Wednesday, 26 November 2014

04. యోగ జీవనశైలి - యోగ ఓ ట్రెజర్ హౌస్ & సుర్యనమస్కారాలు



మానసికప్రశాంతత, ఉల్లాసం, ఉత్సాహాలకి ఓ ట్రెజర్ హౌస్ మనలోనే ఉంది. అయితే ఈ ట్రెజర్ హౌస్ నీ తెరవడానికి కావలసిన తాళంచెవిని కనిపెట్టడం లోనే వుంది అసలైన కిటుకు. అది మనచేతల్లో,చేతుల్లోనే వున్నది అనేనిజాన్ని గుర్తించాలి. ఈ 'కీ' మనల్ని శారీరకంగా, మానసికంగా మనలోని వ్యక్తిగత బలహీనతలపై ఆధిపత్యం సాధించదానికి ఆ పై చక్కటి ప్రశాంతతని పొందడానికి నూతన మార్గాన్ని అవగతం చేస్తుంది.
ఇందుకోసం ఎటువంటి ప్రిస్కిప్షన్ ఫీజుని, మెడిసిన్ కాస్టుని, ఎక్విపుమెంట్ కాస్టుని కోరుకోని 'కీ' ఇది!
నిజమైన ఈ డాక్టరు మీతోనే, మీవెనువెంటనే ఉన్నాడు.  ఏవరి మనతో, మనలో వుండే ఈ డాక్టరు? ఇది వాస్తవమేనా? ఈ డాక్టరుగారి సేవలు ఎలా ఉపయొగించుకోవాలి? దీనికి సమాధానం మనలో వుండే ఈ డాక్టరుని మన హైందవ నాగరికత సుమారు 5000 సంవత్సరల క్రితమే గుర్తించి మానవాళికి అపురుపకానుకగా అందజేసింది….అవును ఇది యధార్థం!! అదే ‘యోగ’
హిందుత్వం నుంచి శాఖోపశాఖలుగా విస్తరించి భౌద్దయిజం, జైనయిజంలతో కలిసి ఆసియాలో బహుళ ప్రాచూర్యం పొందింది. 19వ శతాబ్దంలో యోగగురు వీవేకానందద్వార పాశ్చత్యనాగరికతలు వీటి విలువలను గుర్తించాయి.  హిందువారసత్వ గ్రంధాలు అయిన హఠయోగప్రధీపిక, శివసంహిత, రాజయోగ, పతంజలి యోగసూత్రాలు ప్రామాణికాలుగా నేడు యోగశిక్షణ ఆభ్యాసం విశ్వవ్యాప్తాంగా జరుగుతున్నాది.
విశ్వసనీయమైన ఫలితాలను గుర్తించిన పలు కార్పోరేటు సంస్థలు నేడు తమ ఉద్యొగులకి ‘యోగశిక్షణ శిబిరాల’ను తమ క్యాంపస్ లలో నిర్వహిస్తున్నాయి.
పాశ్చత్యదేశాలు యోగప్రాశస్యతని గుర్తించి యోగక్లాసులను ప్రోత్సహిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా యోగశిక్షణకి ఎనలేని ఆదరణ లభిస్తున్నది అంటే అతిశయొక్తి కాదు. అయితే మన అందరికి తెలిసిన ఈ ప్రాధమిక విషయాన్ని ఈ సందర్బంలో మననం చేసుకోవాలి.
మనం గాలి లేకుండా కొన్ని నిముషాల కంటే ఎక్కువుగా జీవించలేము. అదే నీరులేకుండా కొన్నిరోజులు జీవించగలం. అదే ఆహరం లేకుండా కొన్ని వారాలు జీవించడానికి అవకాశంవుంది.అంటే జీవించడానికి, జీవక్రియ సమర్థవంతంగా నిర్వర్తించడానికి కావల్సింది శ్వాసక్రియ. ఆశ్వాసక్రియని క్రమబద్దీకరించగలిగిన శక్తివంతమైన ప్రక్రియే యోగ.
దీర్గశ్వాసక్రియ ఆరోగ్యానికి రహదారి. అటువంటి శ్వాసని సమర్థవంతంగా నిర్వర్తించడానికి యోగకళలో మెడిటేషన్ చక్కటి మార్గదర్సి ఔతుంది.
నీవు నీ ఆత్మ, తనువు, మనస్సలతో అనుసంధానమై ఓ విహాంగంలా మనసిక ప్రశాంతతని అనుభవించే స్థితికి మార్గం అవగతం చేస్తుంది మెడిటేషన్..!! మానసిక స్థైర్యాన్ని, విచక్షణని, వివేకతలకు అనుసంధానిస్తూ మానసిక దౌర్బల్యాలకి స్వస్తి చెప్పే కళే యోగ..!!!
o   యోగ ద్వార మీ శరీరంలోని కండారాలు ఉత్తేజితమై తమ సహజ మృధుత్వాన్ని సంతరించుకుంటాయి. శరీరం తేలిక అయిన అనుభూతిని తీసుక వస్తుంది.
o   కార్టిలేజ్ వ్యవస్థ కూడా మృధుత్వాన్ని సంతరించుకోని శక్తివంతం అవుతుంది. ఆర్థరైటీస్ భారి నుంచి సమర్థవంతంగా కాపాడుతుంది.
o   సరి అయిన శారీరక భంగిమ ద్వార /యోగాఆసన ద్వార వెన్నముక బలొపేతం అవుతుంది. ఇది వెన్నముక వ్యవస్థకి సంరక్షణని తీసుక వస్తుంది.
o   రక్త ప్రసరణ శరీరాంగాలకు సక్రమంగా అందడానికి తోడ్పాటు అవుతుంది. లింఫాటిక్   వ్యవస్థ బలోపేతం అవుతుంది. అది అన్ని వయస్సుల వారిలో కూడా రోగనిరోధక వ్యవస్థని తేజోవంతం చేస్తుంది.
o   కొద్దిరోజుల ఆభ్యాసంతో సరియైన విశ్రాంతి, ఘాడమైన నిద్రద్వారా అహ్లాధకరమైన నిద్రానుభూతి, మెరుగైన మానశికస్థితితో మానశిక ఆందోళన/అలజడులపై నియంత్రణలని సాధిస్తుంది అని పలు అధ్యాయనాలు తెలియజేస్తున్నాయి. 
o   మీ మనస్సుకి యోగప్రశాంతతని చేకూరుస్తుంది. ప్రేమ, కరుణ, దయ, జాలి, ఆర్థ్రత అనే భావనలకి ఆలంబన అవుతుంది.  అది జీవితంలోకి ఆహ్లదాన్ని, నిర్మలత్వాన్ని తీసుకవస్తూంది.  నిద్రలేమి, వివేకలేమి, విచక్షణలేమిని దూరంచేస్తుంది.  
కేవలం రోజు ఓ గంట పాటు ఎనిమిది వారాల యోగసాధనతో మస్తిష్కంలో జరిగేమార్పులు మనలోని    నైరాశ్యాం, డిప్రెషను భావాల కేంద్రకాలనుంచి ఆభావనలను తగ్గించివేస్తాయి అని ఇటివల హర్వర్డు విశ్వవిధ్యాలయ పరిశొధనలలో ధ్రువీకరించబడ్డాయి అని ఆ శాస్త్రవేత్తలబృందం ప్రకటించింది.         
యోగసాధనలో అద్యాత్మిక, శారీరక, మానసిక ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. మీరుచేయవలసిందల్లా ఖచ్చితమైన నిర్ణయాలని తీసుకొని ప్రయత్నాలు మొదలుపెట్టి చక్కటి ఆరోగ్యాన్ని సొంతంచేసుకోవడమే!!

యోగ శిక్షణని అనుభవజ్ఞులైన గురు ముఖత ప్రాధమికంగా నేర్చుకోవాలి. ఆ పై మీ దినచర్యగా అభ్యాసం చేయాలి.

సుర్యనమస్కారాలు
కాంతి ప్రధాత అయిన సుర్యుడిని ప్రాచీనకాలం నుంచి జగజ్జ్యోతిగా మనం ఆరాధిస్తు వస్తున్నాం. నీరసాన్ని, మనోరుగ్మతలనుంచి విముక్తిచేస్తూ ఙానజ్యొతులని వెలిగించే తేజోవంతమైన జీవశక్తిగా మన వేదాలు కొనియాడాయి.

సుర్యనమస్కారాలు అంటే ఏమిటి?
 తేజోవంతమైన జీవచైతన్యమైన ఆ సూర్యభగవానుడికి ఉషఃకాలంలో నమస్కారాలను సమర్పించడమే సూర్యనమస్కారాలు. మృదువైన కదలికలతో సుర్యనమస్కారలు పేరిట ఆచరించే పన్నెండు శారీరకభంగిమలు యోగ విద్యలో బహుళప్రాచుర్యతని సంతరించుకున్నాయి.

సుర్యనమస్కారాలు చేయడంవల్ల మనకు కలిగే ప్రయొజనాలు
మన వయస్సుని పుట్టిన తేదినుంచి గణించి చెబుతాం కాని మన వెన్నుముక వంగేశక్తి ఆధారంగా యోగవయస్సు అనేది మన పూర్వికులు గణన చేసేవారు.  యోగవయస్సుని బట్టి యవ్వనం, భౌతికశక్తి, మానసిక ధృడత్వం ఎర్పడతాయి. శరీరం ఎలాపడితే అలా వంగేలా, స్వాధీనంలో వుండేలా వెన్నుపూసలు సులువుగా వంగేలా వుండడానికి చేసే పన్నెండు యోగభంగిమలు సూర్యనమస్కారలు. ఈ పన్నెండు ఆసనాలని వేయడంద్వార మనకి లబించే ప్రయోజనాలను తెలుసుకుందాం.
·       శరీరంలోని వ్యర్ధ పధర్ధాలు స్వేదరూపంలో విసర్జింపబడి దేహకదలికలు సులువవుతాయి, అందువల్ల నరాల వ్యవస్థ  మెరుగై ,  కీళ్లవ్యవస్థ, సరళికృతం అవుతుంది.
·       పంచేద్రియాల శక్తి మెరుగౌతుంది, అందువల్ల రుచి, వినికిడి, ధృష్టి , వాసన శక్తులు పెరుగుతాయి.
·       వ్యాధినిరోధకత   పెరుగుతుంది అందువల్ల శరీరం తేజోవంతంగా, శక్తివంతంగా తయారవుతుంది.
·       జీర్ణవ్యవస్థ మలినరహితమయి మెరుగౌతుంది, మెటభాలిజం సాధరణస్థితికి వస్తుంది. 
·       మనస్సుకి ప్రశాంతత చేకూరుతుంది అందువల్ల  ఆలోచనలలో స్పష్టత , భావవ్యక్తీకరణలో స్వేచ్చత, ఏకాగ్రత, ఙాపకశక్తిలో మెరుగుదలలకి కారణమవుతుంది అది  మానసికానందం సాధించుకోవడానికి మార్గం సుగమతరంచేస్తుంది.
సూర్యనమస్కారాలు ఏలా చేయాలి?
ఉషోదయవేళ సూర్యునికి అభిముఖంగా పలుచటి బట్టలు ధరించి సాధనకి వుపక్రమించాలి. సాధనలో శరీరంలోని వివిధభాగాల కదలికలని గమనిస్తూ వుండాలి. శ్వాసపై ధృష్టి సారించి ఆ కదలికల మద్య సమన్వయం వుండేలా చూసుకోవాలి. శరీరాన్ని వెనుకకువంచేభంగిమలలో శ్వాసనిలోనికి తీసుకోవడం, ముందుకు వంచే భంగిమలలో శ్వాసని వదలడం చేయాలి. ఈ సాధన ప్రాణయమ, ధ్యాన, వ్యాయమం సమ్మేళణాలతో కలసివుంటుంది. అందుకని ఆరంభంలో యోగాచార్యుల సమక్షంలో మెళుకువలను ఆభ్యసించడం అభిలషణీయం.

1.      ప్రణామాసనం: ముందుగా ప్రార్ధన భంగిమలొ సూర్యునికి అభిముఖంగా నిల్చొని ‘ఓం మిత్రాయ నమః’ మంత్రోచ్చారణతో రెండు చేతులను  నమస్కార ముద్రలోనికి తీసుకొని  సాధరణ శ్వాసక్రియని కొద్దిసేపు కొనసాగించాలి.
2.     హస్త ఉత్థానాసనం: ‘ఓం రవయే నమః’ మంత్రోచ్చారణతో ధీర్ఘశ్వాసనిలోనికి తీసుకుంటూ రెండుచేతులను పైకెత్తి వీపువెనుకకు వంచాలి.
3.     పాదహస్తాసనం: ‘ఓం సూర్యాయ నమః’ మంత్రోచ్చారణతో శ్వాసని నెమ్మదిగా వదులుతూ రెండుచేతులను నేలనితాకే విధంగా కటిభాగాన్ని ముందుకు వంచాలి. ఈ భంగిమలో ముఖం తొడలని చుస్తూ వుండాలి.
4.     ఆశ్వసంచలనాసనం: ‘ఓం భానవే నమః’మంత్రోచ్చారణతో శ్వాసని లోనికి తీసుకుంటూ కుడిపాదాన్ని వెనుకకు తీసుకుంటూ కటిబాగాన్ని కిందికి దించుతు మోకాలుని, కుడికాలుని వంచుతూ రెండుచేతులను నేలపైన వుంచండి.
5.     సంతులనాసనం: ‘ఓం ఖగాయ నమఃమంత్రోచ్చారణతో గాలిని నెమ్మదిగా వదలుతూ కాలివేళ్లను నేలకి తగిలేట్లుగా రెండుకాళ్లను వెనక్కి తీసుకుంటూ కటినుంచి పైభాగాన్ని గాలిలోవుండేట్లుగా రెండు అరచేతులని నేలకి ఆనించి వుంచండి. మొత్తం శరీరం కాలివేళ్లు , అరచేతుల ఆధారంగా నిలవాలి. 
6.     అష్టాంగనమస్కార: ‘ఓం పూష్ణే నమః ‘మంత్రోచ్చారణతో  కాలివేళ్లు, అరచేతులను కదల్చకుండా మొండాన్ని నేలపైకి వంచాలి, అందుకు ముందుగా మోకాళ్లని నేలకి తాకించండి తరువాత చాతి, గడ్డమ్ని నేలకి తాకించాలి.
7.     భుజంగాసన: అష్టాంగ నమస్కారముద్రలోవలే ఉదరం నేలని తాకేలా వుంచాలి, ‘ఓం హిరణ్యగర్భాయ నమః’ మంత్రోచ్చారణతో శ్వాసని లోనికి తీసుకుంటూ గడ్డం, తలని పైకెత్తి చూస్తూ వుండాలి. మోచేతులను శరీరానికి దగ్గరగా వుంచాలి. 
8.     పర్వతాసనం: భుజంగాసనభంగిమ నుండి చేతులను, కాళ్లను కదల్చకుండా ‘ఓం మరీచయే నమః’ మంత్రోచ్చారణతో శ్వాసను నెమ్మదిగా వదలుతూ కటిభాగాన్ని  మెల్లగా పైకి లేపాలి, మడమలని నేలకి నొక్కి వుంచాలి.
9.     ఆశ్వసంచలనాసనం: పర్వతాసన భంగిమనుంచి ‘ఓం ఆదిత్యాయ నమః’ మంత్రోచ్చారణతో శ్వాసని లోనికి తీసుకుంటూ కుడిపాదాన్ని వెనుకకు తీసుకుంటూ కటిబాగాన్ని కిందికి దించుతు మోకాలుని, కుడికాలుని వంచుతూ రెండుచేతులను నేలపైన వుంచే ఈ భంగిమకి రండి.
10.  పాదహస్తాసనం: ఆశ్వసంచలనాసన భంగిమనుంచి ‘ఓం సవిత్రే నమః’ మంత్రోచ్చారణతో శ్వాసని నెమ్మదిగా వదులుతూ రెండుచేతులను నేలనితాకే విధంగా కటిభాగాన్ని ముందుకు వంచే ఈ భంగిమకి రండి.
11.   హస్త ఉత్థానాసనం: పాదహస్తాసన భంగిమనుంచి ఓం అర్కాయ నమః’ మంత్రోచ్చారణతో ధీర్ఘశ్వాసనిలోనికి తీసుకుంటూ రెండుచేతులను పైకెత్తి వీపువెనుకకు వంచే ఈ భంగిమకి రండి.
12.  ప్రణామాసనం: ‘ఓం భాస్కరాయ నమః’ మంత్రోచ్చారణతో సాధరణ శ్వాసక్రియతో రెండు చేతులను నమస్కార ముద్రలోనికి తీసుకరావడంతో సూర్యనమస్కారాలు ముగిసినట్లే!
సూర్యనమస్కారాలు ఏంతసేపు చేయాలి?
ఈ వురుకుల, పరుగుల గజిబిజి జీవితంలో బాడిఫిట్నెసుగా   వుంచుకోవడం ముఖ్యం అని తెలిసికూడ తగినంతసమయం కేటాయించలేక పోతున్నాం అని మదనపడేవారు కనీసం సూర్యనమాస్కారాలని రోజూ ఓ ఇరవై నిమిషాలు క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వార బాడిఫిట్నెస్ని కాపాడుకోవచ్చు. 
మెరుగైన ఫలితాలకోసం ప్రతిరోజు ఉషఃకాలంలో ఇరవై నుంచి ఇరవైఐదు నిముషాల సాధన అభిలషణియం. పరగడుపున చేసే ఆసనాలు ఏంతో విలువైన ఆరోగ్యప్రధాయణి కాని ఋతుసమయాలలోను, వెన్నముక కిందిభాగంలో, మోకాళ్లనొప్పులు ఉన్నపుడు, జ్వరం, హార్టు సంభందిత సమస్యలువున్నవారు ఆసన సాధన చేయరాదు



No comments:

Post a Comment