గణితశాస్త్రంలో విశిష్ట సంఖ్య 1️⃣8️⃣
మన జీవితంలో ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా మనం ఎరుకతో గమనిస్తే గణితసంఖ్య 18 కి గల విశేష ప్రాధాన్యతను గుర్తించవచ్చు.
- పంచమ వేదం మహాభారతం లోని పర్వాలు 18
- వేద వాఙ్మయం 📚ప్రబోధించే పురాణాలు 18
- భగవద్గీతలో 📗అధ్యాయాలు 18
- ధర్మపరిరక్షణ 🎯 లక్ష్యంగా భారతసంగ్రామం జరిగిన రోజులు 18
- మహాభారత ⚔️యుద్ధంలో పాల్గొన్న సైనికులు 18 అక్షౌహిణీలు
- దేవాలయంలో 🛕 దైవదర్శనానికి అధిరోహించవలసినవి 18 సోపానాలు
- యజ్ఞంలో పాల్గొనే ఋత్విక్కులు 18 మంది
- ఈశావ్యాసోపనిషత్తులో 📕శ్లోకాలు 18
- సంఖ్యా యోగంలో🔖 స్థితప్రజ్ఞత లక్షణ శ్లోకాలు 18
- సంఖ్యా యొగంలో 🔖ఆత్మవర్ణన శ్లోకాలు 18
- మోక్షసౌధ సోపానాలు 18
- యుక్త వయస్సుకి చేరేది 18 వ సంవత్సరం
- దేశభవిష్యత్తు నిర్ణయించే ఓటు హక్కు వచ్చేది 18 వ సంవత్సరం
- వధువరులకు 👩❤️💋👩వివాహం చేసుకోవడానికి కావలసిన అర్హత వచ్చేది 18 వ సంవత్సరం
మనలో దైవత్వం అంతర్వాహినిగా ఉంటే, అంతర్యామిగా మనసనే మందిరం 🛕లో ఉపద్రష్టగా 🕉️ఆసీనుడైన అప్రమేయుడుని చేరుకోవడానికి అధిరోహించవలసిన సోపానాలు కూడా 18
ప్రత్యగాత్మ సన్నిహిత్వానికి జీవన శైలిగా 18 🇳🇵సోపానాల మార్గదర్శి
🍒సంస్కారభరిత జీవనం
గురువుల మీద చూపించే గౌరవం, అమ్మ నాన్నల మీద ప్రేమ, ఆర్తుల మీద దయ, ఇతర జీవుల మీద కరుణ, పెద్దల యందు చూపించే వినయ విధేయతలు, అతిధి మర్యాదలు, సమయ పాలన పాటించడం మనలని సంస్కారవంతులగా చేస్తుంది. మీ పిల్లలకు సంస్కారభరిత విలువలను నేర్పించడమే వారికి మీరు ఇచ్చే నిజమైన సిరి సంపదలు.
🍒మోహం
లేనిది ఉన్నట్లుగా పనులు జరిపించు కొనడానికి పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు, వారే శ్రేయోభిలాషులు అనే మొహంలో పడడం మీ అవివేకం.
ఉన్నది ఉన్నట్లుగా యదార్థం మాట్లాడేవ్యక్తి నిజమైన శ్రేయోభిలాషి. అటువంటి వారు దొరకడం అరుదు, అటువంటి వారిని వదలుకోవడం మూర్ఖత్వం.
🍒 సచ్చీలత
తప్పులు చేయని సచ్చీలత ఎవరికి ఉండదు. అయితే తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమార్పణ కోరడం వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది. మిమ్మల్ని ప్రేమించేవారిని ఇష్టపడండి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి స్నేహహస్తం అందించండి. మీకు కష్టం కలిగించినవారికి కూడా శుభం కలగాలని ప్రార్థించండి. మీ శీలసంపద సత్వగుణంతో వికసిస్తుంది.
🍒మంచి మాట
ఏది పడితే అది వినడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. మంచిమాటలు తప్పక వినాలి. మంచి మాటలే మాట్లాడాలి. అందరి హితం మాటల్లో, చేతల్లో చూపించాలి. మూర్ఖుడు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైనవాడు ఆలోచించి సౌమ్యంగా,మృదువుగా సూటిగా మాట్లాడుతాడు. ఏం మాట్లాడావన్న దానికంటే ఎలా మాట్లాడావనేది ముఖ్యం.
మనిషిని ఒప్పించినా మనసును నొప్పించినా అది మాట తీరే.
🍒పెద్దల మాట శిరోధార్యం
తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యం కాదు.
రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఎపిజె అబ్దుల్ కలాం, రమణమహర్షి, సత్యసాయిబాబా లాంటి మహాత్ముల మాటలు చదవండి. జీవితం అంటే ఏమిటి, ఎలవుండాలి అనేది ప్రబోధిస్తాయి.
🍒జడత్వం
జడత్వం అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన లేని ఉదాసీన జీవితం.
ఇస్లామిక్ మతమౌడ్యంతో ఊచకోతకు బలి అవుతున్న హిందువుల పట్ల సమాజంలో చైతన్యం లోపించి ప్రతిస్పందనలేని లక్షణమే జడత్వంగా సమాజంని ఆవహిస్తుంది.
ఈ సమాజంలో ఒకరు వృద్ధిలోకి వచ్చినా, ఇంకొకరు అధోగతిపాలు అయినా కారణ మేమిటని ప్రశ్నించుకుంటే అందుకు జడత్వమే ప్రధాన కారణం అవుతుంది.
జడత్వం మానసికంగా, సామాజికంగా నిన్ను బలహీనుడిని చేస్తుంది, దానిని అదుపులో ఉంచుకోవాలి.
🍒ఆదర్శవంతంగా వుండాలి
శాస్త్రాలలో📚 చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే కార్యశీలి అందరికి ఆదర్శం అవుతాడు.
ఐతే నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్న దాన్నిబట్టి నీవు ఇతరులకు ఆదర్శం అవుతావు.
🍒ఆత్మపరిశీలన
నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదు అనే ఆలోచన ముందరి కాళ్లకు బంధనం అవుతుంది. జీవితంలో రాణించడానికి అది అడ్డంకి అవుతుంది. ఈ లోపాన్ని ఆత్మపరిశీలనతో సరిదిద్దుకుంటే పది మందికీ ఆదర్శప్రాయం కావచ్చు.
🍒కోపం
శత్రువు బయటనుంచి రాడు. కోపమే నిజమైన శత్రువు. కోపం మీ విచక్షణ జ్ఞానాన్ని హరిస్తుంది.
కోపాన్ని ఎవరికివారుగా పరిశీలించి సరిదిద్దుకోవాలి. అంతేగాని నాకు కోపం వచ్చింది అన్న తరువాత ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు.
నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకున్నవాడు రాణిస్తాడు, అది లేనివాడు కోపిష్టిగా ఒంటరి అయ్యే ప్రమాదం ఉంది.
🍒ప్రణాళిక
ఆధ్యాత్మిక పరంగా, సాంఘిక పరంగా, సామాజిక పరంగా కూడా ప్రతి ఒక్కరికి తప్పక ఓ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యసాధనకు ఓ 🔖నిర్దిష్ట ప్రణాళిక కావాలి.
ఆచరణలో తారసపడే సాధక బాధకాలను, అవకాశాలను మూల్యాంకనం చేస్తూ వ్యూహరచన వుండాలి. ఆ ప్రణాళిక అంతిమ లక్ష్యం 🎯 ఒడిదుడుకులు లేకుండా గమ్యం చేరుకునే దిశలో వుండాలి అంతేగాని అవరోధంగా వుండరాదు. అందుకే తరుచుగా అవసరమైతే వ్యూహం అమలులో మార్పులు, కూర్పులు, చేర్పులు తప్పనిసరి.
🍒శ్రవణం
మనలో చాలా మంది సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడకుండా నిర్లిప్తంగా వుండిపోతారు. అలగాకుండా మీరు ఏ స్థాయిలో వున్న ఏవైనా సమస్యలు ఎదురైతే మీలో కుమిలిపోకుండా వాటిని కొలిగ్స్ తో పంచుకోండి, వారి అభిప్రాయాలను పరిగణ లోనికి తీసుకోండి. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు ప్రధానం, వారి ఆ మాటల్లో ఏమైనా పరిష్కార మార్గం దొరకుతుందా? అందులో ఒక్క మంచి ఆలోచన వున్నా భేషజానికి పోకుండా దానిని ముందుకు తీసుకువెళ్తే విజయం ✌️ సాధించవచ్చు. ఎదుటి వారి మాటకు విలువ ఇవ్వడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు.
ఆలోచనల గజిబిజిలో ఉంటే మనస్సుకు ప్రశాంతతను కలిగించే శ్రవణానంద 🎧సంగీతంను ఆలకించండి, మనస్సుతో ఆస్వాదించండి.
🍒స్పష్టత
మనం చేసే ఏ పనినైనా ఎందుకు చేస్తున్నామో అనే స్పష్టమైన అభిప్రాయం కలిగి వుండాలి.
చదవబోయే చదువు, చేరబోయే ఉద్యోగం, షేరుమార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు, కొనబోయే ఇల్లు ఇలా ఏ విషయంలో అయినా సంపూర్ణ అవగాహన వుండాలి, ఎటువంటి అస్పష్టత వుండరాదు.
స్పష్టత తీసుకునే నిర్ణయాలలో క్లారిటీ ఇస్తూ నాణ్యత, బాధ్యతలను ప్రతిబింబిస్తుంది. ఆలోచనలలో క్లారిటీ, స్పష్టత కోసం శ్వాస మీద ధ్యాసతో ప్రతిరోజూ ధ్యానం కనీసం ఓ పావుగంట సాధన అలవాటు చేసుకోండి. ఆశ్చర్య భరితమైన మెరుగైన ఆలోచనలు మీ మదిలో క్రమంగా వికసితం కావడం గమనిస్తారు.
🍒మట్టిముద్దలా కిందపడిపోకండి
గోడకి విసరిన బంతిలా 🏀మీ ప్రవర్తన వుండాలి, అంతేగాని గోడకు విసిరిన మట్టిముద్దలా ఆగిపోకండి. జీవితంలో పొరపాట్లు, అపజయాలు, వైఫల్యాలు లేకుండా ఎవ్వరి జీవితం సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా వంకలు పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు కించపరచారని, అవహేళన చేశారని మట్టిముద్దలా కిందపడిపోకండి. ఆ పొరపాట్లను సరిదిద్దుకొని రబ్బరు బంతిలా మీరు కార్యోన్ముఖులుగా ముందుకు సాగిపోవాలి.
🍒నిరాశ
ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకున్న, మంచి స్కోర్ వచ్చినా మంచి కాలేజి లో సీటు రాకున్నా, మంచి కాలేజి అయినా అనుకున్న కోర్సులో సీటు రాకున్న, మంచి గ్రేడు వచ్చినా అనుకున్న కంపెనీలో ఉద్యోగం రాకున్నా, ఉద్యోగం వచ్చినా మంచి సంబంధం కలిసిరాకపోయినా , చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం అయినా, ఫారిన్ కి వెళ్లే ఛాన్స్ లేటు అయినా,అనుకున్న వృత్తిలో ఒడిదుడుకులు వచ్చినా , ఆశించిన రీతిలో జీవితం ముందుకు సాగడం లేదు అని నిరాశ, నిస్పృహలతో వుండడం యువతలో చూస్తున్నాం. నీవు అనుకున్నట్లుగా జరగాలని ఎందుకు అనుకోవాలి. జీవితం అనే వైకుంఠపాళిలో కేవలం అవకాశాలు అనే నిచ్చెనలే కాదు, కిందకి దించే 🐍పాములు కూడా వుంటాయి. నీ విజ్ఞత తో వాటిని అధిగమించే నేర్పు కావాలి.
నీ జన్మకి కారణమయిన ఆ పరమేశ్వరుడు 🕉️నీ ద్వారా ఈ సమాజానికి ఏమి చేయించాలను కుంటున్నాడో అని అలోచించండి. ఇక నిరాశ,నిస్పృహల నుండి నూతన అధ్యాయం మొదలవుతుంది.
🍒 పుస్తక పఠనం
ఈ నూతన సంవత్సరం పుస్తకపఠనం 📗అలవాటు చేసుకోండి. ఐతే ఏ పుస్తకం పడితే అది చదవకండి. స్ఫూర్తిని నింపే మహనీయుల ఉపన్యాసాలు, జీవిత చరిత్రలు, అనుభవాలను చదవండి. మీకెంతో మనో స్థైర్యం కలుగచేస్తాయి. మంచి పుస్తకం చదవడం ఓ మంచి మిత్రుడితో కొనసాగించే స్నేహం లాంటిది.
వేదాలు📚 చదివే ప్రయత్నం చేయండి.జీవిత లక్ష్యం 🎯అవగతం అవుతుంది. పలుభాషలలో ప్రావీణ్యం సంపాదించుకోండి. మిత్రులతో, సన్నిహితులతో, ఇంట్లో చక్కగా తెలుగులో మాట్లాడండి.
🍒ఆరాధించడం కాదు…కృతజ్ఞత
భక్తి అంటే భగవంతుడు ఏదో మనకు అనుగ్రహిస్తాడు అని ఆరాధించడం కాదు, మనకి అనుగ్రహించిన జీవితానికి కృతజ్ఞత తెలియ చేయడం. జగద్గురు ఉపదేశాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడం.
జీవితాంతం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సదా మీకోసమే అలుపెరుగని సేవలను అందిస్తున్న దేహం, మనస్సు, బుద్ధి పంచ కర్మేంద్రియాలు,పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలయందు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇవే మోక్షసౌధ సోపానాలు.
🍒వైఫల్యాలే విజయ కేతనాలు కావాలి
మనం చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలి అని ఆశించడం అత్యాశ అవుతుంది. చేసే ప్రయత్నాలలో వైఫల్యాలు కూడా ఎదురైతాయి. ఎవరైతే వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారో వారు జీవితంలో అభివృద్ధి పథంలో 🚩🚩🚩విజయకేతనాలను ఎగరవేస్తారు.
జీవితం అంటే కష్టాలలో పడిపోవడం కాదు, ఎందుకు పడిపోయామో కారణాలను మూల్యాంకనం చేసి, అక్కడనుంచే నిలబడి సమర్థవంతంగా పోరాటస్ఫూర్తితో ముందడుగు వేయడం. అప్పుడు వికల్పాలు, వైఫల్యాలలే విజయ పథానికి సోపానాలు అవుతాయి.
🍒పొగడ్త పాలపొంగులా కారాదు
ఎవరికైనా పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొ కారణం కూడా కనిపించదు. అందుకని తల్లిదండ్రులుగా మీ పిల్లలు చదువుల్లో, ఆటల్లో చూపించే ప్రతిభని మనసారా అభినందించండి, వారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయకండి, వారిని అహంభావులుగా తయారు చేయకండి.
ఐతే జీవితంలో పొగడ్త అన్నది సరియైన మోతాదులో తీసుకుంటే మనస్సు పరవశిస్తుంది. మందులే కదా అని అతి మోతాదులో తీసుకుంటే అది విషం అవుతుంది.
రేపటి రోజు ఎలా వుండాలో అనేది నీ ఆలోచనలలో,చేతల్లో,చేతుల్లో ఉంది. నీ భవిష్యత్తు నీవే రాసుకోవాలి.
సర్వేజనా సుఖినోభవంతు
మీ
ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️ 🧘♀️ 🧘♀️ 🧘♀️ 🧘♀️ 🧘♀️ 🧘♀️
No comments:
Post a Comment