Thursday, 5 March 2015

17. ఆహారపధం VII వేడీ వేడీగా ఇడ్లీ సాంబార్!!


మనందరం బాగా ఇష్టపడే రెసిపి సాంబారు. దీనిని తయారుచేసుకోవడం తేలిక. ఓంటరిగా ఉంటే ఉడిపి హోటల్ నుంచి కూడా దీనిని కొనుక్కోవచ్చు. ఇందులో పప్పుగింజలని విరివిగా వాడుతారు కాబట్టి అవసరమైన ప్రోటీన్సు, ఫైబర్లు లభ్యమౌతాయి. అయితే పోషకసంవృద్దికోసం ఇందులో పచ్చి బఠాణిలు, అలసందలు, బీన్సు, పొటాటో, క్యారెట్, బ్రోకోలి, ఆనియన్, గార్లిక్ క్లోవ్సు, సీజన్లో దొరికే టమోట, గుమ్మడి, బెండ, వంకాయ, సొరకాయలను కూడా వాడుకోవచ్చు.  ఇవి రెసిపిలో 70 శాతంగా ఉండాలి. ఇవే గాకుండా మీకు ఇష్టమైన ఫ్రేష్ వెజిటబుల్సుని వేటినైన వాడండి. మునగకాడలు లభ్యమైతే విధిగా విరివిగా వాడుకోండి. ఇందులోని కాల్షియం బోన్ వ్యవష్థకి బలాన్ని తీసుకువస్తుంది. ఎండు కారాన్ని వాడరాదు అయితే పచ్చిమిర్చిని లేదా పెప్పర్ని వాడుకోండి.          రెసిపి జీర్ణవ్యవస్థని ఆరోగ్యవంతంగా, జీర్ణక్రియని సమర్థవంతంగా ఉంచుతుంది. ఆసక్తి ఉంటే బజారులో దొరికె మంచి దినుసులతో తయారైన సాంబారుపొడిని కూడా వాడుకోవచ్చు. రుచికోసం తీపిమీద ఆసక్తి ఉంటే కొద్దిగా బెల్లం వాడుకోండి. సాధారణంగా తీపిని వాడనవసరం లేదు. తాలింపుల్లో వెన్నని వాడుకోండి.  సర్వుచేసే ముందు కొత్తిమీరతో గార్నిషింగ్ చేయండి.
 
వేడీ, వేడీ ఇడ్లీలతో సాంబారు కాంబినేషన్ని ఇష్టపడని సౌత్ ఇండియన్ బహుశా ఉండకపోవచ్చు. మీ బామ్మ కొద్దిగా పొట్టుతీయని మినపప్పుతో ఇడ్లీని తయారుచేయడం మీకు గుర్తు ఉండేఉంటుంది, పరంపరలోనె వీటీని తయారుచేసుకోండి. ఇడ్లీలు ఆవిరిమీద తయారావుతాయి కాబట్టి ఎక్కువ పోషకాలు వంటలో నష్టపోవు. వీటీని నెయ్యి, కారపుపోడులతో తీసుకొనేఅలవాటుని ఆరోగ్యరీత్యా ఆపివేయాలి. ఆసక్తి ఉంటే పుదీన లేదా అల్లంచట్నీలని వాడుకోవచ్చు.


సాంబారురైసుకూడా ఇంకో మన ఫేవరేట్ డిష్ అయితే దినిని వేడివేడిగానే తీసుకోవాలి. పాలీషుచేయని ముడిబియ్యంతో దీనిని తీసుకోవడం ఆరోగ్యరీత్యా మంచిది. షుగర్ వ్యాదిగ్రస్తులు దీనిని తప్పకపాటించాలి. వీరి రెసిపిలో గుమ్మడి, స్వీట్ పొటాటోలని తక్కువుగా వాడాలి.

 సాంబారు రెసిపిలో వాడే చింతపండుపులుసు మంచి ఔషధకారిణి, మరియు విరోచనకారి. ప్రేవువ్యవస్థని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, థయామిన్, మాగ్నిషీయం, పోటాషీయంలు సంవృద్దిగా లభ్యం, అది మిమ్మలని ఆరోగ్యభరితంగా ఉంచుతుంది. కాని రెసిపిని రోజుతీసుకొనే అలవాటు కొన్ని ఇండ్లలో ఉంది, అలా చేయడం జీర్ణవ్యవస్థ అందులోని ఔషదగుణాల నుండి రెసిస్టెన్సిని పొందుతుంది, అది వాంచణీయం కాదు.  అందుకని రోజులో ఒకసారి వారంలో రెండు నుంచి మూడు సార్లు మించి  తీసుకోకండి. మజ్జిగపులుసుని కూడా ప్రత్యమ్నయంగా ట్రై చేయండి. దానిరుచి మిమ్మలని మళ్లీ మళ్లీ తీసుకొనే కోరికని కలుగచేస్తుంది.

No comments:

Post a Comment