కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి?
వ్యక్తిగత సంబంధబాంధవ్యాలను పరిరక్షించడంలో, వ్యక్తిశీల నిర్మాణంలో కృతజ్ఞత కలిగివుండడం క్రియాశీలక పాత్రను పోషిస్తుంది. కృతజ్ఞత అంటే ఇతరులు మనకు చేసిన మేలును లేదా సహాయాన్ని గుర్తుంచుకుని, వారి పట్ల ఆదరణ, ధన్యవాదాలు తెలపడం. అది బలహీన బంధాలను, బాంధవ్యాలను బలోపేతం చేస్తూ సంతోషానికి కారణం అవుతుంది.
కృతజ్ఞతాపూర్వక ప్రశంసలు,అభినందలను మనస్సులో దాచుకోకండి వాటిని సకాలంలో వారికి అందచేయండి, అవి వారిలో నూతన ఉత్తేజాన్నిస్తుంది. అందుకే మీ శ్రీమతి ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తున్న ఆహారరుచులను ఆస్వాదిస్తూ అభినందనలను తప్పక అందచేయండి.
గో ప్రసాదిత అమృతమే మనం రోజూవాడుకునే పాలు, పెరుగు,వెన్న, జున్ను,నెయ్యి అవి ఆరోగ్య ప్రదాయని. అందుకే హైందవ ధర్మంలో భాగంగా ఆవులను గోమాతగా గౌరవిస్తాం, కొలుస్తాం.
తల్లి స్తన్యం సరిగా అందకపోతే ఆవుపాలే🍼 చిన్నారులకు అమృతాహారం. అందుకే ఆవును గోమాతగా కొలవడమే కాకుండా గోశాలాలను ప్రోత్సహిస్తూ, అక్కడి ఆవులకు పోషణ అందించడం, గోవధని వ్యతిరేకించడం మనం గోవులకు 🐄 సమర్పించే నిజమైన భక్తిపూర్వక కృతజ్ఞత!
“సర్వ భూతస్థ ఆత్మానం, సర్వ భూతని ఆత్మని “ అనే భావన సకల జీవరాశుల యందు కలిగివుంటే ఆ హృదయం కరుణాభరితం, ప్రశాంత భరితం,ఆనంద భరితం అవుతుంది
మనకు నీడ,పండ్లు,ప్రాణవాయువులను అందించే వృక్షాలను 🌳సంరక్షించడం, పెంచడం పర్యావరణాన్ని పరిరక్షించడం మన కనీస బాధ్యత. “వృక్షోరక్షిత రక్షితః “ రక్షింపబడిన వృక్ష సంపద మనలని తల్లిలా, తన జీవిత కాలం పక్షులకు ఆవాసంగా, జీవనాంతరం కలపగా 🪵మన అవసరాలను తీరుస్తూ సంరక్షిస్తుంది.
కాలికి ముల్లు గుచ్చుకుంటే కంటినుంచి కన్నీరు 😢 వస్తుంది, అదే విధంగా ప్రకృతి ప్రకోపిస్తే రక్షింపబడని వృక్షసంపద కరువుకాటకాల రూపంలో మానవాళిని శిక్షిస్తుంది.విచక్షణరహితంగా నీడను ఇచ్చే మహావృక్షాలను నగర పారిశ్రామికీకరణలో భాగంగా తొలగించుకుంటూ పోవడంతో నేడు మహానగరాలు వాతావరణ కాలుష్యకోరలలో నగరవాసులు తీవ్ర అనారోగ్యా సమస్యలకు లోనవుతున్నారు.
అనారోగ్యంతో ఐసీయూలో ఆక్సిజన్ మీద వున్నపుడు ప్రతివృక్షం తల్లిలా ఏమీ ఆశించకుండా తన జీవితకాలం ప్రాణవాయువులను సకల జీవరాశికి మరియు మానవాళికి అందచేస్తూ వాటిమనుగడకు ఆధారభూతంగా శ్రేయస్సునే కోరుకుంటుంది అనే తత్వం బోధపడుతుంది. అందుకే ప్రతి ముంగిట ఒక కొత్త మొక్కను పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత సమిష్టిగా మనందరిది. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామిగా మనం క్రియాశీలక పాత్రను కలిగి వుండడం మనం వృక్షసంపదలపట్ల కృతజ్ఞతపూర్వక నివాళి!!
జీవధార, జీవనాధార అయిన నదీజలాలను, 🌊మంచినీటి చెరువులను, కుంటలను, దిగుడు బావులను, భూగర్భ జలవనరులను సంరక్షించడం, రసాయనిక వ్యర్థాలను సాగునీటిలో కలవనీయకుండా నిరోధించడం, నీటివాడకంలో వృథాగాకుండా పొదుపుగా వాడడం, వేసవి కాలంలో చలివేంద్రాలతో బాటసారుల దప్పిక తీర్చడం, మూగజీవాల దప్పికను గుర్తించి వాటికి త్రాగునీరు అందించడం…ఇవే ప్రకృతి ప్రసాదిత జలాలపట్ల మనం చూపించే నిజమైన నివాళి!
కంటికి కనిపించని, అసలు వున్నాడా, లేడా అనే సందిగ్ధంలో అప్రమేయుడు, అవ్యయుడు, ప్రత్యాగాత్మ,సర్వాంతర్యామి అయిన ఆ సృష్టికర్తకు కృతజ్ఞతాంజలి ఎందుకు సమర్పించాలి? ఏమని సమర్పించాలి? ఎలా సమర్పించాలి? అనేది హేతువాదుల మదినితొలచే ప్రశ్నల పరంపర.. ఇది వారిలోని మూఢత్వానికి పరాకాష్ట మాత్రమే, ఎందుకంటే..
- లక్షలాది స్వేదరంధ్రాలు వున్న శరీరం నుంచి చుక్క నీరు కూడా లీక్ కాదు అంతటి అద్భుత వ్యవస్థను ప్రసాదించిన అప్రమేయుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.
- వాటర్ ప్యూరిఫయర్ సమర్థత కోసం వాటర్ పిల్టర్స్ ను రెగ్యులర్ గా మారుస్తూ వుంటాం, కానీ కిడ్నీలు జీవితాంతం మార్చనవసరం లేకుండా రక్తాన్ని శుద్ధి చేసే నెఫ్రాన్ వ్యవస్థను అందించిన విశ్వంభరుడికి కృతజ్ఞత నివాళిని సమర్పించాలి
- నీటి సరఫరా సాఫీగా వుండాలి అంటే నీటి పైపులను తరచు మారుస్తూనే ఉండాలి, కానీ జీవితాంతం రక్తప్రసరణ చేసే రక్తనాళాలు తన విధులను నిరాటంకంగా నిర్వసిస్తువుంటాయి అయితే, గుండెకు 🫀 రక్తప్రసరణ చేసే నాళాలకు అడ్డంకి కలిగిస్తూ కొవ్వు చేరుకోవడం ద్వారా బ్లాక్ అయిన నాళాలతో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకునే వ్యక్తిని పరామర్శించేపుడు, మనం ఎందుకు ఆ పరమాత్మకి హృదయ పూర్వక కృతజ్ఞతలు సమర్పించాలి అనేది అవగతం అవుతుంది.
- షడ్రుచుల సమ్మేళనంతో కొన్ని వేల రుచులను గ్రహిస్తూ ఆస్వాదించే నాలుక 👅 విలువ నోటి క్యాన్సర్ భాదితుడిని చూసినతర్వాత ఆ అద్భుత జిహ్వరుచిని ప్రసాదించిన పరమేశ్వరునికి రెండుచేతులతో నమస్కరిస్తూ కృతజ్ఞతను ప్రదర్శించాల్సిందే!
- చిటపట చినుకులు , పిల్లగాలులు, సమ శీతోష్ణ ఆహ్లాదకర వాతావరణంలో,చిరుజల్లులకు పులకరించే మదిలోని అనుభూతుల మధుర భావనలను కలిగించే ప్రకృతిమాతకు కృతజ్ఞత కుసుమాలతో ఆరాధించాల్సిందే!
- ఖరీదైన మొబైల్ 📱కూడా బ్యాటరీ 🔋చార్జింగ్ లేకుంటే పనిచేయదు, కాని మన జీవితకాలం ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేకుండా పనిచేసే బలమైన, దృఢమైన గుండెని బహూకరించిన ఆ జగన్నాథుడికి కృతజ్ఞత తెలియచేయాల్సిందే!
- ఏ వాద్యపరికరం అన్ని శబ్దాలను పలికించలేదు,కానీ సప్తస్వరాలనే కాదు, అసంఖ్యాకంగా వివిధ శబ్దాలను అలవోకగా పలికించగలిగిన స్వరపేటికను బహుకరించిన ఆ స్వరకర్తకు కృతజ్ఞతాపూర్వకంగా వుండాల్సిందే!
- ఏ పరికరం 🎧కూడా అన్ని శబ్దాలను వాటి అర్థాలను గ్రహించలేదు,కానీ చెవి అన్ని శబ్దాలను, ముఖ్యంగా ఆడవారి మాటల అంతరార్ధంను కూడా గమనించగలిగిన ప్రభావశీలి అందుకే ఆ అవ్యయుడకు కృతజ్ఞత చూపించాల్సిందే!
- ఎంత ఖరీదైన కెమేరా 📹అయినా పరిమితమైన మెగాపిక్సెల్స్ తో దృశ్యాన్ని వీక్షించగలదు, కానీ మన నేత్రద్వయం 👀వీక్షణ నాణ్యతకు సరిసమానమైన కెమెరా లేనేలేదు అందుకే అంతటి అపురూప దృష్టిని అనుగ్రహించిన ఆ అవ్యక్తుడకు కృతజ్ఞత కుసుమాలను సమర్పించాల్సిందే!
- అపురూప,అపూర్వ,అనన్య సంపదలుగా ప్రజ్ఞ,మేధస్సుల నిలయమై తార్కిక, విచక్షణ, వివేక, జ్ఞానల కేంద్రంగా అత్యద్భుత అంతర్గత వ్యవస్థకు ఆనవాలంగా విరాజిల్లుతున్న మస్తిష్కం 🧠ఇతర జీవరాశులనుంచి ప్రత్యేకతను సంతరించుకున్న ఈ మానవదేహంలో ప్రధాన అవయవం. అటువంటి అనన్యనిధిని బహుకరించిన ఆ పరబ్రహ్మకు కృతజ్ఞతాభావనతో శిరస్సు వంచి నమస్కరించాల్సిందే!
అమూల్యం, అవ్యక్తం, అనంతం అయిన ఈ అపురూప సంపదల నిధులను అందించిన ఆ సర్వాంతర్యామికి సదా, సర్వదా మనసా,వాచ, కర్మణా కృతజ్ఞత పూర్వక భావనతో నివాళులు అర్పించాలి.
సర్వేజనా సుఖినోభవంతు.
మీ ఆధ్యాత్మిక సేవలో
RaNa
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
#divineguidance #yogameditation
#yogainspiration #yogamitra
No comments:
Post a Comment