ష, కర్ర్జురాలని వాడాలి.

o   కర్జురాలు సూక్ష్మపోషకాలు, విటమిన్సు, మినరల్సుకు నిధులు. రోజు మూడూ, నాలుగు కర్జురాలను తీసుకోండి. మీ చిన్నారులకి స్నాక్ ఐటంగా ఇవ్వండి. రాత్రి ఐదారు ఎండు కర్జురాల ముక్కలని మంచినీళ్లలో నానబెట్టండి. ఆ నీటిని చిన్నపిల్లలతొ ఉదయం తాగించండి. వీటి రుచిని ఇష్టపడుతారు.ఇందులోని ఫ్లోరిన్ దంతసంరక్షణకి, ఐరన్ రక్తహీనరహితానికి   తోడ్పాటు అవుతుంది.

o   కర్జురాలలోని పొటాషియం నరాలవ్యవస్థని, ఫైబరు జీర్ణవ్యవస్థని, ప్రొటీన్లు శారీరకవ్యవస్థని ఆరోగ్యంగా వుంచుతాయి. ఇందులో B1, B2, B3, B5, C మరియు A1 విటమిన్లు ఉన్నాయి ఇవి కంటి చూపుని మెరుగుపరుస్తాయి. ఉదరకోశ క్యాన్సరు నుంచి రక్షణ ఇస్తుంది. చెడు కొలొస్ట్రాలుని తగ్గిస్తుంది.  ఇందులోని ‘లో’ కెలోరీలు ఆరోగ్య పరిరక్షణకి మేలు చేస్తాయి.

o   వారంలో మూడుసార్లు డ్రైఫ్రూట్సుని రెగులర్గా తీసుకోవడం ఓ అలవాటుగా చేసుకోండి. ఈ అలవాటు ఆరోగ్యకర జీవితానికి, ధీర్గాయుస్సుకి కారణం అవుతుంది.

o   ప్రతిసారి పది నుంచి పదిహేను గ్రాములు మించకుండా వారానికి రెండుమార్లు రెగ్యులర్ వీటిని తీసుకోవడం ఓ అలవాటుగా చేసుకోవడం ద్వారా పాంక్రియాసుక్యాన్సరు భారి నుంచి రక్షణ పొందవచ్చు.
డ్రైనట్సు, డ్రై ఫ్రూట్సులపై అపోహలు వదలి మీ డైటులో వీటిని ఓ భాగంగా చేర్చుకొనండి, వాటి అపార ఫలితాలను, రుచులను మనసరా అస్వాదించండి.

Tuesday, 10 February 2015

15. ఆహారపధం V బ్లడ్ షుగరు లెవల్సుని ఇలా నియంత్రించుకోండి...


నాగరిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఇటివల వివక్షణ రహితంగా వచ్చిన మార్పులు, కూర్పులు, చేర్పుల ఫలితంగా ఈ సమాజంలో ఓ అవలక్షణంగా చక్కెరవ్యాధి ఆంధోళనకరస్థాయిలో విస్తరిస్తున్నాది. ఒకప్పుడు నలబై సంవత్సరాల వయస్సు పైబడినవారిలో అగుపించే ఈ లక్షణాలు నేడు ఇరవై నుంచి ఇరవైఐదు సంవత్సరాలా యువతలో కూడా అగుపించడం మనం గమనిస్తున్నాం. ప్రతి ఐదుగురిలో ఇద్దరు చక్కెర వ్యాధిభాధితులే అని గణాంకాలు చెబుతున్నాయి.  ఇందుకు ప్రధాన కారాణాలు శరీరానికి తగినంత వ్యాయమం ఇవ్వకపోవడం, తీసుకునే ఆహరాలు ప్రధానంగా జంకుఫుడ్సు మరియు సూక్ష్మ పోషకాల లోపభరితం కావడమే! చక్కెరవ్యాధిని సమర్థవంతంగా నియత్రించుకోవడానికి సహజ జీవనశైలీలో సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకోవడం ప్రారంభించాలి.


o   పండ్లలో ఫైబర్, పొటాషీయం, విటమిన్లు, మైక్రో నూట్రీషీయంట్లు, ఎంజైంలు, యాంటియాంక్సిడెంట్సు పుష్కలంగా వుంటాయి. ఉపాహారంగా వారంలో మూడుమార్లు ఆయా సీజన్లలో దొరికే పండ్లని తీసుకోవాలి.

o   ప్రతిరోజు విధిగా ఆయా సీజన్లలో దొరికే రెండు రకాల పండ్లు తినాలి అనే నియమాన్ని తప్పక పాటించండి.

o   ఉపాహారంగా వారంలో నాలుగుమార్లు మొలకెత్తిన సజ్జలు, అలసందలు, పెసర, రాగి, శనగ గింజలని తీసుకోవాలి, మొలకెత్తించిన గింజలు సూక్ష్మపోషకాలకి, ఫైబర్లకి మరియు ప్రొటిన్లకి రెట్టింపు నిధులౌతాయి!!

o   నానబెట్టినవి నాలుగు లేక ఐదు కాజు, బాదం, పిస్తా, పల్లి పప్పులనుకూడా తీసుకోండి. అవి ప్రొటీన్లు, విటమిన్లు, ఓమెగా 3 కొవ్వు సముదాయాలతో ఆరోగ్యమైన ఆహారాలు. ఎక్కువగావాడితే బరువును పెంచేస్తాయి కాబట్టి వీటి వాడకంలో పరిమితులు విదించుకోవాలి.

o   జామకాయలోని ఫైబర్, విటమిన్ సి లు గ్లూకోజునిల్వలను కంట్రోలు చేస్తాయి. అవకాశం ఉన్నంతకాలం చెక్కుతీయని జామకాయలని రోజూ తీసుకోండి, మరియు చవకగా లభిస్తాయి.

o   సీతాఫలంలో మాగ్నీషీయం, పోటాషియం, ఐరను, విటమిన్ సి లు మరియు యాంటి డయాబిటిక్ గుణాలు బ్లడ్ షుగరులెవల్సుని నియంత్రిస్తాయి. సీజన్లో స్నాక్ గా ఓ ఫ్రూటు తీసుకోండి

o   కమలఫలాలో విటమిన్ సి పుష్కలం, షుగర్లు తక్కువగా ఉంటాయి. వీటిని రెగులర్గా తీసుకోండి.

o   కివి పండ్లని కూడ రెగ్యులర్గా తీసుకొండి ఇందులోని సూక్ష్మపోషకాలు గ్లూకోజు లెవెల్సుని నియంత్రిస్తాయి. ఇవి ఫ్రిడ్జులో ఐదు, ఆరువారాల వరుకు నిల్వఉంటాయి. 

o   పుచ్చకాయ, కర్బుజాలు తక్కువ  షుగర్సుని కలిగి ఉంటాయి. వీటిని మీరు వాడుకోవాలి. 

o   ఫైన్ ఆపిలు, ఆపిల్, దానిమ్మ లని కూడా తీసుకొండి ఇందులోని యాంటి ఆక్సిడెంట్సు మీకు ఎంతో అవసరం.

o   నేరేడు పండ్లలోని ఇలాజిక్ రసాలు పాంక్రియాసుని ఉత్తేజపరుస్తుంది అందుకని వీటిని మీరు తీసుకోవాలి.
 

o   తాజా వెజిటబులుసలాడ్సు’ లో ‘కేలోరీల్ని కలిగివుంటాయి అందుకని వీటితోనే ప్రతిసారి భోజనంని ఆరంభించాలి, అది భోజనంలో 40% దాకా వుండాలి. అది మీ టమ్మిని నిండుగావుండేట్లు చేస్తుంది.

o   ప్రతి రోజు 20 నుంచి 25 గ్రాములు ఉల్లిపాయలని తీసుకోవాలి, అవి ‘లో’ కెలోరీల ఆరోగ్యకరమైన ఆహరం.

o   గుమ్మడిలో A, C విటమిన్లు, పోటాషియం, ఐరను, ప్రోటీన్లు, యాంటి ఆక్సిడెంట్సు విరివిగా లభిస్తాయి అందుకని అపుడపుడు తగుమొతాదులో గుమ్మడిని నిరభ్యంతరంగా తిసుకోవచ్చు.

o   అలవాటువుంటే వారంలో ఒకటి, రెండుమార్లు ఓ ఉడకబెట్టినగుడ్డుని తీసుకోవచ్చు, ఆమ్లేటుగా తీసుకోవద్దు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
o   కాకరకాయజ్యూసుని పరగడపున తీసుకోండి ఇందులోని పెప్టిటైడ్సు గ్లూకోసులెవెల్సుని తగ్గించాడనికి సహయపడుతుంది, లేదా ఇగురుగా భోజనంలో తీసుకోవచ్చు.
o   ఉసిరికాయలో విటమిన్ C పాంక్రియాసుకి ఉపయొగకారి. ఉసిరి జ్యూసిని ఓ గ్లాసు పరగడుపున తీసుకోండి.
o   పరగడుపున తాజా కరివేపాకులను ఓ గుప్పెడు తీసుకోండి అది పాంక్రియాసు లోని కణాలని సంరక్షిస్తాయి.
o   లేత వేపాకు చిగురుని ఓ గుప్పెడు పరగడుపున తీసుకోవడం ద్వారా అది రక్తశుద్దికి తోడ్పడుతుంది.
o   తాజా లేత మామిడి ఆకులని రాత్రి మంచినీళ్లలొ నానవేయండి. పరగడుపున నీళ్లు తాగండి. లెదా మామిడాకులను మంచినిటిలో మరగబెట్టి    నీటిని తరచుగా  త్రాగండి. అవి ఇన్సులిను స్తాయిని పెంచడానికి సహకరిస్తుంది.
o   మిరియాలపొడిని వేడి పాలలో కలిపి పడుకొనే ముందు తరచుగా ఓ కప్ తీసుకోండి. రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. గాయాలు త్వరగా తగ్గుతాయి.
o   గ్రీన్ టీని తరచుగా తీసుకోండి అది పాంక్రియాసుని ఉత్తేజపరుస్తూ ఇన్సులిన్ తయారికి ప్రేరణ అవుతుంది. 
o   జింజర్ టి ఇన్సులిన్ స్తాయిని పరిరక్షిస్తూ, బ్లడ్ సుగర్సుని నియంత్రించడానికి దోహదకారి అవుతుంది.
o   దాల్చినచెక్క పౌడరుని కొద్దిగా గ్లాసునీళ్లలో కలిపి వారంలో రెండుమార్లు నైటుటైం తీసుకోండి, అది టాక్సిన్సుని శుభ్రపరుస్తూ లివరువ్యవస్థని సక్రమంగా పనిచేయుస్తుంది.
o   నైటు డిన్నరుని ఆకుకూరలతో రెండు లేక మూడు పుల్కాలతో ముగించాలి, ఆహరాన్ని ప్రతిరోజు ఒకే సమయంలో తీసుకోవడం అభిలషణీయం.
o   ఓ చెంచ మెంతిపౌడరుని ఓ కప్పు వెన్నతీసిన పాలతో కలిపి వారంలో నాలుగు నుంచి ఐడు సార్లు నైటుటైం తీసుకోండి, అది పాంక్రియాసుని ఉత్తేజపరుస్తుంది.
o   ఓ గ్లాసు టమొటాజ్యూసు, క్యారెట్ జ్యూసు, లెమనుజ్యూసు, పైన్ ఆపిల్ జ్యూసు, పాపాయజ్యూసులలో ఒక దానిని కాఫీ, టీ లకి ప్రత్యమ్నాయంగా స్నాక్ టైంలో తీసుకోండి. అది పాంక్రియాసుని ఉత్తేజపరుస్తుంది
o   కాల్సియం బలిష్టమైన బోనువ్యవస్థకి అవసరం అందుకని లస్సి /పెరుగు పై ఆధారపడితే అందులోని కెలొరీలు బరువునికూడా పెంచుతాయి. అందుకే వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అయితే ప్రత్యమ్నయంగా బట్టరుమిల్కుని రెగ్యులరుగా తీసుకోవచ్చు.
o   పాలు పౌష్టికాహారం అయినా అందులోని కొవ్వు మీలో కొలోస్ట్రాల్ని పేంచివేస్తుండి, అందుకే వీటి వాడకం రోజుకి ఒకకప్పుని మించరాదు, అవికూడ వెన్నతీసిన పాలు అయితేనే ఆరోగ్యకరం.
o   మందుకాని మందు అల్కహాలు తీసుకునే అలవాటు ఉంటే వారానికి ఒకటి, రెండుమార్లు పెగ్గు మించకుండా తీసుకోవచ్చు, అది కొలోస్ట్రాలుని కరగించడానికి సహయపడుతుంది. అయితే ఇందుకోసం కొత్తగా అలవాటు చేసుకోకండి.
o   షుగరుకి బదులుగా తేనేని వాడుకోవాలి. అందులోని ఔషదగుణాలు ఎనలేని శ్రేయస్సుని పంచిపెడ్తాయి.
రోజు మంచినీళ్లు మూడు నుంచి నాలుగు లీటర్లు త్రాగలి. వీటి అవశ్యకత వివరాలకి’ జీవధార...జీవనధార’ ఆర్టికలుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/blog-post_15.html
యోగసాధన సాంప్రదాయక పద్దతిలో కేవలం అరగంటపాటు ఎనిమిది నుంచి పది వారాలు ప్రతిరోజు కొనసాగించడంద్వార రోగనిరోధక వ్యవస్త బలోపేతం అవుతుంది, రక్తంలో గ్లూకోజుస్తాయి సాధరణ స్థితికి రావడానికి దోహదం అవుతుంది. మరిన్నివివరాలకియోగసంజీవణీ’ ఆర్టికలుని క్లిక్ చేయండి http://rvnsetty.blogspot.com/2014/11/07.html
 
 
 
 
 
 
 
 

 
 

Sunday, 1 February 2015

14ఆహార పధం III బరవుని ఇలా తగ్గించుకోండి..


 
మనం తీసుకొనే ఆహరం పోషకభరితంగా, వైవిధ్యపూరితంతో, వివక్షణాపూరితంగా వుండాలి. నేటి సమాజం ఇటీవలకాలంలో సాధించిన అబివృద్ది ఫలాలతో ఉన్నత జీవనప్రమణాలతో మన కొనుగోలుశక్తి మెరుగుపడింది, దీనితో బలవర్ధకమైన అహరాలు ఆధిక కేలోరిల ఆహరాలపై మనం మక్కువ పెంచుకున్నాం. పర్యవసానంగా ఒబెసిటి అన్నది మనలో సాధారణమైంది. 50% కి పైగా నేడు ఒబెసిటి భాదితులే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆందోళనకరస్థాయిలో నేడు వేగంగా నగరాలలో విస్తరిస్తున్నాది. నేటియువత ఒబెసిటి అధిగమించడానికి డైటింగుని ఆశ్రయిస్తున్నారు. అయితే డైటింగులో నాణ్యత, వైవిద్యభరితం ఉన్నపటికి బరువును వదిలించుకోలేక నిరాశపరులవుతున్నారు. ఇందుకు కారణం వీరుతీసుకొనే కొన్నిరకాల ఆహరపధార్థాలు ఆరోగ్యకరమైనప్పటికి అధికకెలొరీలతో బలవర్ధకాలు కావడమే! అందుకని వాటి వాడకంలో వివక్షత చూపించాల్సిందే!

o   పాలు పౌష్టికాహారం అయినా అందులోని కొవ్వు కొలోస్ట్రాల్ స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటి వాడకం రోజుకి ఒకటి, రెండు కప్పులని మించరాదు, అవికూడ వెన్నతీసిన పాలు అయితేనే ఆరోగ్యకరం.
o   లస్సి /పెరుగు కాల్సియంకి నిధి బలిష్టమైన బోనువ్యవస్థకి అవసరం కాని అందులోని కెలొరీలు బరువునికూడా పెంచు తాయి. అందుకే వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అయితే ప్రత్యమ్నయంగా బట్టరుమిల్కుని రెగ్యులరుగా తీసుకోవచ్చు.
o   అరటిపండు, మామిడికాయ, ధ్రాక్ష, పనస, సపోటాలలో కేలొరీలు ఎక్కువే అవి బరువుని మరియు చక్కెర నిల్వలను పెంచుతాయి, అందుకే వీటిని ముఖ్యంగా డయాబిటీసు భాదితులు తక్కువ మొతాదులో తీసుకోవాలి.
o   ఫ్రూట్ సలాడుతో ఐసుక్రీముని, డ్రై ఫ్రూట్సుని, షుగర్ని రుచులకోసం కలపకండి, ఆసక్తి ఉంటే తేనెని కలుపుకోండి. తేనేలోని యాంటి బాక్టిరియల్, యాంటి ఆక్సిడెంట్లు మిమ్మలని ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయొగపడుతాయి.
o   కాజు, బాదం, పిస్తా, పల్లీలు ప్రొటీన్లు, విటమిన్లు, ఓమెగా 3 కొవ్వు సముదాయాలతో ఆరోగ్యమైన ఆహారాలు అయితే కెలరీలకినిధులు, బరువును పెంచుతాయి, అందుకే నానబెట్టిన డ్రైనట్సుని వారంలో ఒకటి, రెండు సార్లు రోజుకి ఐదు, ఆరుకి మించి తీసుకోవద్దు.
o   డ్రై ఫ్రూట్సు ఆరోగ్యకరమైన ఆహరం కాని అవి కేలోరీలనిధులు అందుకని ప్రత్యమ్నాయంగ తాజా పండ్లు తీసుకోవాలి.
o   వెజిటబుల్ సలాడ్సులో బట్టరు, కాజు, బాదం, పిస్తాలని కలపరాదు రుచికోసం కెచప్ ని తీసుకోవద్దు.
o   రెడ్ వైన్ లోని యాంటి ఆక్సిడెంట్లు మేలుని కలుగచేస్తాయి కాని అందులోని కెలొరీలు బరువుని కూడా పెంచుతాయి, అందుకని పరిమితంగా తీసుకోవాలి.
o   గుడ్డునిఉడకబెట్టి తీసుకోవాలి కాని దానిని ఆమ్లేటుగా తీసుకుంటే అందులో వాడే ఆయిల్ ద్వార కొవ్వు పెరుగుతుంది.
o   తేనీరులోని ఫ్లెవరాయిడ్సు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తూ మిమ్మలని ఆరొగ్యవంతంగా ఉంచుతూ సత్వరశక్తిని యిస్తాయి కాని పాలు, చక్కెరలు లేకుండా ఒకటి, రెండు కప్పులు ప్రతి రోజు సేవించండి.
o   వెజ్ శాండ్విజ్ /వెజ్ బర్గర్లులతోపాటు రుచికి వాడే కెచ్ అప్, మెయో, బట్టర్లు మీ బరవుని పెంచేస్తాయి.
o   శీతలికరణ ఆహరాలలో ప్రిజర్వేటివుగా వాడే షుగర్తో ఎంప్టీ కెలరీలు అదనంగా జమ అవుతాయి.
o   ఎనెర్జిబార్సు తక్షణ శక్తిదాయకాలు అయితే ఎంప్టి కెలరీలు మీ సొంతం అవుతాయి
o   డార్కు చాక్లేట్లలోని ఫ్లెవరాయిడ్సు ఆరోగ్యకర మైనవే కాని అవి తెచ్చే కెలరీలు మీ బరవుని పెంచేస్తాయి, అందుకని అలవాటు వుంటే వారానికి రెండు, మూడు చాక్లేట్లు తీసుకోండి.
o   సీరియల్సు ఉపాహారానికి అనువైనవే కాని ప్రిజర్వేటిఉగా వాదే సోడియం, షుగర్ లని గురించి ఆలోచించండి. అలవాటు వుంటే వారానికి ఒకటి, రెండుసార్లు తగు మోతాదులోతీసుకోండి.
o   కూకీసు కేలోరీలకి నిధులే అందుకని వాటిని దూరంగా ఉంచాలి.
o   వడియాలు, అప్పడాలతో అదనంగా కెలొరీలు జమ అవుతాయి, బరవుని తగ్గించుకోవాడానికి సహకరించవు. అలవాటు వుంటే వారంలో ఒకసారి మితంగా తీసుకోవాలి.
o   అరటికాయ చిప్సు, ఆలు చిప్సు, మరి చిప్సు అయినా ఎంప్టి కెలోరీలతో బరవుని పెంచేస్తాయి, అందుకని వీటిని వాడకండి.
o   పూరీలకి నూనేని బాగా వాడుతారు అందులోని ఆధిక కేలోరీలు బరవుని, కొవ్వుని జమచేస్తాయి బదులుగా పుల్కాలు డైలీ తీసుకొవచ్చు.
o   దోశ, ఊతప్పం, మసాలదోశలలో వాడే నెయ్యి/బట్టరు/నూనెలు మీలో అదనపు కెలోరీలు మరియు కొవ్వుని జమ చేస్తాయి, బరువుని మరియు అనారోగ్యాన్ని తీసుకవస్తాయి, అందుకని ప్రత్యమ్నయంగా అవిరితో తయారయ్యే ఇడ్లీలను అల్లం/పుదీన చట్నీలతో తీసుకోండి.

మీరు పాటించే డైటింగ్ జీరో కేలోరీలు, తక్కువ కేలోరీలతో సూక్ష్మపోషక భరితంగా సాత్వికాహరంగానే ఉండి తీరాలి.

వారంలో ఐదు నుంచి ఆరు గంటలు మీకు ఆసక్తికరమైన క్రీడని, వాకింగునిగాని విధిగా చేసి తీరవలసిందే        
 వివరాలకోసం ఆర్టికలుని క్లిక్ చేయండి. http://rvnsetty.blogspot.com/2014/12/09.html