Wednesday, 7 January 2015

12. ఆహారపధం IV ఆరోగ్యానికి హానికరమైన ఊరగాయ?!



ఆవగాయ, మాగాయ, ఊరగాయ, నిల్వపచ్చళ్లు అంటే ఇష్టం కాని తెలుగువారు ఎవరైనా ఉన్నారా? మన ఇంట్లో బామ్మగారి ఫేవరేట్ ఐటం కూడా ఇదే మరి! అవి ఎందుకు అంత ఇష్టం అయినాయి అంటే వాటి నోరూరించే రుచి మీ జిహ్వకి, అభిరుచులకి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే రోజూ మీ మెనులో ఇది ఓక తప్పనిసరి అయిటంగా చేరిపోయింది. ఇంతగా అవి మనలని ప్రభావితం చేయాడానికి వాటిలో వాడే ఉప్పు, కారం, పులుపు, నూనెలు, మసాలాలు, తీపి పదార్దాల సమీకరణాలే... ఇవి పికిల్సుని ధీర్ఘకాలం నిల్వ ఉంచుతాయి. ఈ పికిల్సు ఎంతటి ప్రాచుర్యాన్నిపొందాయి అంటే చివరికి కూరగాయలకి బదులు చేపలు ఇతర మాంసాహారాలతో కూడా నేడు మార్కెట్లలో ఇవి పుష్కలంగా లభ్యం. రోజు వీటిని కొద్ది,కొద్దిగా తీసుకున్నప్పటికి, సంవత్సరాల తరబడి వాడడంద్వారా ఆరోగ్యరీత్యా శరీరానికి హానికరం.

o   నిల్వపచ్చళ్లలోని ఉప్పునిల్వలలో సోడియం సాంద్రత అధికమొతాదులో ఉంటుంది అది బీపి భాదితులలో బీపి లెవెల్సులో హెచ్చుమార్పులకు కారణం అవుతుంది, అందుకని పచ్చళ్లని వీరు వాడకపోవడం సర్వదా శ్రేయస్కరం.

o   తరచుగా తీసుకొనే ఊరగాయలోని ఉప్పు,కారాలు  జీర్ణకోశం చుట్ట్తు అంటిపెట్టుకొనిఉన్న సన్నటిపలుచటి మ్యూకసుపొరని నిరంతరం  రాపిడికి గురిచేస్తుంది, జీర్ణవ్యవస్థపై ప్రతికూలప్రబావన్ని తిసుకువస్తుంది. అది కడుపులోమంటలకి, చిన్నప్రేవు వ్యవస్థలో అల్సర్లకు కారణం అవుతుంది.

o   గాఢమైన సోడియంసాంధ్రత శరీరంలో ద్రవాభిసరణ సమతుల్యతలని సాధించడానికి నీటినిల్వలని అధిక మోతాదులో నిల్వచేసుకోవాల్సిన పరిస్థితిని కలుగ చేస్తుంది. అది శరీరాంగాలలో నీరుగాచేరుతుంది, ఆరొగ్యపరమైన సమస్యలని తీసుకువస్తాయి.

o   ధీర్గకాలం నిల్వచేయడానికి వాడే నూనెలు, అతిసాంద్రతలో సోడియం, ఇతర దినుసులు శరీరంలో ట్రైగ్లిజరైడ్సుల స్థాయిని అందోళనకరస్థాయికి పెంచుతుంది.

వెన్నతీసినపెరుగులో కలిపిన ఊరగాయని, పుదీనాలతో తీసుకుంటే అది కొద్దిగా ఉపశమనాన్ని ఇస్తుంది. పచ్చళ్లని, కూరలని నిత్యం తాజాగానే తీసుకోవాలి. నిమ్మరసాన్ని ఉప్పుకి బదులుగా,కారంకి పచ్చిమిర్చిని, పులుపుకి చింతకాయ, పుల్లటి మామిడికాయని ప్రత్యమ్నాయంగా వాడుకోవాలి, అది మీ జిహ్వచాపల్యానికి తృప్తినితెస్తుంది. నూనేలని వంటలలో వాడకపోవడం ఆరోగ్యరీత్యా అభిలషణీయం. జీరో మరియు లో కెలోరీల ఆహారం మిమ్మల్ని స్లింగా, ఆరోగ్యాభరితంగా ఉంచుతుంది. సవివరాలకి  చదవండి మానససాత్విక్...

No comments:

Post a Comment