యద్భావం తద్భవతి సంకల్ప అనితరశక్తి
మన మదిలో ఆలోచనలు నిరంతరం ఓ స్రవంతిలా జనిస్తూనే ఉంటాయి.
అదే ఆలోచన స్రవంతిలో ఎన్నెన్నో ఆలోచనలు కరిగి పోతువుంటాయి, కొన్ని ఆలోచనలు మాత్రమే ఆశలవుతాయి, మిగతావి పేరాశలవుతాయి. అందులో కొన్ని ఆశలు కోరికలవుతాయి.
ఈ కోరికల మధ్య పరస్పర స్పర్ధ ఉంటుంది, ఆ స్పర్ధ ద్వారా వాటిలో ప్రాధాన్యతలు ఏర్పడుతాయి. ఆ ప్రాధాన్యతలో ఎన్నెన్నో కోరికలు వెనుకబడి పోతాయి, మరుగున పడిపోతాయి. కొన్ని మాత్రమే ఆకాంక్షలుగా మారుతాయి. అందులో కొన్ని సాకారదిశగా,మిగిలినవి పగటికలలు అవుతాయి . సాకారదిశలో పయనించే కొన్ని ఆకాంక్షలు మదిలో భావనలవుతాయి. అ భావనల సాకారదిశలో మన పయనం నిరంతరం కొనసాగుతూనే వుంటుంది. అదే జీవితం, జీవనపయనం.
ఆలోచన స్రవంతి నుంచి మనలో నూరు కోరికలు కలిగాయి అని అనుకుందాం అందులో ఆకలి, దప్పిక లాంటి ఒకటి లేక రెండు కోరికలు వెంటనే తీర్చుకుంటాం. ఇటువంటి కోరికలు పునరావృత మవుతుంటాయి అందుకే కాఫీ, టిపిన్లు, భోజనాలు, మంచినీళ్లు తరచుగా తీసుకుంటాం.
మనలో ఆశలు, కోరికలు,ఊహలు, ఆలోచనలు ఎన్నో వుంటాయి, అందులో కొన్ని త్వరగా మారిపోతాయి, మరి కొన్ని మరుగున పడిపోతాయి . రేపు మరి కొన్ని ఆలోచనలు, భావాలు మదిలో పురుడు పోసుకుంటాయి. ఇవి అన్నీ మనస్సు చేస్తున్న ఆలోచనలు మాత్రమే.
ఇందుకు కారణం ఎపుడైనా ఆలోచించారా? అందుకు ప్రధాన కారణం సంకల్పం. కోరికలకు శక్తి లేదు కానీ సంకల్పానికి మాత్రమే శక్తి ఉంది. కోరిక ఇలా జరుగుతే బావుంటుంది అని అనుకుంటుంది, కానీ సంకల్పం అది నిశ్చయంగా జరుగుతుంది అనే భావనతో ఉంటుంది. అంతేగాని ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ అవుతాయా అని మనస్సుకు సర్దిచెప్పుకోవడం కాదు కావాల్సింది,
“యద్భావం తద్భవతి “ అనేది వేదోక్తి. మనం ఏ భావనతో ఉంటామో అలాగే ఆలోచిస్తాం, అలాగే ప్రవర్తిస్తుంటాం, అలాగే మాట్లాడుతాం.
ఏ భావనను నమ్మకంగా,బలంగా, దృఢంగా విశ్వసిస్తామో అదే నిజమవుతుంది మన బలహీనమైన కోరికలను దృఢనిశ్చయంగా చేస్తూ మనస్సును దృఢతరం చేస్తుంది. అవి మన సబ్ కాన్షియస్ మైండ్ 🧠కు ఆశయాలుగా చేరుతాయి. ఉపచేతన మనస్సులో ఆశయసాధన దిశగా ఓ లక్ష్యం 🎯 ఏర్పడుతుంది. ఆ లక్ష్యసాధనకు నిన్ను సంసిద్ధుడను చేస్తుంది. లక్ష్యసాధనలో ఎదురయ్యే సమస్యలను సవాళ్లుగా స్వీకరిస్తుంది. ఇదే సంకల్ప అనితరశక్తి.
సంకల్పధ్యానంతో ముందుకు అడుగులువేస్తువుంటే సంకల్ప అనితరశక్తి సామర్థ్యాలు ద్విగుణీకృతం అవుతాయి. మన సిద్ధయోగులు ఈ సంకల్ప అనంతశక్తితో విశాలవిశ్వాన్ని, 🌍🔭ఖగోళమండల స్వరూపాన్ని, నక్షత్రరాశులను, తోకచుక్కలను,🌌 పాలపుంతలను,సౌరకుటుంభ వ్యవస్థను, గ్రహలు వాటి స్థితి గతులను ఎటువంటి ఆధునిక టెలిస్కోపుల🔭 సహాయత లేకుండా తమ అంతర్నేత్రంతో వీక్షించారు. ఆ ఖగోళవిజ్ఞానాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే వేదశాస్త్రాలుగా మానవాళికి అపురూప జ్ఞాన భండారంగా అందించారు. అలనాటి వేద విజ్ఞానమే నేటి ఆధునిక సైన్స్, పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు కూడా మూలాధారం అయింది.
అప్రమేయుడు, అనంతరూపుడు, అవ్యయయుడు, ప్రత్యాగాత్మ , సర్వాంతర్యామి 🔱 ని అంతర్యామిగా తమ అంతరంగంలో మనోనేత్రంతో ఆత్మానుభూతిగా ఆస్వాదించారు, వీక్షించారు , తరించారు.
నీలో బలమైన, దృఢమైన, దృఢతరమైన ఆకాంక్ష ఉంటే సంపూర్ణ విశ్వాసంతో కూడిన అంకిత భావం, సమర్పణ భావం, నిర్మలమైన మనస్సుతో ముందుకు పయనం సాగిస్తే ఆ ఆత్మానుభూతితో తరించడానికి నిన్ను ఆపే శక్తి ఈ సృష్టిలో లేదు అనే భావన హృదయంలో వికసిస్తుంది. సంకల్పధ్యానం ఆ మార్గదర్శనం కలిగించే అంతరంగ ద్వారాన్నీ అవతరణ చేస్తుంది.
సంకల్పధ్యానం ద్వారా ఆజ్ఞాచక్రం తేజోవంతం అవుతుంది. లక్ష్యంలో స్పష్టత వస్తుంది. లక్ష్య సాధనకు మార్గం, దశ దిశలను అవగతం చేస్తుంది. మనస్సు సంకల్ప వికల్పాల కేంద్రం. వికల్ప భావనలను దూరం చేస్తూ లక్ష్యం వైపు నడిపిస్తుంది.
అంగ వైకల్యం ఓ శాపం కాదు, మన మానసిక వైకల్యాలే నిజమైన శాపం అని వీరు మనకు ప్రబోధిస్తున్నారు.
- తంగవేలు మరియప్పన్ నిర్వీర్యమైన ఒక కాలుతో హై జంప్ లో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించి పారాలింపిక్స్ లో కాంస్య,🥉 రజిత 🥈మరియు స్వర్ణ పతకాలతో 🥇అలరించిన మేటి క్రీడాకారుడు.
- భాష .ఎఫ్. పోలియో ఓ అడ్డంకి కాదు అని పవర్ లిఫ్టింగ్ లో 🏋️అసాధారణ ప్రతిభ కనబరిచి రివార్డులు, అర్జున అవార్డును కూడా అందుకున్నారు
- గిరీష్ శర్మ నిర్వీర్యమైన ఒక కాలుతో 🏸బ్యాడ్మింటన్ లో ఏడు సార్లు జాతీయ చాంపియన్ గా అవార్డులు 🥇అందుకున్నారు.
- సుధ చంద్రన్ ప్రమాదంలో ఓ కాలు తీసివేయబడిన కృతిమ కాలుతో నృత్యంలో 💃మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో పోరాడి విజేతగా తన కలలను సాకారం చేసుకున్న ప్రఖ్యాత అంతర్జాతీయ మేటి నృత్యకారిణిగా మన్నలను పొందింది. ఆమె జీవితకథ స్ఫూర్తి తో మయూరీ చిత్రం నిర్మించబడింది.
- ఆటిజం, జన్యుపరంగా పుట్టుకతో వచ్చే మానసిక సమస్యలతో, న్యూటన్ ప్రపంచంలో ప్రముఖ శాస్త్రవేత్తగా లబ్ధప్రతిష్టలను పొందారు.
జీవితం అంటే కష్టాలను, కన్నీళ్లను, ప్రతికూలతలను సవాళ్లుగా స్వీకరించి ఆ జారుడు మెట్లనుంచి మొక్కవోని ధైర్యంతో పోరాట స్పూర్తితో ముందడుగు వేయడం. అసాధ్యం అనే పదం వీరి నిఘంటువులో లేదు అని మానవాళికి ప్రబోధగీతంలా చాటీ చెప్పిన మానవీయులు, మహనీయులు.
వీరు ఇతరులలో స్ఫూర్తివంతమైన భావాజాలంతో ముందుకు నడిపించే కరదీపికలు. భావితరాలకు ఆశాజ్యోతులు.
సర్వేజనా సుఖినో భవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♂️🧘🧘🧘🧘🧘🧘
No comments:
Post a Comment