Saturday, 26 September 2026

రానా కవితలు 10 ప్రతీరోజు పండుగే !!!

 

ప్రతీరోజు పండుగే !!!



అహం ప్రేమను ఆవిరిచేస్తుంది 

అసూయ అనురాగాన్ని అవిరిచేస్తుంది

ద్వేషం ఆప్యాయతని అవిరిచేస్తుంది

ఉద్రేకం సహనాన్ని అవిరిచేస్తుంది

ఆగ్రహం ఆనందాన్ని అవిరిచేస్తుంది

సంశయం నమ్మకాన్ని అవిరిచేస్తుంది

నిరాశ సంతోషాన్ని అవిరిచేస్తుంది

ఈ నియంత్రణలేమి మీ ప్రశాంతతను అవిరిచేస్తుంది 

జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది…


భయం ధైర్యాన్ని అవిరిచేస్తుంది

భయం పిరికితనాన్ని చేరువ చేస్తుంది

పిరికితనం వివేకాన్ని దూరం చేస్తుంది 

పిరికితనం నిన్ను భీరువును చేస్తుంది

ఇక నీ పయనం 

అసమర్ధుని జీవనయాత్రగా కొనసాగుతుంది…


మొహం అవివేకంను చేరువ చేస్తుంది

అవివేకం కామంను చేరువ చేస్తుంది

కామం క్రోధాన్ని ఆలింగనం చేసుకుంటుంది 

క్రోధం లోభాన్ని దరి చేర్చుకుంటుంది

క్రోధం విచక్షణను అవిరిచేస్తుంది

లోభం తీరని అసంతృప్తికి వేదిక అవుతుంది 

కామ, క్రోధాలు యుక్తయుక్తాలను దూరం చేస్తుంది 

కామ,క్రోధ,లోభాలు మదిలో వికృత తాండవం చేస్తాయి 

మనస్సును సంపూర్ణంగా ఆవహిస్తాయి 

నిన్ను కోపిష్టిగా, పరమ లోభిగా, దుర్వసనపరుడినిగా చేస్తుంది…


నిన్ను మోహితుడిని చేసేది ఈ అరిషడ్వర్గాలు 

వాటి మాయజాలం ను గుర్తించు

వాటి ప్రవర్తనను నిశితంగా గమనించు 

వాటిని ప్రశ్నించు,తిరస్కరించు,త్యజించు 

ఇక 

జీవితం ప్రతి రోజు పండుగే!!!


మీ 

పరిమళ కిశోర్ 

+44 7859 935246


No comments:

Post a Comment