Tuesday, 24 February 2026

ఆధ్యాత్మిక పథం 23 జీవన సాధన


జీవన సాధన 


అవ్యక్తంలో జీవన సమరం ఆరంభించి అసంఖ్యాక శుక్రకణాల పోరాటంలో విజేతగా నిలిచిన ఓ శుక్రకణం అండజంతో కూడి మాతృగర్భ ప్రవేశంతో తన ప్రస్థానం మొదలవుతుంది,  తిరిగి అవ్యక్తంలోనికి చేరుకోవడంతో ఈ జీవన సమరంతో కూడిన మహాప్రస్థానం🪦 ముగుస్తుంది. 

ఈ జీవన సమరమే జీవితం, అది జీవించడానికే.. జీవించడమే నిజానికి జీవన సాధన! 

మనం భగవంతుడి పట్ల ఎరుకతో అంకితభావంతో చేస్తే అదే అద్భుతమైనసాధన అవుతుంది,

మట్టిలో నాటిన విత్తనం మూడోరోజుకి 🌱మొలకెత్తుతుంది, అదే, కాలక్రమంలో అనేక క్లిష్టపరిస్థితుల్లని అధిగమిస్తూ చెట్టుగా 🌴ఎదిగి పూలు 💐 , పండ్లు 🥭, నీడనిస్తుంది, సేద తీరుస్తుంది, 🕊️పక్షులకుఅవాసమవుతుంది, లోకానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది.

ప్రతిఫలం ఆశించకుండా  🌊 నీరు 🌅ఉష్ణతాపంతో ఆవిరిగా పరివర్తనచెంది కారుమబ్బులుగా 🌧️ సుదూర దూరాలు పయనం సాగించి వర్షించి పుడమి తల్లిని పులకరింపచేస్తు, బీటలువారిన భూములను పంటభూములుగా మారుస్తూ , 🏞️నది జలాలుగా,  సాగునీరుగా, 🚰త్రాగునీరుగా దప్పికలను తీరుస్తూ,చల్లటిగాలిగా స్వేచ్చగా వీస్తూ ప్రాణికోటి సేద తీరుస్తుంది.

ప్రకృతిలో ప్రతి చర్య ఎంతో సహజంగా, పరోపకారమే లక్ష్యంగా కొనసాగుతుంది.

మన జీవితమూ కూడా అలానే సాగిపోవాలి. అడుగడుగునా నడవడిక, ప్రవర్తనలలో మానవత్వం వెల్లివిరాయాలి.


ఒక జ్యోతి🪔 మరొక జ్యోతిని వెలిగించినట్లు,  మనిషి దయ, కరుణ,జాలి, ప్రేమ పూరిత ఆలోచనలు, భావనలతో పదిమంది జీవితాల్లో వెలుగులు నింపాలి, అలాంటి  జీవితసాధనలోనే ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది, అది దివ్యత్వాన్ని దర్శనం చేయిస్తుంది, జీవితంలోని రహస్యం, ‘దివ్యత్వం ఏంటి అనేది తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన’ అని పరమహంస యోగానంద పేర్కొన్నారు.

మానవ జన్మను భగవంతుడి ప్రసాదంగా భావించినప్పుడు భక్తిగా రెండు చేతులూ పైకెత్తి ఆ దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి, అందులోని తాత్వికతను గుర్తించాలి,

సాధారణ మనిషి కూడా సాధనవల్ల అనేక ధార్మిక ప్రయోజనాలు పొందగలడు,

అందుకు:

  • అన్ని విషయాల్లోనూ దృఢచిత్తం కలిగి ఉండి , వాస్తవ పరిస్థితులపై తిరుగులేని విజయం సాధించాలి,
  • ఏ పని చేస్తున్నాసరే, అంతరంగ చైతన్యాన్ని మేల్కొల్పుతూ ఉండాలి, తన ప్రజ్ఞను వదులుకోకూడదు.
  • మాట, ఆలోచన, చర్య ప్రతిదానిలోనూ స్వచ్ఛత, సహనం,మంచితనం ప్రతిబింబించాలి, అప్పుడు, అంతరంగం దివ్యమైన ఆనందమయమైన  అనుభవాలను పోగుచేస్తుంది, ఆ దివ్యానుభవాలే ,అంతర్యామి సన్నిధికి చేర్చే ఆలంబనలవుతాయి. 

అలౌకిక అనుభూతి పొందడానికి తన మనసును గెలుచుకున్న జితేంద్రియుడుగా ఎదగాలి, పరమాత్మ యందు అనన్యచింతన కలిగివుండాలి. ఇందుకు నియమబద్ధమైన జీవితం గడపాలి. తనలోని అన్ని కోరికలను సమర్పణ భావనతో ఆ మాధవుడికి సమర్పించుకోవాలి.

శ్రద్ధ, సహనం, అంకితభావనలతో ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి,

ఇటుక మీద ఇటుక పేర్చినట్లు ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించుకోవాలి,

ఈ ప్రయాణంలో ఎక్కడా అలసిపో కూడదు. విజయ దరహాసంతో, తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకోవాలి, అప్పుడే మనిషి జీవనసాధన ఫలిస్తుంది,

ఆధ్యాత్మిక సాధనలోని రహస్యం... ఆ సచ్చిదానంద రూపమైన దివ్యత్వం మనిషి అనుభవంలోకి వస్తుంది,

అపురూపమైన ఆ అనుభవాన్ని, ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని మనిషి మాత్రమే పొందగలడు,

ఇదంతా,ఆధ్యాత్మిక జీవన సాధనవల్లే సాధ్యమవుతుంది.


సర్వేజనా సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 



ఆధ్యాత్మిక పథం 22 సుకుమారం


సుకుమారం 

ఆ రోజుల్లో  రోజువారి పనులు పూర్తిచేసుకొని స్నానానంతరం జడవేసుకొని, కొద్దిగా మొహానికి పౌడర్ అద్ది, కట్టు, బొట్టు, కాటుకలతో అద్దంలో 🪞తమ ముఖారవిందాన్ని  చూసుకుంటూ తుదిమెరుగులతో మురిసిపోయేవారు. 

ఈ రోజుల్లో యువత మాటి మాటికీ అద్దంలో 🪞అదే పనిగా చూసుకుంటూ మురిసిపోవడం ఓ దినచర్యగా మారిపోయింది.. అలా చూస్తుంటే ఏమవుతుంది? అదే  ముఖం సుకుమారమైనదిగా, అదే వర్చస్సు నాజూకుగా, ఆకర్షణీయమైన శరీరసౌష్టవంగా నిన్ను మోహంలో పడేస్తుంది.నెమ్మది నెమ్మదిగా మనస్సుకు నచ్చిన ఆ రూపం కోసం నీవు విపరీతమైన శ్రద్ధ చూపడం మొదలవుతుంది. 

ఈ మానసిక బలహీనతలను  సొమ్ముచేసుకోవడానికి మార్కెట్లలో సౌందర్యపరిరక్షణగా బోటాక్స్, బ్యూటీ పార్లర్లు, బ్యూటీ సెలూన్లు  తామరతుంపర్లగా వీధి వీధికి పుట్టుకొస్తున్నాయి. తమ కార్యక్రమాలను శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయి, నిర్వహిస్తున్నాయి.

  • ముఖ సౌందర్యం కోసం ఫేస్ క్రీంలు, 🧴ఫేస్ ప్యాక్ లు , స్క్రబ్బర్స్ 🧽, మేకప్ బోటిక్, కన్సిలర్స్
  • ఆకర్షణీయమైన 👄పెదవులకోసం 💄లిప్ స్టిక్స్,అప్పర్ లిప్ త్రెడింగ్, బొటాక్స్ , లిప్ గ్లాష్ 
  • కనుబొమ్మల మెరుపు కోసం  ఐ బ్రో థ్రెడింగ్, ఐ బ్రో టింట్, ఐ లాషెస్, ఐ లైనర్, మస్కారా, ఐషాడోలు 
  • కాంతివంతమైన చర్మం కోసం వివిధ రకాల క్లీనర్స్, ఫేస్ వాష్లు, మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్లు, 🧴బాడీ ఆయిల్స్, బాడీక్రీంలు, సన్ స్క్రీన్ లోషన్లు 
  • నఖ సౌందర్యానికి నెయిల్ పాలిష్ 💅 లు, నెయిల్ ఆర్ట్
  • హస్త సౌందర్యం కోసం మానిక్యూర్, హ్యాండ్ వ్యాక్సింగ్ 
  • శిరోజ పోషణ పేరుతో షాంపూలు, కండిషనర్లు 
  • శిరోజాలంకరణ 🧑‍🦰పేరుతో హైలేట్స్ , హెయిర్ డైలు, హెయిర్ స్టైల్ పేరుతో  స్ట్రెయిట్ నర్స్. 

ఈ సౌందర్య పోషణ పేరుతో ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఐస్ క్రీమ్ తిన్నా తినక పోయినా కరిగి పోతుంది, అదే విధంగా ఈ పై పై మెరుగులు ఐస్ 🍧 క్రీమ్స్ లాంటివే!

వేసుకున్న, వేసుకుంటున్న పౌండేషన్, పేస్ ప్యాకులు కడుక్కోవడానికి, తోమడానికి స్క్రబ్బర్స్ పేరు మీదుగా పర్సును 👜 ఖాళీ చేస్తున్నాయి.


అనాదిగా వస్తున్న సాంప్రదాయక సహజ సౌందర్య సాధనాలు ప్రతిభావంతంగా నామమాత్ర ఖర్చుతో చర్మసౌందర్యం, దేహలాలిత్యం,ఆకర్షణీయసౌష్టవంని మీ సొంతం చేస్తాయి..

  • పసుపు, తేనె 🍯 కాంబినేషన్ ముఖం మీద ముడతలు, మచ్చలను తగ్గించి, ముఖవర్చస్సు, చర్మకాంతిని పెంచుతాయి.
  • ముఖంపై టాన్, పిగ్మెంటేషన్ తొలగించడానికి తేనె, పెరుగు మిశ్రమం సహాయపడుతుంది.
  • ఉల్లిరసం, తేనె 🍯 కాంబినేషన్ చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది 
  • వారంలో ఓ తైల స్నానం, పక్షంలో నలుగుపిండితో ఓ అభ్యంగ స్నానం, మాసానికి ఓ కుంకుడు కాయలతో స్నానం మీ శిరోజ సంరక్షణను, కాంతి వంతమైన నిగ నిగలాడే స్కిన్ టోన్ తో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తు సహజ సౌందర్యాన్నీ తీసుకువస్తుంది. మీ మిత్రమండలిలో ఇక మీరే తోపు!! ఇక కండిషనర్లకు, షాంపూలకు ఏ మాత్రం ఖర్చు చేయనవసరం లేదు. 
  • ఎటువంటి స్కిన్ లోషన్ వాడకుండా ఉషోదయ వెలుగుల్లో, సంధ్యా సమయాల్లో ప్రభాత సూర్యుడి దివ్య కాంతులలో మీ తనువు, మనువు పులకరించేలా ప్రతిరోజూ ఓ 45 నిమిషాలు నడక 🚶‍♂️ సాగించండి.ఆ ఆహ్లాదకర అనుభూతులను తనివితీరా ఆస్వాదిస్తూ మీ మనస్సులో మధుర జ్ఞాపకాలగా పదిలపరుచుకొండి.
  • తేలికపాటి వ్యాయామాలు, యోగ సాధనాలకు ఓ అరగంట సమయాన్ని కేటాయించండి.
  • మీ మనస్సుకు నచ్చిన నాట్యం,నృత్యం 🩰, చిత్రలేఖనం 🎨, సంగీతం 🎸లాంటి లలితకళల యందు ఆసక్తి, అభిరుచిని కలిగి వాటిని ఆస్వాదించండి.
  • జుట్టు పలచబడటం, అవాంఛనీయ రోమాలు పెరగడం, మొటిమలు రావడం, బరువు పెరగడం వంటివి హార్మోన్ల అసమతుల్యతనే ప్రధాన కారణం. ఈ సమస్యలను అధిగమించడానికి మంచినీళ్లు రోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి . వారంలో ఓ రోజు కేవలం ద్రవాహారాలు మాత్రమే తీసుకోవాలి..ఇది మీ బాడీలో డిటాక్సిఫికేషన్ చర్యగా ఆమం స్థాయి ని తగ్గించడానికి దోహదం చేస్తుంది.
  • మీరు తీసుకునే ఆహారం 🥗నాణ్యమైనదిగా వుండాలి. సహజ పోషకాలు అయిన పాలు, పండ్లు, నెయ్యి, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పోషక నిధులైన బాదం, ఆక్రోట్లు, అవిసె గింజలు, కాజు,పిస్తా, కిస్మిస్,గుమ్మడి గింజలు వంటివి మాత్రమే ఆహారంలో వుండేలా చూసుకోండి. అవీ మీ హార్మోన్ల పనితీరును, సమతౌల్యతలను మెరుగుపరుస్తాయి. 
  • దీర్ఘకాలం పోషకాహారలోపం హార్మోన్ల వ్యవస్థ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  హార్మోన్ల వ్యవస్థ మెరుగ్గా ఉండడానికి సమతుల్య ఆహారం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రధానం. యోగ 🧘‍♀️సాధన, ధ్యానం, గుడ్ రీడింగ్ 📖,కలుపుగోలుతనం, సహజ జీవన విధానం ఇందుకు దోహదం చేస్తాయి.

గుర్తుంచుకోండి అందం, ఆనందం బయటనుంచి కొనుక్కుంటే వచ్చేవి కాదు. అవి నీలో, నీతోనే, నీలోపలనే ఉన్నాయి . దానిని జీవితకాలం పరిరక్షించుకోవడానికీ కేవలం మీ జీవనశైలీ, జీవితశైలీ ప్రభావితం చేస్తాయి..


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️



ఆధ్యాత్మిక ఫధం 21 ఆనందమే నీ ఆయుష్షు


ఆనందమే నీ ఆయుష్షు 

ఆనందంగా వుండేవాళ్ళు దీర్ఘకాలం జీవిస్తారు.

దీర్ఘకాలం జీవించే వారు మంచి ఆరోగ్యం కలిగివుంటారు.

ఆరోగ్యవంతులుగా వుండేవాళ్లు సంతోషభరిత జీవనవిధానం కలిగివుంటారు.

సంతోషంతో ఉండేవారు  క్రియాశీలక  ఆలోచనలను కలిగివుంటారు.

అవి వారు తీసుకునే ఆహారం, పనులు, ఆలోచనలలో నాణ్యతను కలిగి ఉంటాయి.


ఆరోగ్యవంతులుగా వుండేవారి శరీరంలో ఆమం చాలా తక్కువస్థాయిలో ఉంటుంది.

ఎవరిలో ఆమం ఎక్కువగా తయారవుతుందో వారు అనారోగ్యంతో తరచుగా వ్యాధులభారిన పడుతున్నారు. చరకుడు ‘మందాగ్ని జనితమామం రోగణాం కారణం పరమ్ ‘ అని పురాతన సంస్కృత గ్రంథం ‘చరక సంహితలో 1700 సంవత్సరాల క్రితం పేర్కొన్నారు 

జఠరాగ్ని మందగించడం వల్ల మనం తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కాకుండా పోతుంది. సరిగా జీర్ణం కాని ఆహారం కుళ్ళిపోయి 'ఆమం' అనే జిగట పదార్థంగా మారుతుంది. ఇది శరీరానికి హానికలిగించే విషపదార్థం ‘టాక్సిన్’ రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు కారణమై, వివిధ వ్యాధులకు మూలమవుతుంది

ఈ ఆమం శరీరంలోని వివిధ నాళాలలో పేరుకుపోయి రక్త ప్రసరణకు మరియు పోషకాల సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. శరీరంలోని అన్నిఅవయవాల పనితీరులపైన ప్రభావం చూపిస్తుంది. 

ఆకలి లేకపోవడం, ఎప్పుడూ అలసటగా ఉండటం, నిస్సత్తువ, అలసత్వం, కీళ్ల నొప్పులు, మలబద్ధకం, నాలుకపై తెల్లని పొర ఏర్పడటం మరియు నోటి దుర్వాసన వంటివి ఆమంస్థాయిలను గుర్తించగలిగిన ప్రాధమిక లక్షణాలు.

ఆమం వల్ల కీళ్లవాతం, అజీర్ణం మరియు వివిధ రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.


మన శరీరాలలో ఆమం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవడానికి మన జీవనశైలీనే ప్రధానకారణం. తీసుకునే ఆహారం విషయంలో మానసిక నియంత్రణ కోల్పోవడం,

కేవలం తినడానికే మనం ఉండేది అని కంటికి ఆకర్షణీయం అనిపిస్తే ఏది పడితే అది తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎప్పడు పడితే అప్పుడు తినడం, ఆకలి వున్నా లేకపోయిన కుంభాలు కుంభాలు లాగించి వేయడం ఓ అలవాటుగా అయిపోయింది. 

ఈ ధోరణి వివాహవిందుల్లో జనాలు ఒకరిని మరొకరు నెట్టుకుంటూ అక్కడి వివిధ రకాల నోరూరించే షడ్రుచులతో కూడిన వంటకాలపై దండయాత్ర అప్రహితంగా కొనసాగించడం తరచుగా చూస్తుంటాం.


విరుద్ధ ఆహారాలు జీర్ణక్రియ దెబ్బతినడానికి,గ్యాస్, అసిడిటీలకు,చర్మ సంబంధిత వ్యాధులు రాషెస్, అలర్జీలకు, రోగనిరోధక శక్తి తగ్గడానికి, శరీరంలో విషతుల్యాలు ఆమం పేరుకుపోవడానికి ప్రధాన కారణమవుతాయి . అందుకే విరుద్ధ ఆహారాలపట్ల అప్రమత్తంగా ఉండాలి అవి:

  • వేసవి కాలంలో అదే పనిగా బాగా వేడి వేడిగా వుండే హాట్ సమోసాలు,మిరపకాయ బజ్జీలు,హాట్ సూప్🍵, మసాలా కాపీ, టీ ☕️ లు తీసుకుంటూవుంటే జీర్ణవ్యవస్థలో అల్సర్లకు కారణమవుతుంది, అవి భవిష్యత్లో క్యాన్సర్ కణాలుగా తయారుకావచ్చు.
  • శీతాకాలంలో చల్లటి ఆహారాలు, శీతల పానీయాలు,ఐస్ క్రీమ్స్, 🍦ప్రిడ్జిలోని పాలు,పెరుగు,మజ్జిగ, నీళ్లు 🛀 మెటబాలిజంను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
  • వేడి వేడిగా ఆహారం తీసుకున్న వెనువెంటనే చల్లటి శీతలపానీయాలు, ఫ్రూట్ సలాడ్లు, మిల్కు షేకులు, 🍧ఐస్ క్రీంలు తీసుకోకండి.
  • భోజనంతో ఐస్ క్రీమ్ 🍦 తీసుకోవడం, ఐస్ క్రీమ్ తో స్వీట్ కలపడం, బాగా ఫ్రై 🍟చేసిన ఆహారాలు రాత్రి 🌙 తీసుకునే పెరుగు పదార్థాలు జీర్ణక్రియను మందగిస్తాయి.
  • పాలలో 🍌అరటిపండు, మామిడిపండు 🥭మినహా పుల్లని పండ్లు నారింజ, నిమ్మ,బత్తాయి కలపకూడదు. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది.
  • తేనెను 🍯ఎప్పుడూ వేడి చేయకూడదు లేదా వేడి పదార్థాలలో కలపకూడదు. వేడి చేసిన తేనె శరీరంలో విషతుల్యంగా మారుతుంది.
  • పాలు 🥛మరియు చేపలను 🍤కలిపి తింటే రక్తప్రసరణలో ఆటంకాలు ఏర్పడి, చర్మ వ్యాధులు, బొల్లి, తెల్ల మచ్చలు వంటివి వచ్చే అవకాశం ఉంది.
  • పెరుగు వంటి చలవ చేసే పదార్థాలను, వేడి చేసే 🍗మాంసాహారంతో కలిపి తీసుకోకూడదు.
  • నెయ్యి మరియు 🍯తేనెను సమాన పరిమాణంలో తీసుకోకూడదు. ఇది శరీరానికి హానికరం.
  • పాలు 🥛తాగే ముందు లేదా తర్వాత వెంటనే ఉప్పగా ఉండే పదార్థాలు తినకూడదు. 

ఆహారం కొందరికి అమృతం, అదే  మరి కొందరికి విషం. అందుకే కొన్ని ఆహారాలు. మతపరంగా, సామాజికపరంగా,ఆరోగ్యపరంగా నిషిద్ధ ఆహారాలుగా పరిగణిస్తారు.

  • మధుమేహం వున్నవాళ్ళు శీతల పానీయాలు,స్వీట్లు, క్యాండీ,పాలీషుచేసిన రైస్, మామిడి, సపోట, అరటి, సీత ఫలం వంటి పండ్లు, బేకరి ఉత్పత్తుల తీసుకోవడం మీద అధిక నియంత్రణ కలిగి ఉండాలి.
  • థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు అయోడిన్ శోషణను ప్రభావితంచేసే సోయా ఉత్పత్తులు, బ్రకోలి,కాలీఫ్లవర్ వంటివి పరిమితం చేయాలి.
  • ఫ్యాటీ లివర్ సమస్య వున్నవాళ్లు చక్కెర, స్వీట్లు, శీతల పానీయాలు ,ఆల్కహాలు,వైట్ బ్రెడ్, మరియు జంక్ ఫుడ్ , బేకరి ఉత్పత్తుల తీసుకోవడం మీద అప్రమత్తత కలిగి ఉండాలి.
  • అలెర్జీలు ఉన్నవారిలో గ్లూటెన్ (గోధుమ), లాక్టోస్ (పాల ఉత్పత్తులు), వేరుశెనగ, నట్స్ వంటివి కొందరికి నిషిద్ధం. 
  • వివిధ మత ఆచారాలలో వారు కొన్ని ఆహారాలను నిషిద్ధ ఆహారాలుగా పరిగణిస్తారు.

మనం తీసుకునే ఆహారంలో సమీకృత పోషకాలు పుష్కలంగా వుండే సాత్విక ఆహారాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. తీసుకునే ఆహారంలో పాలు, పండ్లు, నెయ్యి, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పోషక నిధులైన బాదం, కాజు,పిస్తా, కిస్మిస్,గుమ్మడి,అవిసె గింజలు వంటివి దేహపరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మీ ఆహారంలో ప్రధానంగా ఉండేలా చూసుకోవాలి. 

  • రోజుకు మూడుసార్లు భోజనం చేసే బదులుగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం 🥗 చేయండి.భోజనంలో అన్నం 40% వరకు ఆకుకూరలు, వేపుడులు,సలాడులు, సాంబారు, పెరుగు లేక మజ్జిగ వంటివి 60% వరకు ఉండాలి, మసాలాలు, ఉప్పుకారాలు తక్కువగా వుండేలా చూసుకోవాలి.
  • భోజనం 🍛 తో పొట్టని 70%వరకు మాత్రమే నింపండి, ఈ నాణ్యమైన భోజనశైలి ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఎసిడిటి,గ్యాస్ లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • భోజనానికి అరగంట ముందుగా, భోజనం తీసుకున్న అరగంట తరువాత మాత్రమే నీళ్లు 🚰త్రాగండి. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు క్రమేణా మానివేయండి.ఈ మార్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
  • సాయంకాల భోజనం 🍛 కు ఉదయం తీసుకునే 🥗అల్పాహారంల మధ్య నిరాహారంగా 13 నుంచి 14 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి, అయితే మంచినీళ్లు మీ ఆసక్తి మేరకు త్రాగండి. ఈ మార్పు శరీర అంతరశుద్ధికి సహాయపడుతుంది. 

మన ఆరోగ్యం, శరీరపోషణ, దేహదారుఢ్యం, ఆలోచనలు, భావనలు, నడవడికలు ప్రవర్తనలకు తీసుకునే ఆహారం ప్రధానపాత్ర పోషిస్తుంది.

తీసుకునే ఆహారం మితాహారం, హితాహారం,మధురాహారంగా దేహానికి,మనస్సుకు సాత్వికతను చేకూర్చేవిధంగా ఉండాలి. ఏ ఆహారం అయితే మనస్సును ప్రశాంతంగా వుంచడానికి, దేహం ఆరోగ్యవంతంగా వుంచడానికి, మానసిక ప్రకోపాలను దూరంగా వుంచడానికి సహకరిస్తిందో ఆ ఆహారాలు సాత్వికాహారాలు అవుతాయి. అవి జీవితంలో సంతోష మధురిమలకు ఆలంబనగా ఆనంద భరిత జీవితంకు దోహదం చేస్తాయి.  ఆనందంగా జీవించేవాళ్లు దీర్ఘ ఆయుష్షుతో జీవితాన్ని గడిపేస్తారు.

అరగని, తరగని సంపద ఎంతున్నా, ఆరోగ్యసంపదే మిన్న !!!


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️







ఆధ్యాత్మిక ఫధం 20 సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః..’


సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః..’

ఎదుటివాడికి🗣️ చెప్పమంటే ప్రతివాడూ వేదవ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే… వీరికి లక్ష్యం 🎯 నందుఅమితాసక్తి 🤞 లక్ష్యసాధనలో లేశమాత్రం లేకపోవడం, సిద్ధాంతం నందు వున్న ప్రీతి ఆచరణలో ఏ మాత్రం చూపించకపోవడం వీరి సహజ నైజం.

తమకు తోచిందే ధర్మం, చూస్తున్నదే నిజం, తమకు లాభం కలిగించేదే ధర్మం అనే దృక్పథం కలిగివుంటారు. అంతులేని  కోరికలను తీర్చుకోవడానికి వీరు  దైవాన్ని ఒక ఉపకరణంగా భావిస్తారు. పనులు సజావుగా జరిగితే తమ ఇష్టదైవానికి పూజలు, అభిషేకాలు, వ్రతాలు చేస్తారు, భూరి కానుకలు కూడా సమర్పిస్తారు, అలా అనుకున్నరీతిలో పనులు జరగకపోతే ఆ దైవాన్ని ఉన్నావా? అసలున్నవా? అని ఆయన ఉనికినే ప్రశ్నిస్తారు , నిందారోపణలు కూడా చేస్తారు.వీరు దేవుడితో కేవలం వ్యాపారధోరణిని, ప్రవృత్తిని కలిగివుంటారు, భక్తి, విశ్వాసం,నమ్మకం లేశమాత్రంగా వుంటుంది. వీరు పైకి వేదాలు వల్లిస్తూ , లోన అసురప్రవృత్తితో రగిలిపోతు వుంటారు.

సమాజంలోని తీరుతెన్నులను తమ అనుకూలధోరణితో ఆలోచిస్తూ ప్రవర్తించే వీరు ఎటుచూసినా, ఏ రంగంలో అయినా కోకొల్లలు. ఇది దుష్కర్మాచరణ, వివేకరహితం, అనైతికం, అజ్ఞానభరితం.ఈ విపరీత ఆలోచనాధోరణి చాపకింద నీరులా అన్నివైపులకూ విస్తరిస్స్తూ, హైందవ సంప్రదాయలను, సంస్కృతిని, ఆచారాలను మానవతావిలువలను అపహాస్యం చేస్తున్నాయి. సామాజికవిలువలను ఆఘాతంలోకీ నెట్టేస్తున్నాయి.

  • పరకామణిసేవ ముసుగులో స్వామివారికి సమర్పించిన విలువైన కానుకలను తమ హస్తలాఘవంతో మాయంచేస్తూ, వాటిలో కొంత తిరిగి కానుకలుగా🧧 ఆ దేవునికి లంచం లాంఛనంగా సమర్పించి 🤲 పరమాత్మ అనుగ్రహం కోసం ప్రార్థనలు, పూజలు, ఉపవాస దీక్షలు చేస్తారు. వీరికి ఆ విశ్వంభరుడు క్షమాభిక్ష అనుగ్రహిస్తాడా!?
  • నటన, నృత్యం💃,గానం, అభినయనం కళామాతల్లికి సమర్పించే భక్తి పూర్వక నీరాజనాలు, ఐతే కళల పేరుతో కొందరు తమ మేధస్సును మతవైరుష్యాలకు, మతవిద్వేషాలను రెచ్చగొట్టే ఉగ్రాయుధంగా, వంచనానైజంనే కళాప్రవృత్తిగా మానవీయత విలువలను అగ్నికి ఆహుతి 🔥చేస్తూ మతసామరస్యం,శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు.
  • ప్రజారోగ్యం పేరుతో ప్రజలను నిలువుదోపిడే  అంతిమలక్ష్యంగా కొన్ని ఫార్మా కంపెనీలు హానికలిగించే ఉత్ప్రేరక మందులను, నిషేధిత మందులను, నాసిరకం మందులను,వ్యాధి తెలియని వాటికి 💉వాక్సిన్ల పేరిట ఉత్పత్తి విక్రయాలు అప్రహితంగా కొనసాగిస్తున్నాయి.
  • లిక్కరు 🥃అమ్మకాలతో సామాన్యుల ఇళ్లు,వళ్లు గుల్లచేస్తూ, భిక్షగా  ప్రజాసంక్షేమపథకాలు అమలు కంటితుడుపు చర్యగా చేసే విష రాజకీయాలు ఈ సమాజాన్ని విశాదసంస్కృతి దిశకి పయనం చేయిస్తుంది. 
  • డ్రగ్స్ ను విచ్చలవిడిగా విక్రయిస్తూ యువతతో విధ్వంసాన్ని సృష్టిస్తున్న డ్రగ్స్ మాఫియాల మితిమీరిన ఆగడాలు విషసంస్కృతికి సంకేతాలవుతున్నాయి.
  • ప్రజాసేవ పేరుతో అలవికాని వాగ్దానాలు చేస్తూ భావి తరాలను అప్పులవుభిలోనికి నెట్టివేస్తూ, ఆర్ధికవ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తూ దేశాన్నీ మరో వెనిజులా దిశకు తీసుకు వెళ్తున్న రాజకీయనాయకులు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బలమైన రాజకీయ వ్యవస్థ ఈ దేశానికి ఎంతో అవసరం.
  • వైద్యం పేరిట కార్పొరేట్ హాస్పిటళ్లు రోగం తెలియని చికిత్సల పేరుతో నిత్యం అదే పనిగా దగా,వంచనలు,ఘరానమోసాలతో రోగులను బికారూలుగా చేస్తూ వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షపండ్లుగా మారిస్తే, నవసమాజం ఏలా నిర్మితం అవుతుంది?
  • చర్మ సౌందర్యం పేరుతో మన బలహీనతలను ఆకర్షించే ప్రకటనలతో డబ్బు, టైంను యధేచ్ఛగా దోపిడీ చేస్తున్న మల్టీనేషనల్ కాస్మొటిక్ కంపెనీలు, మన సాంప్రదాయక పద్ధతులను తెరమరుగు చేస్తున్నాయి.
  • మాయమాటలనే పెట్టుబడిగా సొమ్ము చేసుకుంటూ జనాల జీవితాలతో, ఆరోగ్యాలతో ఎటుచూసినా చెలగాటలాడే కల్తీదారుల అవినీతి భాగోతాలు జనజీవనాన్ని విషాదం లోనికి నెడుతున్నాయి.
  • న్యాయంకోసం లాయర్ల👩‍💼 సేవలు కొనుక్కునే తెలివితేటలు , డబ్బుకు న్యాయంని అమ్ముకునే తెలివితేటలు లాయర్లు 👩🏻‍💼అయితే న్యాయవ్యవస్థ అందరు వున్న అనాథగా మిగిలిపోతూవుంది.
  • కాదేదీ వంచనకు అనర్హం అంటూ అప్రహితంగా కొనసాగుతున్న ప్రజావ్యవస్థలు సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.

అన్ని కలగలిపి చేసిన  నేరాలకు, అక్రమాలకు,మోసాలకు,తప్పిదాలకు శిక్షల నుండి న్యాయస్థానంలో న్యాయం కొనుక్కునే తెలివితేటలు నీకు ఉండవచ్చు. కానీ,

అంతరంగ న్యాయస్థానంలో ⚖️చిత్రగుప్తుడుగా నీ చిత్తంలోగుప్తంగా నిలిచివున్న ఉపద్రష్ట, ఆత్మసాక్షిల ముందు ఆ కర్మఫలాలను అనుభవించడానికి నీవు సిద్ధంగా వుండాల్సిందే !చేసిన కర్మలు ఎవ్వరిని వదిలిపెట్టవు! 

  • నిజాన్ని భూమిలో పాతిపెట్టినా అది ఓ రోజు భూమి పొరలను ఛిద్రం చేస్తూ విత్తనం 🌱మొక్కగా ఏలా బయటకు వస్తుందో నీ పాపకర్మఫలాలు కూడా అలాగే నిన్ను దగ్ధం చేయడానికి నీ చుట్టూ, సదా నీ వెంటనే ఉంటాయి. న్యాయం, ధర్మం ☸️,కాలం ఎవ్వరిని ఉపేక్షించవు.
  • పుష్పాలలోని 💐లోని సుగంధభరిత పరిమళాలు గాలిలోకలసి సువాసన రూపంలో మన మనసును ఏలా కదిలిస్తాయో, నీవు మట్టిలో మట్టిగా కలిసిపోయినా నీ కర్మఫలాలు వాసన రూపంలో, ప్రారబ్ధకర్మలుగా మరుజన్మకు నీ ఆత్మసాక్షిగా విడదీయలేని రాక్షసబంధాలుగా దృఢంగా పెనవేసుకపోతుంటాయి.
  • కర్మక్షయం, వాసనక్షయం జరిగే వరకు నీవు తిరిగి జన్మలు తీసుకోవాల్సిందే. ఈ కాలచక్రం ☸️సృష్టి ఆరంభం నుంచి తన పయనం ఇలా సాగిస్తూనే ఉంది.

తప్పులు చేయకుండా ఎలా తప్పించుకోవాలి, ఆ పరమాత్మ 🔱అభయహస్తం ఏలా పొందాలి,అనే సద్భావనలే నిన్ను మంచిదారిలో 🛣️నడిపిస్తాయి.

  • జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే, తోటివారికి సంతోషం కలిగించే పనులు మాత్రమే చేస్తూ వుండాలి! ఎదుటివారీ క్షేమంనే ఆకాంక్షించించడం ఎపుడు మొదలవుతుందో ఆ క్షణం నుంచే నీ ఆలోచనలు సంతోషభరితం అవుతాయి.
  • మనకు ఏదైనా కావాలంటే, ముందుగా కష్టాలలో వున్నవారికి స్నేహహస్తం 🤝అందించండి, ఆదరించండి. మనం ఇతరులకు ప్రతిఫలితం ఆశించకుండా ఏవైతే చేస్తామో ఆ సత్కర్మలే సదాచేయూతగా వుంటాయి.
  • ఎవరి నుండి ఏమీ ఆశించక, ఆపన్నహస్తం అందించే త్యాగశీలులు సంతోషభరిత జీవిత మాధుర్యాలను అనుభవిస్తూ ఆనందంగా ఉంటారు. పరులసొమ్ము 💰ఆశించని ఈ అపరిగ్రహణ ఆచరణ అప్రమేయుడు, అవ్యయుడు, విశ్వంభరుడు అయిన పరంబ్రహ్మంతో నిత్యసాన్నిహిత్యం, తన్మయత్వం, ముక్తిప్రాసాదము లోనికి ప్రవేశించడానికి ప్రథమ సోపానం అవుతుంది.
  • జీవితం ఆసక్తికరంగా, అందంగా గడపడం నేర్చుకున్న వ్యక్తులతో మీ సన్నిహిత్వం పెంపొందించుకోండి. మీరు కూడా అలాంటి వారి లాగే పరివర్తన చెందండి.
  • మనందరిలో కొన్నిలోపాలు, మరికొన్ని మంచి లక్షణాలు కలిగివుంటాయి .ఇతరులలోని లోపాలను గుర్తించండి అయితే వాటిని అనుకరించకండి, కానీ వారిలోని మంచి గుణాలను గుర్తించి వాటిని ప్రశంసించండి. మీరు అందరికీ సన్నిహితులవుతారు.
  • గుర్తుంచుకోండి తప్పు నీవుచేసిన, నీ వారుచేసిన, ఎదుటివారు చేసిన, నీ శత్రువులు చేసిన, ఎవరుచేసినా తప్పును తప్పుగా చూడకపోవడం, దానిని శిక్షించక క్షమించడం అనేది అతి పెద్ద తప్పుఅవుతుంది. అది క్రమేణా వైరస్ 🦠 గా సమాజాన్ని పట్టి పీడిస్తుంది.
  • తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం.తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం. 
  • కష్టసమయాల్లో కూడా 😅కన్నీళ్లు ఉన్నా, నవ్వుతూ 🤠 మాట్లాడండి. భాదలను మాత్రం పంచుకోకండి, అవి మీకు ఊరట కలిగించిన ఎదుటివారు మిమ్మల్ని దూరంగవుంచే ప్రయత్నం చేస్తారు. 
  • పూజ 🪔 అంటే పూర్వజన్మల కర్మఫలాలను నశింపచేసేది. అందుకే ప్రతి రోజూ అప్రమేయుడు, అవ్యయుడు అయిన ప్రత్యాగాత్మకు మనసే 🛕 కోవెలగా శ్రద్ధ,నిష్ఠలతో భక్తిపూర్వకంగా 🙏 పూజించండి 🪔 ఆరాధించండి. 
  • మీ సంతోషాలను, పాపపుణ్య ఫలాలను పరమాత్మకు భక్తిపూర్వకంగా నివేదించండి, వాటినే నైవేద్యంగా హృదయపూర్వకంగా ఆ సర్వేశ్వరుడికి సమర్పించండి. ఇదే మానసిక ప్రశాంతతకు చేరువ చేసే ఆత్మనివేదన. ఇది వాసనక్షయం,కర్మక్షయంలను కూడా దగ్ధం చేసే ప్రతిభావంతశీలిగా విశ్వంభరుడి అనుగ్రహపాత్రుడిని చేస్తుంది.
  • ఎవరైతే మానవీయదృక్పథంతో ఇతరులకు కష్టాలు కలిగించే పనులు చేయరాదని నైతికంగా వాటిని ఆచరిస్తూ వుంటారో వారీ జీవితం ఆదర్శవంతం, వారు ఇతరులకు ఆదర్శప్రాయులుగా మార్గదర్శకులవుతారు.

ధర్మాచరణ మార్గంలో 🛣️పయనం మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, జీవితం సంతోషభరిత పయనంగా కొనసాగుతుంది.

అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే ఉంటాయి ఎందుకంటే చీకటి రాబోయే వెలుతురుకు సంకేతం.

ఇక్కడ ఏది శాశ్వతం కాదు.


సర్వేజనా సుఖినోభవంతు

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 


Sunday, 22 February 2026

ఆధ్యాత్మిక పథం 19 గణితశాస్త్రంలో విశిష్ట సంఖ్య 1️⃣8️⃣


గణితశాస్త్రంలో విశిష్ట సంఖ్య 1️⃣8️⃣

మన జీవితంలో ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా మనం ఎరుకతో గమనిస్తే గణితసంఖ్య  18 కి గల విశేష ప్రాధాన్యతను గుర్తించవచ్చు.

  • పంచమ వేదం మహాభారతం లోని పర్వాలు 18
  • వేద వాఙ్మయం 📚ప్రబోధించే పురాణాలు 18
  • భగవద్గీతలో 📗అధ్యాయాలు 18 
  • ధర్మపరిరక్షణ 🎯 లక్ష్యంగా భారతసంగ్రామం జరిగిన రోజులు 18
  • మహాభారత ⚔️యుద్ధంలో పాల్గొన్న సైనికులు 18 అక్షౌహిణీలు 
  • దేవాలయంలో  🛕 దైవదర్శనానికి అధిరోహించవలసినవి 18 సోపానాలు 
  • యజ్ఞంలో పాల్గొనే ఋత్విక్కులు 18 మంది 
  • ఈశావ్యాసోపనిషత్తులో 📕శ్లోకాలు 18
  • సంఖ్యా యోగంలో🔖 స్థితప్రజ్ఞత లక్షణ శ్లోకాలు 18
  • సంఖ్యా యొగంలో 🔖ఆత్మవర్ణన శ్లోకాలు 18
  • మోక్షసౌధ సోపానాలు 18
  • యుక్త వయస్సుకి చేరేది 18 వ సంవత్సరం
  • దేశభవిష్యత్తు నిర్ణయించే ఓటు హక్కు వచ్చేది 18 వ సంవత్సరం 
  • వధువరులకు 👩‍❤️‍💋‍👩వివాహం చేసుకోవడానికి కావలసిన అర్హత వచ్చేది 18 వ సంవత్సరం

మనలో దైవత్వం అంతర్వాహినిగా ఉంటే, అంతర్యామిగా మనసనే మందిరం 🛕లో ఉపద్రష్టగా 🕉️ఆసీనుడైన అప్రమేయుడుని చేరుకోవడానికి అధిరోహించవలసిన సోపానాలు కూడా  18

ప్రత్యగాత్మ సన్నిహిత్వానికి జీవన శైలిగా 18 🇳🇵సోపానాల మార్గదర్శి 

🍒సంస్కారభరిత జీవనం 

గురువుల మీద చూపించే గౌరవం, అమ్మ నాన్నల మీద ప్రేమ, ఆర్తుల మీద దయ, ఇతర జీవుల మీద కరుణ, పెద్దల యందు చూపించే వినయ విధేయతలు, అతిధి మర్యాదలు, సమయ పాలన పాటించడం మనలని సంస్కారవంతులగా చేస్తుంది. మీ పిల్లలకు సంస్కారభరిత విలువలను నేర్పించడమే వారికి మీరు ఇచ్చే నిజమైన సిరి సంపదలు.

🍒మోహం 

లేనిది ఉన్నట్లుగా పనులు జరిపించు కొనడానికి పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు, వారే శ్రేయోభిలాషులు అనే మొహంలో పడడం మీ అవివేకం. 

ఉన్నది ఉన్నట్లుగా యదార్థం మాట్లాడేవ్యక్తి నిజమైన శ్రేయోభిలాషి. అటువంటి వారు దొరకడం అరుదు, అటువంటి వారిని వదలుకోవడం మూర్ఖత్వం.

🍒 సచ్చీలత 

తప్పులు చేయని సచ్చీలత ఎవరికి ఉండదు. అయితే తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమార్పణ కోరడం వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది. మిమ్మల్ని ప్రేమించేవారిని ఇష్టపడండి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి స్నేహహస్తం అందించండి. మీకు కష్టం కలిగించినవారికి కూడా శుభం కలగాలని ప్రార్థించండి. మీ శీలసంపద సత్వగుణంతో వికసిస్తుంది.

🍒మంచి మాట

ఏది పడితే అది వినడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. మంచిమాటలు తప్పక వినాలి. మంచి మాటలే మాట్లాడాలి. అందరి హితం మాటల్లో, చేతల్లో చూపించాలి. మూర్ఖుడు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైనవాడు ఆలోచించి సౌమ్యంగా,మృదువుగా సూటిగా మాట్లాడుతాడు. ఏం మాట్లాడావన్న దానికంటే ఎలా మాట్లాడావనేది ముఖ్యం.

మనిషిని ఒప్పించినా మనసును నొప్పించినా అది మాట తీరే.

🍒పెద్దల మాట శిరోధార్యం 

తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యం కాదు.

రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఎపిజె అబ్దుల్‌ కలాం, రమణమహర్షి, సత్యసాయిబాబా లాంటి మహాత్ముల మాటలు చదవండి. జీవితం అంటే ఏమిటి, ఎలవుండాలి అనేది ప్రబోధిస్తాయి.

🍒జడత్వం 

జడత్వం అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన లేని ఉదాసీన జీవితం.

ఇస్లామిక్ మతమౌడ్యంతో ఊచకోతకు బలి అవుతున్న హిందువుల పట్ల సమాజంలో చైతన్యం లోపించి ప్రతిస్పందనలేని లక్షణమే జడత్వంగా సమాజంని ఆవహిస్తుంది. 

ఈ సమాజంలో ఒకరు వృద్ధిలోకి వచ్చినా, ఇంకొకరు అధోగతిపాలు అయినా కారణ మేమిటని ప్రశ్నించుకుంటే అందుకు జడత్వమే ప్రధాన కారణం అవుతుంది.

జడత్వం మానసికంగా, సామాజికంగా నిన్ను బలహీనుడిని చేస్తుంది, దానిని అదుపులో ఉంచుకోవాలి.

🍒ఆదర్శవంతంగా వుండాలి 

శాస్త్రాలలో📚 చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే కార్యశీలి అందరికి ఆదర్శం అవుతాడు.

ఐతే నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్న దాన్నిబట్టి నీవు ఇతరులకు ఆదర్శం అవుతావు.

🍒ఆత్మపరిశీలన

నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదు అనే ఆలోచన ముందరి కాళ్లకు బంధనం అవుతుంది. జీవితంలో రాణించడానికి అది అడ్డంకి అవుతుంది. ఈ లోపాన్ని ఆత్మపరిశీలనతో సరిదిద్దుకుంటే పది మందికీ ఆదర్శప్రాయం కావచ్చు.

🍒కోపం 

శత్రువు బయటనుంచి రాడు. కోపమే నిజమైన శత్రువు. కోపం మీ విచక్షణ జ్ఞానాన్ని హరిస్తుంది.

కోపాన్ని ఎవరికివారుగా పరిశీలించి సరిదిద్దుకోవాలి. అంతేగాని నాకు కోపం వచ్చింది అన్న తరువాత ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. 

నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు  కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని  ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకున్నవాడు రాణిస్తాడు,  అది లేనివాడు కోపిష్టిగా ఒంటరి అయ్యే ప్రమాదం ఉంది. 

🍒ప్రణాళిక

ఆధ్యాత్మిక పరంగా, సాంఘిక పరంగా, సామాజిక పరంగా కూడా ప్రతి ఒక్కరికి తప్పక ఓ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యసాధనకు ఓ 🔖నిర్దిష్ట ప్రణాళిక కావాలి.

ఆచరణలో తారసపడే సాధక బాధకాలను, అవకాశాలను మూల్యాంకనం చేస్తూ వ్యూహరచన వుండాలి. ఆ ప్రణాళిక అంతిమ లక్ష్యం 🎯 ఒడిదుడుకులు లేకుండా గమ్యం చేరుకునే దిశలో వుండాలి అంతేగాని అవరోధంగా వుండరాదు. అందుకే తరుచుగా అవసరమైతే వ్యూహం అమలులో మార్పులు, కూర్పులు, చేర్పులు తప్పనిసరి.

 🍒శ్రవణం

 మనలో చాలా మంది సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడకుండా నిర్లిప్తంగా వుండిపోతారు. అలగాకుండా మీరు ఏ స్థాయిలో వున్న ఏవైనా సమస్యలు ఎదురైతే మీలో కుమిలిపోకుండా వాటిని కొలిగ్స్ తో పంచుకోండి, వారి అభిప్రాయాలను పరిగణ లోనికి తీసుకోండి. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు ప్రధానం, వారి ఆ మాటల్లో ఏమైనా పరిష్కార మార్గం దొరకుతుందా? అందులో ఒక్క మంచి ఆలోచన వున్నా భేషజానికి పోకుండా దానిని ముందుకు తీసుకువెళ్తే విజయం ✌️ సాధించవచ్చు. ఎదుటి వారి మాటకు విలువ ఇవ్వడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు.

ఆలోచనల గజిబిజిలో ఉంటే మనస్సుకు ప్రశాంతతను కలిగించే శ్రవణానంద 🎧సంగీతంను ఆలకించండి, మనస్సుతో ఆస్వాదించండి. 

🍒స్పష్టత 

మనం చేసే ఏ పనినైనా ఎందుకు చేస్తున్నామో అనే స్పష్టమైన అభిప్రాయం కలిగి వుండాలి.

చదవబోయే చదువు, చేరబోయే ఉద్యోగం, షేరుమార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు, కొనబోయే ఇల్లు ఇలా ఏ విషయంలో అయినా సంపూర్ణ అవగాహన వుండాలి, ఎటువంటి అస్పష్టత వుండరాదు. 

స్పష్టత  తీసుకునే నిర్ణయాలలో క్లారిటీ ఇస్తూ నాణ్యత, బాధ్యతలను ప్రతిబింబిస్తుంది. ఆలోచనలలో క్లారిటీ, స్పష్టత కోసం శ్వాస మీద ధ్యాసతో ప్రతిరోజూ ధ్యానం కనీసం ఓ పావుగంట సాధన అలవాటు చేసుకోండి. ఆశ్చర్య భరితమైన మెరుగైన ఆలోచనలు మీ మదిలో క్రమంగా వికసితం కావడం గమనిస్తారు.

🍒మట్టిముద్దలా కిందపడిపోకండి 

గోడకి విసరిన బంతిలా 🏀మీ ప్రవర్తన వుండాలి, అంతేగాని గోడకు విసిరిన మట్టిముద్దలా ఆగిపోకండి.  జీవితంలో పొరపాట్లు, అపజయాలు, వైఫల్యాలు లేకుండా ఎవ్వరి జీవితం సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా వంకలు పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు కించపరచారని, అవహేళన చేశారని మట్టిముద్దలా కిందపడిపోకండి. ఆ పొరపాట్లను సరిదిద్దుకొని రబ్బరు బంతిలా మీరు కార్యోన్ముఖులుగా  ముందుకు సాగిపోవాలి. 

🍒నిరాశ

ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకున్న, మంచి స్కోర్ వచ్చినా మంచి కాలేజి లో సీటు రాకున్నా, మంచి కాలేజి అయినా అనుకున్న కోర్సులో సీటు రాకున్న, మంచి గ్రేడు వచ్చినా అనుకున్న కంపెనీలో ఉద్యోగం రాకున్నా, ఉద్యోగం వచ్చినా మంచి సంబంధం కలిసిరాకపోయినా , చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం అయినా, ఫారిన్ కి వెళ్లే ఛాన్స్ లేటు అయినా,అనుకున్న వృత్తిలో ఒడిదుడుకులు వచ్చినా , ఆశించిన రీతిలో జీవితం ముందుకు సాగడం లేదు అని నిరాశ, నిస్పృహలతో వుండడం యువతలో చూస్తున్నాం. నీవు అనుకున్నట్లుగా జరగాలని ఎందుకు అనుకోవాలి. జీవితం అనే వైకుంఠపాళిలో కేవలం అవకాశాలు అనే నిచ్చెనలే కాదు, కిందకి దించే 🐍పాములు కూడా వుంటాయి. నీ విజ్ఞత తో వాటిని అధిగమించే నేర్పు కావాలి.

నీ జన్మకి కారణమయిన ఆ పరమేశ్వరుడు 🕉️నీ ద్వారా ఈ సమాజానికి ఏమి చేయించాలను కుంటున్నాడో అని అలోచించండి. ఇక నిరాశ,నిస్పృహల నుండి నూతన అధ్యాయం మొదలవుతుంది.

🍒 పుస్తక పఠనం

ఈ నూతన సంవత్సరం పుస్తకపఠనం 📗అలవాటు చేసుకోండి. ఐతే ఏ పుస్తకం పడితే అది చదవకండి. స్ఫూర్తిని నింపే మహనీయుల ఉపన్యాసాలు, జీవిత చరిత్రలు, అనుభవాలను చదవండి. మీకెంతో మనో స్థైర్యం కలుగచేస్తాయి. మంచి పుస్తకం చదవడం ఓ మంచి మిత్రుడితో కొనసాగించే స్నేహం లాంటిది.

వేదాలు📚 చదివే ప్రయత్నం చేయండి.జీవిత లక్ష్యం 🎯అవగతం అవుతుంది. పలుభాషలలో ప్రావీణ్యం సంపాదించుకోండి. మిత్రులతో, సన్నిహితులతో, ఇంట్లో చక్కగా తెలుగులో మాట్లాడండి. 

🍒ఆరాధించడం కాదు…కృతజ్ఞత 

భక్తి అంటే భగవంతుడు ఏదో మనకు అనుగ్రహిస్తాడు అని ఆరాధించడం కాదు, మనకి అనుగ్రహించిన జీవితానికి కృతజ్ఞత తెలియ చేయడం. జగద్గురు ఉపదేశాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడం. 

జీవితాంతం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సదా మీకోసమే అలుపెరుగని సేవలను అందిస్తున్న దేహం, మనస్సు, బుద్ధి పంచ కర్మేంద్రియాలు,పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలయందు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇవే మోక్షసౌధ సోపానాలు.

🍒వైఫల్యాలే విజయ కేతనాలు కావాలి

మనం చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలి అని ఆశించడం అత్యాశ అవుతుంది. చేసే ప్రయత్నాలలో వైఫల్యాలు కూడా ఎదురైతాయి. ఎవరైతే వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారో వారు జీవితంలో అభివృద్ధి పథంలో 🚩🚩🚩విజయకేతనాలను ఎగరవేస్తారు.

జీవితం అంటే కష్టాలలో పడిపోవడం కాదు, ఎందుకు పడిపోయామో కారణాలను మూల్యాంకనం చేసి, అక్కడనుంచే నిలబడి సమర్థవంతంగా పోరాటస్ఫూర్తితో ముందడుగు వేయడం.  అప్పుడు వికల్పాలు, వైఫల్యాలలే విజయ పథానికి సోపానాలు అవుతాయి.

🍒పొగడ్త పాలపొంగులా కారాదు

ఎవరికైనా పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొ కారణం కూడా కనిపించదు. అందుకని తల్లిదండ్రులుగా మీ పిల్లలు చదువుల్లో, ఆటల్లో చూపించే  ప్రతిభని మనసారా అభినందించండి, వారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయకండి, వారిని అహంభావులుగా తయారు చేయకండి.

ఐతే జీవితంలో పొగడ్త అన్నది సరియైన మోతాదులో తీసుకుంటే మనస్సు పరవశిస్తుంది. మందులే కదా అని అతి మోతాదులో తీసుకుంటే అది విషం అవుతుంది.

 రేపటి రోజు ఎలా వుండాలో అనేది నీ ఆలోచనలలో,చేతల్లో,చేతుల్లో ఉంది. నీ భవిష్యత్తు నీవే రాసుకోవాలి.


సర్వేజనా సుఖినోభవంతు

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 





     

ఆధ్యాత్మిక పథం 18 లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే

 

లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే

విధాత వ్రాసిన నుదుటిగీత తప్పించుకోవడం ఎవ్వరి వశంకాదు అనే నమ్మకం కొందరిది అయితే, మరికొందరు ఇది మూఢనమ్మకం , విధాతకు మన విధివ్రాతలు రాసేంత టైమ్ ఎక్కడవుంటుంది అని కౌంటర్లు వేస్తూవుంటారు.

గతజన్మలలోని కర్మఫలాలు ఈ జన్మకి ప్రారబ్ధకర్మఫలాలవుతాయి. వాటి నుంచి ఎదురయ్యే కష్టాలను, దుఃఖాలను, పేదరికంను, అనారోగ్యాలను,వేదనలను ఈ జీవనప్రయానంలో అనుభవించి తీరాల్సిందే…ఇవి లేని జీవితం ఊహించలేము…  

ఈ లోకంలో కష్టాలు, ఇతిబాధలు, విధివ్రాతల నుంచి ఎవరు తప్పించుకోలేరు అనే నమ్మకం మనందరిలో ఉంటుంది.

ఐతే ఎవరు వీటిని సవాళ్లుగా స్వీకరించి మనోధైర్యంతో ముందడుగు వేస్తారో వారు ఆ కష్టాలఊభి నుంచి బయటకు రావడానికి, విజయంసాధించడానికి విధాత అభయహస్తం వారికి లభిస్తుంది.

హైందవ సంస్కృతీ ఈ విశ్వంను మూడులోకాలుగా విస్తరించినా అఖిలాండ బ్రహ్మాండం అని విశ్వసిస్తుంది. అవి స్వర్గం, నరకం, మర్త్యలోకాలు. కర్మఫలాభిలాషులకు వారి కర్మఫలాల పలితంగా మరణానంతరం యాతనాశరీరంతో తన లోకంలోనికి పయనించి తీరుతుంది. ఇదే విషయంను అప్రమేయుడు అయిన పరమాత్మ గీతలో కర్మఫలం అనుభవించడానికి సిద్ధం కండి అని  అనిష్ట మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం…’ అని హెచ్చరించారు.


స్వర్గం

ఇది పుణ్యలోకం. పుణ్యాత్మల లోకం. స్వర్గంలో దుఃఖం ఉండదు.

  • సంతోషభరితం, ఆనందభరితం, అది దేవతలు, పుణ్యాత్మల ఆవాసం.
  • ఆకలిదప్పికలు, ఇతి భాదలు లేని సుమధుర మనోహర సుందర సుఖలోకం. 
  • అందరూ తపించేది, కోరుకొనేది, ఇష్టపడేది, ఆకాంక్షించే ఉత్తమలోకం స్వర్గం. 
  • జీవితంలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా మాత్రమే సిద్ధించేది. 

స్వర్గలోకానికి వీసా మనం చేసే దానధర్మాలు, యజ్ఞాలు, వ్రతాలు, పూజలు, దీక్షలు, స్మరణం, మానవసేవ, పాప ప్రక్షాళనలో భాగంగా పుణ్యతీర్థాలు,పుణ్యక్షేత్రాల దర్శన, అనన్యచింతన, అన్నన్యభక్తితో తీసుకునే దీక్షలు ప్రధాన భూమికను పోషిస్తాయి.

వీరు సాత్విక ఆహార ప్రియులు. సాత్వికగుణం కలిగి దయ,కరుణ,జాలి,ప్రేమ భావనలతో సృష్టిలోని ప్రతి జీవియందు సమభావం,కృప,కరుణలను కలిగివుంటారు. 

వీరి ప్రవర్తనలలో వాచక అహింస, మానసిక అహింస,శారీరక అహింసపాలన మాత్రమే వుంటుంది. సత్కర్మలఫలంగా  స్వర్గలోకంకి ప్రవేశిస్తారు.

స్వర్గలోక ప్రయాణాభిలాషులగా మీ దినచర్యలో కొద్దిపాటి మార్పులను ఈ రోజే స్వాగతించండి.

  • ప్రాతఃకాలంలో పరిశుద్ధమైన మనస్సుతో భగవానుని అనుగ్రహం ఆకాంక్షిస్తూ వారి దివ్య సన్నిదిలో ఓ అరగంట ఉషోదయ ధ్యానముతో దినచర్యను ప్రారంభించండి. ధ్యానం 🧘‍♀️ మీలో మానసిక ప్రశాంతతను తీసుకువస్తుంది.
  • మీకు ఇష్టము వచ్చిన స్తోత్రమునో, శ్లోకమునో, మంత్రమునో మనస్సులో స్మరిస్తూ ఆ విశ్వవంభరుడిని కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థించండి. 
  • ఈ ప్రార్థన, ఆరాధన, సమర్పణ కేవలం మీ క్షేమం కొరకు మాత్రమే గాకుండా అందరూ క్షేమంగా వుండాలి, వర్షాలతో సకాలంలో పుడమితల్లి పులకరించాలి, అన్నదాతలు పాడిపంటలతో వారి కుటుంబాలల్లో ఆనందం వెళ్లివిరియాలి, అందరి కష్టాలు తొలగిపోవాలి, అందరి మనస్సుల్లో సుఖసంతోషాలు పొంగి పొరలాలి అని మనఃపూర్వకంగా ఆ అప్రమేయుడిని అంకిత భావంతో వేడుకోవాలి.
  • సర్వేజనా సుఖినోభవంతు గా అందరిక్షేమము ఆకాంక్షిస్తూ మనఃపూర్వకంగా ప్రార్థించేవారు శ్రేష్టులు,మానవీయులు,మహనీయులు.
  • మనం శుభం జరగాలని మనసా,వాచా,కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది. ‘యద్భావం తద్భవతి’ అనే వేదోక్తి ఈ సత్యాన్ని ప్రబోధిస్తుంది.
  • వేదపారాయణ,వేదాధ్యయనం,సత్ సాంగత్యాలలో పాల్గొనండి. ఆధ్యాత్మికత మీ ప్రవర్తనలో ప్రతిభింభించేలా వుండాలి..


నరకం 

ఇది నరకంలోకం. ఇక్కడ సుఖం వుండదు, దుఃఖానికి అంతం ఉండదు. 

ఇది ఇతిభాదల ఆవాసం,దుఃఖభరితం, వేదనాభరితం. అందరికీ అయిష్టం అయినది.  

ఈ లోకం నరకయాతనలకు, పాపకర్మలకు తెరచి వుంచిన దుర్గంధభరితద్వారం.

యాతనశరీరానికి వీసా అవసరం లేని తెరచివుంచిన,నిష్క్రమణ తెలియని, ప్రవేశద్వారం. ప్రవేశం ఉచితం,

ఇందులో అయిష్టంగా ప్రవేశం చేసే అందరిలో సాత్వికత లేశమాత్రం వుండవచ్చు. రజోగుణం ఎక్కువగా, తమోగుణం పూర్ణంగా వుంటుంది. 

వీరు మాంసాహార ప్రియులు. రాక్షసాహారం తీసుకునే వీరు రాక్షసప్రవృత్తితో సృష్టిలోని ఇతర జీవాలు తమ ఆకలి తీర్చుకోవడానికి దేవుడు సిద్ధంచేసిన ఆహారం అనే విపరీతధోరణితో ప్రవర్తిస్తుంటారు.

అహంభావం,అహంకారం,గర్వం,మదం,అత్యాశ వీరి స్వభావంలో అడుగడుగునా కనిపిస్తుంది.

నాది నాదే,నీది కూడా నాదే,అంతా నాదే అనే కబంధహస్తాలతో ఇతరుల ఆస్తులను ఆక్రమించుకుంటారు. అసూయాద్వేషాలతో రగిలి పోతుంటారు.

వీరు జీవితమంతా పగ, ప్రతీకారాలు, కుయుక్తులు, కుట్రలు చేస్తూ, కుతంత్రాలతో రగిలిపోతూ ఇతరుల జీవితాలతో  చెలగాటాలాడుకుంటూ వారి జీవితాలను నరకప్రాయంచేస్తూ పైశాచిక ఆనందం పొందే అసురవర్గం.

ఈ అతతాయులకు పరంబ్రహ్మ విధించే శిక్షనే నరకం. ఇది ఆత్మను అధోగతిలోకి పడవేసే విపరీతాకర్షణ శక్తి భరితం.


మర్త్యలోకం.

ఈ మర్త్యలోకం మనందరి ఆవాసం. ఇది అనశ్వరమైనది కాదు. పుట్టిన ప్రతి జీవి నశించే స్వభావం కలిగినది.

ఇది మిశ్రమలోకము. ఇక్కడ సుఖదుఃఖాలు, కష్టనష్టాలు కలగలిసి ఉంటాయి. సుఖదుఃఖములు, కష్ట సుఖాలు రెండూ  అపరిహార్యాలే!! అందుకని కష్టాలు, దుఃఖాలు కలిగినపుడు నిరాశ, నిస్పృహలతో కృంగిపోకండి అవి నిలకడలేనివి, రాకపోకలు సాగించేటువంటి సహజ స్వభావం కలిగినవి అని గ్రహించడంద్వారా మనస్సుకు ఉపశమనం కలుగుతుంది. కర్మఫలాలుగా వీటిని అనుభవించవలసిందే!!

వీరు ప్రధానంగా రజోగుణ సంపన్నులు. అహం వారి మాటలలో, చేష్టలలో, ప్రవర్తనలో తొణికిసలాడుతుంది. తమ సంతోషం,కుటుంబశ్రేయస్సు మాత్రమే ముఖ్యం. మానవత్వం చూపించ వలసిన సందర్భాలలో స్వార్థంతో ఆలోచిస్తారు. సంపాదనకోసం ధర్మం,న్యాయంల నుంచి ఎంతకైనా దిగజారుతారు. సంపాదనే జీవితాశయంగా గానుగెద్దులాంటి జీవితం గడిపేస్తుంటారు. సంపాదన కోసం ఇతరులకు హాని కలిగించడం, వారికి ఇష్టం లేని పనులు బలవంతంగా చేయిస్తారు. ఇతరులను క్షోభకు గురిచేస్తారు. దయ, కరుణ అనేవి వీరి డిక్షనరీలో ఎక్కడో సుదూరంగా వుండొచ్చు. 

వీరు చేసే పూజలు,ప్రార్థనలు,హోమాలు,క్రతువులు కేవలం తమ స్వలాభానికే.

వీరిలో తమోగుణం ఎక్కువగా,రజోగుణం సాధారణంగా,సాత్విక గుణం స్వల్పంగా ఉంటాయి. భవిష్యత్ జన్మలు వీరి ప్రస్తుత కర్మాచరణ ఫలాలుగా అధమజన్మ లేక నీచజన్మలుగా కూడా వుండగలవు. 

ప్రయత్నపూర్వకంగా సాత్విక గుణాలను పెంపోదించుకుంటూ, రజోగుణాలను అదుపులో ఉంచుకోవడండ్వారా విధివ్రాత వీరే తిరగరాసుకోవచ్చు.

మరి కొందరు సాత్వికగుణ మరియు రజోగుణ భావాల సమ్మేళనంతో ఉన్నప్పటికీ వారిలో సాత్విక గుణం మెండుగా ,రజోగుణం తక్కువగా , తమోగుణం అతి స్వల్పంగా కనిపిస్తుంది. 

వీరు ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉంటారు.

వీరు వాచక హింస, శారీరక హింస, మానసిక హింసలను ప్రోత్సహించరు, పాటించరు. 

దయ, కరుణ కలిగి స్నేహహస్తం అందించడానికి సిద్ధంగా ఉంటారు. 

ప్రాపంచిక భోగాలపై మక్కువ 🤞 కలిగి ఉంటారు. కీర్తి, ప్రతిష్టలు, గుర్తింపును కోరుకుంటారు.

వారి పుణ్యకర్మల ఫలితంగా రాబోయే ఉత్తమ జన్మలకు అది వేదిక అవుతుంది. 

తమ కర్మాచరణలో మెరుగైన కార్యాచరణతో సాత్విక గుణాలను పెంపొందించుకుంటూ, తమోగుణాలని అదుపుచేసుకుంటూ శాంతియుత జీవన మాధుర్యాలను అనుభవిస్తుంటారు.

నారు పోసిన వాడు నీళ్లు పోయడా అని కొందరు అన్నీ భగవంతుడే చేస్తాడని మనము ఏమీ చేయనక్కరలేదు అని సోమరిగా వుండొచ్చు అనే భావనతో కాలం గడుపుతారు. జంతువులకు కావలసినవన్నీ భగవంతుడు చూస్తాడు కానీ, మానవులకు భగవంతుడు స్వతంత్రంగా ఆలోచించే బుద్ధియిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి యుక్తాయుక్త విచక్షణతో కర్మలను ఆచరించాలి అన్నదే ఆ ప్రత్యగాత్మ అభిప్రాయము. 

''జంతూనాం నరజన్మ దుర్లభం''  అటువంటి విశేష మానవ జన్మ పొందిన తరువాత దానిని వ్యర్థము చేయకూడదు. ఆ బుద్ధిని సక్రమముగా వినియోగించు కొనక, కాలము వ్యర్థముచేస్తే పతితుడవుతాడు. 

  • స్వర్గనరకాలలో దేనిని పొందడానికైనా మార్గం మానవలోకంలోనే వుంది.
  • మీ భవిష్యజన్మలు మీరు ఈ జన్మలో మీ పాపపుణ్య కర్మఫలాల ఫలితాలుగా లలాటలిఖితంగా మీరే వ్రాసుకుంటున్నారు. మీ తలరాతలు రాసుకునే అపరబ్రహ్మలు మీరే!


సర్వేజనా సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729

✨🧘✨🧘✨🧘✨🧘✨🧘✨🧘✨🧘✨🧘✨  

https://yogamithra15.wixsite.com/yogamithra

ఆధ్యాత్మిక పథం 17 జీవితం



జీవితం 

అతి దుర్లభం అయిన ఈ మానవజన్మ అప్రమేయుడు, సర్వేశ్వరుడు అయిన పరమాత్మ మనకు ఎన్నోజన్మల నిరీక్షణ ఫలంగా  ప్రసాదించిన అపురూప కానుక!

అవ్యక్తం, అచింత్యం నుంచి ఈ జన్మ తీసుకుని శిశువుగా జీవితం ప్రారంభించి అమ్మ నాన్నల ప్రేమామృతం గ్రోలుతూ బాల్యం,కౌమారం,యవ్వన దశలను దాటుకుంటూ యుక్త వయస్సులో జీవితభాగస్వామితో వివాహబంధంతో అగ్ని 🔥 సాక్షిగా ఒక్కటి అవుతాం.

వైవాహిక జీవితమధురిమలను పరస్పర అనురాగంతో ఆస్వాదిస్తూ, వంశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ పిల్లలను కనడం వారికి ప్రేమ, ఆప్యాయతలతో పెంచి పోషించి ప్రయోజకులుగా తీర్చిదిద్దడం కోసం జీవితాన్నీ ఫణంగా పెడతాం.

నెమ్మదిగా వృద్ధాప్యదశలోనికి అడుగుపెడుతూ గమ్యం తెలియని దిశలో తిరిగి అవ్యక్తం, అచింత్యం లోనికి ప్రయాణం కొనసాగిస్తూ ఇంకో జన్మ తీసుకోవడానికి సంసిద్ధం అవుతాం. 

ఈ జీవనప్రక్రియ, జీవితానుసంధానంతో  కొనసాగే జీవనగమనంలో ఎన్నెన్నో మలుపులు, ఒడిదుడుకులు, పరిచయాలు, స్నేహబంధాలు , అనుభవాలు, అనుభూతులు,భావోద్వేగాలతో కూడిన సజీవసంగమంగా, ముందుకు పయనించే జలధారగా కొనసాగుతూ ఏదో ఒక రోజు అంతర్ధానం అవుతుంది.


జీవితం అంటే అప్రమేయుడితో కొనసాగే జన్మాంతర అనుబంధం 

జీవితం అంటే విశ్వంభరుడితో అనుభంద ఆకాంక్ష 

జీవితం అంటే ఋణానుభందం 

జీవితం అంటే  కొన్ని మధుర జ్ఞాపకాలు 

జీవితం అంటే భావోద్వేగాల కడలి

జీవితం అంటే అనుభవాల దొంతర 

జీవితం అంటే కలిమి లేముల కావడి

జీవితం అంటే రాగద్వేషాలు.

జీవితం అంటే కష్టసుఖాల ఒరవడి 

జీవితం అంటే నేను, నాది, నీవు, నీది అనే ద్వైత్వభావన

జీవితం అంటే తండ్రి కొడుకుల మధ్య వుండే ప్రేమానుభందాలు.

జీవితం అంటే భార్య భర్తల మధ్య వుండే నమ్మకం, అనురాగం.

జీవితం అంటే అన్న,తమ్ముల్ల మధ్య వుండే విశ్వాసం,మమకారం. 

జీవితం అంటే తోబుట్టువుల మధ్య వుండే అనురాగ, ప్రేమ బంధం.

జీవితం అంటే కష్టసుఖాలలో కూడా తోడునీడగా వుండే స్నేహబంధం.

స్నేహమేరాజీవితం స్నేహమేరాశాశ్వతంగా ప్రతిఫలం ఆశించకుండా కేవలం నీ శ్రేయస్సు, భవిష్యత్తును ఆకాంక్షించే మంచి మిత్రుడితో స్నేహం కలకాలం కొనసాగించడమే !!


కాలంలో జన్మించడం, కాలంలో పయనించడం, కాలంలో కలిసిపోవడమే జీవితం.

ఆది అంతం తెలియని ఈ కాలచక్రంలో అవ్యక్తం నుంచి వ్యక్తమవుతూ తిరిగి అవ్యక్తంలో కలిసిపోయే ఆత్మ తన నిరంతరప్రయాణంలో అసంఖ్యాకమైన జన్మలను తీసుకుంది ,తీసుకుంటుంది, తీసుకోబోతుంది ఇది చర్వితచరణం. సృష్టి ఆరంభం నుంచి ఆత్మ తన పయనం ఇలా నిరంతరం కొనసాగిస్తూనే ఉంది. 

ఈ జీవిత ప్రయాణం  చాలా చిన్నది అయితే విలువైనది,అమూల్యమైనది. అందుకే ఈ జీవితాన్ని జీవకళతో ఆస్వాదించాలి.అందుకోసం:

  • సంతోషం కోసం పరితపించడం కాదు, అది మార్కెట్టులో దొరికే వస్తువు కాదు, అది మనం చేసే పనులలో, కార్యకర్మలలో,ఆలోచనలలో ప్రతిఫలిస్తుంది అనే సత్యం తెలుసుకోవడం
  • నీవు ఏ క్షణం నుండి ఎదుటివారి మంచిని మనఃపూర్తిగా కోరుకోవడం ప్రారంభిస్తావో ఆ క్షణం నుండి మనస్సులో  ఆనందం చిగురిస్తుంది.
  • బంధాలు శాశ్వతంగా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి . మన తప్పిదాలకు మనఃపూర్వకంగా క్షమాపణ కోరాలి,అది మెరుగైన మానవీయ సంబంధాలతో సంతోషం పరిమళిస్తుంది.
  • జీవితమంటే మనస్సును బుజ్జగిస్తూ, నచ్చచెపుతూ బ్రతకటం కాదు మనస్సుకు నచ్చేలా బ్రతకడం,జీవించడం.
  • కోపం వచ్చిన ఒక్క క్షణం మనస్సుని నిగ్రహించుకుంటే పశ్చాత్తాపంతో కుమిలిపోయే వంద క్షణాలను ఆదా చేసుకోవచ్చు.
  • జీవితంలో అవమానంను నుంచి నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే స్థైర్యం, అంతేకానీ తిరిగి అవమానించే గుణం కాదు.
  • జీవితం కష్టాలలో ఉన్నప్పుడు కృంగిపోవడం కాదు, కష్టాలకు ఎదురు నిలబడి ముందుకు ధైర్యంగా సాగించే పయనం.
  • ఇతరులను మెప్పుకోసం చేసేపనులు అసంతృప్తికి కారణ మవుతాయి,అందుకని మనస్సు కోరిన విధంగా కర్తవ్యకర్మలు ఆచరించు. మనస్సు ప్రశాంతతో పులకరిస్తుంది.
  • ధర్మం కోసం నీతితో జీవించు. ఆ నిజాయితీ నిన్ను అజాతశత్రువును చేస్తుంది, విశ్వంభరుడికి దగ్గర చేస్తుంది.
  • సత్యం కోసం జీవించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. మంచి కోసం జీవించు, మానవత్వం నిన్ను కాపాడుతుంది. అంతర్యామి ఉపద్రష్టగా నిన్ను దరి చేర్చుకుంటాడు.
  • ఈ ధర్మం పాటించడం క్లిష్టతరం,నావల్లకాదు అని ఆలోచించే బదులు ఈ అవకాశం మళ్లీ రాదేమో కదా అని అనుకుంటే అదే ఇష్టంగా సత్ఫలితాలను ఇస్తుంది.
  • మనస్సు, బుద్ధి, వివేకం మంచిగా ఉంటే జీవితంలో ప్రతిరోజు విలువైనదే, మంగళకరమైనదే. మంచిరోజు ఆనందదాయకం, చెడురోజు అనుభవం అవుతుంది , కష్టమైనరోజు పాఠం అవుతుంది.ఇష్టమైనరోజు జ్ఞాపకంగా మిగులుతుంది. భవిష్యత్తు ఆశాజనకం అవుతుంది.
  • జీవితంలో భయపడవలసింది అనివార్యమైన మరణం గురించి కాదు, ఆలోపుగా ఏమీ సాధించలేకపోవడాన్ని గురించి!!

మీ ఆలోచనలు పంచుకుంటే అవి తెరచి ఉంచిన పుస్తకంలా ఇతరులకు ఆదర్శప్రాయం కావచ్చు ,మీ ఆలోచలు పంచుకోలేకపోతే అవి మూసి వుంచిన పుస్తకంలా నిష్ప్రయోజనం కావచ్చు.


సర్వేజనా సుఖినోభవంతు

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 

ఆధ్యాత్మిక పథం 16 అష్టైశ్వర్యాలు


అష్టైశ్వర్యాలు


కలిమి అంటే సిరి సంపదలు. నగలు, ఆభరణాలు, వజ్రాలు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, బాండ్లు, సెక్యూరిటీలు, నగదు , హోదా, మంచి జీతం,విలాసవంతమైన బంగ్లా, ఖరీదైనకార్లే సంపదలని, అవే శాశ్వతం అనుకుంటూ వాటిని సంపాదించడం కోసం అలుపెరుగని జీవిత సమరం కొనసాగిస్తుంటాం. కానీ సత్యం ఏమిటంటే  రాత్రి వెంట పగలు లాగా కలిమి లేములు కూడా కలిసి ఉంటాయి. లేమి అంటే సంపదలు ఆవిరి కావడం. 

మనం తరుచుగా ఓ శ్రీమంతుడు బికారి కావడం, అదృష్టం కలిసి వచ్చి ఓ సామాన్యుడు శ్రీమంతుడు కావడం చూస్తున్నాం.  సంపదలు ఎవరిని ఎలా వరిస్తాయో, ఎవరిని ఎలా వంచిస్తుందో, ఎపుడు ఎవరిదగ్గరికి ఎలా వెళ్తాయో, ఏ క్షణాన ఎవరి దగ్గరనుంచి ఎలా జారుకుంటుందో ఎవరు చెప్పలేరు. అందుకనే సంపద ఉందన్న గర్వం కలిగివుండడం అవివేకం.

‘కలిమి లేములు, కష్ట సుఖాలు కావడికుండలోయ్’ అనే సినీగీతం నేటికి మనందరి మదిలో గింగిరాలు తిరుగుతోంది. కలిమి లేముల ప్రభావరహితంగా  సంపూర్ణ మైన, ఆనందమయమైన జీవితానికి కావాల్సినవిఅష్టైశ్వర్యాలు అవే నిజమైన సిరి సంపదలు. అవి:


ధనం: 

భోగభాగ్యాలు,ఆర్ధిక స్థిరత్వంలని తీసుకువస్తుంది. అయితే ఆ సంపాదన న్యాయబద్ధంగా,ధర్మార్జనగా ఉంటే అది ఎనలేని ఆత్మసంతోషాన్నితెస్తుంది.

సంపాదన కేవలం కూడ పెట్టడానికే కాదు. ఆర్తులకు సహాయం చేసేదిగా ఉండాలి. దాన,ధర్మాలతో సంపాదనవిలువ దిగ్వునీకృతం అవుతుంది. దానం డబ్బుతోనే కాదు, మనసుతో కూడా చేయగలగాలి. ఒక మంచిమాట, ఓదార్పు, ఆకలి,దాహం తీర్చడం కూడా దానమే. మనస్సు విశాలం అయితే దానం సహజంగా వస్తుంది. అపాత్రదానం ద్వారాఫలితం శూన్యం.ఎదుటి వ్యక్తి క్షేమం ఆకాంక్షిస్తూ చేసే సహాయం ఆనందంని మాత్రమే కలిగిస్తుంది!!ఆడంబరాలను దూరంగా వుంటూ చేసే పొదుపు భవిష్యత్తును సుఖప్రదం చేస్తుంది. అదే లోభత్వం అయితే అడవిగాచిన వెన్నెల అవుతుంది. దానధర్మాలు తెలియని సంపాదన ఆకాశంలో వర్షించని మేఘం, ఎండమావి, దప్పిక తీర్చలేని సముద్రంలోని నీరు వంటివి.

ప్రతిష్ఠ:  

మనం చేసే దానధర్మాలు,పుణ్యకార్యాలు,సేవాకార్యక్రమాలు, సత్కర్మలు,నిష్కామ కర్మలు, లోకహితం,సమాజశ్రేయస్సును ఆకాంక్షిస్తూ నిర్వహించే యజ్ఞక్రియలు, క్రియాశీలక జీవితంగా కొనసాగితే   అవి సమాజంలో మంచి పేరు, గౌరవం ప్రతిష్టలను తీసుకువస్తూ జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. 

 కేవలం పేరు, ప్రతిష్ఠలు,గుర్తింపుల కోసం తాపత్రయపడుతూ చేసే ఏ కార్యం అయినా అశ్రద్ధదానం అవుతూ అప్రతిష్టకు దారితీస్తుంది. రాజకీయ నాయకులు ఎన్నికల సమయాల్లో చేసే వాగ్దానాలు, హామీలు ఇటువంటి కోవకు చెందుతాయి.

ఇల్లాలు: 

అనురాగం, అన్యోన్య దాంపత్యం, సుఖదుఃఖాల్లో తోడు నీడగా ఉండే సహధర్మచారిణి జీవితాన్ని సుఖమయం చేస్తుంది. 

తన భర్తను మహారాజుగా చూస్తూ అతని హృదయంలో మహారాణిగా ఆసీనురాలవుతూ ఆదర్శవంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతుంది. ఆదర్శ కుటుంభంగా వికసిస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలుగా ప్రకాశిస్తుంది. 

ప్రతి గృహస్థుడు ధర్మబద్ధంగా, ఏకపత్నీవ్రతుడుగా, నీతివంతమైన జీవితం గడుపుతూ ఆదర్శప్రాయంగా గృహస్తుజీవితం కొనసాగిస్తే ఆ గృహం ఆనందనిలయం అవుతుంది.

సంతానం: 

విద్య వినయ విధేయతలతో సంస్కారభరితమైన విలువలతో కూడిన భాద్యతాయుతమైన పెంపకంతో నవసమాజ నిర్మాణానికి, నవశకానికి అదర్శప్రాయులుగా వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులుగా బాధ్యతతో వ్యవహరించాలి. 

సంస్కారం ఉంటే సంపదలు లేకపోయినా జీవితం సంతోషంగా సాగుతుంది. సంపదలు ఉండి సంస్కారరహితం అయితే బ్రతుకు దుర్భరం అవుతుంది.

వయస్సులో ఉన్న పిల్లల నడవడికను నిశితంగా గమనిస్తూ అవసరమైతే మీ విలువైన సలహాలతో వారిని ఉత్తమ భావిపౌరులుగా తీర్చిదిద్దాలి. 

బాల్యంలో శిక్షణ, కౌమారంలో క్రమశిక్షణకు అలవాటైన సంతానం మిమ్మల్ని ప్రేమతో గౌరవిస్తూ మీ వంశ ప్రతిష్టను బరువు బాధ్యతలను హృదయపూర్వకంగా స్వీకరిస్తూ సమాజానికి ఉపయోగపడే చిరుదివ్వేలుగా ప్రకాశిస్తారు. వార్ధక్యంలో రక్షణగా ఉంటారు.

ధైర్యం

ధైర్యం అంటే సానుకూల దృక్పథం, భావోద్వేగాలతో జీవితంలో ఎదురయ్యే సంఘటలను , ప్రతిబంధకాలను, సమస్యలను, కష్టానష్టాలను, చాలెంజిగా స్వీకరిస్తు ప్రతిసవాళ్లను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోవడం. 

సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించుకుంటూ అలుపెరుగని బాటసారిలా ముందడుగు వేయడం. 

అటువంటి క్రియాశీలక వ్యక్తులు వారి వారి రంగాల్లో, వృత్తుల్లో , పదవుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ విజయకేతనాలను ఎగురవేస్తూ నూతన ఒరవడికి నాంది పలికే మహనీయులుగా స్ఫూర్తివంతమైన నాయకత్వంతో అందరికీ స్ఫూర్తిదాయకంగా, ఆదర్శంగా నిలుస్తారు.

అప్రమేయుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మ “క్షుద్రం హృదయదౌర్భల్యం త్యక్త్వో త్తిష్ఠ పరంపత” అని ప్రబోధించారు. పిరికితనంను వదిలివేయి, ధైర్యంగా విశ్వాసంతో నీ కార్యకలాపాలు ధర్మబద్ధంగా నిర్వహించు, విజయ పరంపరను కొనసాగించు. ఉత్సాహం,సాహసం,ధైర్యం,సద్బుద్ధి,శక్తి,పరాక్రమం ఎక్కడవుంటాయో అక్కడే పరమాత్మ అనుగ్రహం దిగ్విజయరూపంలో ప్రకాశిస్తూ ప్రకటితం అవుతుంది.

స్థైర్యం:

మానసిక దృఢత్వం,దృఢనిశ్చయం,ఏకాగ్రత, పట్టుదల,మనోబలంల మేలుకలయికనే మనో స్థైర్యంలో ప్రతిబింబిస్తుంది. 

తార్కిక వివేక విచక్షణా జ్ఞానం, ఆత్మవిశ్వాసం,అంకితభావం, కృషి దీక్షతలతో ఏ పనినైనా  తమ ప్రజ్ఞ,మేధస్సులతో సమర్థవంతంగా నిర్వర్తించే సామర్థ్యం క్రియాశీలకంగా ప్రస్ఫుటమవుతుంది.

ఎంత అరగదీసినా గంధంచెక్క పరిమళం మనోహరమే, జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోస్థైర్యం కోల్పోకుండా వుండేది ధీరత్వం.

విద్య : 

ఏది అయితే తెలుసుకున్నాక ఇక తెలుసుకోవలసిన విషయ పరిజ్ఞానం వుండదో అటువంటి విశేషజ్ఞానమే ఆధ్యాత్మిక విద్య. అది విద్యలలో ఉత్కృష్టమైన,శ్రేష్ఠమైన జ్ఞానసంపద. 

మనం చదివే చదువులు, డిగ్రీలు,ఉన్నత విద్యలు అవి కేవలం జీవనభృతి కోసం మాత్రమే. నేటి విద్యావ్యవస్థలో చిన్నారులు శక్తికి మించిన భారంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. 

నిజానికి  జ్ఞానం పుస్తకాలలో మాత్రమే వుండేది కాదు, అది అనుభవాలతో జీవిత పాఠాలుగా సమకూరేది. తప్పులే చేయని ఆదర్శ జీవితం వుండనే వుండదు, ఆ తప్పులనుంచే గుణపాఠాలు, నిజమైన జ్ఞానం వస్తుంది. అది తార్కిక,వివేక, విచక్షణ జ్ఠానంతో నిత్యమై,సత్యమై ప్రకాశవంతంగా వుంటుంది.

వినయం: 

విద్య ఎవరిలోనైనా వినయ సంపదగా ప్రకటితమవుతూ ప్రకాశించాలి, అంతేకానీ అహంకారం, అహంభావసహితంగా ఉంటే అది శోభించదు, రాణించదు. 

మాటలలో సౌమ్యత, ప్రవర్తనలో మృదుత్వం, చేతనలలో లాలిత్యంతో కూడిన వ్యక్తిత్వం వన్నె తెస్తూ అందరిలో  ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని తెస్తుంది.


తరగని ఆనంద సిరులు అయిన ఈ అష్టైశ్వర్యాలను అనుగ్రహించమని ఆ సర్వేశ్వరుడు, అప్రమేయుడు అయిన భగవంతుని అంతఃకరణ శుద్ధితో, మనఃపూర్తిగా వేడుకోవాలి, భక్తితో నివేదించుకోవాలి, హృదయపూర్వకంగా విన్నవించుకోవాలి.

జీవితంలో సంతోష సమయాలను అనందగా ఆస్వాదించాలి. కష్ట సమయాల్లో ఇవి శాశ్వతం కావు ముందు ముందు అన్ని మంచిరోజులే అనే భావనతో వాటిని సవాళ్లుగా స్వీకరించి ముందడుగు వేయాలి. సానుకూల ఆలోచనలను మనస్సు స్వీకరిస్తూ అదే మార్గంలో స్పందిస్తుంది.

అందమైన పూలతోట సువాసనలతో మత్తెకిస్తూ తన అందాలతో కనువిందు చేస్తుంది, సానుకూల భావనలు మనస్సులో నింపుకుంటే మనసే నందనవనంగా గుబాళిస్తుంది.

ఆనందంగా ఉంటే అనారోగ్యాలు దరిచేరవు, సానుకూల దృక్పథం, భావనలతో మనస్సు ప్రశాంత భరితం అవుతుంది, జీవితం సంతోషకరంగా మారుతుంది.

మనశ్శాంతి, ఆరోగ్యం, మంచి మనస్సు, మంచి కుటుంబం, సంతోషకరమైన జీవితం, ప్రేమమయమైన వైవాహిక జీవితం, పేరు ప్రఖ్యాతులే నిజమైన ఐశ్వర్య రూపాలు, ఇవి ఉంటే జీవితం సంపూర్ణం, పరిపూర్ణం.


సర్వేజనా సుఖినోభవంతు

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 

Friday, 20 February 2026

ఆధ్యాత్మిక పథం 15 ఆనందో బ్రహ్మ

 

ఆనందో బ్రహ్మ 

ఆనందం మాటల్లో, చేతల్లో వ్యక్తపరచలేని ఆహ్లాదకర మానసికానంద మధురానుభూతి!! 

అది ఉత్సాహం,ఉల్లాసం, సంతసం, మోదం, ఆహ్లాదం, హర్షం, సంతృప్తి ,సంతోషాల సంగమ కూడలితో కలిగే అనిర్వచనీయానుభూతి.

  • ఎన్నికల్లో విజయం సాధిస్తే  కలిగేది విజయానందం 
  • లాటరీలో అదృష్టలక్ష్మీవరిస్తే కలిగేది సంభ్రమాశ్చర్యం.
  • ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కలిగేది ఉల్లాసభరితం
  • ఉద్యోగంలో చేరే రోజు ఉద్వేగభరితం.
  • ప్రేమలో గెలుపుతో మనస్సు పరవశంతో మైమరవడం.
  • ఆ ఇష్టసఖితో కలిసి మొదటిసారి తీసుకునే డిన్నర్ మధురసభరితం
  • ఎగ్జామ్స్ లో ప్రప్రథమస్థానం సాధిస్తే పొందే అనుభూతి వర్ణానాతీతవిజయానందం.
  • వ్యాపారం దిన,దిన ప్రవర్ధమానం అవుతుంటే మనసు పొందేది హర్షాతీభరితం.
  • తన కూతురి పెండ్లితో ఆ తండ్రి పొందే సంతోషం కన్నులలో కన్పించే నక్షత్రప్రకాశం
  • తండ్రిని చేస్తున్న అర్ధాంగి పై  అనురాగం హృదయంలో  కలిగే పులకరింత.

మనస్సులో జనించే ఆహ్లాదాలు,ఉల్లాసాలు,హర్షాతిశయాలు, అనురాగాలు, ఆకాంక్షలు, ఆకర్షణలు, పరవశింపులు,పులకింతలు,ఉద్వేగాలు సంతోషంలో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

ఇవన్నీ మనతోనే ఉంటాయి అనే భ్రమలతో,భ్రమలలో,కలలలో జీవితాన్ని గడిపేస్తాం! 

సత్యం ఏమిటంటే ఇవన్నీ నెమ్మదినెమ్మదిగా కాలక్రమంలో ఆవిరి అయిపోతాయి, కానీ వాటి జ్ఞాపకాలు మదిలో మదురభావనలుగా మనస్సు దొంతరలలో నిక్షిప్తం అవుతాయి.

సంతోషం అనే భావన శాశ్వతం అయితే మనందరం సంతోషంగా చీకు,చింతనలు లేని జీవితాలను గడపాలి కదా!! 

మనం సమాజంలో జరిగే సంఘటనను నిశితంగా పరిశీలిస్తే ప్రేమ వివాహాలలోని ఆకర్షణ అనతి కాలంలో కీచులాటలతో మసకబారడం,ప్రథమస్థానంతో గుర్తింపు పొందిన ప్రజ్ఞ ఉద్యోగాన్వేషణలో అలసిపోవడం,ఎన్నికల్లోని విజయం తమ ప్రభుత్వ తప్పిదాలతో ఛిద్రం కావడం,ఉద్యోగాలు లే అప్ లతో నిరుద్యోగిగా మారడం,వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలతో నీరసించి పోవడం,  వైవాహికజీవితం తడబడుతుంటే ఆందోళన పడటం, అనుకోకుండా వరించిన అదృష్టం విలాసాలతో కనుమరుగు కావడం వంటివి నిత్యం గమనించవచ్చు. 


ఆవిరి అయ్యే సంతోషమే అశాంతికి బీజం అవుతుంది,అసంతృప్తికి అంకురం అవుతుంది. మనశ్శాంతికీ బీటలు వేస్తుంది, హృదయం భాదతప్తం మవుతుంది. భాదతప్తహృదయంలో సుఖం, సంతోషాలకు స్థానం ఎక్కడ ఉంటుంది? మనశ్శాంతి లేని జీవితంలో ప్రశాంతత ఎలా చేకూరుతుంది?

నిజానికి దుఃఖం వెంట సంతోషం, కష్టం వెంట సుఖం, లాభం వెంట నష్టం, కీర్తి వెంట అపకీర్తి, చీకటి వెంట వెలుగు, శీతలం వెంట ఉష్ణం, గౌరవం వెంట అగౌరవం, కలిమి వెంట లేమి విడదీయలేనంతగా,  పాలలో నీళ్లలా కలగలసి వుంటాయి. 

ఇవి ఏవి శాశ్వతం కావు,కాలేవు అనే పరమార్ధతత్వం మనఃశాంతికి బీజం అవుతుంది. అది మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. నిర్మలమైన మనస్సులో ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతమైన మనస్సులో ఆలోచనలకు క్లారిటీ వస్తుంది. ఆలోచనలలో క్లారిటీ ఉంటే చేసేపనిలో స్పష్టతవస్తుంది . స్పష్టతతో చేసే పని పూర్ణనాణ్యతతో ప్రకాశిస్తుంది. వికసించిన ప్రకాశంతో లక్ష్యం సాకారం అవుతుంది.


భగవాన్ ప్రబోధ గీతంగా మానవాళికి అందించిన కార్యాచరనే 

“సుఖదుఃఖే సమే కృత్వా లాభా లా భౌ జయ జయా 

తతో యుద్ధాయ యుజ్యస్వ  నైవం పాప మవాప్స్యసి “

మనం చేసే ప్రతి పనిలోనూ కష్ట సుఖాలను, లాభ నష్టాలను, జయ అపజయాలను గురించి ఆలోచించక కర్తవ్యాన్ని నిర్వర్తించడం నిష్కామకర్మాచరణ అవుతుంది. అటువంటి క్రియాశీలక చర్యలు మనలని పవిత్రులను చేస్తుంది.


అక్షయ సుఖం,సంతోషం,మనశ్శాంతి కోసం జీవితకాలం ప్రయత్నిస్తూనే వుంటాం. ఆ ప్రయత్నం ఎండమావుల్లా, మృగతృష్ణగా మారుతుంది. ఇందుకు కారణం అవి బయటనే వున్నాయి అనే భ్రమలో  అన్వేషిస్తూ జీవితాంతం కొనసాగిస్తూ వుండడం. నిజానికి అవి బయటలేవు, అవి నీలోనే ఉన్నాయి, నీతోనే ఉన్నాయి. వాటిని నీవే స్వయంగా అన్వేషించాలి. పంచేంద్రియాల నిగ్రహం ఆ మార్గంను అవగతం చేస్తుంది.


ఇంద్రియనిగ్రహం మనఃశాంతికి దగ్గరచేస్తుంది. మనం తీసుకునే ఆహారాలపై నియంత్రణే ఇంద్రియనిగ్రహం అవుతుంది. తినదగని వాటిని అదే పనిగా తినడం, చూడకూడని వాటినే అదే పనిగా చూడడం, వినకూడని వాటిని వినడానికే ఇష్టపడటం, మాటలాడగూడని విషయాలనే మాట్లాడడానికే ఇష్టపడటం,గంజాయి, ధూమపానం, డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉంటే మనస్సుకు ప్రశాంతత ఎలా కలుగుతుంది?  

ఆహార నియంత్రణ అంటే మనం చూసే దృష్టి, వినే మాటలు, స్పరానుభూతి,  జిహ్వారుచి,మాట్లాడే భాషణలపై వుండే మానసిక నియంత్రణ అదే ఇంద్రియనిగ్రహం.


గుడిలో గంట మోగితే భక్త జన సందోహం అప్రమత్తం అవుతుంది, అదే విధంగా ఇంద్రియనిగ్రహాచరణ మనస్సును అప్రమత్తం చేస్తుంది. వివేక, తార్కిక,విచక్షణా జ్ఞానంతో నిష్కామకర్మాచరణలతో మనశ్శాంతికి అది వేదికవుతూ మానసిక ప్రశాంతతకు ఆలంబనంగా అక్షయసంతోషాలకు, ఆనందాలకు కారణమవుతుంది. నీవు నిరతిశయానందంలో వుంటే ఈ సృష్టిలో నీవు అందుకోలేనిది, పొందలేనిది అంటూ ఏమీ లేదు!


సర్వేజనా సుఖినోభవంతు 

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa

9900022729

🧘‍♂️🧘🧘🧘🧘🧘🧘 




ఆధ్యాత్మిక పధం 14 శిలలపై శిల్పాలనే చెక్కినారు

శిలలపైనే శిల్పాలు చెక్కినారు 

శిలలలో అందమైన రూపాలను చూడగలిగే వివేవికదృష్టి, ఆ శిలలనే అందమైన శిల్పాలుగా తీర్చే కళావైభవ సంపన్నులు.

ఇసుకలో సౌధాలని చూడగలిగే మేధస్సు , ఆ మేధస్సుతో సుందర ఆకాశ హర్మ్యాలను నిర్మించే అపరవాస్తుశిల్పులు.

మొక్కల్లో ఔషధాలను చూసే అపర ధన్వంతరులు..

మృత్తికలో వస్తు సముదాయాన్ని చూడగలిగే విశేష ప్రజ్ఞాశాలి. ఆ ప్రజ్ఞతో మట్టితో కుండలను, వంట పాత్రలను తయారుచేసే కమ్మరి.

కలపలో 🪵మూర్తీభవించిన మూర్తిని దర్శించే అంతర్దృష్టి, ఆ దృష్టితో అపూర్వ కళావైభవాన్ని సృష్టించే కళామతల్లి ముద్దుబిడ్డ.

భూగర్భంలో  నిక్షేపమైన ఖనిజసంపదలను గుర్తించి వెలికితీసిన వివేకశీలి. 

ఆ వివేకంతో వస్తుసామాగ్రి,పనిముట్లు,ఇతర ఉపకరణాలను మానవవాళికి అందచేసిన అభినవ విశ్వకర్మ.

తన విశేష పరిజ్ఞానంతో వాతావరణ అధ్యయనశీలి, వాన రాక పోకలను అంచనా వేయగలిగిన సామర్థ్యంతో కృషీవలుడికి అందించే స్నేహమాదుర్య హస్తం.

తన మేధ, ప్రజ్ఞ పాటవాలతో ప్రతి నీటి బొట్టు బొట్టునూ ఒడిసి పట్టుకునే నేర్పరితనం, ఆ నీటినుంచి జలవిద్యుత్, సాగునీరు,తాగు నీరులతో దాహార్తి తీర్చగలిగే బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణం.

కంటికి కనిపించని గాలినుంచి విద్యుత్తు తయారు చేయగలిగిన మేధసంపత్తుతో గాలిమరల నిర్మాణం.

సౌరశక్తిని నిత్యావసరాలకు ప్రత్యమ్నాయ ఇంధనంగా వినియోగించగలిగిన నేర్పరితనం.

మానవీయతకు ప్రతిబింభంగా మానవవాళి శ్రేయస్సునే ఆకాంక్షించే విన్నూత్న పరిశోధనలతో మూర్తీభవించిన మహనీయుడు, మానవీయుడు,కృషీవలుడు, మానవుడే!!!

కానీ ప్రస్తుత సమాజంలో మనలో కరుణ, దయ, జాలి, ప్రేమ పూరిత భావనలు హృదయాలలో మసక బారుతున్నాయి మానవీయత అనేది ఆవిరి అవుతూవుంది. పలితంగా నిత్యం …

  • కష్టపడకుండా డబ్బు సంపాదించాలని పెరుగుతున్న నేర ప్రవృత్తి 
  • ఆకలితో అలమటించే దీనులు, అన్నార్తులు 
  • ఏమరుపాటు లేకుంటే కష్టార్జితం దోచుకునే సైబర్ నేరగాళ్లు 
  • కార్పోరేట్ వైద్యం ముసుగులో నిలువుదోపిడి చేస్తున్న వైద్యులు
  • చదువుకునే బదులు చదువుకొనే భావిపౌరులు 
  • డబ్బుకోసమే అవినీతిపరులకు పని చేసే న్యాయవాదులు 
  • సంపాదనే లక్ష్యంగా ఆహారపదార్ధాల కల్తీ మయం 
  • ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే రాజకీయ నాయకులు
  • ఎదగటానికి ప్రక్కవాడిని తొక్కుకుంటూ ముందుకు సాగే వైఖరి
  • స్వార్థం,కపటం,పగ,ప్రతీకారాలు పునాదులుగా విస్తరిస్తున్న సమాజ పోకడలు
  • ప్రమాదంలో వుంటే చేయూతకు బదులు రీల్సు చేస్తూన్న బాధ్యతారాహిత్యం 
  • కామప్రవృత్తితో వావి వరసలు లేకుండా  మోజుతో విపరీత ప్రవర్తన 
  • మతం పేరుతో ఉగ్రమూకల అరాచకత్వం, నరమేధమే ధ్యేయంగా ఆత్మాహుతి దాడులు 

తోటి మనిషిని మనిషిగా చూడలేని అసుర ప్రవృత్తితో చేసే నరమేధానికి ఏ దేవుడైనా హర్షిస్తాడా?!

ఎవరు ఏమైతే నాకేంటి నేను నా కుటుంబం బాగా ఉంటే చాలు తమ ఇరుగు పొరుగు వారితో నా కేంటి సంబంధం అనే ధోరణి. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వుంచితే తమ బాద్యత తీరినట్లే భావించే కొడుకులు.

 ఈ ఆలోచన స్రవంతి, ధోరణులతో కేవలం తమ ఆకాంక్షల కోసం దేవాలయాలు, మసీదులు, చర్చిలు,ప్రార్థనా మందిరాలు, గురు ద్వారాలు,ఆలయాలు, ఆరాధన మందిరాలతో ఎటుచూసినా అప్రమేయుడు, అవ్యక్తుడు, సర్వాంతర్యామి, విశ్వంభరుడు,సృష్టికర్త అయిన ఆ ఇలవేల్పులకు  వారి వారి సంప్రదాయాలతో, విశ్వాసాలతో, నమ్మకాలతో సేవిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మొక్కులు, ముడుపులు,ఉపవాసాదీక్షలు సమర్పిస్తారు. ఆయితే 

  • మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థించేందుకు దర్గాలకు, 🕌మసీదులకు వెళ్లే ముందుగా, నువ్వు అన్యాయము చేసిన వారికి హృదయపూర్వక క్షమాపణలు చెప్పడం నేర్చుకో!!
  • నీవు చేసిన పాపాలకు క్షమాపణ కోరుకునేందుకు గురుద్వార,ప్రార్థనా మందిరాలకు వెళ్లే ముందుగా, నిన్ను గాయపరిచిన వారిని హృదయ పూర్వకంగా క్షమించడము నేర్చుకో!!
  • తల వంచి ప్రార్థించేందుకు గుడులకు,🛕 గోపురాలకి వెళ్ళడానికి ముందుగా నీ తోటి వారి ముందు వినయ,విధేయతలను చూపించడం నేర్చుకో!!
  • దేవుని ముందుదీపాలు వెలిగించేందుకు 💒చర్చికి వెళ్ళడానికి ముందుగా పాపం, గర్వం, అహంభావాల చీకటిని  నీ హృదయం నుంచి తొలగించుకోవడం నేర్చుకో!!
  • దేవుని పాదాలపై 🛐 పూలు పెట్టేందుకు ప్రార్థనా మందిరాలకు, ఆరాధన మందిరాలకు వెళ్ళడానికి ముందుగా నీ  ఇంటిని, మనసుని  దయ, ప్రేమ, వాత్సల్యాల పరిమళాలతో నింపడం నేర్చుకో!! 

భక్తి భావన,ప్రదర్శనలలో స్వచ్ఛత,పవిత్రత,పరిశుద్ధత,ఆధ్యాత్మిక వెల్లివిరుస్తుంటే ఆ సర్వాంతర్యామికి మనం సమర్పించే కృతజ్ఞాంజలి,నివేదన,సమర్పణ అవుతుంది.

అంకితభావం,సమర్పణ భావం,అనన్యభక్తి,అనన్య చింతనతో కూడిన ప్రార్థనలే ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి అర్హత అవుతుంది.

తమ విశేష భక్తి ప్రదర్శనలో భాగంగా ఆ పరమాత్మ అనుగ్రహం కోసం నూతనంగా అనేక గుడులు,గోపురాలు,దేవాలయాలు,ప్రార్థన మందిరాలు,ఆరాధన మందిరాలు, మసీదులు, చర్చీలను నిర్మిస్తున్నారు.  ఆడంబరానికి ప్రాధాన్యత,గుర్తింపులకోసం చేసే ధార్మిక కార్యక్రమాల

సాధారణ పలితాలను అందచేస్తాయి.

కరుణ, దయ, జాలి, వినయం, విధేయత, ప్రేమ పూరిత హృదయంలో మానవీయత వికసిస్తుంది, పరిమళిస్తుంది. వారి సేవలు ఉత్తమ పలితాలకు మార్గదర్శనం అవుతాయి.

సర్వేజన సుఖినోభవంతు 

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘🧘🧘🧘🧘🧘 



 





ఆధ్యాత్మిక పధం 13 ఒత్తిడి…ఆందోళన రెండూ ఒకటి కాదా ?


ఒత్తిడి…ఆందోళన రెండూ ఒకటి కాదా ?


ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి, పనిలో ఒత్తిళ్లు మరియు ఇతర సవాళ్లకు శరీరం మరియు మనస్సు ఇచ్చే సహజ ప్రతిస్పందనే స్ట్రెస్, అదే ఒత్తిడికి మూలం.

వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కుంటున్న సమస్య టెన్షన్, ప్రెషర్,ఒత్తిడి.

  • ఓ చిన్నారి హోంవర్క్ పూర్తి చేయలేకపోతే పడేది టెన్షన్
  • సకాలంలో పని పూర్తిచేయకపోవడంతో వచ్చేది వర్కుప్రెషర్ 
  • వ్యాపారంలో తగినంత ఆదాయం లేకపోవడంతో కలిగేది ఒత్తిడి 
  • ట్రాఫిక్ లో చిక్కుకొని సకాలంలో ఆఫీసుకు చేరుకోలేకపోతే కలిగేది అసహనం 
  • పనిచేస్తునేవున్నా ఇంకా పూర్తికాని పనులతో సతమతమయ్యే ఇల్లాలు
  • ఎన్ని గంటలు పని చేసినా తెమలని పనులతో నిస్పృహతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి
  • ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ విద్యార్థులు పడేది ఆందోళన.
  • అనుకున్న టార్గెట్ చేరుకోలేకపోతే ఎలా ? భయంతో కూడిన ఉద్వేగం.
  • స్కూలు నుంచి పిల్లలు రావడం ఆలస్యం అయితే అమ్మకువచ్చేది ఆందోళన.

ఒత్తిడి, టెన్షన్,ప్రెషర్, ఆందోళలు జీవితంలో అవసరమే!అవి మనలోని ప్రతిభను వెలికితీస్తాయి!!

  • పరీక్షలకోసం  ప్రిపరేషన్స్ వారిని మరింత జాగ్రత్తగా చదువుకునేలా చేస్తుంది. 
  • హోమ్ వర్క్ చేసే విషయంలో చిన్నారికి పట్టుదలను పెంచుతుంది. 
  • వ్యాపారంలో ఒత్తిడి మరింత కష్టపడే స్వభావాన్ని పెంచుతుంది. 
  • పనిలోని ఒత్తిడి పట్టుదలతో సమర్థవంతంగా పనిచేసేలా ప్రేరణ కలిగిస్తుంది.
  • అనారోగ్యం జీవితాన్ని దుఃఖమయం అనే భావన ఆరోగ్యవంత జీవనానికి ప్రేరణ అవుతుంది.
  • సంతోషకర జీవితం కోసం విద్యార్థిలో కష్టపడే మనస్తత్వానికి కారణ మవుతుంది.
  • పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసే ప్రతి పనిలో అంకితభావానికి కారణం అవుతుంది.

ఒత్తిడి, ఆందోళన,ఉద్వేగం,టెన్షన్ లు మన ఆధీనంలో ఉంటే ప్రోత్సాహకర ఫలితాలే వస్తాయి!నీవు వాటి కంట్రోలులో ఉంటే మానసిక వేదనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది! 

పనిలోని ఒత్తిడి ఆ పని పూర్తవగానే మనస్సు తేలిక పడాలి, అలాగాకుండా ఆందోళనతోనే ఉంటే అది మనస్తాపానికి దారితీస్తుంది. అటువంటి నియంత్రణలో లేని ఒత్తిడి నిరాశ, నిస్తేజం, నిద్రలేమి,అధికంగా తినడం లేదా ఆకలి లేకపోవడం, శక్తి లేకపోవడం వంటి అనేక శారీరక మరియు మానసిక రుగ్మతలకు కారణమవుతుంది.

ఒత్తిడి అనేది సవాళ్లకు ప్రతిస్పందనే నీవు అనుభవించే మానసికవేదన లేదా భావోద్వేగ విపత్తు. శరీరం ఒత్తిడికి ప్రతిస్పందించే తీరు ఆందోళన. ఇది అతివిచారం లేదా అతిదుఃఖంగా అగుపిస్తుంది. ఇందుకు మారిన జీవనశైలి, పని ఒత్తిళ్లు, బంధాలు దూరం కావడం, బంధాలను కోల్పోవడం వంటి అనేక కారణాల కలబోతగా కలసి ఉండవచ్చు. ఒత్తిడి లేని ఆందోళనే ఉండదు.

 ప్రతి రోజూ ఎదురయ్యే శారీరక,మానసిక ఒత్తిడులు,ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు, ఆర్ధికఇబ్బందుల భావోద్వేగాల విపత్తును సమర్థవంతంగా స్వీకరించే సానుకూల భావనలతో మనస్సును సంసిద్ధం చేయడానికి ఓ నిర్దిష్ట ప్రణాళికగా యోగాను ఈ నవీన సమాజం గుర్తించింది. 

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచంలో అన్నిదేశాలు యోగ ప్రాధాన్యతను తమదేశ ప్రజలకు తెలియజేస్తున్నాయి, సామూహిక యోగ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాయి.

యోగ అంటే ఏమిటి? యోగ మానసిక ఒత్తిడి ఆందోళనలను నియంత్రించే ప్రభావశీలినా?!

  • యోగ అంటే మానసిక ప్రశాంతతకు వేదిక
  • యోగ అంటే సమస్యలను సవాళ్లుగా స్వీకరించే సానుకూల దృక్పథం
  • యోగ అంటే అనారోగ్యాలను దూరం చేసుకునే విధానం
  • యోగ అంటే మెరుగైన, నాణ్యమైన శ్వాసక్రియాచరణ
  • యోగ అంటే ఉద్విగ్నరహిత ఆలోచన సరళి
  • యోగ అంటే లక్ష్యసాధనలో దృఢసంకల్పం 
  • యోగ అంటే ఉత్కృష్టమైన లక్ష్యసిద్ధి
  • యోగ అంటే మెరుగైన జీవన విధానం 

యోగ జీవన విధానం కాలంతో పాటుగా చైతన్యవంతంగా ముందుకు నడిపేది, నడిపించేది.

యోగ సాధన నూతనఉత్తేజాన్ని, ప్రశాంతతను తీసుకురావడంలో అత్యంత ప్రభావశీలి!

యోగాసనాలు, యోగ క్రియలు, ధ్యానం, ప్రాణాయామలతో సంక్లిష్టమైన ఆందోళనలకు కారణమయిన మానసిక , శారీరక స్థితిగతులను సమర్థవంతం నియంత్రించే సరళీకృత విధానం.

ప్రతిఒక్కరూ వయస్సుతో నిమిత్తం లేకుండా ఉదయం లేదా సాయంకాలం సమయాల్లో మీ అనుకూలతను బట్టి చేయదగిన సరళమైన ప్రాథమిక ఆసనం, విశ్రాంతి ఆసనం లేదా విరామ ఆసనంగా వాడుకలో వ్యవహరింపబడే శవాసనం. మానసిక విశ్రాంతి, శారీరక విశ్రాంతిల కోసం ఉపయుక్తమైన ఈ ఆసనం ఇలా చేయాలి.

  • యోగ మ్యాట్ పై వెల్లకిలా చేతులు, కాళ్లు సాచి ముఖం  ఆకాశంకేసి చూస్తున్నట్లుగా కన్నులు మూసుకొని పడుకోండి.  ప్రకృతి ప్రసాదిత ప్రాణధాతు రూపం ఆక్సిజన్ ను ధారాళంగా లోతైన ఉచ్చాస్వగా తీసుకుంటూ శ్వాసకోశాలు మరియు సర్వాంగాలు ఆ ప్రాణదాతువులో పులకిస్తున్న భావనతో నెమ్మదిగా శ్వాసను తీసుకోవాలి. 
  • ప్రతి నిశ్వాసను నెమ్మదిగా నాభి దిగువనుంచి శరీరంలోని  గ్యాసులను, టాక్సిన్లను బయటకు వదిలివేస్తున్న భావనతో సుదీర్ఘ నిశ్వాసక్రియగా కొనసాగించాలి. 
  • శ్వాస మీద ధ్యాసతో కేవలం ఉచ్ఛాస్వ నిశ్వాసల గమనాన్ని పరిశీలించండి. 
  • మనలో కొందరు శ్వాసను దీర్ఘంగా లోనికి తీసుకోగలరు, మరికొందరు దీర్ఘ నిశ్వాస తీసుకోగలరు. అయితే శ్వాస తీసుకునే వ్యవధి, నిశ్వాసల వేగాన్ని క్రమేణా తగ్గించడం ప్రధానం. 
  • మనస్సు, శరీరంను తేలిక అవుతున్న అనుభూతితో పది నిమిషాలు భావోద్వేగ రహితంగా ఆసన సాధనను కొనసాగించాలి.

నెమ్మది నెమ్మదిగా శ్వాసవేగాన్ని నియంత్రించడంతో మనస్సులో అలజడులు క్రమేణా తగ్గుముఖం పడతాయి. అందుకు యోగిక్ శ్వాస క్రియను 4:4:6 ను ప్రాక్టీస్ చేయండి. ఆరంభంలో 4 సెకన్లు  ఉచ్ఛాస్వ తీసుకోవాలి, 4 సెకన్లు శ్వాసనీ బంధించాలి (కుంభకం) ఆ తరువాయి 6 సెకన్లు నిశ్వాస ద్వారా శ్వాసను వదలాలి.  ఓ పది వారాలలో  5:5:8 స్థాయికి చేరుకునే విధంగా అభ్యాసం చేయాలి. ఈ శ్వాసనియంత్రణ పలితంగా శ్వాసకోశాలు తేజోవంతం అవుతాయి, శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాలు బయటకు పోవడం ద్వారా జీర్ణక్రియ,జీవక్రియ,జీవితక్రియల నాణ్యత మెరుగవుతూ మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. మానసిక అలజడులపై నియంత్రణవస్తూ మనస్సు ప్రశాంతతకు చేరువవుతుంది. 

  • సుఖాసనం లేదా పద్మాసనం 🧘లేదా అర్ధపద్మాసనం లేదా వజ్రాసనంలలో సౌకర్యవంతమైన ఆసనస్థితిలో శ్వాస నియంత్రణ ఆధార విశ్రాంతి ఆసనసాధన చేస్తే అదే ప్రాణాయామం అవుతుంది. 
  • ఇది ప్రాణశక్తిని మెరుగైన, నాణ్యమైన యోగిక్ శ్వాసక్రియా ద్వారా ఉత్తేజభరితం చేస్తుంది. 
  • నేల మీద కూర్చోలేనివారు కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చుని ప్రాణాయామం సాధన చేయవచ్చు.  అనారోగ్యంతో అశక్తులైనవారు బెడ్ మీద నుంచి శవాసనం వేయడం అభిలషణీయం.

ఈ సాధన ఆరుబయట ఉషోదయ వేళల్లో కొనసాగిస్తే చక్కటి ప్రాణవాయువుతో మనువు,తనువు పరవశిస్తుంది. అపార్ట్మెంట్లలో వుంటే ధారాళంగా వెలుతురు, గాలి ప్రసరించే గదిలో చేయడం శ్రేయస్కరం.

మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారే! వీరు ప్రతిరోజూ శవాసనం నిద్రకు ఉపక్రమించే ముందు ఓ పావుగంట సేపు శ్వాస మీద ధ్యాసతో మీ ఇష్టదైవమైన ఆ పరమాత్మకు కృతజ్ఞతాపూర్వక స్మరణతో అభ్యాసం చేయండి.

    • ఈ ఆసనంలో మీ తల,మెడకి ఆసరాగా మెత్తటి పలుచటి తలదిండుతో నిద్రలోనికి నెమ్మదిగా జారుకోండి అది మెడనొప్పుల నుంచి ఉపశమనం తెస్తూ సుఖనిద్రకు కారణం అవుతుంది.
    • వెన్నునొప్పి ఉంటే రెండు మోకాళ్లుకు దిగువున ఆసరాగా మెత్తటి దిండు ఉంచడం ద్వారా వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనంతో మంచినిద్ర లభిస్తుంది.
    • పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉంటే రెండు మోకాళ్ల మధ్య మెత్తటి దిండు ఆసరాతో వెన్ను సమతుల్యతను కాపాడుతూ నిద్రలేమి నుంచి ఉపశమనం పొందండి.

ఇదే ఆసనం బోర్లా పడుకుని లోతైన దీర్ఘ ఉచ్ఛాస్వ, నిశ్వాసలతో నెమ్మదిగా కొనసాగిస్తే అది మకరాసనం అవుతుంది. మానసిక, శారీరక విశ్రాంతి కోసం ఈ ఆసనం ఉపయోగపడుతుంది.

మనశ్శాంతి అనేది బయటనుంచి వచ్చేది కాదు. దూరం పెట్టాల్సిన వాటిని దూరం పెడితే వస్తుంది.

సర్వేజనా సుఖినోభవంతు.

మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra