Saturday, 15 November 2014

02. యోగ జీవనశైలి - ఉల్లాసంగా… ఉత్సాహంగా!!


నేటి ఆధునిక జీవనవిధానం పాశ్చత్య నాగరికతల ప్రలోభాలకి ప్రభావితమైన విలాసభరిత జీవితాలుగా మారింది.  
లేట్ నైట్ డిన్నర్లు, పార్టీలు, తినడానికే మనం అనే ధోరణిలో తీసుకొనే జీరొ కేలరిఫుడ్సు, పబ్ సంస్కృతులు, ఆలస్యంగా నిద్రపోవడాలు మన ఆహరశైలీలో వచ్చిన విస్తృతమైన మార్పులు.   
ఏక్కువసమయం కూర్చునిపనిచేసే వుద్యోగాలు, శారీరకవ్యాయం లేకపోవడం, ఆలస్యంగా నిద్రలేవడాలు నేటి జీవనసరళిలో కనిపించే సాధరణ దృశ్యాలు.
ఈ సాంఘిక, సామాజిక, ఆర్ధికస్థితులలో వచ్చిన విలక్షణమార్పులు మన సంస్కృతికి, వ్యక్తిగతవిలువలకి, సామజికవిలువలకి పెనుసవా ల్లుగా పరిణమించాయి.
క్రమశిక్షణ లోపించిన జీవనవిధానం, ఆహరనియమాలు, శారీరకవ్యాయామలు, ఆహరశైలీలోని మార్పులు, మనలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరుని ప్రభావితం చేస్తున్నాయి, దాని పర్యనసానమే బిపి, సుగర్, నిద్రలేమి, బ్రాకైంటీస్, సైనస్, ఒబెసిటి లాంటి శారీరక రుగ్మతలదరికి దగ్గర చేస్తున్నాయి.

చేసేవృత్తులలో, పనులలో వుద్యోగాలలో నిరంతరం పెరిగుతున్న వత్తిడి, అభద్రతాభావాలకి మానసికవేదనలకి నిలయాలుగా మారుతున్నాయి. 
ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఉల్లాసభరితంగా, ఉత్తేజభరితంగా, ఆరోగ్యవంతంగా జీవనప్రయాణం కొనసాగాడానికి మానసికవేదనలకి అలంబనగా ప్రతికూలభావోద్వేగాల పరంపరలు అయిన నిస్తేజం, నిరాశక్తత, నిర్లిప్తత, కోపం, ఆందోళనలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ అనే భావనకి తూట్లు పొడుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే తరగని సిరిని దూరం చేస్తున్నాయి. అందుకే ఈ ప్రతికూలభావోద్వేగాలని సదా మనఅదుపులో వుంచాలి. వాటిపై ఆధిపత్యమే సుఖజీవనానికి నాంది అవుతుంది.

దిగులు, భయం, అనుమానం, అసంతృప్తి, అహం, అజ్ఞానం, చిరాకు, ఒంటరితనం, నిస్తేజం, నిరాశక్తత, నిర్లిప్తత, ఆందోళన, కోపం, పిరికితనం, అసహనాలు అనే వ్యక్తిగత బలహీనతల బంధాలను బలహీనపరచు కోవాలి. ఈ జీవితాన్ని ఆనందమయంగా, ఆరోగ్యవంతంగా ముందుకు నడిపేది, నడిపించేది కేవలం ఈ బలహీనతలపై ఆధిపత్యాన్ని సాధించే మానసిక స్థైర్యమే!!
నేనేమిచేయలేను అనే ప్రతికూల భావోద్వేగాలను, నేనే ఎమైనచేయగలను అనే అతివిశ్వాసాన్ని వదిలి, నేను చేయగలను అనే సానుకూల భావోద్వేగాల తో మీ దశ, దిశలని నిర్ణయించుకొని క్రమశిక్షణ, ధీక్షాశిక్షణలతో బలమైన ముందడుగు వేయాలి. మీలోని ఆత్మపరిశిలన, ఆత్మవిమర్శలనే ఆయుధాలకి పదునుపెట్టండి. అవి అభద్రతభావాలను మీనుంచి దూరంచేస్తాయి.
సంతోషకరమైన, అహ్లాదకరమైన జీవనాన్ని సాగించడానికి ఓ వ్యూహంతో నూతన ప్రణాళిక తయారు చేసుకోవాలి. దానిని అమలుచేసే పట్టుదల, నమ్మకం, విశ్వాసం మీలో వుండాలి. నమ్మకం, విశ్వాసంలేని ఏ ప్రయత్నమైన నిష్ప్రయోజనమే!!
ఓటమికి వెరవరాదు. అది తీసుకవచ్చే అనుభవాలాతో కొత్తగా ప్రయత్నించాలి. ఓటమి భయంతో ప్రయత్నం చేయకపోవడం అది మీలోని పిరికితనానికి చేయూత అవుతుంది. ప్రయత్నం చేయకపోవడం మీకు ఎన్నో అముల్య అవకాశాలను దూరం చేస్తుంది. మిమ్మల్ని నిరశావాదులుగా మిగిల్చివేస్తుంది. ఓటమినుంచే గుణపాఠం నేర్చుకోవాలి!  విజయానికి దాన్నే మార్గంగా చేసుకోవాలి!! ప్రతి పరాజయం సాదీంచబోయే విజయాలాకి ఓ ఆవకాశం అవుతుంది!!!
ఈ జీవనంలో ఓటమిఎరుగని విజయం లేదు.ప్రతి ఓటమి మీలోనిధీరత్వానికి ప్రేరణ కావాలి. అది గెలుపుకొసం పట్టుద లని పెంచుతుంది. మిమ్మల్ని విజయసాధనలో ముందుకు నడిపిస్తుంది. యోగ నవజీవనంలో ఎదురయ్యే సమస్యలని చాలెంజిగా తీసుకోనే సానుకూల భావోద్వేగాలకి, మానసిక స్థైర్యానికి ప్రేరణ అవుతుంది అని శాస్త్రీయ పరిశోధనలలో ఋజువైంది. ఆది నీవుచేసే పనులలో, వృత్తిలో, సమాజంలో ముందు వరుసలో ఉంచుతుంది.



యోగ ఓ నవ జీవనవిధానం అది మీ ఆలోచనలని, తనువుని, మనస్సుని అనుసంధానం చేసే ఆధ్యాత్మిక భావనాసరళి. యోగసాధన విధ్యార్ధులు, యువకులు, పిల్లలు, యువతులు, గర్భిణీలు అందరు మానశిక వికాసానికి పెంపొందించు కొనడానికి ఆచరించదగిన నమ్మకమైన జీవనశైలి. ప్రేమ, కరుణ, దయ, జాలి, అప్యాయత, అనురాగం, అబిమానం, అర్థ్రతలకి ఆలంబనగా అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
ఇక నవజీవనప్రయాణాన్ని ఆరంభించండిమీ జీవనశైలిలో కొద్దిమార్పులని, స్వల్పచేర్పులని అంగీకరించాలి. సహజ జీవనశైలిని మనఃపుర్తిగా ఆహ్వానించాలి అది మీలోని సాదారణ బలహీనతలను దూరంగా వుంచడానికి వేసే మొదటి అడుగు అవుతుంది.
మీ వ్యక్తిగత వ్యూహప్రణాళికని మెరుగైన, ఆశించిన ఫలితాలను సత్వరంగా సాధించే విధంగా దానిని క్రియాశీలకంగా అమలు పరచాలి.
సహజజీవనశైలి సహజత్వానికి ప్రతీక. ఇది దినచర్యలో స్వల్పమార్పులతో మొదలవుతుంది. ఫ్రతిఫలంగా మీకు ఏనలేని శాంతిని, సంతోషాన్ని, ఆహ్లాదాన్ని మరియు ఆరోగ్యాన్ని మీ జీవనమార్గంలోనికి తీసుకవస్తుంది.సాధారణ వ్యాధులను దరి చేరనీయకుండా రక్షణకవచంగా మారుతుంది.
ఆరోగ్యవంతంగా, ఆరోగ్యభరితంగా మిమ్మల్ని నడిపించడానికి మీకు మొదటిగా కావల్సింది సంవృద్దిగా జీవధార, జీవనధార!!
ఇక పయనం ఆ దిశలొ సాగిద్దాం.







No comments:

Post a Comment