వైఫల్యాలే విజయ సోపానాలు
మనం కొత్త నిర్ణయాలు పుట్టినరోజు🎂, ఉగాది, దసరా, మ్యారేజి డే లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇలా తీసుకుంటూ ఉంటాం.
📍 రోజూ 8 గంటలు నిద్ర 🛌పోవాలి, అది మనస్సుకు ప్రశాంతతను తీసుకవస్తుంది.
📍ఆరోగ్యభరిత జీవనం కోసం రోజు ఓ అరగంట యోగ 🧘 సాధన చేయాలి.
📍 దేహధర్మంగా రోజు ఉషోదయ వేళల్లో ప్రశాంత వాతావరణంలో వాకింగ్ 🏃చేయాలి.
📍దేహదారుఢ్యం కోసం జింలో కనీసం ఓ అరగంట వ్యాయామం 🏋️చేయాలి.
📍మొబైల్ ఫోన్ 📱వాడకం రోజుకు మూడు గంటలే.
📍జీవితభాగస్వామితో నిజాయితీగా వుండాలి.
📍పేరెంట్స్ తో రోజులో ఒక్కసారి అయినా మనస్సు విప్పి📞 మాట్లాడాలి.
📍వారంలో ఒక రోజు పూర్తిగా ఫ్యామిలీ 🧑🧑🧒తో సరదాగా గడపాలి.
📍చీటికి మాటికి చిరాకు, పరాకు, చిర్రుబుర్రు లాడడం మానివేయాలి💃.
📌ఈ నిర్ణయాలు ఆచరించడానికి, అమలుపరచడానికి ప్రయత్నం కూడా చేస్తాం,కాని కొన్నిరోజుల్లోనే ఆ ప్రయతాలను గాలికి వదిలేస్తాం. ఇది ఎందుకు అని ఆలోచిస్తే ఆశయం దృఢంగా కొనసాగించే సంకల్పం లోపించడం అని అర్థం అవుతుంది . అయితే అలవాట్లను మెరుగుపరుచు కోవడం ద్వారా ఈ అడ్డంకులను అధిగమించవచ్చు. ఐతే ఈ అలవాట్లను ఎలా మెరుగుపరచుకోవాలి అన్నదే ముందుండే నిజమైన ఛాలెంజ్?
✍️ అలవాట్లు మెరుగు పరుచుకోవడానికి, మార్చుకోవడానికి ఏ మంత్రదండం 🧚కాని షార్టుకట్ కానీ వుండదు, అందుకు కేవలం దృఢమైన సంకల్పం 🧗వుండాలి, అప్పుడు ఆలోచనలు క్రమంగా సంకల్పదిశలో 🌱అంకురిస్తాయి
ఆలోచనలకు మూలాలు సంకల్పాలు! కాబట్టి మార్పుఅనేది మన సంకల్పంలో రావాలి. అయితే కేవలం సంకల్పంతో అన్నింటినీ సాధించలేము!!!
అదే సంకల్పంతో మనస్సులో ఇది అసాధ్యం కాదు అనే గట్టి నమ్మకం, విశ్వాసంతో ముందడుగు వేస్తూవుంటే, నీ మస్తిష్కం ఆ ఆలోచన తరంగాలను స్వాగతిస్తూ అదే ధృడవిశ్వాసంతో ఆ దిశలో నడవడానికి సంసిద్ధం అవుతుంది!!!
📌సంకల్పంతో అంకురించే🌱 దృఢమైన ఆలోచనాతరంగాల సమూహమే చిన్న చిన్న అలవాట్లుగా పరివర్తన చెందుతాయి.. అయితే అలవాట్లలో మార్పులు చాలా నెమ్మదిగా కచ్చితంగా వస్తాయి... సంకల్పలేమి లేని ఆలోచనాచరణ, అమలుతో మార్పు అనేది రోజుకు కేవలం ఒక శాతం అయినా సంవత్సరంలో 360 శాతంగా నీలో వికసిస్తుంది. ఓ నీటి చుక్క 💧 చిన్నదే కానీ కొన్నీ నీటిచుక్కలు💦 కలిస్తే నీ దప్పిక తీరుతుంది, నీ కలల సాకారంలో అదే విజయకేతనం అవుతుంది.
💡 చదరంగం (చెస్ )♟️ఆటలో ప్రతిభావంతుడైన క్రీడాకారుడు కావాలి అనే డ్రీమ్ వుంటే సరిపోదు దానిని సాకారం చేసుకునే దిశలో రోజూ ఆన్ లైన్లో ప్రత్యర్థులతో గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా చెస్ ఆట ఆడాల్సిందే. గెలుపులతో పొందే స్పూర్తి, వైఫల్యంలోని నిరాశ, నిస్పృహలను అధిగమించే మానసిక దృఢత్వం అలవరుచుకోవడం ద్వారా క్రమంగా ధారణశక్తి వికసిస్తుంది. ఓ సంవత్సరకాలం మెళుకువలు ఇలా మెరుగు పరుచుకుంటూ ముందడుగు వేస్తుంటే ఓ ఛాంపియను 🏆కు కావాల్సిన అర్హత నీ సొంతం అవుతుంది!!
💡 ఐఏఎస్ లేక ఐపిఎస్ అధికారి అనే నీ డ్రీమ్ 💭సాకారం కావాలి అంటే అంకిత భావంతో రోజూ 5 నుంచి 6 గంటలు స్మార్ట్ గా స్టడీస్ వుండితీరాలి. నెమ్మది నెమ్మదిగా వికసిత గ్రాహకశక్తితో మేధస్సు, ప్రజ్ఞలు మెరుగుపడుతూ, ఓ సంవత్సర నిరంతర మెళుకువలతో కూడిన సాధనతో నీ మస్తిష్కం 🧠అందుకు సర్వసంసిద్ధుడిని చేస్తుంది.
💡 తన 11 సంవత్సరాల చిరుప్రాయంలో ప్రమాదవశాత్తు అంగవికారాలు అయిన అవని లేఖర ఆ దురదృష్టకర సంఘటన కలిగించిన బాధ,నిరాశ నిస్పృహలను తన మొక్కవోని మనోబలంతో సమర్థవంతంగా అధిగమించి తన దృఢసంకల్పం, పట్టుదలలతో అత్యున్నత ప్రతిభ షూటింగులో🏹 ప్రదర్శించి 18 సంవత్సరాల వయస్సులో పారఒలంపిక్సులో దేశానికి రెండు 🏅స్వర్ణ పతకాలను సాధించిన తొలి భారతీయ స్వర్ణ మహిళగా ఎందరికో స్పూర్తి, ప్రేరణ అయింది.
⚡థామస్ అల్వా ఎడిసన్ బల్బు ఆవిష్కరణలో కొన్నివేలమార్లు విఫలమయినాడు, కానీ ప్రతి విఫలప్రయత్నం నుంచి స్పూర్తి, ప్రేరణలతోనే ఈ మానవాళికి అత్యుత్తమ ఆవిష్కరణ 💡విద్యుత్ బల్బును అందించారు. ప్రతి విఫలప్రయత్నం తనలో ఓ నూతనఅన్వేషణ మార్గంను అవగతం చేసింది!!
తల్లిదండ్రులుగా మీ పిల్లలు🧑🤝🧑 ఎదుగుతున్న వయసులో వారి కొత్త స్నేహాలు, ప్రవర్తనలు, పోకడలను నిశితంగా గమనించాలి.
అవసరమైన ప్రతిసందర్భంలోను సర్దుబాటు ధోరణి వీడి వారిని సక్రమ నిర్ణయాలతో ముందడుగు వేయించే మార్గదర్శులుగా ఉండాలి
వారిలోని అంతర్గప్రతిభను గుర్తించి ఆ ఇష్టమైన రంగంలో ప్రతిభాపాటవాలను మెరుగు పరుచుకోవడానికి ప్రోత్సహించండి.
ఆ ప్రయత్నాలలో విఫలం అయితే అవహేళనగా చూడడం వారిలో న్యూనతా భావనలకు నాంది అవుతుంది. విఫలయత్నం నుంచి ప్రేరణ పొందేలా మన ప్రవర్తన ఉండాలి.
విఫల ప్రయత్నాలు అపజయాలకు సంకేతం కాదు, అవి ప్రతిభను వెలికితీసే గీటురాళ్లు. సాధించబోయే విజయాలకు అవే పునాదిరాళ్లు అనే భావనలకు అంకురం కావాలి.
మీ ఆలోచనలను పిల్లలపై👭 బలవంతంగా రుద్దకండి.చదువుల్లో వారికి ఆసక్తికరమైన కోర్సులను ఎన్నుకునే స్వేచ్చను ఇవ్వండి. వారి ఉజ్వల భవిష్యత్తును ఆకాక్షించండి.
సర్వేజనా సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
#divineguidance #yogameditation
#yogainspiration #yogamitra
No comments:
Post a Comment