దేవుడు 🔱 వున్నాడా…?
దైవానికి ఎలాదగ్గరకావాలి?
దేవుడువున్నాడు అనే నమ్మకంతో కొందరు,
దేవుడువున్నాడా అనే అపనమ్మకంతో ఇంకొందరు,
దేవుడు ఎక్కడ వుంటాడు అనే సందిగ్ధంలో మరికొందరు.
దేవుడువుంటే ఎందుకు కన్పించడు?
కనిపించని దేవుడిని ఏమని పిలవాలి?
ఏమని ప్రార్థించాలి?
ఆయన మనప్రార్థనలను ఆలకిస్తాడా?
ఆయన మనకోరికలను నెరవేరుస్తాడా?
అసలు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు?
ఇంతకీ ఎవరైనా దేవుడీని చూసారా?
ఇలా ఎన్నెన్నో సందేహాలు???
దేవుడు వున్నాడు అని వాదించేవాడు, దేవుడులేడు అని వాదించే ఇద్దరి వాదనలు కూడా సరియైనవికానే కాదు!!
దేవుడువున్నాడు అనే వాడు ఆ అనుభూతిని మనసారా ఆస్వాదించకనే,ఆ ప్రయత్నంకూడా చేయకనే పూజలు, 🪔 హోమాలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తూ ఆ భ్రమతోనే వుంటూవుంటాడు. పరమాత్మ అనుభూతిని పొందనివాడు ఆ అంకిత భావాన్ని ఎలా కలిగివుంటాడు!!
దేవుడిని చూడలేదు,కాబట్టి దేవుడు లేడు అనే అజ్ఞాని చీకటిలో వుండి చైతన్యవంతం,స్వయం ప్రకాశిత అంతర్యామి అనుభూతిని ఎలా పొందగలడు?
సుగంధపరిమళాలు👃 నాసికతోనే అస్వాదిస్తాం అని అనుకుంటాం, కానీ నిజానికి అది ఓ మానశిక అనుభూతి!
సంగీతం 🦻చెవితో వింటున్నా ఆ శ్రవణానందకరం ఆత్మానుభూతితోనే సాధ్యం!
👁️కంటితో చూసే సుందరదృశ్యం, మనస్సుతో వీక్షిస్తే సుందర మనోహరదృశ్యంగా మనస్సుపొరల్లో నిక్షిప్తం అవుతుంది కదా!
అదేవిధంగా ఆత్మానుభూతితోనే దైవానుభూతిని మనసారా ఆస్వాదించగలం. అందుకు పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే సాధన తప్పక వుండితీరాలి.
మనసే ఓ కోవెల 🛕గా అంకితభావం, సమర్పణభావం, దృఢచిత్తం, భక్తి, శ్రద్ధ, నిష్ఠ, అనన్యచింతనలతో మేళవించిన ధ్యానం 🧘♀️ ద్వారా అప్రమేయుడు, విశ్వంభరుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మత తత్వానికి చేరువకాగలం. ధ్యానం ఆ పరమాత్మ అనుభూతిని ఆస్వాదించడానికి ఓ యానకం అవుతుంది.
ఈ రోజునుంచే ధ్యానం ద్వారా ఆ పరమాత్మ తత్వానికి దగ్గర అయ్యే ప్రయత్నం ఆరంభించాలి.
సర్వేజన సుఖీనో భవంతు
మీ ఆధ్యాత్మిక సేవలో
RaNa
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
#divineguidance #yogameditation
#yogainspiration #yogamitra
No comments:
Post a Comment