రానా కవితలు 1 విశ్వంభర
అరుణ కాంతుల సొగసులను
స్వాగతిస్తూ
ఉషోదయ వేళల్లో
వికసించే 🪻పూబాలలనడుగు
పూదోట వెదజల్లే పరిమళాలనడుగు
మలయమారుతాలతో పరవశించే కొండగాలినడుగు
పూతోటలోని🐝 తేటి నడుగు
ఈ తుషారబిందువుల🫧 సొగసులు నీకెక్కడివి అని
అంకురించిన 🌱 మొలకనడుగు
కుహు కుహూ రాగాల కోకిలనడుగు
పక్షుల కిలకిల రావాలనడుగు
🦋సీతాకోకచిలుకగా మారిన 🐛 గొంగళిపురుగునడుగు
పురివిప్పిన🦚 నాట్యమయూరిని నడుగు
చెంగు చెంగున ఎగిరే జింక పిల్లలనడుగు
గల గల పారే సెలయేళ్లలో
తమ సొగసులతో ఆకట్టుకునే 🦢రాజహంసలనడుగు
పుడమి తల్లిని దైవంగా భావించే కృషీవలుడిని నడుగు
తన స్వేదాన్ని తర్పణంగా సమర్పించే అన్నదాత నడుగు
సుప్రభాతసేవలో తరిస్తున్న 🧘♂️యోగులనడుగు
ఏ కుంచెతో ఈ నింగికి సప్తవర్ణాలు అద్దినది ఎవరు?
ఇంకెవరు
ప్రకృతి లోని అందాలలో, ఆనందాలలో
నీ లోన, బయట
అటు,ఇటు, ఎటు చూసినా
సర్వత్రా, సర్వంగా విస్తరించివున్న
ఆ అప్రమేయుడే
విశ్వంభరుడు
మీ
9900022729

No comments:
Post a Comment