జీవధార , జీవనధార, ప్రాణధార నీరే!!
జీవభరితం, వైవిధ్యభరితం అయిన ఈ భగవంతుని సృష్టి బహు విలక్షణభరితంగా, మన ఆలోచనలకి, అంచనాలకు అందని విశిష్ట స్థాయిలో ఉంటూ మానవాళి మేధస్సుకి, విజ్ఞతకి, ప్రతిభకి , ప్రజ్ఞలకి పదును పెడుతూ ఎన్నో నూతనావిష్కరాలకి కేంధ్ర బిందువుగా మార్గదర్శకంగా పయనింపచేస్తునే వుంది.
మన దేహానిర్మాణం కూడా అంతే విలక్షణభరితం!
మనం నివసించే ఈ భూమండలం 🌍70 శాతం నీటీతో 30 శాతం భూమితో విస్తరించిన ప్రకృతి స్వరూపం. సరిగ్గా అదే విధంగా మన దేహాల్లో కూడా 🌊70 శాతం విస్తరించిన కణజాలం నీరే !!
నీరే 🌊మనకి జీవధార, జీవనధార, ప్రాణధార కూడా!
సమాజ ప్రగతి, పురోగతి, ఆర్ధికస్వవాలంబనకి , ప్రభుత్వ వ్యవస్థలను ప్రభావితం చేసేది, చేస్తున్నది , చేయబోయేది కూడా పకృతి ప్రసాదిత 🌊జలాలే!
ప్రపంచంలో అతి పురాతన,విశిష్ట మానవ నాగరిక సమాజాలు హరప్ప, సింధు నాగరికతలు గంగ, సింధు నదుల పరివాహక ప్రాంతాల్లోనే వికసించి నలుదిశల శోభిల్లింది!!
నాడు నేడు కూడ వివిధ దేశాల మధ్య ఈ జలయుద్దాలు అనేకమార్లు జరిగాయి, జరుగుతున్నాయి !నేడు ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాక్ పై మనం అప్రకటిత జలయుద్ధానికి శంఖారావం పూరించాం !
ఇక వ్యక్తిగత పరంగా
మనం ప్రతి రోజూ తాగే నీళ్లు శరీరంలో
ఆహారం సమర్థవంతంగా జీర్ణం అవడానికి, జీవరసాయనకచర్యలతో మేళవించిన రసరూప ఆహారం జీవశక్తిగా శరీర అంగంగాలకి రక్తకణాల ద్వారా చేరవేయడానికి,
వ్యర్థపదార్థాలను మలరూపంలో సుఖ విరోచనం అవడానికి,
స్వేదక్రియద్వారా శరీర ఉష్ణోగ్రతల సమతుల్యత ను సదా పరీరక్షించడానికి ,
కిడ్నీవ్యవస్థలో వడపోత ద్వారా రక్తశుద్ధికి, తద్వారా మలినాలను సాఫీగా మూత్రంద్వారా విసర్జనకి కారణం అవుతుంది.
ఆరోగ్యవంతమైన ఈ దేహం సమర్థవంతంగా తన ఈ విధులను నిర్వహించడానికి ప్రతిరోజు మూడు లీటర్ల నీరు తప్పక అందించి తీరాల్సిందే.
కొబ్బరినీళ్లు, చల్లట్టిమజ్జిగ, తాజా పండ్లరసాలు, చెరకురసాలు, వెజిటేబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ లు గా కూడా అందించవచ్చు.
భగవత్ప్రసాదితమైన ఈ విలక్షణ దేహం శత వసంతాలు సమర్థవంతంగా ప్రతిఫలాపేక్ష లేకుండా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మీరు చేయవలసినది అశ్రద్దలేకుండా జాగరూకతతో ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగడమే!
ద్రవ సమతుల్యతలను కాపాడడం మీ కనీస బాధ్యత!!
వృద్ధులలో దప్పిక తక్కువగా ఉంటుంది. అందువల్ల కేవలం ఒకటీ రెండు గ్లాసుల నీరు పరిమితంగా తీసుకుంటుంటారు. అది డిహైడ్రేషన్ కి కారణం అవుతుంది. మీరు జాగరూకతతో గమనిస్తూ తగినంత నీరు తప్పక తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి.
శరీర ధర్మాన్ని గౌరవిద్దాం!!
ఈ దేహాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమిద్దాం!!!
సర్వే జన సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక సేవలో
No comments:
Post a Comment