Wednesday, 18 February 2026

ఆధ్యాత్మిక పధం 5 దేహధర్మో రక్షిత రక్షితః


దేహధర్మో రక్షిత రక్షితః 

ఈ దేహం పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచాగ్నులు మరియు సప్తధాతువుల సమ్మేళనంతో నిర్మితక్షేత్రం.

శిశువుగా ఓ అడుగు పరిమాణంలో వుండే ఈ దేహం కౌమారం నుంచి యవ్వనదశ వరకు సుమారు ఆరు అడుగుల వరకు ఎదుగుతుంది. చేతిగోళ్ళు, శిరోజాలవంటి దేహభాగాలు జీవితాంతం వృద్ధిచెందుతూనే వుంటాయి.

జీవక్రియ, జీవితక్రియలలో భాగంగా నిరంతరం  క్షీణించే మృతకణాల స్థానంలో నూతన కణజాలంతో దేహం తిరిగి పుష్టిని సంతరించుకుంటుంది. ఈ నిరంతరప్రక్రియ సప్తధాతుప్రక్రియల మాయాజాలం.

మనం తీసుకున్న ఆహారాలు జీర్ణనాంతరం క్రమంగా ఒకదాని తర్వాత ఒకటిగా సప్తధాతువులుగా పరివర్తన చెందుతూ శరీరానికి పుష్టిని, శక్తిని, తేజస్సును కలిగిస్తూ దేహనిర్మాణంలో ప్రముఖపాత్ర వహిస్తాయి.

ఈ సప్తధాతువులు  దేహంలో ఎలా ఆవిర్భవిస్తాయి?  ఏమి చేస్తాయి? ఎలా ఉపయోగపడుతాయి? వీటిని గురించి తెలుసుకొనే దిశలో ముందడుగు వేద్దాం.

⚙️రసధాతువు 

📌సప్తధాతువులలో మొదటి ధాతువు.

మనం తీసుకునే ఆహారం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి భక్ష్యాలు, బోక్ష్యాలు, చోష్యాలు, లేహ్యలు. అవి జీర్ణవ్యవస్థలోని రసాయనచర్యల ఫలితంగా  రససార భరితం అవుతుంది. ఇదే ద్రవరూపంలో వుండే ప్లాస్మా లేక లింఫ్ ద్రవంగా వ్యవహరించే  రసధాతువు.  

ఇది  ఉత్కృష్టమైన ప్రధానధాతువు. దీనిద్వారా శరీరపోషణ,శోషణ జరుగుతుంది. దేహంలో తొమ్మిదవవంతు ఈ థాతువుగా నే వుంటూ నిర్వర్తించే ప్రధాన విధులు:

📍శరీరంలోని అన్నిభాగాలకు అవసరమేరకు సూక్ష్మపోషకాలను, విటమిన్లను , మినరల్సును ప్రొటీన్లను, హార్మోన్లను చేరవేస్తుంది. 

📍 సప్తధాతువులకు పోషణ కర్త.

📍ఇది చర్మంను కాంతివంతంగా ఆరోగ్య వంతంగా ఉంచుతుంది.

📍 మనస్సులో సంతోష భావనలకు కారకం అవుతుంది.

📍రసథాతువుకు స్తన్యం ఉపథాతువు. అది పుట్టిన శిశువుకు తల్లిపాలు అవుతాయి.

📍ఇది రక్తధాతువుకు మూలంగా వుంటూ దానిని పోషిస్తుంది.

⚙️రక్తధాతువు 

📌 దేహంలో రెండవ ప్రధానధాతువు. ఇది ద్రవరూపంలో అరుణకాంతితో ప్రకాశించే రక్తం అనే హిమోగ్లోబిన్. రసథాతువులో స్థూలభాగం రక్తధాతువుగా నిర్వర్తించే ప్రధాన విధులు:

📍శరీరంలో కణకణానికి ప్రాణథాతువును ఆక్సిజన్ రూపంలో అందించడం మరియు సూక్ష్మ పోషకాలను చేరవేయడంలో  కీలకపాత్ర తనదే! 

📍దేహంలో జనించే మలినాలను, వ్యర్థాలను శుద్ధిచేయడంలో  గుండె, 🫀 కాలేయం మరియు కిడ్నీ వ్యవస్థలకు అనుబంధ విధులను  నిర్వహిస్తుంది.

📍శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. జీవక్రియ, జీవనక్రియ, జీవితక్రియలను సజావుగా సాగేలా పర్యవేక్షిస్తుంది.

📍 రక్తధాతువుకు రజస్సు అనే ఉపధాతువు వుంది. అది స్త్రీలలో రుతుక్రమంను, గర్భాశయ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది.

☝️ఆకు కూరలు, కూరగాయలు🥗వెజిటేబుల్ జ్యూస్లు,పండ్లు,మొలకలు విరివిగా తీసుకోవడం ద్వారా రక్తవృధ్ధి మెరుగవుతుంది.

⚙️మాంసధాతువు 

📌 రక్తధాతువు మూలాల నుంచి కండరాల కణజాలంగా విస్తరించినదే మాంసధాతువు. 

ఇది రక్తం మరియు ఇతర పోషక కణజలాల నుంచి పోషణ పొందుతూ నిర్వర్తించే ప్రధాన విధులు:

📍ఇది నాడీమండలవ్యవస్థను పరిరక్షిస్తూ ఎముకలకు 🦴  పోషణను యిస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

📍అంగసౌష్టవంతో ఆకర్షణీయమైన శరీరఆకృతిని తీసుకువస్తుంది.

📍దృఢమైన కండరాలతో 💪దేహదారుఢ్యాన్ని తీసుకువస్తుంది.

☝️ప్రోటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో కూడిన ఆహారాలు బలమైన మరియు ఆరోగ్యకరమైన కండర నిర్మాణంలో కీలక పాత్రను కలిగి ఉంటాయి.

⚙️ మేథధాతువు 

📌 మాంసథాతువు మూలాల నుంచి విస్తరించిన సూక్ష్మ పదార్థమే  మేథాధాతువు. ఇది శరీరంలోని కొవ్వు మరియు కొవ్వు కణజాల సముదాయం.

📍శరీరానికి మృదుత్వం మరియు స్నిగ్ధతను అందిస్తుంది.

📍చిన్న చిన్న ఎముకలను 🦴ఆవరించి వుండే కొవ్వు పదార్ధం మేధధాతువు. 

📍అధనపు కొవ్వును నిల్వచేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.

📍 మేధధాతువుకు ఉపథాతువు స్వేదవ్యవస్థ.  ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది.

📍ఆరోగ్యవంతమైన చర్మం, నిగనిగలాడే శిరోజాలు, అందానికి మెరుగులు తెచ్చే రూపం, శరీర సమతుల్యతలను పరిరక్షించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

☝️ఆరోగ్యకరమైన మేధధాతువృద్ధి కోసం సూక్ష్మ పోషకనిధులు అయిన వాల్నట్, బాదం, కాజు, పల్లీలు, ఖర్జూరం, పిస్తా, గుమ్మడి గింజలు , ఏప్రికాట్ , కొబ్బరి లాంటివి మీ ఆహారంలో ఓ భాగంగా వుండేలా చూసుకోండి.

⚙️అస్థిధాతువు

📌ఇది మేధోధాతువుచే పోషించబడుతూ దేహానికి పటుత్వం కలిగిస్తుంది. ఎముకల మరియు మృదులావస్థల కణసముదాయం.

ఇది శరీరఆకృతిని కీళ్లవ్యవస్థను పర్యవేక్షిస్తుంది. వెన్నుపూస వ్యవస్థను సంరక్షిస్తుంది ఈ ధాతువుకు ఉపధాతువుగా దంత వ్యవస్థ వుంది.

📍 ఇది అస్థి పంజరం నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

📍 ధారణశక్తితో స్థిరమైన, దృఢమైన శరీర భంగిమను పోషిస్తుంది.

📍 దంతాలు🦷గోళ్ల💅 ఆరోగ్య వ్యవస్థలను పరిరక్షిస్తుంది 

📍కండరాలు, ధమనులు మరియు సిరలు 🦴ఎముకలను పట్టివుంచడానికి స్థలాన్ని ఇస్తుంది 

📍ఉషోదయ మరియు సంధ్యావేళల్లో వాకింగ్ 🏃 బోన్ వ్యవస్థను బలంగా తయారు చేస్తుంది.

వారంలో కనీసం ఐదు లేక ఆరు గంటల 🏃వాకింగ్ ను ఓ అలవాటుగా చేసుకోవాలి.

☝️ ఐస్ క్రీం 🍨 కూల్ 🍷 డ్రింక్స్, చల్లటి పదార్థాలు🧊  చాక్లెట్లు 🍫 స్వీట్లు 🍩🍮🍰దంత 🦷మరియు దేహ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అందువలన వీటి వాడకం తగ్గించండి.

⚙️మజ్జ ధాతువు 

📌 ఇది అస్థి ధాతువు నుంచి ఏర్పడుతుంది మరియు పోషింపబడుతుంది.

మజ్జ ధాతువు  గుజ్జు రూపంలో వుండే ఎముక కణజాలంను సూచిస్తుంది.

📍ఈ ధాతువులో స్థూల భాగం ఎముక మజ్జ ( బోన్ మ్యారో) ను ఉత్పత్తి చేస్తుంది. 

📍శరీరానికి బలాన్ని ఇస్తుంది. 

📍ఈ ధాతువులోని సూక్ష్మ భాగం శుక్ర ధాతువును పోషిస్తుంది.

☝️శరీరంలో మజ్జ ప్రదోష వైఫల్యాలతో 

📍ఎముకల బలహీనత 

📍కీళ్ల నొప్పులు

📍అరుషిక తలపై దద్దుర్లు, చుండ్రుతో శిరోజాలు.

📍 కండ్ల కలక, పుసులు 

📍 కఫం సంబధిత రుగ్మతలు 

📍 తలతిరగడం (వర్టిగో)

📍వీర్యంలో శుక్రకణాల తగ్గుదలలు సంభవించవచ్చు.

⚙️శుక్ర ధాతువు 

📌 సప్త ధాతువులలో చివరిది మరియు ఉత్కృష్టమైన ప్రధానధాతువు.

📍ఇది స్త్రీ మరియు పురుషులలో పునరుత్పత్తి బలం, తేజస్సు, ఇమ్మ్యూనిటి, సృజనాత్మక మరియు సంతానోత్పత్తిని సూచిస్తుంది. 

📍ఇది కేవలం పురుషులలో వీర్యం మాత్రమే కాదు అవి బీజకణాలు కూడా, స్త్రీలలో గర్భకణ నిలయం అయిన అండాశయం కూడా, వెరసి సృష్టికి ఆలయం.

📍శుక్ర ధాతువు నాణ్యత మిగతా ధాతువుల పోషణ పై ఆధారపడి వుంటుంది.

📌శుక్రధాతువు ఓజస్సు  అనే ఉపధాతువును పోషిస్తుంది.

✨రసధాతువు నుంచి శుక్రదాతువు వరకు దేహమంతా విస్తరించిన సప్తధాతువుల యొక్క ఉత్కృష్టమైన తేజోమయరూపం ఓజస్సు.

✨ హృదయమే అవాసస్థానంగా దేహం అంతా విస్తరించి ప్రకాశించే రూపం తేజస్సు.

✨ప్రకాశవంతమైన ఓజస్సు  మనలో  ప్రజ్ఞ, మేథస్సు, రూపం,ప్రవర్తనలలో ప్రతిబింబిస్తుంది.

ఓజస్సు శరీరానికి శక్తిని మరియు చురుకుదనాన్ని తెస్తుంది. 

✨ఓజస్సు ద్వారా మనోసంబంధిత భావనలు హృదాయంతారలలో 🌱చిగురిస్తాయి.

✨దేహం శ్వాసక్రియ, జీర్ణక్రియ, జీవక్రియ, విసర్జనక్రియలను సజావుగా నిర్వహిస్తుంటే ఓజస్సు సహజసిద్ధంగా 🪷వికసిస్తుంది

☝️ఆకలి, కోపం, ద్వేషం, అసూయ, లోభం, పరస్త్రీ వ్యామోహం,తాగుడు🍺 ప్రాసెసిడ్ ఫుడ్స్ 🧁🥮జంక్ ఫుడ్స్ 🌭🍟🥪🍕జీరోకేలరీఫుడ్స్ 🧃వంటి అనియమిత ఆహారాల ద్వారా మనలోని ఓజస్సు మసకబారుతుంది.

☝️ఓజస్సు పూర్తిగా క్షీణిస్తే జీవుడు తన జీవయాత్రను ముగిస్తాడు. అందుకే దేహధర్మంను రక్షించండి, గౌరవించండి.రక్షింపబడిన దేహధర్మం మీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది 🎷.

దేహధర్మోరక్షిత రక్షితః 

సర్వేజనా సుఖినోభవంతు 

మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa

9900022729

🧘🧘🧘🧘🧘🧘🧘🧘

1 comment:

  1. విలువైన విషయం బాగా వివరించారు.

    ReplyDelete