యోగనిద్ర ఏందుకు కావాలి?
వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా,
వయస్సురీత్యా, ఆరోగ్యరీత్యా, చదవుల్లోపోటీరీత్యా, వాతవరణకాలుష్యరీత్యా నేటి ఈ సమాజంలో
అందరు ఒత్తిడి, టెన్షన్లతో జీవనపయనం సాగిస్తున్నారు.
నేటి ఆధునిక జీవనవిధానం విదేశిసంస్కృతుల
ప్రభావితమవుతూ మనపై మరింత ఒత్తిడిని తీసుకవస్తూంది. ఎక్కువసమయం కూర్చోవడం, కూర్చోవడంలో
సరియైన శారీరక భంగిమని పాటించకపోవడం, తగినంత శారీరక శ్రమలేక పోవడం, బరవు పెరగడం వంటి
కారణాలు మన కీళ్లవ్యవస్థనికూడ ప్రభావితం చేస్తూ పరోక్షంగా కీళ్లజబ్బులకి కారణమవుతున్నాయి,
అంతేగాకుండా మనలోని రక్షణవ్యవస్థ లోటుపాట్లకి గురి అవుతున్నాది. అందుకని మనువు, తనువు
చక్కటి ఆనందభరిత, ఆహ్లదభరితస్థితిని అనుభవించడానికి యోగనిద్ర చక్కగా దోహదపడుతుంది.
యోగనిద్రని ఏలా చేయాలి?
నిద్రకి ఉపక్రమించే ముందు శవాసనంలో వెన్నుపూసకి ఒత్తిడిలేని శరీరభంగిమలో, తలకి దిండుఆసరాతో వెళ్లకిలా పడుకోవాలి. కాళ్లు, చేతులు మరి దగ్గరిగా కాకుండా కొద్ది దూరంలో ఉంచాలి.
o కేవలం శ్వాసపై ద్యాసతో ఉచ్చాస్వ, నిశ్వాసలని చాతి, శ్వాసకోశంలపై సారించి వుంచి కొన్నినిముషాలు లయబద్దంగా కొనసాగించాలి.
o తరువాయి శ్వాసని నెమ్మది, నెమ్మదిగా కాలివేళ్లు, పాదాలు, గిరికలు, పిక్కలు, మొక్కాళ్లు, తొడలు, కటిభాగాలపై సారించి ప్రతి ఉచ్చాశ్వ తో అపారమైన ప్రాణధాతువుని తీసుకుంటూ, ప్రతినిశ్వాసలో ఉద్రిక్తత, అతృత, ఆందోళణలు అవికలిగించే ఇతిభాదలను మీనుంచి దూరం అవుతున్నభావనలతో ఆశరీరాంగాలు తేలికఅయిన భావనతో ఓకటి, రెండు నిముషాలు కొనసాగించాలి. తిరిగి శ్వాసక్రియ ధృష్టిని శ్వాసకోశంపైకి మళ్లించాలి.
o ఈ మారు శ్వాసని చేతివేళ్లు, అరచేతులు, మణికట్లు, ముంజేయి, మోజేయి, భుజాలపై సారించి అపారమైన ప్రాణధాతువుని పోందుతూ తేలికఅయిన భావనతో ఓకటి, రెండు నిముషాలు కొనసాగించాలి. తిరిగి శ్వాసక్రియని హృదయకోశం పైకి మళ్లించాలి.
o ఈ సారి జీర్ణకోశ వ్యవస్థ, ప్రేవువ్యవస్థ, కిడ్నీలు, పొత్తికడుపు కండరాలు ఆ ఆనుభూతిని పోందుతూ, ప్రతినిశ్వాసలో ఉద్రిక్తత, అతృత, ఆందోళణలను మీ నుంచి దూరం అవుతున్న భావనలతో ఓకటి, రెండు నిముషాలు కొనసాగించాలి. తిరిగి శ్వాసక్రియని శ్వాసకోశంపై మళ్లించాలి.
o చివరిసారిగా కనుపాపలు, కనుబొమలు, నుదురు, బుగ్గలు, గడ్డం, మెడ మరియు ముఖకండరాలు, వెన్నుపూసలు ఆ ఆనుభూతిని పొందాలి.
o ఇంకోమారు శరీరంలో నొప్పులు, అసౌకర్యం కలిగించే కండరాలు, స్థానాలపై ప్రత్యేకంగా మనస్సుని సారించి ఆనాపానసతి శ్వాసక్రియని రెండు నుంచి మూడు నిముషాలు కొనసాగించాలి.
o ఈ 'ప్రొగ్రసివ్ రిలాక్సేషన్ టెక్నిక్' మనస్సుని, శరీరాన్ని అనుసంధానం చేయడానికి తోడ్పాటు అవుతుంది. అది మానశిక ప్రశాంతతని పొందడానికి ఆలంబన అవుతుంది. ఈ రిలాక్సేషన్ టెక్నిక్ ని డైలి ప్రాక్టీస్ చేయడంద్వారా నిద్రలేమిని అది కలిగించే ఆలోచన స్రవంతులని నియంత్రిస్తూ, మానశిక అలజడులను పారదోలేస్తుంది!! అలాగే వివిద కారణాలతో స్ట్రెస్, టెన్షన్ లని అనుభవిస్తున్న స్థితులను పారదోలే సానుకూల ఆలోచనలని పెంపొదించడానికి సహకరిస్తుంది.
ఈ లయబద్దమైన శ్వాసక్రియ మెదడులోని భావోద్వేగ ప్రకంపన కేంద్రాలను జాగృతం చేస్తాయి. మిమ్మల్ని అలౌకిక ప్రశాంతత అనూభుతులకి దగ్గరజేస్తుంది. అలసిన తనువుకి ఊరట అవుతుంది. మనస్సులోని ఒత్తిడి, టెన్షన్లలని దూరంచేస్తూ చక్కటి యోగనిద్రగా మిమ్మలని వరిస్తుంది.
మెరుగైన యోగనిద్ర ఫలితాలను పొందడానికి రాత్రి భోజనం చేసిన రెండుగంటల విరామం అనంతరం సాధన చేయడం అభిలషణీయం.
యోగనిద్రలో కేవలం శ్వాసపై ద్యాసతో శ్వాసక్రియని నెమ్మదినెమ్మదిగా కొనసాగించాలి. మొదటి వారంలో నిముషానికి పదిసార్లు శ్వాసక్రియవేగానికి చేరుకోవాడానికి ప్రయత్నించాలి, క్రమేనా నిముషానికి ఎనిమిదిమార్లు జరపగలిగే సామర్ధ్యాన్ని మీరు పొందుతారు. ఈ దశలో మెరుగైన యోగఫలితాలను మీరు పూర్తిగా పొందగలరు.
వేగంగా శ్వాసక్రియ జరిపేవ్యక్తులకంటే నెమ్మదిగా శ్వాసక్రియని కొనసాగించేవారు ధీర్ఘకాలం జీవిస్తున్నారు అని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. యోగసాధన మిమ్మల్ని ధీర్ఘాయష్కులుగా తీర్చుతుంది.
యోగనిద్రని మంధ్రస్థాయి ఓంకారనాదం బ్యాక్ గ్రౌండు మ్యూజిక్ గా పదిహేను నిముషాలు ఉండేగా సాధన చేయండి, అది మిమ్మల్ని అలౌకిక అనుభుతులని దగ్గరచేస్తుంది. ఇక మీరు నెమ్మది, నెమ్మదిగా రిలాక్సుడు మూడులో నిద్రలోకి జారుకుంటారు.
సరియైన శారీరక భంగిమలు, ధ్యానస్థితులు, మాత్రమే అపారమైన ఈ యోగ ఫలితాల అమృతధారలలో మీ మనస్సు, తనువులని పులకించడానికి ఓ వేదిక అవుతుంది.
మనస్సుపై ఆధిపత్యం సాధించే ధ్యానం, యోగనిద్ర, మేడిటేషన్ లని మొదట్లో బ్యాక్ గ్రౌండ్ లో మంధ్రస్థాయి మ్యూజిక్
తో ప్రారంభించినా క్ర మేనా వీటి సహయం అవసరంలేని మనస్సుపై ఆధిపత్యం సాధించే స్థితిని సాధించాలి
కుండలిని యోగ
హర్మోన్లవ్యవస్థ
మనశరీరంలోని రసాయనసమ్మేళనాలలో సమతుల్యతలకి కేంద్రకాలుగా పనిచేయడంద్వార మనస్సుకి, శరీరానికి,
కణనిర్మాణానినికి, మెటబాలిజానికి, ఆరోగ్యవ్యవస్థ సక్రమంగా విధులని నిర్వర్తించడానికి,
రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేయడంలో కీలకపాత్రని పోషిస్తుంది.!
క్రమశిక్షణ లోపించిన
జీవనవిధానం, ఆహరనియమాలు, శారీరకవ్యాయామలు, హర్మోన్లవ్యవస్థని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, కోపం, అసహనం, ఒత్తిడులలాంటి మానసికసమస్యలకి కారణమవుతున్నాయి.
కుండలినియోగాసాధన ద్వార ఈ మానసిక శక్తులని ప్రతికూలంగా ప్రభావితంచేసే విషయాలకి చెక్
పెట్టవచ్చు.
కుండలినియోగ
అంటే ఏమిటి?
మన శరీరంలో చక్రాలు అనబడే గుండ్రంగా తిరుగుతూ వుండే శక్తికేంద్రాలు ఎంతో ప్రధానమైన బాగాలు. ఈ ప్రధాన చక్రాలూ భౌతిక శరీరంలోని ప్రాణాధారమైన అవయాలను అదుపులోవుంచుతూ, వాటికి శక్తిని నిరంతరం అందచేస్తూవుంటాయి. ఈ ప్రధాన చక్రాలనేవి ప్రాణాధార ఇంద్రియాలకు శక్తిని సరఫరాచేసే శక్తికేంద్రాలవంటివి. ఇవి 3 నుంచి 4 అంగుళాల వ్యాసాన్ని కలిగి మన భౌతిక శరీరంలోనికి చొచ్చుకొనిపోయి అక్కడ వ్యాపించి ఈ క్రింది విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటాయి. - ప్రాణశక్తిని గ్రహించి, జీర్ణించుకొని, దానిని శరీరంలోని వివిధభాగాలకు సరఫరా చేస్తాయి.
- భౌతికశరీరంలోని వివిధ అంగాలను అదుపులో వుంచుతూ అవి సక్రమంగా పనిచేసేందుకు భాధ్యత వహిస్తాయి. ఈ ప్రధానచక్రాలను , అదుపులో ఉంచడం, లేదా మార్పు తీసుకరావడం ద్వారా శరీరంలోని వినాళగ్రందులలో చలనాన్ని , ఉత్తేజాన్ని కలిగించవచ్చు.
- కొన్ని చక్రాలు మనోశక్తులకి నిలయాలు. ఆయా చక్రాలను ఉత్తేజపరచడం ద్వార కొన్ని మానశికశక్తులు తేజోవంతం అవుతాయి.
మనలొని 7 ప్రధాన చక్రాలు
i. మూలాధార (రూట్) చక్ర:
ఈ చక్రం వెన్నముక యొక్క మూలస్థానంలో ఉంటుంది. ఇది భౌతిక శరీరాన్ని అంతటిని అదుపులో ఉంచుతూ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూవుంటుంది. కండర వ్యవస్థ, బోన్ వ్య్వస్థలని నియంత్రిస్తూ , రక్తాన్ని ఉత్పత్తిని మరియు నాణ్యతని నియంత్రిస్తూ , శరీరంలోని టిష్యులకి శక్తిని ప్రసరిస్తుంది. జననేంద్రియాలపై కూదా తనప్రభావాన్ని చూపి వాటిని శక్తితో నింపుతుంది. ఈ చక్రం సరిగా పనిచేయకపోతే కీళ్ళవాపులు, వెన్నముక సంభందిత వ్యాధులు, శరీరంలో శక్తి తగ్గడం జరగుతుంది. ఈ చక్రం తేజోవంతంగా ఉన్నవ్యక్తులు బలోపేతంగా, ధృడంగా వుంటారు, లేనివాడు బలహీనంగా, నీరసంగా , బక్కపలుచగా ఉంటారు.
ii. స్వాధిష్టాన (శృంగార) చక్ర:
పొత్తికడుపు దిగువ బాగంలో ఈ చక్రం ఉంటుంది.ఇది జననేంద్రియాలను, మూత్రాశయాన్ని నియంత్రిస్తూ వాటికి శక్తిని ప్రసారం చేస్తుంది.ఈ చక్రం సరిగ్గా పనిచేయకపోతే లైంగిక సమస్యలు తలెత్తుతాయి. కిడ్ని సంభందిత వ్యాదులు బయటపడుతాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రతికూల ప్రాభావితమౌతుంది. మూలాధార చక్రం ప్రభావం దీనిపై ఎక్కువుగా ఉంటుంది. iii. మణిపూరక (నాభి) చక్ర:
iv. అనాహత (హృదయ) చక్ర:
ఇది వక్షభాగానికి మధ్యలో ఉంటుంది. ఇది గుండె, రక్తప్రసరణ వ్యవస్థను అదుపులో ఉంచుతూ వాటికి శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది. ఇది ఎంతో సున్నితమైనది. మానశిక ఉద్వేగాలు. ఉద్రిక్తలు. ఒత్తిడుల ప్రాభావాలు దీనిపై ఆధికంగా ఉంటుంది. ఈ చక్రం సరిగ్గా పని చేయకపోతే హృదయ సంభందిత. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. v. విశుద్ద (థ్రోట్)చక్ర:
vi. ఆఙ్ణా చక్ర:
vii. సహస్రార (క్రౌన్) చక్ర;
'కుండలినియోగ’ శక్తికేంద్రాలను తేజోవంతం చేయడానికి సాధకునికి మార్గదర్శి. యోగ సాధకుడు కుండలిని యోగ సాధనని అందులోని మెళుకువలను యోగాచార్యుల సమక్షంలో ఆభ్యసించాలి. అందుకు మీరు యోగశిక్షణ శిబిరంలో చేరి సాధన చేయాలి.
యోగ ముద్ర
పంచభూతాల సమ్మేళనాలు అయిన గాలి, నీరు, అగ్ని, పృధ్వీ, ఆకాశాలు సృష్టికి లయకారకాలు, అవి పకృతి ప్రసాదాలు. సకల జీవరాశి ఉనికి,మనుగడలలో వీటి పాత్ర అపారం.
ఆధునిక సమాజంలో పారీశ్రామీకీకరణ
పేరిట పరిశ్రమలు వెలువరించే వ్యర్ధాలతో, రసయనాలతో మనచుట్టువుండే వాతవరణం, మనం పీల్చుకొనే
గాలి, తాగేనీరు కలుషితం అవుతున్నాయి. వీటి నియంత్రీకరణ అమలులో పరిశ్రమల యజమాన్యంలో
లోపించిన నిబద్దత, ప్రభుత్వాల అలసత్వంతో ఈ పర్యావరణ పరిరక్షణ రోజురొజుకి సంక్లిష్టం
అవుతున్నాది, పకృతిని చిగురుటాకులా కంపింపచేస్తూన్నాయి. ఈ విషఫలాలు మన సామజికవ్యవస్థకి
వదలని జాడ్యంలా నిరంతరం వేధనికి గురిచేస్తున్నాయి. అవి మన ప్రశాంత
జీవనవిధానాలకి, జీవితవిధానాలకి తీవ్రప్రతికూలంగా మారయి.
‘యోగముద్ర’ అంటే ఏమిటి?
మన జీవనవిధానంలో, జీవితవిధానంలో పర్యావరణ సం’రక్షణలో పంచభూతాల పాత్ర అద్వీతీయం. ఆధునిక సమాజంలో సాంకేతిక అబివృద్ది ముసుగులో విచక్షణ, వివేక రహిత నిర్ణయాలు, వాటి అమలు ఈ పర్యావరణ సం’రక్షణకి పెనుసవాళ్లని విసురుతున్నాయి. పకృతిని చిగురుటాకులా కంపింపచేస్తూన్నాయి.
నాగరికత పేరుతో మన జీవనవిధానంలో, జీవితవిధానంలో వస్తున్నపోకడలు సమాజిక వాతారవరణంలో ఉప్పెనలా ముంచుక వస్తు’న్న మార్పులు మన జీవణశైలిని ప్రభావితం చేస్తున్నాయి. అవి మానశిక, శారీరక, సమాజిక వ్యవస్థలని కలుషితంచేయడంలో విపరీత ప్రభావితం చూపిస్తున్నాయి.
యోగ ముద్రలు
ఈ కలుషిత ప్రమాణాలను సమర్థవంతంగా నియంత్రించడానికి యోగశాస్త్ర అందించిన అపురూప వారసత్వ సంపదగా యోగ ముద్రలని ఆచరించడం ద్వార మానశిక, శారీరక రుగ్మతలను సమర్థవంతంగా అధిగమించడానికి ఓ చక్కటివేదిక అవుతుంది.
యోగముద్రలని వాడుకలో ‘ముద్ర’, ‘హస్తముద్ర’లుగా వ్యవహరించడం పరిపాటి.
ఈ ముద్రలు నాట్యశాస్త్రంలో భావవ్యక్తీకరణాలలో ప్రధాన భూమికని పోషించడం మనందరికి బాగాతెలుసు.
హైందవ సాంప్రదాయాల్లో వివిధ కర్మకాండలలో ఇవి కీలక పాత్రని వహిస్తాయి.
చేతివేళ్లు పంచభుతాలకి ప్రతీక. చిటికెనవేలు జలానికి, వుంగరపువేలు పృధ్వీకి, మధ్యవేలు ఆకాశానికి, చూపుడువేలు వాయుకి, బొటనవేలు అగ్నికిప్రతీకలు. యోగముద్రల ద్వార చేతివేళ్లు శక్తికేంద్రకాలుగా తనువు, మనువులను తేజోభరితం చేస్తాయి.
ఈ ప్రాచీన యోగముద్రలు ఆధునిక జీవితసమస్యలకు పరిష్కారాలని చూపిస్తాయి. ఓ ముద్ర మానశికవికాసాన్ని పెంపొందిస్తే, ఇంకొకటి ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణితంచెస్తే, మరొకటి వ్యాదినిరోధకవ్యవస్థని పరిరక్షించెస్తే ఇలా ప్రతిముద్ర ప్రత్యేకత దానిదే! వీటిని ఆచరించడం తేలిక. ఇవి ఎటువంటి దుష్ప్రబావాలులేని ప్రత్యామ్నాయ వైద్యవిధానంగా గుర్తించండి. ఆత్మవిశ్వాసం, నమ్మకంతోకూడిన ఆచరణే సత్వరఫలితాలకి నాంది అవుతుంది. ఇక ప్రధానమైన హస్తముద్రలని తెలుసుకుందాం.

జ్ఞానముద్ర:
బొటనవేలు చివరను చూపుడువేలు చివరతోకలిపివుంచాలి. మిగిలిన వేళ్లనూ ఒకదానితో మరిఒకటితాకుతూ నిటారుగా వుంచాలి.
· మెడిటేషన్’తో ఈముద్రని ప్రాక్టీసు చేయడంద్వార నాడీమండల వ్యవస్థని సాంత్వన పరుస్తూ మనస్సులోని అతృతలు, ఆందోళనలకి చెక్ పెట్టదానికి సహయకారి అవుతుంద, మరియు సత్వర ఫలితాలు మీ సొంతం.
· బ్రెయిన్ లోని న్యూరాన్ వ్యవస్థని వుత్తేజపరచడం ద్వార మానశిక ప్రశాంతతకి ఆలంబన అవుతుంది.
· జ్ఞాపకశక్తి మరియు ఏకగ్రతలని సాధించడానికి ఉపయోగకారి.
చూపుడువేలు కొనను రెండోకనుపువద్ద మడచి, దాన్ని బొటనవేలు మొదట్లో వుంచాలి.
· ఈ ముద్రసాధనతో ఏండోక్లీన్ గ్లాండ్సు సక్రమంగా తన విధులను నిర్వర్తించడానికి దోహదపడుతుంది ఫలితంగా హర్మోన్ల సమతుల్యతలని సాధించడానికి సహయకారి అవుతుంది.
· శరీరంలోని ప్రధానమైన వాయుసంభందిత అసమానతలని అధిగమించడంద్వార మానశిక స్వస్తతకి ఆలంబన అవుతుంది.
· చర్మ సంబందిత రుగ్మతలని దూరంచేస్తూ చర్మసౌంధర్యాన్ని ఇనుమడింపచేస్తుంది.
పృధ్వీముద్ర:
ఉంగరంవేలు, బొటనవేలు చివరలను కలిపివుంచి మిగతా మూడువేళ్లను సాచి వుంచాలి.
· శారీరక బలహీనతలను దూరంగా వుంచడానికి సహయపడుతుంది.
· జుట్టు రాలడం, తెల్లబడడం, చర్మం పొడిబారడం, ఎసిడిటి, కామెర్లు, అల్సర్లు లాంటి రుగ్మతలను అదుపులోవుంచడానికి సహయకారి
చిటికెనివేలు కొనను బొటనవేలు కొనలను కలిపి వుంచాలి
· చర్మాన్ని కాంతివంతంగాను, గొంతు తడారి పోకుండాను వుంచుతుంది.
· హర్మోన్లఅసమానతలకి, స్త్రీలలో ఋతుసమస్యలకి, సాధారణ జలుబు, రొంపలనుంచి సత్వరపరిష్కారానికి ఇది ఉపయుక్తం.
ఆకాశముద్ర
మధ్యవేలు చివర, బొటనవేలు చివరలను తాకించి మిగతా మూడూవేళ్లని సాచి వుంచాలి.
· ప్రతికూలభావోద్వేగాల నియంత్రణకి, సానుకూల భావోద్వేగాలకి ప్రేరణ అవుతుంది.
· మానశిక ఒత్తిడులను దూరంచేసుకోవాడానికి ,మానశిక ప్రశాంతతని సాధించడానికి రెగ్యులర్గా ప్రాక్టీసుచేయాలి.
హృదయముద్ర
ఉంగరపువేలు చివరను బొటనువేలు మొదట్లోకి తీసుకోవాలి. చూపుడువేలు, నడుమవేలు కొనలను బొటనవేలు కొనతో కలిపి వుంచాలి. చిటికెనవేలుని సాచి వుంచాలి.
· గుండె సంబందిత వ్యాధులని దూరంగా వుంచడానికి ఆరోగ్యవంతమైన హృదయానికి రక్షణగా తోడ్పడుతుంది.
అగ్నిముద్ర
ఉంగరపువేలుని మొదటికణుపువద్ద మడచి, దానికొనను బొటనవేలు మొదట్లో ఆనించాలి.
· రక్తపోటు సమస్యలున్నవారికి ఇది ఉపయొగకారి
· స్తూలకాయాన్ని నియంత్రించుకోవడానికి ఇది సహయకారి.
శూన్యముద్ర
మద్యవేలును మడచివుంచి దాని చివరను బొటనవేలు మొదట్లో ఆనించాలి
· చెవినొప్పి, నత్తి తదితర సమస్యలున్నవారికి మంచి ఫలితాలొస్తాయి.
ముద్రసాధనలో ఈ సూచనలని పాటించండి
· నిపుణులైన యోగాచార్యుల సమక్షంలో యోగముద్రలని నేర్చుకోవాలి.
· మీ అవసరాన్ని దృష్టిలో వుంచుకొని ప్రత్యేకంగా సంబందిత యోగముద్రలని ప్రాక్టీసుచేయాలి.
· వజ్రాసనం, పద్మాసనం, సుఖాసనంలలో మీ కిష్టమైన ఆసనస్థితిలో ఈ హస్త ముద్రలని ప్రాక్టీసుచేయాలి.
· చేతివేళ్లని సున్నితంగా నొక్కాలి అనవసర వత్తిడిని తీసుకోరాదు.
· మెరుగైన ఫలితాల కోసం 10 నుంచి 12 వారాలు సంబందిత ముద్రని సాధనచేయాలి.
· ప్రాణయామ, మెడిటేషన్, ధ్యానంలలో మీకు ఆసక్తికరమైన స్థితిలో శ్వాసపైద్యాసతో యోగముద్రని ప్రాక్టీసుచేయాలి.
· వీటిసాధనకి ప్రత్యేకించి ఓ టైం అంటులేదు ఎపుడైన సాధన చేయవచ్చు కాని ఉషోదయవేళ అభిలషణీయం.
· ప్రత్యేకించి ఆహరనియమాలు లేనప్పటికి కేవలం సాత్వికాహారాలని తీసుకోవడంద్వార మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది.
· ఇక సిగరెట్, డ్రింకుల అలవాట్లకి స్వస్తి చెప్పేయాల్సిందే.
.png)








No comments:
Post a Comment